Mann Ki Baat
-
ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు
న్యూఢిల్లీ: ప్రజా శక్తిని సాంకేతికత దన్నుతో (Central Election Commission)కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలోపేతం చేసిందని ప్రధాని , (Narendra Modi)మోదీ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో ఎన్నికలను సజావుగా నిర్వహించిందంటూ అభినందించారు. ఆదివారం ఆయన , (Mann Ki Baat)‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో కార్యక్రమాన్ని చివరి ఆదివారానికి బదులు ఒక వారం ముందుకు జరిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే ఈసీ వ్యవస్థాపక దినోత్సవం జనవరి 25వ తేదీ సమీపిస్తున్న వేళ ఈసీని మోదీ పొగడటం విశేషం. ‘‘ 1951–52లో తొలిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యం దేశంలో మనగలదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వాళ్లందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా అవతరించింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ విధానాన్ని ఆదునీకరిస్తూ, పటిష్టపరుస్తున్న ఈసీకి నా అభినందనలు’’ అని మోదీ అన్నా రు. ‘‘ ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. భారత గణతంత్రానికి ఇది 75వ వార్షికోత్స వం. ఇంతటి పవిత్ర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగపరిషత్లోని మహనీయులకు నా సెల్యూ ట్. ఆనాటి వారి విస్తృతస్థాయి చర్చలు, రాజ్యాంగ సభలో సభ్యుల ఆలోచనలు, వారి ఉపదేశాలు మనకు గొప్ప వారసత్వ సంపద’’అంటూ నాటి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీల ప్రసంగాల ఆడియో క్లిప్‌లను మోదీ వినిపించారు. ‘‘ భారత్ తరఫున తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహాల కూటమి ఫైర్ఫ్లైను నింగిలోకి పంపి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ చరిత్ర సృష్టించిన విషయాన్ని చెప్పేందుకు గర్వపడుతున్నా’’ అని మోదీ అన్నారు. -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
ఐక్యతా మహా కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి నెలన్నర పాటు జరగనున్న మహా కుంభమేళాను ఐక్యత మహాకుంభ్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘అందరూ కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించాలి. సమాజంలో విద్వేషం, విభజనవాదాల నిర్మూలనకు సంకల్పం తీసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం 117వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మాట్లాడారు. ‘‘దేశమంతా ఏకం కావాలన్న గొప్ప సందేశాన్ని కుంభమేళా ఇస్తోంది. భారీతనంలో కాకుండా భిన్నత్వంలోనే దాని ప్రత్యేకత దాగుంది. అంతటి వైవిధ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడబోం. అవిశ్రాంత గంగా ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలి’’ అన్నారు. కుంభమేళాలో 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ‘ఆయుష్మాన్’తో క్యాన్సర్‌కు చెక్ ‘‘మన దేశంలో 2015–2023 మధ్య మలేరియా కేసులు, మరణాలు 80 శాతం తగ్గినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. ఇదో గొప్ప విజయం. మన దగ్గర క్యాన్సర్ చికిత్సను సకాలంలో ప్రారంభిస్తుండడం గణనీయంగా పెరిగిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 90 శాతం మంది క్యాన్సర్ బాధితులు సకాలంలో చికిత్స పొందగలుగుతున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. ఫిజిలో తమిళ టీచింగ్ ప్రోగ్రాంకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో విశిష్టమైన ఒలింపిక్స్ జరిగాయి. పేదరికం, కరువు, వలసలకు మారుపేరైన ఒడిశాలోని కలహండిలో కూరగాయల విప్లవం సాగుతోంది’’ అని మోదీ అన్నారు. వచ్చే జనవరి 26న రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ‘‘ఇది మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం వల్లే ఈ రోజు నేనీ స్థాయికి చేరుకున్నా. మన రాజ్యాంగం ప్రతి సందర్భంలోనూ కాల పరీక్షకు నిలిచింది. దారిదీపంగా, మార్గదర్శిగా ముందుకు నపుడుతోంది’’ అన్నారు.అక్కినేనితో కొత్త శిఖరాలకు తెలుగు సినిమా సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారంటూ మోదీ ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాలు, విలువలను ఆయన సినిమాలు ప్రతిబింబించాయని కొనియాడారు. ‘‘ఈ ఏడాది ఆయనతో పాటు రాజ్ కపూర్, తపన్ సిన్హా, మహ్మద్ రఫీ వంటి సినీ ఉద్ధండుల శత జయంతి వేడుకలు జరగడం హర్షణీయం. సృజనాత్మక రంగంలో మన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి తెలిపేలా వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ దాకా ఢిల్లీలో తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్) జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి అగ్రశ్రేణి కంటెంట్ క్రియేటర్లు అందులో పాల్గొంటారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్‌లో ఇండియాను కేంద్రస్థానంగా మార్చే దిశగా ఈ సదస్సు మనకు చాలా కీలకం’’ అని తెలిపారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో కంటెంట్ క్రియేటర్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. దేశ ప్రజలందరికీ మోదీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంగా, సంతోషంగా ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఆయన వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు.ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మన్ కీ బాత్‌లో మన తెలుగు సినీ దిగ్గజం నాగేశ్వరరావును ప్రశంసించండంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
వికసిత భారత్‌లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిక బారత్‌లో యువత పాత్ర కీలకమని అన్నారు.‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ .. మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని అన్నారు.'मन की बात' के 116वें एपिसोड में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है, जिनके पूरे परिवार की कोई राजनीतिक पृष्ठभूमि नहीं रही है। ऐसे एक लाख युवाओं को, नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई विशेष… pic.twitter.com/xcU1doulIi— ANI_HindiNews (@AHindinews) November 24, 2024ఈరోజు(ఆదివారం) చాలా ప్రత్యేకమైన రోజని, ఈరోజు ఎన్సీసీడీ అని ప్రధాని గుర్తుచేశారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని, నాడు తాను పొందిన అనుభవం అమూల్యమైనదని మోదీ పేర్కొన్నారు. ఎన్సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ప్రతీ విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువత ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఖచ్చితంగా అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందన్నారు.కార్యక్రమంలో స్వామి వివేకానందను స్మరించుకున్న ప్రధాని మోదీ 'వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నామని అన్నారు. జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘యంగ్ ఐడియాస్ మహాకుంభ్’ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారాల నుంచి తాను పిలుపునిచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: శంకర నేత్రాలయ అట్లాంటాలో శాస్త్రీయ నృత్య కార్యక్రమాలతో నిధుల సేకరణ -
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
యానిమేషన్ రంగంలో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిసారిలాగే ఈ కార్యక్రమంలోనూ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోని 115వ ఎపిసోడ్ నేడు ప్రసారమయ్యింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని చెబుతూ, నేటి మన్ కీ బాత్‌లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను. సర్దార్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరగనుంది. బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15న జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవి. అయినా వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు.నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపిందని మోదీ అన్నారు.ఛోటా భీమ్లాగా మన ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. భారతీయ క్రీడలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నాయి. భారత్‌లో సృజనాత్మక శక్తి ఉప్పొంగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.10 సంవత్సరాల క్రితం, భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని ఎవరైనా చెప్పినప్పుడు, చాలా మంది దానిని నమ్మలేదు. పైగా ఎగతాళి చేసేవారు. కానీ నేడు దేశం సాధించిన విజయాన్ని చూసి.. వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు వాటిని ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ -
PM Narendra Modi: పదేళ్ల మన్‌కీ బాత్
న్యూఢిల్లీ: ‘‘మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్‌కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్‌కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా’’ అన్నారు.పుణే మెట్రో తొలి దశ ప్రారంభం పుణే: ‘‘గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం’’ అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక బాలిక పాఠశాల’ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు. వాటికీ పదేళ్లు ప్రతిష్టాత్మకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాం«దీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. అటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.స్థానికతకు జై స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ‘‘మన గడ్డపై మన కళాకారులు, కారి్మకుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి’’ అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు’’ అని చెప్పారు. -
పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులగా మారారు. వారి నుండి నేను ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ.. -
‘కామ్ కీ బాత్’ ఏనాడూ చెప్పలేదు
సురాన్‌కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్‌కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు. కశ్మీర్‌ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి జమ్మూకశీ్మర్‌ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్‌ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం ‘‘జమ్మూకశీ్మర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్‌ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్‌కు ప్రచారం సోమవారంతో ముగిసింది. కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. -
ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్ కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మోదీకి తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్ కీ బాత్ గురించి మాట్లాడరని విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతండటంతో ప్రధాని మోదీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. భారత కూటమి, కాంగ్రెస్‌లు మోదీ సైకాలజీని మార్చేశాయని అన్నారు.‘ఈ రోజుల్లో ప్రధాని మోదీ ముఖం మారిపోయింది, ఆయన మూడ్ మారిపోయింది. దీనికి కారణం భారత కూటమి, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలే. ప్రధాని, బీజేపీ విభజన రాజకీయాలు వ్యప్తి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని వ్యాపింపజేశారు. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. చదవండి: సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విద్యావంతులకు ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇది నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన బహుమతి’ అంటూ సెటైర్లు వేశారు. జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అర్హులని అన్నారు. కాగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరగ్గా, రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. -
‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
Mann ki Baat: చీర్ఫర్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి ‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్గర్తిరంగా.కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్‌గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు. టైగర్ ఫ్రెండ్స్‌గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్‌కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీటన్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు. సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు. -
ఆటగాళ్లను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దేశ ప్రజలంతా ఒలింపిక్ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్‌గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు కొనకుంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Mann Ki Baat: జన స్పందనకు వందనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ‘ఛీర్4భారత్’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్ కీ బాత్‌లో మోదీ ఇంకా ఏమన్నారంటే..నా తల్లి పేరిట మొక్క నాటాను ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. సంస్కృత భాషను గౌరవించుకుందాం ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్‌కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్ 30) ‘హూల్ దివస్’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్ గిరిజన యోధులు వీర్ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా. మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్ కల్చర్‌పై కువైట్ ప్రభుత్వం కువైట్ నేషనల్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుర్కమెనిస్తాన్‌లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్తోపాటు భారత్‌కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్ దేశాలైన సురినామ్, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.వోకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్ ఉత్పత్తులను గ్లోబల్‌కు చేర్చడంలో జమ్మూకశ్మీర్ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్‌కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్ ఖేరా హితవుపలికారు. -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్‌ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్‌గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్‌ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
మీ తల్లి పేరుతో మొక్కను నాటండి: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 111వ ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం పలు అంశాలపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం మోదీ పాల్గొన్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్ కీ బాత్ కార్యక్రమం 111వ ఎపిసోడ్ దార్వా మరోసారి మీ ముందుకు వచ్చాను. ఫిబ్రవరిలో చెప్పినట్లుగానే మళ్లీ మీ ముందుకు వచ్చాను. మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. రుతుపవనాలు రాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.#WATCH | Prime Minister Narendra Modi addresses the 111th episode of 'Mann Ki Baat'.He says "Today, finally the day has some for which we all were waiting for since February. Through 'Mann Ki Baat', I am once again amongst you, amongst my family members. I told you in February… pic.twitter.com/m5zGtjpjaU— ANI (@ANI) June 30, 2024 ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. కానీ దాని లక్ష్యం మాత్రం దేశంలో కొనసాగుతోంది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే చాలా పెద్దవి. సుమారు 65 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయంలో తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.#WATCH | Prime Minister Narendra Modi addresses the 111th episode of 'Mann Ki Baat'. He says "Mann Ki Baat radio program might have been closed for a few months...but the spirit of Mann Ki Baat...work done for the country, the society good work done every day, work done with… pic.twitter.com/DBlWkLym73— ANI (@ANI) June 30, 2024 ఈరోజు చాలా ప్రాధాన్యం ఉన్న రోజు. మన గిరిజన సోదరసోదరీమణులు ఈరోజును ‘హల్ దివాస్’గా జరుపుకుంటారు. వీర్ సిధు, కాన్హూలకు సంబంధించిన రోజు. వారు బ్రిటిష్ వారి వివక్ష చట్టాలు, నిబంధనలను వ్యతిరేకిస్తూ సంతాలి ప్రజలకు కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు.At the 111th episode of 'Mann Ki Baat', Prime Minister Narendra Modi says "Today, 30th June is a very important day. Our tribal brothers and sisters celebrate this day as 'Hul Diwas'. This day is associated with the courage of Veer Sidhu and Kanhu, who strongly opposed the… pic.twitter.com/av3l0c8ZK6— ANI (@ANI) June 30, 2024 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాంట్ ఫర్ మదర్’ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. అమ్మ పేరుతో నేను ఒక మొక్క నాటాను. మీరు మీ తల్లితో లేదా, మీ అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని అన్నారు.At the 111th episode of 'Mann Ki Baat', Prime Minister Narendra Modi says "A special campaign has begun on World Environment Day this year named 'Ek Ped Maa Ke Naam'. I have also planted a tree in the name of my mother and I have appealed to all the countrymen to plant a tree… pic.twitter.com/8bG1vDgwTO— ANI (@ANI) June 30, 2024 అదే విధంగా ఒలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులు మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. ‘చీర్4భారత్’ హ్యాష్ ట్యాగ్‌తో ఆటగాళ్లను ప్రజలు ప్రోత్సహించాలన్నారు. -
‘‘మన్ కీ బాత్ రిటర్న్స్’’.. 111వ ఎపిసోడ్ ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేడియో సందేశ కార్యక్రమం మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభమవనుంది. జూన్ 30న 111వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాని స్వయంగా వెల్లడించారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంపై ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’కార్యక్రమానికి బ్రేక్ పడింది. ‘కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్ కీ బాత్’మళ్లీ ప్రారంభమవనుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న 111వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని కోరుతున్నా. మై గవ్ ఓపెన్ ఫోరమ్, నమో యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలి’అని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రధాని మోదీ కోరారు. కాగా, ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్ కీ బాత్’110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. -
రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడే స్ఫూర్తి
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందని, ఆ మహత్తర సందర్భం దేశ సమష్టి బలాన్ని చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఆదివారం ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆ శ్రీరాముడే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని ‘దేవుడు దేశానికి, రాముడు రాజ్యానికి’వచ్చిన సందర్భంగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి కోట్లాది మంది ప్రజలు కూడా ఇదేవిధంగా భావించారన్నారు. ‘ప్రతి ఒక్కరూ ఆ రోజు రామ భజన గీతాలు ఆలపించి ఆ రామునికే అంకితమిచ్చారు. రామ జ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరి మాటల్లోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రాముడే నిండిపోయాడు’అని ప్రధాని అన్నారు. -
Mann ki Baat: ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి.. 2024లోనూ కొనసాగాలి
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సృజనాత్మకతను పంచుకోండి ‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు. అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్భజన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా. ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’ ఎన్నెన్నో ఘనతలు ‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’. ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్ సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్‌నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. -
ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించింది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఈ ఏడాది(2023)లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం, జీ-20 విజయవంతంపై ప్రజలు ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాది(2023) దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మోదీ తెలిపారు. ఆయన దేశ ప్రజలకు కొత్త ఏడాది(2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత్ దేశం సాధించిన పలు ఘనతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 2024లో సైతం ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మనమేంటో నిరూపించామని, శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణమని తెలిపారు. ‘నాటు...నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని, ఎలిఫెంట్ విస్పరర్సకు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని ఆనందం వ్యక్తం చేశారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామని మోదీ అన్నారు. ఇది చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటామని పేర్కొన్నారు. అలాగే వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచిందని అభిప్రాయపడ్డారు. అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో మహిళల జట్ట విజయం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్వించేలా చేశాయని తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతంగా నిర్వహించామని, ‘మేరీ మాటీ-మేరా దేశ్’వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశంలో 70 వేలకు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని, ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారిందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని మోదీ అన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటెంట్ల సంఖ్య పెరిగిందని దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. చదవండి: New Year 2024: భారత్‌లో ఐదుసార్లు నూతన సంవత్సర వేడుకలు -
మోదీ ప్రశంసలు అందుకున్న ఎంట్రప్రెన్యూర్ వర్ష..
‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. అదే మన్‌కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష. కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్‌టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్‌కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. వీడియో చూసి... అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్‌లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్ప్రైజ్ను ఏర్పాటు చేసింది. అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్‌మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష. వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్‌కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం. -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
విదేశాల్లో పెళ్లిళ్ల ట్రెండ్: ప్రధాని మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్‌పై ప్రధానమంత్రి నరేంద మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 107వ మన్ కీ బాత్ ద్వారా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 26/11ఉగ్రదాడి మృతులకు,అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే ఈ సందర్బంగా ప్రజలకు కొన్ని కీలక విజ్ఞప్తులు చేశారు. ముంబై ఉగ్రదాడి: 2008 నవంబర్ 26వ తేదీ ముంబై ఉగ్రదాడికి నేటికి 15 ఏళ్లు. దాదాపు 60 గంటలకు పైగా సాగిన ఉగ్రవాదుల మారణకాండలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. విచారణ అనంతరం ఈ కేసులో కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది. దీపావళి రోజున వస్తువుల కొనుగోలుకు నగదు వినియోగం వరుసగా రెండో ఏడాది తగ్గిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు నగదును ఉపయోగించకూడదని, డిజిటల్ చెల్లింపులను మాత్రమే ఉపయోగిస్తామనే ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఒక నెల తర్వాత ప్రజలు తమ సెల్ఫీలను పంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులకే మొగ్గు చూపాలని, భారతీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని కోరారు. భారతీయ ఉత్పత్తుల పట్ల సెంటిమెంట్ కేవలం పండుగలకే పరిమితం కాకూడదన్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కొన్ని వ్యాపార సంస్థలు అంచనా వేస్తున్నాయనీ, పెళ్లి షాపింగ్‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు. విదేశాల్లో పెళ్లిళ్లు అవసరమా? ఆలోచించండి! ఈ పెళ్లిళ్ల సీజన్లో దేశంలో జరిగే పెళ్లిళ్లు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ వృధ్దిలో కీలక పాత్రను గుర్తు చేశారు. భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోందని, ఇది అవసరమా? అని మోదీ ప్రశ్నించారు. అంతేకాదు ‘‘పెళ్లిల సంగతి అటుంచితే.. చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతోంది, నా మనసులోని బాధను కుటుంబ సభ్యులతో చెప్పకపోతే ఎవరికి చెప్పుకోవాలి? అంటూ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ మారాలని ప్రధాని సూచించారు. ఈ గడ్డపై పెళ్లి చేసుకుంటే, ఆ డబ్బంతా దేశంలోనే ఉంటుంది. తద్వారా మీరు మీ దేశానికి, దేశంలోని పేదవారికి కూడా సేవ చేసిస అవకాశం పొందుతారని వ్యాఖ్యానించారు. (రాయల్ లైఫ్, అంబానీ కంటే రిచ్ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!) ఇది ఇలా ఉంటే గతంలో (మార్చి) కూడా “డెస్టినేషన్ వెడ్డింగ్‌లు టూరిజానికి భారీ అవకాశాల్ని కల్పిస్తాయని, మన దేశంలోని ధనవంతులు విదేశాలకు వెళతారు కానీ ఇప్పుడు మధ్యతరగతి ,ఎగువ మధ్యతరగతి వారు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం విదేశాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ‘డెవలపింగ్ టూరిజం ఇన్ మిషన్ మోడ్’ అనే అంశంపై మాట్లాడిన మోదీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీలు కల్పించాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు టూరిజానికి భారీ అవకాశాలు కల్పిస్తాయన్నారు. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్‌తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్‌లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన?
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ప్రాన్పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్ తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు. ఎవరు ఈ బ్రియాన్ డి ఖర్ప్రాన్ ? మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్ గురించి చెప్పారు.'1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ప్రాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్రియాన్ డి ఖర్ప్రాన్ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి' అని ప్రధాని మోదీ చెప్పారు. During #MannKiBaat, talked about Mr. Brian D. Kharpran Daly, who has done decades of work on discovering and popularising caves in Meghalaya. I also urge you all to travel to Meghalaya and explore the beautiful caves yourself. pic.twitter.com/pZDX1SOFuu — Narendra Modi (@narendramodi) August 27, 2023 టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ప్రాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు. ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు. కాగా, మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్‌లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్‌లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The month of September is going to witness the potential of India. India is fully prepared for the G-20 Leaders Summit. Heads of 40 countries & many global organisations will be coming to Delhi to… pic.twitter.com/lgEdcd7XMy — ANI (@ANI) August 27, 2023 అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు.. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh — ANI (@ANI) August 27, 2023 -
నీతి–మనా లోయ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్‌లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు. ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్‌లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్‌ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు. -
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్‌ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్‌తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్‌లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్‌బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
మొండి మౌనానికి మోక్షం ఎన్నడు?
రెండు నెలలుగా మణిపూర్ అతలాకుతలం అవుతోంది. అయినప్పటికీ ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందేహించడానికేం లేదు. కానీ మణిపుర్‌పై మాట్లాడేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఆరంభించని విధంగా ఈ వ్యాసాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఒక ఉద్దేశ ప్రకటనతో. కొలిచినట్లుగా, సమతూకంతో, వేరుగా ఉండి చూస్తూ నాకు వీలైనంతగా ఇందులో న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. విషయం మణిపూర్ అయినప్పుడు ఇలా ఉండటం తప్పనిసరి. నేనిక్కడ మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ మానని గాయాల్ని రేపడం లేదా భావావేశాలను భగ్గుమనిపించడం మాత్రం నా ఆకాంక్ష కాదు. మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఎందుకు తొలగించలేదు? 65 రోజుల తర్వాత కూడా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంలోని ఆయన అసమర్థత లేదా అశక్తత కచ్చితంగా రూఢి అయి నదే. సొంత శాసనసభ్యులకు కూడా ఆయనపై నమ్మకం పోయింది. మే నెలలో, ప్రత్యేక పాలన కోసం డిమాండ్ చేసిన ఏడుగురు బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదని బహిరంగంగానే ప్రకటించారు. జూన్‌లో ఎనిమిది మంది బీజేపీ మెయితీ ఎమ్మెల్యేలు, ‘‘మణిపూర్ ప్రజలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంటే తమ 32 మంది ఎమ్మెల్యేలలో 15 మంది. లెక్కల్ని పక్కన పెడితే, బీరేన్ సింగ్‌ను తొలగించాలనే డిమాండ్ వెనుక లోతైన నైతిక హేతువే ఉంది. మణిపూర్ జనాభాలో 16 శాతంగా ఉన్న కుకీలు... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఆయనే కారణం అని నిందిస్తున్నారు. మెయితీ దురహంకారిగా, కుకీల వ్యతిరేకిగా వారు ఆయన్ని పరిగణిస్తున్నారు. గతవారం బీరేన్ సింగ్ అధికార ట్విట్టర్ అకౌంట్ ఈ ఆరోపణకు ఒక ధ్రువీకరణగా నిలిచింది. తనను విమర్శిస్తున్నది కుకీలు, మయన్మార్‌కు చెందిన వారు మాత్రమే నన్న అర్థం వచ్చేలా బీరేన్ సింగ్ ఒక ట్విట్టర్ యూజర్‌కు బదులి చ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ‘‘మీరసలు ఎప్పుడో రాజీ నామా చేయవలసింది కదా?’’ అని ఆ యూజర్ చేసిన కామెంట్‌కు సమాధానంగా, ‘‘నీది భారతదేశమా? లేక మయన్మారా?’ అని బీరేన్ సింగ్ ప్రశ్నించినట్లు ట్విట్టర్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాయి. కుకీలను అన్నిటి కంటే ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే సయోధ్యపై ఏ విధమైన ఆశ ఉంటుంది? నేను లేవనెత్తాలని అనుకుంటున్న రెండవ అంశం, జూన్ నెలా ఖరులో జరిగిన ఒక సంఘటన. దాదాపు 1,500 మంది మెయితీ మహిళలు, బహుశా ‘మీరా పైబిస్’ మహిళా ఉద్యమ కార్యకర్తలు... తూర్పు ఇంఫాల్‌లోని 3వ ఆర్మీ దళ శిబిరాన్ని చుట్టుముట్టి మెయితీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపునకు చెందిన 12 మంది మెయితీ తీవ్రవాదులను విడిపించుకుని వెళ్లారు. 2015లో చందేల్‌లో పొంచివుండి జరిపిన మెరుపుదాడితో 18 మంది సైనికులను హతమార్చింది ఈ ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపు సభ్యులే. ఆ పన్నెండు మందిలో తనను తాను లెఫ్ట్‌నెంట్ కల్నల్ మెయి రంగ్‌థెమ్ తంబా అని చెప్పుకునే వ్యక్తి ఆనాటి దాడికి వ్యూహం రచించాడు. వీళ్లసలు ఎప్పటికీ విడుదల కావలసినవాళ్లు కాదు. కానీ విడు దలయ్యారు. ఇంకా ఘోరం ఏమిటంటే, విడిపించుకుని వెళ్లిన ఈ మహిళలందరికీ బీజేపీ మెయితీ ఎమ్మెల్యే తౌనోజం శ్యామ్‌కుమార్ సింగ్ మద్దతు ఉండటం. వారిని విడిపించుకుని వెళ్లేటప్పుడు తను అక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆయన ఖండించడం లేదు కానీ, వాళ్లను విడుదల చేయాలని తను అడగలేదని మాత్రం గట్టిగా చెబు తున్నారు. అయితే భద్రతా అధికారులు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెప్పిన కథనం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా మిలిటెంట్ల విడుదలకు బలగాలతో చర్చలు జరిపారని! వైరుద్ధ్యం ఏమిటంటే కుకీలను వెళ్లి కలుసుకోవాలనీ, ద్వైపాక్షికంగా ఉండాలనీ బీరేన్ సింగ్‌కు హోమ్ మంత్రి చెప్పారని ‘ది హిందూ’లో వార్త వచ్చిన తర్వాతే ఈ ‘విడిపించుకు పోవడం’ జరగడం. ఇంఫాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు... హోమ్ మంత్రి చెప్పారంటున్న దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఇంకొక సంగతి. శ్యామ్ కుమార్ సింగ్ వార్తను మిగతా పత్రికలు ఎందుకు వేయలేదు? ఇంఫాల్‌లో గానీ, ఢిల్లీలో గానీ ఎవరూ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? నా మూడో ఆందోళన... బాధను కలిగించేది మాత్రమే కాదు, భ్రాంతులను పోగొట్టేది కూడా! రెండు నెలలుగా మణిపూర్ అతలా కుతలం అవుతోంది. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, ఇప్పుడిక భయానకమైన శిరచ్ఛేదనం! అయినప్పటికీ మన ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మెయితీ, ప్రతి కుకీ, ప్రతి నాగా... నిరాశలో ఉన్నారు. మొదట వారు కలత చెందారు. తర్వాత ఆగ్రహించారు. ఆ తర్వాత తమకు నమ్మకద్రోహం జరిగి నట్లుగా భావించారు. ఇప్పుడు తాము ఎవరికీ అక్కర్లేదని నమ్ము తున్నారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందే హించడానికేం లేదు. కానీ మణిపూర్‌పై మాట్లాడేందుకు మోదీ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. విధులు, రాజ్యాంగ అవసరాలను మించి దేశంలోని ఆందోళన కర పరిస్థితులపైన మాట్లాడవలసిన నైతిక ఒత్తిడి ప్రభుత్వాధినేతపై ఉంటుంది. ఆయన మాట్లాడారూ అంటే మనందరి తరఫున మాట్లాడి నట్లు. మన ప్రధానమంత్రిగా మాట్లాడినట్లు. కానీ ఆయనకు మాట్లా డేందుకు ఏమీ లేదంటే ఆయన మౌనం ఆయన ఒక్కరితోనే ఉంటుంది. ఆ మౌనం మనందరికి ప్రాతినిధ్యం వహించదు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
"మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా?
మణిపూర్ అల్లర్లు మొదలై నెల రోజులు దాటుతోంది. కానీ ఇంతవరకు ప్రధానమంత్రి నోరు మెదపలేదు. ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు, అఖిలపక్షాల వారిని ఎందుకు పిలిచి మాట్లాడలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే. "మన్ కీ బాత్"లో ముందు "మణిపూర్ కీ బాత్" గురించి మాట్లాడండని ధ్వజమెత్తారు. మే 3న మొదలైన మణిపూర్ అల్లర్లలో సుమారుగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయిటీ వర్గానికి ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదన విషయమై రాజుకున్న గొడవల్లో కుకీ వర్గానికి, మెయిటీ వర్గానికి తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఊహించని ప్రాణనష్టం తోపాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. మధ్యలో కొద్దిరోజులు శాంతించిన ఇరువర్గాలు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఒకపక్క ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుంటే భారత ప్రధాని నరేందర్ మోదీ మాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు మల్లిఖార్జున్ ఖర్గే. మణిపూర్ కీ బాత్.. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. మొదట మీ "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్"ని చేర్చండి. సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మీరు ఇంతవరకు నోరు విప్పింది లేదు, ఒక సమావేశం నిర్వహించింది లేదు, అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది లేదు. మణిపూర్ భారత్ దేశానికి చెందినది కాదనుకుంటున్నారా.. ఇది సహించదగినది కాదు. రాష్ట్రం తగలబడిపోతుంటే పట్టించుకోరా? రాజధర్మాన్ని అనుసరించండి. శాంతికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించండి. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పండి. రాష్ట్రంలో పరిస్థితిని మెరుగుపరచడానికి అఖిలపక్షాలను ఆహ్వానించండని రాశారు. .@narendramodi ji, Your ‘𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’ should have first included ‘𝐌𝐚𝐧𝐢𝐩𝐮𝐫 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’, but in vain. The situation in the border state is precarious and deeply disturbing. ▫️You have not spoken a word. ▫️You have not chaired a single meeting. ▫️You have… — Mallikarjun Kharge (@kharge) June 18, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత... కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్‌కీ బాత్‌లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్‌ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్‌కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్‌కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాం 100వ ఎపిసోడ్‌ను ఆదివారం బీజేపీ చాలా అట్టహాసంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నెలవారి రేడియో కార్యక్రమం మన కీ బాత్ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా అన్ని ఎపిసోడ్లకు కలిపి రూ. 830 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఒక ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ని గుజరాత్ ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు గాధ్వీ చేశారు. దీంతో గాధ్వీపై ఏప్రిల్ 29న సైబర్ క్రై బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం తరపును ఫిర్యాదుదారుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విశ్వసనీయమైన డేటా లేకుండా గాధ్వి ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆప్ బీజేపిపై ఫైర్ అయ్యింది. బీజేపీ రాజకీయ హత్యకు పాల్పడుతూ ఇలా తమ నాయకులపై కేసు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్ధా మాట్లాడతూ..కొత్త రోజు కొత్త ఎఫ్ఆర్ అంటూ ట్విట్టర్లో విమర్శించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చిన్న రాజకీయ తర్జభర్జన చేసినందుకే గాధ్విపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే..పతకాలు గెలుచుకున్న రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని మాత్రం చూసి చూడనట్టు వదిలేశారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనలు చేసినా.. సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాక పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని చద్ధా గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్యాక్ట్ చెక్ యూనిట్ గాధ్వీ చేసిన ట్వీట్‌ని అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. వాస్తవానికి ఆ వైరల్ మెసేజ్‌లో చెప్పినట్లుగా ఒక్క ఎపిసోడ్‌కు రూ. 8.3 కోట్లు కాదని మొత్తం మన్కి బాత్ ఎపిసోడ్ల ప్రకటనల మొత్త ఖర్చు రూ. 8.3 కోట్లని వెల్లడించింది. ప్రతి ఎపిసోడ్‌కు ప్రకటనల మద్దతు ఉందని ఊహిస్తోంది అది తప్పు అని పీఐబీ పేర్కొంది. (చదవండి: బతికే ఉన్నా, పెళ్లైంది అంటూ సీఎం, డీజేపీలకి లేఖ..తీరా చూస్తే ఆ వ్యక్తి..) -
నూరు మాసాల మాట
మాటలు మంచివే. అందులోనూ మాటల్లో మనసు పరిచి, ప్రజలతో పంచుకోవడం ప్రజాస్వామ్య లక్షణం. పాలకులకు వన్నె తెచ్చే విషయం. ప్రధాని మోదీ గడచిన తొమ్మిదేళ్ళ పాలనాకాలంలో ప్రతి నెలా రేడియో వేదికగా పంచుకున్న ‘మన్ కీ బాత్’ (ఎంకేబీ) విశిష్టమైనది అందుకే. 2014 అక్టోబర్ 3న మొదలైన ఈ నెలవారీ ప్రసంగాలు ఈ ఏప్రిల్ 30తో వరుసగా 100 నెలలు, 100 భాగాలు పూర్తి చేసుకున్నప్పుడు అదొక మహోత్సవమైంది. ఏకంగా 20 దేశాల్లో 200 చోట్ల, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా బీజేపీ ఏర్పాటు చేసిన 4 లక్షల వేదికల్లో ఈ వందో ఎపిసోడ్ వినే వసతులు కల్పించడమే అందుకు నిదర్శనం. రాజ్భవన్లలో ఎంకేబీ శతమాసోత్సవాన్ని ఆహ్వానితుల ముంగిట సంబరంగా చేసుకోవడం కనివిని ఎరుగని ఘట్టం. ఇది కోట్లాది భారతీయుల మనో వాణి అని అధికార పక్షం అంటుంటే, ప్రజాసమస్యలపై మోదీ మౌనం వహిస్తున్నందున ఇది వట్టి ‘మౌన్ కీ బాత్’ అని ప్రతిపక్షాల విమర్శ. అసలు నిజం ఈ రెంటికీ మధ్య ఉందనేది విశ్లేషణ. రాజకీయ రంగస్థలిపై ప్రత్యర్థుల్ని చిత్తుచేసే పాత్రలో పేరు తెచ్చుకున్న మోదీ తెలివిగా ఎంకేబీని జనంతో సంభాషణగానే మొదటి నుంచి మలిచారు. ‘స్వచ్ఛ భారత్’, ‘హర్ ఘర్ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లాంటి ఉద్యమాలను ఈ ప్రసంగాలతో ముందుకు నడిపారు. ఉన్నత లక్ష్యాలకు అంకితమైన ఉదాత్త పాలన, పాలకుడనే భావన కలిగించడంలో కృతకృత్యులయ్యారు. ఇది తొమ్మిదేళ్ళుగా ఆయన పెంచుకున్న పెట్టుబడి. పైకి రాజకీయ ప్రస్తావనలేమీ లేకుండానే సాగినా ఈ ప్రసంగ పరంపర ఇప్పుడు చేసుకున్న శతమాసోత్సవ ప్రచార పటాటోపంలో మాత్రం అస్సలు రాజకీయాలు లేవని అనలేం. వంద రూపాయల ప్రత్యేక నాణెం, సమాచార ప్రసారశాఖ సంపాదకీయ వ్యాఖ్యలు, ఎంకేబీ వింటున్న మంత్రుల ఫోటోలు – ఇలా దేశమంతా ఓ సంరంభం. తిరుగులేని నాయకుడి మనోధర్మ వాణి ఆసరాగా, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్న కమలనాథుల ఆశ అర్థం చేసుకోదగినదే. అధికారంలో ఎవరున్నా కాస్త హెచ్చుతగ్గులుగా ఇది చేసే పనే. అదే సమయంలో ఈ ప్రసంగ పరంపరతో సమాజంలో సానుకూల ఫలితాలే లేవనుకోవడమూ తప్పే. ఎంకేబీలో ప్రస్తావించిన అనేక అంశాలు, సామాన్యుల విజయగాథలు శ్రోతలకు విజ్ఞానాన్నీ, విశేషంగా స్ఫూర్తినీ అందించాయి. నెలకోసారి అలాంటి అంశాలనూ, వ్యక్తులనూ ఎంపిక చేయడా నికి ప్రభుత్వ శాఖలు, పార్టీ యంత్రాగం ఎంతటి శ్రమ, క్షేత్రపరిశీలన చేస్తున్నాయో ఊహించవచ్చు. నిజానికి, వార్తల నుంచి వ్యవసాయ సలహాల దాకా అన్నిటికీ రేడియోనే ఆధారమై, రచ్చబండ వద్ద ఊరంతా రేడియోల ముందు పోగైన రోజుల నుంచి ఇవాళ సమాజం చాలా మారింది. దూరదర్శన్, ప్రైవేట్ కేబుల్ టీవీలు, శాటిలైట్ టీవీ ఛానల్స్, ఇప్పుడు ఓటీటీ దాకా కొత్త వేదికలతో 1990ల నుంచి రేడియో ప్రాచుర్యం తగ్గుతూ వచ్చింది. అలాంటి వేళ 2014లో మోదీ రేడియో మాధ్యమాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంతో పాటు ఫలితంపై అనుమానాలూ పెంచింది. కానీ, 501 ప్రసార కేంద్రాలతో, 23 భాషల్లో కార్యక్రమాలతో దేశంలో భౌగోళికంగా 90 శాతాన్నీ, జనాభాలో 98 శాతాన్నీ చేరుతున్న రేడియోను బలంగా వినియోగించుకున్నారు. గ్రామీణ, దిగువ మధ్యతరగతి జనానికి దగ్గరవుతూ, వారిదైన భాషలో మోదీ సమాచార ప్రసారం చేయగలిగారు. లేఖలతో వారినీ ఇందులో భాగస్వా ముల్ని చేశారు. వెరసి, ఎంకేబీని కీలక ప్రసార, ప్రచారోద్యమంగా మలుచుకున్నారు. ఇది కేవలం బీజేపీ కార్యకర్తలు వినే కార్యక్రమమని విమర్శలు వచ్చాయి. కానీ, ఎంకేబీలోని అంశాలతో సామాన్య జనం మమేకమయ్యేలా, ఆకాశవాణి, దూరదర్శన్ సహా ప్రైవేట్ టీవీ ఛానళ్ళలో, మర్నాటి పత్రికల్లో అవి ప్రధాన వార్తలుగా మారేలా తీర్చిదిద్దిన రూపకర్తల దూరదృష్టినీ, వ్యూహ చతురతనూ కొట్టిపారేయలేం. ఇంటి పెద్ద మిగతా కుటుంబ సభ్యులతో తన భావాలు పంచుకుంటున్న పద్ధతిలో సాగడం ఎంకెబీ విజయసూత్రం. ప్రసారభారతి సీఈఓ విడుదల చేసిన ఐఐఎం–రోహ్ తక్ తాజా నివేదిక 10 వేల మందిని సర్వే చేసి, ఇప్పటికి 100 కోట్ల మంది ఈ కార్యక్రమం విన్నారని పేర్కొంది. 96 శాతానికి ఎంకేబీ గురించి తెలుసనీ, 23 కోట్ల మంది క్రమం తప్పక వింటున్నారనీ తెలిపింది. సదరు ఐఐఎం డైరెక్టర్ వివాదచరిత అటుంచితే, ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలున్న సీఎస్డీఎస్ సంస్థ నిరుడు నవంబర్‌లో విడుదల చేసిన నివేదిక మాత్రం దేశంలో అయిదింట మూడొంతులు ఎన్నడూ ఎంకేబీ వినలేదంటోంది. లెక్కలెలా ఉన్నా... సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి సైతం వదలకుండా ప్రతి నెలా ఎంకెబీ వింటానన్నారు. ఇలాంటి వీరవిధేయ శ్రోతలు తక్కువేమీ కాదు. మోదీ ‘ఆధ్యాత్మిక ప్రయాణం’గా పేర్కొన్న ఈ కార్యక్రమం ఎంతగా ప్రభుత్వ అండ ఉన్నా,ఇంతకాలం శ్రోతల ఆసక్తిని నిలబెట్టుకోవడం విశేషమే. రేడియో పునర్వైభవానికీ తోడ్పడుతున్న ఈ ప్రసార ఉద్యమం అక్కడి కన్నా ఆన్లైన్లో, టీవీలో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. దేశంలో పెరిగిన డిజిటలీకరణకు కొండగుర్తుగా నిలుస్తోంది. ప్రజల మనసుకు దగ్గరైన అంశాలతో, ‘బేటీ బచావో బేటీ పఢావో’ లాంటి నినాదాలతో మోదీ మంత్రముగ్ధం చేస్తున్నారు. ఇప్పటి దాకా ఒక్కసారైనా పూర్తిస్థాయి విలేఖరుల సమావేశం జరపని తొలి భారత ప్రధాని అన్న విమర్శలకు వెరవకుండా నిత్యం జనంలో ఉంటూ, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కమ్యూనికేషన్ కింగ్ అనిపించుకున్నారు. ఎంకేబీతో కొత్త వాతావరణం సృష్టించారు. మనోవాణిని తెలపడం మంచిదైనా, ఏకపాత్రాభినయ స్వగతం కన్నా స్వేచ్ఛాయుత మీడియా సంభాషణలు ప్రజాస్వామ్యానికి మరింత మేలు. మౌనం కన్నా మాట ప్రభావమే ఎక్కువని ‘మౌన్ కీ బాత్’ శతమాసోత్సవం సైతం నిరూపిస్తోంది. -
మన్‌కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..
డిల్లీలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 24 ఏళ్ల పూనమ్ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్ భర్త ప్రమోద్ కుమార్ చెప్పారు. సదరు మహిళ పూనమ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం. ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్ లఖింపూర్ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్ సంగతన్ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ ఎపిసోడ్లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గుజరాత్ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్ కునుకు.. ఆ కమిట్మెంట్కు ఫలితంగా..) -
Mann Ki Baat: మన్ కీ బాత్... నా ఆధ్యాత్మిక ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది. కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్‌తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్‌ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా... ‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్‌లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం. ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్‌రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది. దేశ ప్రజలే నాకు సర్వస్వం ‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్‌లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’ ఐరాస, విదేశాల్లోనూ... న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్కు విశేష స్పందన లభించింది. దేశమంతటా... ► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు. ► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు. ► అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్‌లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు. కేరళలోని కొచ్చిన్‌లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు -
మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..
సాక్షి, ఢిల్లీ: ఎంతో ఆత్రుతతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసరమవుతోంది. మన్ కీ బాత్ కోసం దేశవ్యాప్తంగా 4 లక్షల వేదికలు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌తో పాటు వెయ్యి రేడియో స్టేషన్లతో లైవ్‌లో మన్ కీ బాత్ ప్రసారమవుతోంది. ఇక, మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ మొదలుపెట్టాం. ప్రజలు మన్ కీ బాత్‌లో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన్ కీ బాత్‌లో చర్చించాం. సామాన్యులతో అనుసంధానికి మన్ కీ బాత్ వేదికైంది. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందన్నారు. I'm glad that #MannKiBaat has covered various stories of women empowerment, such as the women of Deora village in Chhattisgarh, tribal women in Tamil Nadu making terracotta cups, and women rejuvenating Vellore Lake. #MannKiBaat has showcased stories of talented individuals across… pic.twitter.com/XvIUfOjXew — ANI (@ANI) April 30, 2023 ఇక, మన్ కీ బాత్ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని స్వయం సహాయక సంఘం గుర్తించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రధాని ప్రశంసించారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా గతంలో ఫోన్లో మాట్లాడిని వ్యక్తులతో మోదీ మళ్లీ ముచ్చటించారు. విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి మోదీ ప్రస్తావించారు. ప్రసాద్ ఎక్కువగా భారతీయ వస్తువులే ఉపయోగిస్తారని అన్నారు. ఇలా పలువురు గురించి ప్రస్తావించారు. Mann Ki Baat has been a catalyst in igniting numerous mass movements, be it 'Har Ghar Tiranga' or 'Catch the Rain', Mann Ki Baat has enabled mass movements to gain momentum: PM Narendra Modi during the 100th edition of #MannKiBaat#MannKiBaat100 pic.twitter.com/Z2DBkxzNee — ANI (@ANI) April 30, 2023 #WATCH | Union Minister Jitendra Singh listens to the 100th episode of #MannKiBaat at India House in London, UK. pic.twitter.com/yOpYXHNSjQ — ANI (@ANI) April 30, 2023 #WATCH | BJP national president JP Nadda listens to the 100th episode of #MannKiBaat, in Davanagere, Karnataka. pic.twitter.com/h9kLJKGlDe — ANI (@ANI) April 30, 2023 #WATCH | Uttar Pradesh: Students and teachers at Irfania Madarsa in Lucknow listen to the 100th episode of #MannKiBaat pic.twitter.com/J6uXAgICmS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 30, 2023 ఇది కూడా చదవండి: మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం.. -
మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం..
రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇక 2014 అక్టోబర్ 3న తీసుకువచ్చిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతమైంది. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా.. స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా.. వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం విశేషం. ఇక, ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్’ వందో ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు ఆలకించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్ కేంద్రం స్థాయి నాయకుల వరకూ అంతా పాల్గొనేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులూ వినేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వివరించింది. ఇక, ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం కానుంది. మరోవైపు.. 11 విదేశీ భాషల్లో కూడా మన్ కీ బాత్ ప్రసారం కానుంది. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్‌ను వినిపించనున్నట్లు పార్టీ పేర్కొంది. రాజ్ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించనునట్లు వెల్లడించింది. ఇక, మన్ కీ బాత్ వందో ఎపిసోడ్.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. -
మోదీ మనోధర్మ వాణి ‘మన్ కీ బాత్’
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ విధానం ఈనాటిది కాదు. అదే çపరంపరను అనుసరిస్తూ మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతం కావడంలోని రహస్యం అదే. రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకం! ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అందుకే... ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఏ పనికైనా ప్రజాస్వామ్యంలో అదే స్థాయిలో గౌరవ మర్యాదలు, ఆదరణ లభిస్తాయి. తమ సంక్షేమం, మంచి చెడ్డల గురించి ఆలోచించి, సమయానుగుణంగా మార్గదర్శనం చేసే వ్యక్తిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. భారతదేశంలో ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగ స్వామ్యం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. చోళుల కాలంలో తమిళనాడులోని ఉత్తర మెరూర్లో గ్రామసభ, మన పక్కనున్న కర్ణాటకలోని బీదర్ జిల్లాల్లో బసవేశ్వరుడి ‘అనుభవ మండపం’ వంటివి పురాతన కాలం నుంచే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పడతాయి. అందుకే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జరిగే కార్య క్రమాలు విజయవంతం అయ్యాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న 21వ శతాబ్దంలోనూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తూ... రేడియో ద్వారా నిరంతరం ప్రజలతో సంభాషించడం, తద్వారా వారందరినీ భాగ స్వామ్యం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ను ప్రారంభించారు. ప్రతినెలా చివరి ఆదివారం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, వీధుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, పార్టీ కార్యాలయాల్లో... ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకమే. మీ మాట.. నా నోట! దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు, సాహసం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి దాయక గాథల గురించి చర్చిస్తూనే... ప్రజాసమస్యలు, సవాళ్లను ప్రస్తావిస్తూ వారిని చైతన్య పరచడం, ఆ సమస్యలపై వారిని పోరాటానికి సిద్ధం చేయడం... దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పనిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి స్వయంగా నిరంతరాయంగా చేస్తుండటమే ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల ఆదరణకు కారణం. ‘మన్ కీ బాత్’ అనేది మీది, నాది, మనందరి మనసులోని మాట. ప్రధాని వాక్కు ద్వారా దేశం మొత్తానికి తెలియజెప్పబడుతున్న ‘మన మాట’. ‘గొంతు నాదే కానీ భావన మీ అందరిదీ’ అని ప్రధాని కూడా తరచుగా చెబుతుంటారు. అందుకే ప్రధాని మాటలు, దేశంలోని 90 శాతం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమా లను, అక్కడి సామాన్యుల అసామాన్యమైన ఆలోచనను గుర్తుచేస్తూ... దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపడం; కరోనా రూపంలో ‘తాత్కాలిక గ్రహణం’ పట్టిన సమయంలో ‘జాగ్రత్తగా ఉండండి, మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం...వంటి ఎన్నో సానుకూలమైన మార్పులకు వేదిక ఈ ‘మన్ కీ బాత్’. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మాట్లాడిన మాటల గురించి.. తర్వాతి రోజు పేపర్లలో, టీవీ ఛానళ్లలో చర్చ జరగడం ద్వారా ఎందరో సాధారణ వ్యక్తుల అసాధారణ ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది. ప్రధానమంత్రికి కోట్ల సంఖ్యలో ఉత్తరాలు వస్తాయి. వాటిలోని అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ప్రజలు తమ అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన లేఖలను కూడా వీలున్నప్పుడు చదువుతూ, నేరుగా వారితో మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఓ ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే ప్రజలు ప్రధానిని గుండెల్లో పెట్టుకున్నారు. ప్రధానినైనా.. మీలో ఒకడినే! ఓ రకంగా చెప్పాలంటే ‘మన్ కీ బాత్’... భారతదేశపు నెలవారీ సమీక్షగా భావించవచ్చు. ఇందులో ప్రజలు, వారి సమస్యలు, పరిష్కారాలు, సమా జాభివృద్ధి కోసం అక్కడక్కడ వ్యక్తులు చేస్తున్న మహోతన్నమైన పనులు పేర్కొంటూనే... కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ వీటి ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, సెల్ఫీ విత్ డాక్టర్ (కరోనా సమయంలో), జల సంరక్షణ, అవినీతి రహిత, మత్తుపదార్థాల ప్రభావం లేని భారత్ నిర్మాణంతో పాటుగా కుంభమేళా, ఇంక్రెడిబుల్ ఇండియా, ఫిట్ ఇండియా, బేటీ బచావో – బేటీ పఢావో, యోగా, ఖాదీకి ప్రోత్సాహం వంటి ఎన్నో విషయాలను చర్చిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఖాదీ రంగం ఉత్పత్తి 191 శాతం, కొనుగోళ్లు 332 శాతం పెరగడం, స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవడం, కరోనా సమయంలో నిబంధనలను పాటించడం వంటివి... ప్రధాని మోదీ మాటలను ప్రజలు విశ్వసించి భాగస్వాములు అవుతున్నారని చెప్పేందుకు నిదర్శనం. అందుకే చాలా కేంద్ర ప్రభుత్వ విభాగాలు తమ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న పురోగతిని, కొత్త పథకాలను మోదీ నోటి ద్వారా నేరుగా యావద్దేశానికి అందించాలని ప్రయత్నిస్తుంటాయి. యాడ్ ఏజెన్సీలను పెట్టుకుని ప్రచారం చేసినదానికంటే... ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలకు నేరుగా పథకాల గురించి చేరుతుండటమే ఇందుకు కారణం. భారతదేశంలోని ప్రజల కోసం వివిధ భాషల్లో, మాండలికాల్లో ప్రసారం కావడంతో పాటు ఇంగ్లిష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కూడా... దేశంలో ఈ నెలరోజుల్లో ఏం జరిగింది? భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై స్పష్టత లభిస్తోంది. భారతదేశంలో సామాజిక పరమైన విప్లవం తీసుకురావడంలో ఈ కార్యక్రమం విజయవంతం అయిందనే చెప్పాలి. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్’ సంస్థ చేసిన ఓ స్టడీ ప్రకారం... సమాజంలోని ప్రతి వర్గంపై, ప్రతి రంగంపై ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో, యువత, స్వయం సహాయక బృందాలపై ఈ ప్రభావం కనబడుతోంది. తద్వారా గ్రామీణాభివృద్ధి పథకాల సద్వినియోగం, అమృత్ సరోవర్ మిషన్ వంటి వాటిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. రాజకీయాలకు అతీతంగా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా జరుగుతున్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి పథంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. -జి.కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ‘మన్ కీ బాత్’ రాజకీయాలకు తావులేనిది.. భారతదేశ సుసంపన్న వారసత్వం, యోగా, ధ్యానం వైపు నేను బాల్యంలోనే ఆకర్షితుడనయ్యాను. అలా నా 18 ఏళ్ల వయసులో సత్య– జ్ఞానాన్వేషణలో హిమాలయాలకు వెళ్లాను. సుదీర్ఘ కాలం సంచారిగా కొనసాగిన సమయంలో జీవితంలోని విభిన్న కోణాలను దర్శించే అవకాశం లభించింది. ఇందులో భాగంగా చాలా కాలం సాధుసంతుల సత్సంగంలో గడపగలగడం నా అదృష్టం. ఎందరో మహనీయులు, యోగులు సమాజ సంస్కరణకే తమ జీవితాలను అంకితం చేయడం చూశాను. వారి బోధనలతో సమాజం స్వీయశక్తిని ఎలా గుర్తించగలదో గ్రహించాను. సాధుసంతుల కరుణా తత్పరత నా ఆరాధ్య గురుదేవునితోపాటు గొప్ప యోగులందరి నుంచీ నేను కూడా ఇదంతా నేర్చుకున్నాను. ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు, ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం వింటూ, ఆయా అంశాలపై స్పందించే వేళ మన సాధుసంతులు ప్రబోధించే ‘కరుణా తత్పరత’ను ఆయన కూడా అనుసరిస్తున్నట్లు తోస్తుంది. ఈ కార్యక్రమం మొదలైన రోజున నేను యాదృచ్ఛికంగా విన్నప్పటికీ, అదొక అలవాటుగా మారింది. ఎందుకంటే– ‘మన్ కీ బాత్’ ప్రధానంగా రాజకీయాలకు తావులేనిది.. అంతేగాక దేశం, సమాజం, సంస్కృతి, యోగా, సమాజంలోని శ్రమజీవుల విజయాలను మాత్రమే అది ప్రస్తావిస్తుంది. నేను ఈ ప్రసంగం వినడం ప్రారంభించినపుడు– అసలు ‘మన్ కీ బాత్’ వల్ల ప్రయో జనం ఏమిటనే ఆసక్తి నాలో ఉదయించింది. అయితే, ఈ రేడియో కార్యక్రమం ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఒక వినూత్న ప్రయోగమనే వాస్త వాన్ని నేను గుర్తించాను. అయినప్పటికీ– ఈ కొత్తదనం, ఆసక్తి, రాజ కీయరహిత స్వభావం ఈ వేదికపై కొనసాగడం సాధ్యమేనా అని కించిత్ సందేహం కూడా కలిగింది. కానీ, అశేష ప్రజా దరణతో ఈ కార్యక్రమం నేడు 100వ భాగం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భయాలన్నీ నిరాధారమని నిరూపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా సందేహాలను పటాపంచలు చేశారని చెప్పడానికి నేనెంత మాత్రం సంకోచించను. మనసుతో మనసు సంభాషణ ప్రధానమంత్రి చొరవతో ప్రపంచం అంత ర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం యోగాభ్యాసానికి విశ్వగురువైన భారతదేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా 2022 సెప్టెంబరు నెలలో ‘మ¯Œ కీ బాత్’ కార్యక్రమం అంశం నాకు గుర్తుకొస్తోంది. ఆనాటి ప్రసంగంలో భాగంగా సూరత్ నగరానికి చెందిన బాలిక ‘అన్వి’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిన ఆ చిన్నారికి ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ చేశారు. ఆ తర్వాత ఆత్మ స్థై్థర్యంతో, యోగాభ్యాసంతో ఆ బాలిక సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. యోగాభ్యాసంలో అనేక పతకాలు కూడా సాధించడాన్ని ప్రధాని ఉదాహరించారు. అటవీ విధ్వంసాన్ని నిలువ రిస్తూ, నక్సలైట్లను ఎదుర్కొన్న జార్ఖండ్ వీరవనిత ‘జమునా తుడు’ కథను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా పంచుకున్నారు. బిహార్‌లోని ముజ ఫర్పూర్లో ‘రైతు పిన్ని’గా ప్రసిద్ధురాలైన రాజ కుమారి దేవి కథను కూడా ఆయన ప్రస్తావించారు. గుజరాత్ వాస్తవ్యురాలైన దివ్యాంగురాలు ముక్తాబెన్ పంకజ్‌కుమార్ డాగ్లీ కథను కూడా ప్రజ లతో పంచుకున్నారు. పట్టుదారం వడకడంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్న ఒడిషా మహిళ కున్ని దేవూరి గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా మారు మూల ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవ సమయంలో అండగా నిలిచే పద్మశ్రీ సూలగిత్తి నరసమ్మ గురించి కూడా పౌరులు తెలుసు కున్నారు. సిద్దగంగ మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శ్రీ శివకుమార్ స్వామీజీ రచనల గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ తరహాలో ‘మన్ కీ బాత్’ ద్వారా ఎన్నో స్ఫూర్తిదాయక గాథలు మనకు చేరాయి. సామాన్యులతో విస్తృత స్థాయిలో మమేక మవుతూ ప్రధాని ఆత్మీయ అనుబంధం ఏర్పరచు కున్నారు. కాబట్టే ఆయన నిర్వహించే ప్రతి కార్య క్రమంలోనూ మీ కుటుంబ పెద్ద లేదా సంరక్షకుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నట్లు మీరు భావిస్తారు. మనసుతో మనసు సంభాషణే ‘మ¯Œ కీ బాత్’ అన్నది నా నిశ్చితాభిప్రాయం. -శ్రీ ఎం. వ్యాసకర్త ఆధ్యాత్మిక గురువు, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత -
జీ-20 లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్
-
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్‌ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
మన్ కీ బాత్ @100.. నేడు జాతీయ సదస్సు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ మాసాంతపు ‘ఆలిండియా రేడియో’ప్రాసంగిక కార్యక్రమం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సదస్సు నిర్వహించనుంది. దీన్ని బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో నాలుగు ప్రత్యేకచర్చా కార్యక్రమాలుంటాయి. వీటిలో నటులు అమీర్ ఖాన్, రవీనాటాండన్, తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, పూర్ణ మలావత్లతో పాటు మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించిన 100 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ‘మన్ కీ బాత్’100 ఎపిసోడ్లకు గుర్తుగా పోస్టల్ స్టాంప్, నాణేలను హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. -
‘మన్ కీ బాత్’కు 23 కోట్ల శ్రోతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–రోహ్తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే.. 100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం–రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ చెప్పారు. మన్ కీ బాత్ 100వ ఎడిషన్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. ఎక్కువ మంది టీవీ చానళ్లలో, మొబైల్ ఫోన్లలో వీక్షించనున్నారు. కేవలం 17.6 శాతం మంది రేడియోల్లో వినబోతున్నట్లు సర్వేలో తేలింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. -
రూ.100 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం.. మనం వినియోగించవచ్చా?
ఇప్పటి వరకు మనం రూ. 1,2,5,10, 20 కాయిన్స్ చూశాం. వాటిని వినియోగించాం. అయితే త్వరలో భారత మార్కెట్లో రూ.100 నాణేలు విడుదల కానున్నాయి. ఈ కొత్త కాయిన్ వినియోగంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.100 కాయిన్ విడుదలపై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ వంద రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 ఎపిసోడ్ మన్‌కీ బాత్ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. రూ.100 కాయిన్‌ను వినియోగించుకోవచ్చా? ఏప్రిల్ 30న జరిగే మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా రూ.100 కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసలు బాటు కల్పించింది కేంద్రం. రూ.100 కాయిన్ ప్రత్యేకతలు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన మేరకు.. రూ.1, 2,10,20 నాణెల కంటే విభిన్నంగా ఉండనుంది. కాయిన్ 44 మిల్లీమీటర్ డయారీ మీటర్లో గుండ్రంగా ఉంటుంది. ఇందులో 35 గ్రాముల ఇనుము, వెండి 50శాతం,రాగి 40 శాతం, నికెల్ 5శాతం, జింక్ శాతం కలిగి ఉంటుంది. వీటితో పాటు అశోక స్తంభము ముద్ర, మధ్యలో సత్యమేవ జయతే, దేవనగరి భాషలో భారత్ అనే పదాలు కనిపిస్తాయి. ఎడమవైపు ఇంగ్లీష్‌లో ఇండియా అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా కాయిన్ మీద రూపాయి చిహ్నం "₹" 100 సంఖ్య ఉండగా.. నాణెం వెనుక భాగంలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లోగో, దానిపై '2023' అని రాయబడి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ యూజర్లకు శుభవార్త! -
నారీ శక్తికి సలాం: మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో మహిళలు అమూల్య పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్‌లో క్రోడీకరించిన మహిళల స్ఫూర్తి గాథలను షేర్ చేశారు. నారీశక్తి ఫర్ న్యూ ఇండియా అంటూ హాష్‌ట్యాగ్ జత చేశారు. భారత మహిళల స్ఫూర్తిదాయకత్వంపై ‘హర్ స్టోరీ, మై స్టోరీ...’ శీర్షికతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాసిన వ్యాసాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. ‘‘త్రిపుర నుంచి తిరిగొస్తూ వ్యాసం చదివా. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతి సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదిగిన ఒక స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని కళ్లకు కట్టిన ఆ వ్యాసాన్ని అందరూ చదవాలి’’ అని సూచించారు. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కూడా కొనియాడారు. -
మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్‌కీబాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని ఈ సందర్భంగా వినిపించారు. మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్‌కుమార్‌ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్ నాయక్ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు. -
ఇ–సంజీవనితో డిజిటల్ విప్లవం
న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్ విప్లవం తన సత్తా చాటుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇ–సంజీవని యాప్ దీనికి నిదర్శనమని చెప్పారు. ఆన్లైన్లో మెడికల్ కన్సల్టేషన్ చేసే ఈ యాప్ ద్వారా 10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యాప్ ప్రాణ రక్షణగా మారిందని చెప్పారు. ఈ యాప్ ఒక్కటి చూసి భారత్ డిజిటల్ పవర్ ఏంటో చెప్పవచ్చునని అన్నారు. ఒక డాక్టర్, ఒక రోగితో మాట్లాడిన ఆయన, ఇ–సంజీవని యాప్ ఎంత ఉపయోగకరమో వివరించారు. ‘‘ఇది మనం సాధించిన అతి పెద్ద ఘనత. భారత దేశ ప్రజలు టెక్నాలజీని మన జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం. కరోనా సమయంలో ఈ యాప్ ప్రజలందరికీ ఒక వరంలా మారడం మనం కళ్లారా చూశాము’’ అని ప్రధాని చెప్పారు. ఇక నగదు చెల్లింపుల్లోనూ యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. సింగపూర్‌కు చెందిన పేనౌకి కూడా యాక్సెస్ లభించడంతో రెండు దేశాల ప్రజల మధ్య కూడా డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరంగా మారాయన్నారు. యూపీలో కొత్తగా నియమితులైన పోలీసులనుద్దేశించి మోదీ మాట్లాడారు. లక్నోలో ఉద్యోగ మేళాలో 9 వేల మందికి ఆయన నియామక పత్రాలిచ్చారు. నేడు కర్ణాటకకు ప్రధాని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో ప్రధాని పర్యటించడం ఇది ఐదోసారి! -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్‌లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్‌కీ బాత్‌లో తెలుగువారి ప్రస్తావన మన్‌కీబాత్‌లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్‌లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
Mann ki Baat: 'మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు'
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాల గురించి మాట్లాడారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని పేర్కొన్నారు. అనేక మంది కళాకారులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించినట్లు వివరించారు. మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లు మోదీ తెలిపారు. యోగా, చిరుధాన్యాల దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. చిరుధాన్యాల గొప్పతనాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం -
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్'.. భారత్ మైలురాళ్లు చెప్పిన మోదీ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఈ ఏడాది అధిగమించినట్లు చెప్పారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఆధునిక యుగంలో యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై యోగా ప్రభావవంతంగా ఉందని టాటా రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సహకరించాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ రేడియా కార్యక్రమంలో మాట్లాడుతారు. మొత్తంగా ఇది 96వ ఎపిసోడ్ కాగా.. ఈ ఏడాది చివరిది. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్‌కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్‌ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్‌గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
ఆ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్‌లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్‌ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్‌లోనే నిర్వహించారు. భగత్‌సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్‌ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
గుజరాత్‌పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్‌లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్‌జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్‌లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్‌ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు. -
Mann ki Baat:‘త్రివర్ణ పతాకాన్ని మీ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోండి’
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు. ఇదీ చదవండి: Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం -
Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి 47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చివరికి గాయకుడు కిశోర్ కుమార్ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు. -
'మన్ కీ బాత్'లో మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించిన మోదీ
తాజాగా జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించారు. దేశంలోని యువ అథ్లెట్లకు మిథాలీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ అందించిన సేవలు చిరస్మరణీమని అన్నారు. మిథాలీ అసాధారణ క్రికెటర్ అని, క్రీడలకు సంబంధించి దేశంలోని మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలని ప్రశంసించారు. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో మిథాలీ కీలకపాత్ర పోషించిందని ఆకాశానికెత్తారు. ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మిథాలీ రాజ్ జూన్ 8న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు (7805), అత్యధిక మ్యాచ్‌లు (232), టెస్ట్‌ల్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ.. ఇలా మిథాలీ ఖాతాలో పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. చదవండి: 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు -
100 మందికి సుకన్య సమృద్ధి యోజన
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వాసి రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. (క్లిక్: ఇందుకూరు పేట.. కూరగాయల తోట) -
Mann Ki Baat: మన స్టార్టప్‌లు సూపర్
న్యూఢిల్లీ: భారత స్టార్టప్ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వీటివల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు’’ అంటూ కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్‌లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్‌ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికార్న్ (రూ.7,500 కోట్ల కనీస టర్నోవర్ ఉన్న స్టార్టప్) కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీతో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమష్టి విలువ 330 బిలియన్ డాలర్ల కంటే కూడా ఎక్కువ! అంటే, రూ.25 లక్షల కోట్ల పై చిలుకు!! ప్రతి భారతీయునికీ గర్వకారణమిది’’ అన్నారు. ‘‘వీటిల్లో 44 యూనికార్న్‌లు గతేడాదే వచ్చాయంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికార్న్‌ల సగటు వార్సిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కవ. పైగా మన యూనికార్న్‌లు ఈ కామర్స్, ఫిన్ టెక్, ఎడ్ టెక్, బయో టెక్ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటార్లు విరివిగా అందుబాటులోకి రావడం మరో సానుకూల పరిణామం’’ అన్నారు. వెంబు శ్రీధర్, మదన్ పడాకీ, మీరా షెనాయ్ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు. మనసుంటే మార్గముంటుంది మన దేశం విభిన్న భాషలు, యాసలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో సుసంపన్నంగా అలరారుతోందని మోదీ అన్నారు. మన బలానికి, ఐక్యతకు ఈ వైవిధ్యమే మూలమని కొనియాడారు. ‘‘సాధించి తీరాలన్న మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షల్లో కన్నడ సబ్జెక్టులో 92 మార్కులు సాధించిన కల్పన అనే ఉత్తరాఖండ్ అమ్మాయే ఇందుకు ఉదాహరణ. ఆమెకు మూడో తరగతిలోనే టీబీ సోకింది. ఒక కంటి చూపు కూడా పోయింది. పైగా ఇటీవలి దాకా కన్నడ భాష గురించి అసలేమీ తెలియదు. అయినా మైసూరుకు చెందిన ప్రొఫెసర్ తారామూర్తి ప్రోత్సాహంతో మూడే నెలల్లో కన్నడపై పట్టు సాధించింది. రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించిన పశ్చిమబెంగాల్లోని పురులియాకు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్దీ ఇలాంటి స్ఫూర్తి గాథే. అలాగే తంజావూరు స్వయం సహాయక బృందం కళాకారులు నాకు పంపిన అమ్మవారి కళాకృతి ఓ వెలకట్టలేని బహుమానం. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’కు ఇవన్నీ ఉదాహరణలే’’ అన్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చార్ధామ్ యాత్రకు భక్తులు ఈసారి భారీగా పోటెత్తుతుండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని చెత్తాచెదారంతో నింపుతుండటం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యతన్నారు. సూర్యోదయాన్ని స్వాగతిస్తూ... ప్రపంచవ్యాప్త రిలే యోగా ప్రపంచ యోగా డేను ఈ జూన్ 21న ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘మానవాళి కోసం యోగా’ పేరిట దేశవ్యాప్తంగా 75 చోట్ల యోగా డే ఈవెంట్లు జరుగుతాయి. అలాగే గార్డియన్ రింగ్ పేరిట జూన్ 21న రోజు పొడవునా ప్రపంచమంతటా పలు దేశాల్లో సూర్యోదయాన్ని యోగా సాధనతో స్వాగతించనున్నాం. ఇది ఒకరకంగా రిలే యోగా ఈవెంట్‌గా సాగుతుంది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వీటిని చేపడతాయి’’ అని వివరించారు. ‘దేశం, జాతి తదితరాలతో సంబంధం లేకుండా యోగాతో ఎందరో శారీరక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. జపనీయుల్లో భారత్ పట్ల ఉన్న ప్రేమను ఇటీవల ఆ దేశంలో పర్యటన సందర్భంగా సన్నిహితంగా గమనించానని మోదీ చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత కళా దర్శకుడు హిరోషీ కొయిటే తొమ్మిదేళ్లుగా మహాభారత్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్టు, నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిసి ఎంతో సంతోషించా. మరో ఇద్దరు జపనీయులు రామాయణంపై జపనీస్‌లో యానిమేషన్ ఫిల్మ్ రూపొందించారు’’ అని వివరించారు. -
Azadi Ka Amrit Mahotsav: సూపర్ సెవెన్.. తుఝే సలామ్!
భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. ఏమీ దిక్కుతోచని స్థితి. ఎవరో తీసుకెళ్లి కౌసని(ఉత్తరాఖండ్)లోని లక్ష్మీ మహిళా ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇన్నిరోజులు ఇల్లే లోకంగా ఉన్న తనకు, లోకమే ఆశ్రమంగా పరిచయం అయింది. సమాజసేవ నుంచి పర్యావరణం వరకు ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగింది. కోసీ నది పరివాహక ప్రాంతాలలోని గ్రామాల్లో మహిళలు చెట్లు కొట్టేసి వంటచెరుకుగా ఉపయోగించేవారు. ‘ఇలా చేయడం తప్పు’ అని చెప్పకుండా ‘ఇలా చేస్తే మన పర్యావరణానికి ఎంత నష్టమో తెలుసా...’ అంటూ చెప్పేది. అప్పుడు వారు తప్పును తెలుసుకొని తమ అలవాటును మార్చుకున్నారు. ఎవరైనా చెట్లు కొట్టడానికి వస్తే మూకుమ్మడిగా అడ్డుకునేవారు. కొన్నిసార్లు చట్టం చేయలేని పని చైతన్యం తెస్తుంది! ‘కోసీ నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఆమె చేసిన ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమెను పర్యావరణ పోరాట యోధురాలిగా నిలిపింది. ఆమె పేరు... బసంతిదేవి నాగ్‌పూర్‌కు చెందిన ఆ అమ్మాయి చదువులో చురుకేమీ కాదు. అయితే సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం, సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. డిగ్రీ పూర్తయిన తరువాత ఎంబీఏ చేయాలనుకుందిగానీ ‘ఇది నా దారి కాదు’ అనుకోవడం తనను వేరే దారికి తీసుకు వెళ్లింది. యూనిఫామ్ ధరించాలనేది తన కల. ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్‌కు అప్లై చేసింది. నాగ్‌పుర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజిలో అడ్మిషన్ లభించింది. ఆ కాలేజీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు... హర్షిణి కన్హేకర్ ఇండియాలో ఫస్ట్ ఉమన్ ఫైర్‌ఫైటర్. ‘సాహసం, త్యాగం స్త్రీల రక్తంలోనే ఉంది’ అంటున్న హర్షిణి ఇప్పుడు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. ‘ఈ సమయంలో బయటికి వెళ్లడం అవసరమా!’ అన్నారు ఇంట్లోవాళ్లు. ‘మంచిపని చేయడానికి సమయంతో పనిఏమిటి’ అని అన్నది ఆమె. పూనమ్ నౌతియాల్ ఎప్పుడూ అంతే! ఉత్తరాఖండ్‌లోని బగేశ్వర్‌లో హెల్త్‌వర్కర్‌గా పనిచేసే పూనమ్ వ్యాక్సినేషన్ అనే మహాయజ్ఞంలో అత్యంత చురుకైన పాత్ర నిర్వహించింది. రోజూ పది నుంచి పన్నెండు కిలోమీటర్లకు పైగా మారుమూల గ్రామాలకు నడిచి వెళ్లేది. చెమటలు కక్కుకుంటూ అంతదూరం వెళితే... చాలామంది వ్యాక్సిన్ అంటే విముఖతగా ఉండేవారు. ఆ సమయంలో తాను ఒక టీచరై వారికి పాఠం చెప్పేది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో చెప్పే పాఠం అది. తల్లిగా మారి బుజ్జగించేది. సహ ఉద్యోగులు డీలా పడితే వారిలో ఉత్సాహం నింపేది. పూనమ్ పేరును మన ప్రధాని ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఉద్యోగవిధిని ఉద్యమంలా మార్చిన ఆమె ఎంతోమందికి స్ఫూర్తి. అలెప్పి (కేరళ)కు చెందిన ఆ అమ్మాయి చదువులో ఎప్పుడూ ముందుండేది. తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను చూస్తూ పెరిగిన ఆమెకు అప్పటినుంచి రాకెట్లు, క్షిపణులు అంటే ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి తనను ఎక్కడి దాకా తీసుకువెళ్లిందంటే ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ స్థాయికి చేరుకునేంతగా! ఆమె పేరు... డా. టెన్సి థామస్ ‘ప్రకృతి అద్భుతశక్తులను, అద్భుతమైన ఆలోచనలను మనకు ఇస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకోవడమే’ అంటారు థామస్. ... వీరు మాత్రమే కాదు 2017లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన అన్షు జంజనంప, ఫస్ట్ ప్రొఫెషనల్ ఫిమేల్ స్టాండ్–అప్ పాడ్లర్ (ఇండియా) తన్వీ జగదీష్, సోలోగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని క్రాస్ చేసిన యంగెస్ట్ ఫస్ట్ ఉమన్ పైలట్ అరోషి పండిట్ ‘సూపర్ సెవెన్’ (ఉమెన్ ఛేంజ్ మేకర్స్) జాబితాలో ఉన్నారు. ‘ఆజాది కా అమృతోత్సవ్’లో భాగంగా వివిధ రంగాలకు చెంది ఏడుగురు మహిళల కృషి, విజయాలను కళ్లకు కట్టేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్‌సిరీస్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సిరీస్‌లు ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నాయి. చదవండి👉🏾Russia-Ukraine: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
డిజిటల్ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. చిన్న చిన్న ఆన్లైన్ పేమెంట్లు భారీ డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్‌టెక్ స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు. మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. పలు రంగాల్లో దివ్యాంగులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సంరక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షాపే చర్చలో కొందరు పిల్లలకు లెక్కల గురించి కొంచెం భయమున్నట్లు గమనించానని, గణితశాస్త్రంలో మన దేశానికి ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. భారత్ సున్నాను ప్రపంచానికి గుర్తు చేసిందని, మన విజ్ఞానంలో గణితం ఒక భాగమని, అందువల్ల లెక్కల గురించి భయపడవద్దని పిల్లలకు సూచించారు. -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్‌భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
సగర్వంగా మాతృభాషలో మాట్లాడండి
న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు. ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్‌పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
PM Modi Mann Ki Baat: స్వీయ అప్రమత్తతే దేశానికి బలం
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాధికారక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను భారత్ ఓడించాలంటే పౌరులంతా స్వీయ క్రమశిక్షణతో, అప్రమత్తతో వ్యవహరించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. వైరస్‌పై యుద్ధంలో పై చేయి సాధించాలంటే పౌరుల వ్యక్తిగత అప్రమత్తతే అసలైన బలమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో ప్రధాని మోదీ దేశంలోని తాజా స్థితిగతులపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. ► ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ప్రక్రియలతో పోలిస్తే భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్ రేటులో అద్భుతమైన పురోగతిని సాధించింది. అయినాసరే, ప్రజలు ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తవహించాల్సిందే. ►ఒమిక్రాన్ గుట్టుమట్లను తెల్సుకునేందుకు మన శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీంతో అందివస్తున్న కొత్త విషయాలు, సమాచారానికి తగ్గట్లు కేంద్రప్రభుత్వం సైతం తగు చర్యలకు పూనుకుంటోంది ►మహమ్మారిగా పరిణమించిన కోవిడ్‌ను ఎదుర్కోవడంలో 2019 నుంచీ మన రెండేళ్ల అనుభవం ఎంతగానో దోహదపడుతోంది. అందుకే ‘దేశ ఆరోగ్య పరిస్థితి’చేయిదాటిపోకుండా అడ్డుకోగలిగాం. ఇదంతా మన సమష్టి కృషి ఫలితమే. ఇంతే బాధ్యతాయుతంగా ఉంటూ 2022 కొత్త ఏడాదిలోకి అడుగుపెడదాం. ►వ్యాక్సినేషన్లో 141 కోట్ల మైలురాయిని దాటేశాం. ఇదంతా ప్రతీ ఒక్క భారతీయుడి విజయం. వ్యవస్థపై, శాస్త్రంపై, శాస్త్రవేత్తలపై భారతీయులు పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనం. ►ప్రతీ ఏడాదిలాగే ఈసారీ ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థితో మాట్లాడతాను. Myజౌఠి. జీn ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోండి. ► భిన్నజీవ జాతులకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్‌లో పక్షుల వేటను ఆపేస్తూ ఎయిర్గన్లను ప్రజలు స్వచ్ఛందంగా త్యజించడం గొప్ప మార్పు. ►కూనూర్‌లో వాయుసేన హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి తుదివరకు పోరాడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. శౌర్య చక్ర వంటి పురస్కారాలు సాధించినా తన మూలాలను మర్చిపోలేదు. తన పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలతో వరుణ్ సింగ్ రాసిన ఉత్తరాన్ని మోదీ గుర్తుచేశారు. -
అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదన్న ఆయన వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆకాశవాణి మన్ కీ బాత్ 83వ సంచికలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు అధికారం అక్కర్లేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుడు ఒకరు మోదీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పగా ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు. ‘‘వాస్తవానికి నేను ఇప్పుడు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ప్రజా సేవలో ఉండాలన్నదే నా లక్ష్యం. ఒక ప్రధానమంత్రిగా నేను చెలాయిస్తున్నది అధికారం కాదు. ఇదంతా ప్రజాసేవే’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నది స్టార్టప్‌ల యుగమని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో స్టార్టప్ పరిశ్రమ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో 100 కోట్ల డాలర్ల విలువను కలిగిఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 70కి పైగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలోని పల్లెల్లో యువత కూడా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమస్యలకి పరి ష్కార మార్గాలు చూపిస్తున్నారని మోదీ అన్నా రు. కరోనాతో ప్రపంచ దేశాలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తల్లడిల్లుతూ ఉంటే మన స్టార్టప్ రంగం ఎంతో ఎత్తుకి ఎదిగిందని చెప్పారు. 1971 యుద్ధానికి గోల్డెన్ జూబ్లీ డిసెంబర్ మాసం వచ్చిందంటే తనకి వీర సైనికులు గుర్తుకు వస్తారని ప్రధాని అన్నారు. నేవీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ డేని ఇప్పటికే జరుపుకున్నామని 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజేతలుగా నిలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీర సైనికుల్ని కన్న తల్లులకు మోదీ జోహార్లు అర్పించారు. -
స్టార్టప్ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ
ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్‌ల యుగం నడుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో అన్నారు. ఈ స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని అన్నారు. దేశంలో గల 70కి పైగా స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి అని తెలిపారు. యువత జనాభా అధికంగా ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని అని "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో మోదీ అన్నారు. ఈ మూడు విషయాలు కలిసి వచ్చినప్పుడు, అపూర్వమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. "ఈ రోజుల్లో మన చుట్టూ స్టార్టప్, స్టార్టప్, స్టార్టప్ వింటాము. ఇది స్టార్టప్‌ల శకం, ఈ స్టార్టప్‌ల రంగంలో ఒక విధంగా భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనేది కూడా నిజం" అని మోదీ అన్నారు. ప్రతి ఏడాది స్టార్టప్‌లు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని, ఈ రంగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. "దేశంలోని చిన్న నగరాల్లో కూడా స్టార్టప్‌ల వ్యాప్తి పెరిగింది. ఈ రోజుల్లో యునికార్న్ అనే పదం చాలా చర్చలో ఉంది. యునికార్న్ స్టార్టప్‌ల విలువ ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.7,000 కోట్లు)" అని మోడీ అన్నారు. (చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..) "2015 సంవత్సరం వరకు దేశంలో 9 నుంచి పది యునికార్న్స్ ఉండేవి, ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ పరంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అనే విషయం తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం 10 నెలల్లో ప్రతి 10 రోజులకు భారతదేశంలో ఒక స్టార్టప్ యునికార్న్ గా మారింది" అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో దేశంలోని యువత ఈ గొప్ప విజయాన్ని సాధించారని ఆయన అన్నారు. "నేడు, భారతదేశంలో 70కి పైగా యునికార్న్స్ ఉన్నాయి అని, వీటి విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి" అని మోడీ అన్నారు. -
ఆ ఉద్యోగాలు కేవలం పురుషులకే అన్న అభిప్రాయానికి కాలం చెల్లింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్ వ్యవస్థను వారే ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్యం, పోలీసు శాఖ కేవలం పురుషులకే అన్న పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. 2014లో దేశవ్యాప్తంగా 1.05 లక్షల మంది మహిళా పోలీసులు ఉండగా, 2020 నాటికి 2.15 లక్షలకు చేరినట్లు ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల్లోనూ మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ యూనిట్లలో సైతం పనిచేసేందుకు యువతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇది మన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు 100 కోట్ల డోసుల కరోనా టీకా పంపిణీ పూర్తి కావడంతో దేశం కొత్త ఉత్సాహం, వేగంతో ముందుకు దూసుకెళుతోందని మోదీ అన్నారు. మనదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపాడుతూనే ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని ప్రధాని ప్రజలను కోరారు. -
నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్య క్రమం
-
PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం
న్యూఢిల్లీ: దసరా, దీపావళి దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో కోవిడ్–19 నిబంధనలు అందరూ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ 81వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు. పండుగలొస్తున్న సమయంలోనే కోవిడ్–19పై పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలన్నారు. ‘‘భారత్ వ్యాక్సినేషన్లో ప్రతీ రోజూ ఒక సరికొత్త రికార్డు సాధిస్తోంది. అంతర్జాతీయ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. కరోనా నుంచి రక్షణనిచ్చేది వ్యాక్సిన్ మాత్రమే’’అని మోదీ అన్నారు.‘వ్యాక్సిన్ అన్నది ఒక సురక్ష చక్రం వంటిది. మీ చుట్టు పక్కల వారికి టీకా వేయించాల్సిన బాధ్యత మీదే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’అని ప్రధాని చెప్పారు. ఈసారి మోదీ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నదుల పరిశుభ్రత, డిజిటల్ లావాదేవీలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలపై మాట్లాడారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట నిరుపేదల కోసం టాయిలెట్లు నిర్మించి స్వచ్ఛభారత్ కోసం ఎలా పోరాడామో ఆర్థిక రంగం స్వచ్ఛంగా ఉండేలా, నిరుపేదల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండడానికి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జన్‌ధన్ ఖాతాల్లో లబి్ధదారులకు నేరుగా డబ్బు జమ అవుతూ ఉండడంతో దిగువ స్థాయిలో అవినీతిని కట్టడి చేశామన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వంటి టెక్నాలజీతో యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారని చెప్పారు. ఆగస్టు నెలలో 355 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగాయని వెల్లడించారు. రోజుకి సగటున 6 లక్షల కోట్ల నగదు లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయని, డిజిటల్ ఎకానమీ పారదర్శకత, స్వచ్ఛతకు ప్రతీక అని అన్నారు. సెంట్రల్ విస్టా సందర్శన కొత్త పార్లమెంటు నిర్మాణ స్థలాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. పనుల్లో నిమగ్నమై ఉన్న కారి్మకులతో మాట్లాడి, నిర్మాణం సాగుతున్న తీరును తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటులో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు ప్రధాని, ఉపరాష్ట్రపతుల నివాసాలు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదు..
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్లో మాట్లాడారు. స్వచ్ఛభారత్ అనగానే అందరికీ ఇండోర్ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు. యువతరం మారుతోంది దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ టీమ్ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యానచంద్ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్‌లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్ ధ్యాన్‌చంద్‌జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్‌ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. -
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు