PM Narendra Modi Begins Mann Ki Baat 100th Episode, Know Highlights Inside - Sakshi
Sakshi News home page

మన్‌ కీ బాత్‌ @100.. మోదీ కామెంట్స్‌ ఇవే..

Published Sun, Apr 30 2023 11:39 AM | Last Updated on Sun, Apr 30 2023 12:59 PM

PM Narendra Modi Begins Mann Ki Baat 100th Episode - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎంతో ఆత్రుతతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ ప్రసరమవుతోంది. మన్‌ కీ బాత్‌ కోసం దేశవ్యాప్తంగా 4 లక్షల వేదికలు ఏర్పాటు చేశారు.  ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌తో పాటు వెయ్యి రేడియో స్టేషన్‌లతో లైవ్‌లో మన్‌ కీ బాత్‌ ప్రసారమవుతోంది. 

ఇక, మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్‌ మొదలుపెట్టాం. ప్రజలు మన్‌ కీ బాత్‌లో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన్‌ కీ బాత్‌లో చర్చించాం. సామాన్యులతో అనుసంధానికి మన్‌ కీ బాత్‌ వేదికైంది. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. సమాజంలో ఎన్నో మార్పులకు మన్‌ కీ బాత్‌ శ్రీకారం చుట్టిందన్నారు. 

ఇక, మన్‌ కీ బాత్‌ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని స్వయం సహాయక సంఘం గుర్తించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రధాని ప్రశంసించారు. 100వ ఎపిసోడ్‌ సందర్భంగా గతంలో ఫోన్‌లో మాట్లాడిని వ్యక్తులతో మోదీ మళ్లీ ముచ్చటించారు. విశాఖకు చెందిన వెంకట ప్రసాద్‌ గురించి మోదీ ప్రస్తావించారు. ప్రసాద్‌ ఎక్కువగా భారతీయ వస్తువులే ఉపయోగిస్తారని అన్నారు. ఇలా పలువురు గురించి ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి: మన్‌ కీ బాత్‌ @100.. ఐరాసలో ప్రసారం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement