
న్యూఢిల్లీ:మన్‌కీ బాత్‌లో తెలంగాణ టీచర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివారం(ఫిబ్రవరి23) నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.‘ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది.
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాష్ గిరిజన భాషలను కాపాడడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారు’ అని మోదీ కొనియాడారు.
‘ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం. పది సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసింది.చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.
అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తా’అని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment