విదా, సోఫియా
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశ భద్రతా వ్యవస్థలో శునకాల సేవల గురించి ప్రస్తావించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కామాండేషన్ కార్డు పొందిన ఆర్మీ శునకాలు విదా, సోఫియాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ( అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ )
కర్తవ్య నిర్వహణలో వాటి సేవలను మోదీ కొనియాడారు. ప్రజలందరూ శునకాలను పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, విదా నార్తర్న్ కమాండ్‌లోని యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఐదు మైన్‌లు, ఒక గ్రెనేడ్ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడింది. ఇక సోఫియా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తోంది. వాసన పట్టి బాంబులను గుర్తించటంలో సోఫియా నిపుణురాలు.
Comments
Please login to add a commentAdd a comment