సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది.
మన్ కీ బాత్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్‌నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్‌ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు.
‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’
మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్‌నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం
Comments
Please login to add a commentAdd a comment