ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు | PM Narendra Modi praise on Election Commission during Mann Ki Baat | Sakshi
Sakshi News home page

ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు

Published Mon, Jan 20 2025 4:55 AM | Last Updated on Mon, Jan 20 2025 5:19 AM

PM Narendra Modi praise on Election Commission during Mann Ki Baat

ఎన్నికలను సజావుగా నిర్వహించింది 

మన్‌ కీ బాత్‌లో మోదీ 

న్యూఢిల్లీ: ప్రజా శక్తిని సాంకేతికత దన్నుతో (Central Election Commission)కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలోపేతం చేసిందని ప్రధాని , (Narendra Modi)మోదీ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో ఎన్నికలను సజావుగా నిర్వహించిందంటూ అభినందించారు. ఆదివారం ఆయన , (Mann Ki Baat)‘మన్‌కీ బాత్‌’లో మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో కార్యక్రమాన్ని చివరి ఆదివారానికి బదులు ఒక వారం ముందుకు జరిపారు. 

జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే ఈసీ వ్యవస్థాపక దినోత్సవం జనవరి 25వ తేదీ సమీపిస్తున్న వేళ ఈసీని మోదీ పొగడటం విశేషం. ‘‘ 1951–52లో తొలిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యం దేశంలో మనగలదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వాళ్లందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ భారత్‌ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా అవతరించింది. 

ఎప్పటికప్పుడు ఓటింగ్‌ విధానాన్ని ఆదునీకరిస్తూ, పటిష్టపరుస్తున్న ఈసీకి నా అభినందనలు’’ అని మోదీ అన్నా రు. ‘‘ ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. భారత గణతంత్రానికి ఇది 75వ వార్షికోత్స వం. ఇంతటి పవిత్ర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగపరిషత్‌లోని మహనీయులకు నా సెల్యూ ట్‌. 

ఆనాటి వారి విస్తృతస్థాయి చర్చలు, రాజ్యాంగ సభలో సభ్యుల ఆలోచనలు, వారి ఉపదేశాలు మనకు గొప్ప వారసత్వ సంపద’’అంటూ నాటి చైర్మన్‌ రాజేంద్ర ప్రసాద్, బీఆర్‌ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్‌ ముఖర్జీల ప్రసంగాల ఆడియో క్లిప్‌లను మోదీ వినిపించారు. ‘‘ భారత్‌ తరఫున తొలిసారిగా ప్రైవేట్‌ ఉపగ్రహాల కూటమి ఫైర్‌ఫ్లైను నింగిలోకి పంపి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్‌’ చరిత్ర సృష్టించిన విషయాన్ని చెప్పేందుకు గర్వపడుతున్నా’’ అని మోదీ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement