Sound and Light Show
-
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్‌ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
గోల్కొండలో ‘షో’ చూపిస్తున్నారు!
‘సౌండ్ అండ్ లైట్ షో’లో చుక్కలు చూపిస్తున్న సిబ్బంది - నష్టాల పేరుతో ఎగ్జిక్యూటివ్ టికెట్లను అంటగడుతున్న వైనం - రూ.80 టికెట్ ఇచ్చేందుకు నిరాకరణ.. రూ.140 టికెట్ కొనాలని ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బెంగళూరు వరుణ్ కుటుంబం సోమ వారం రాత్రి గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోకు వెళ్లింది. సాధారణ కేటగిరీ రూ.80 టికెట్ కావాలని కౌంటర్లో అడగ్గా, ఎగ్జిక్యూ టివ్ కేటగిరీ రూ.140 టికెట్ కొంటేనే అనుమ తిస్తామని సిబ్బంది తెలిపారు. రూ.60 చిన్న పిల్లల టికెట్‌నూ రూ.140కి కొనాల్సిందే నని తేల్చి చెప్పారు. అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక షో చూడకుండానే వారు వెనుదిరిగారు. కొన్ని రోజులుగా సౌండ్ అండ్ లైట్ షోలో జరుగుతున్న తంతు ఇది. దేశంలోనే టాప్ షోగా పేరున్న గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో కీర్తి మసకబారే వ్యవహారమిది. పర్యాటక శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోల్కొండకు వచ్చే పర్యాటకులు విస్తుపోయేలా చేస్తున్నారు. గోల్కోండలో రెండు సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తుండగా నిర్వహణ సరిగా లేక ప్రదర్శనకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. రెండో ప్రదర్శనకు ప్రేక్షకులు మరీ తక్కువగా ఉంటుండటంతో నిర్వహణ ఖర్చులకు సరిపోవటం లేదంటూ రెండో తరగతి టికెట్లు అమ్మకుండా, ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలంటూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం బెంగళూరు నుంచి వచ్చిన సందర్శకులు సిబ్బందిని నిలదీస్తే ‘ఫిర్యాదు చేసుకోండి’ అంటూ దురుసుగా వ్యవహరించారు. సమస్య ఇది.. దేశంలో ప్రస్తుతం 7 చోట్ల సౌండ్ అండ్ లైట్ షోలున్నాయి. వీటిలో తొలుత ఎర్రకోట షో మొదలైనా, రెండో విడతలో అండమాన్ జైలు, మదురై ప్యాలెస్, కోల్‌కతా విక్టోరియా మెమోరియల్‌తో కలిపి 1993లో మొదలైన గోల్కొండ షో టాప్‌గా నిలిచింది. 450 అడుగుల ఎత్తున్న కోటను రంగురంగుల 720 లైట్లతో అద్భుతంగా చూపటంతోపాటు గంటపాటు కొనసాగడం దీని ప్రత్యేకత. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా ఈ షో కోసం క్యూ కడుతుంటారు. కానీ ప్రస్తుతం ఆ లైట్లు, సౌండ్ సిస్టం పాతపడిపోవటంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త సిబ్బందిని నియమించటంతో వారికి సరైన నైపుణ్యం, అవగాహన లేక సమస్యలు పెరిగాయన్న ఫిర్యాదులున్నాయి. ఇక నిత్యం రాత్రి 7 గంటలకు ఆంగ్లంలో వివరిస్తూ సాగే తొలి షో ఉంటుంది. 8 గంటలకు మొదలయ్యే రెండో ప్రదర్శనలో... వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తెలుగులో, మిగతా రోజుల్లో హిందీలో షో ఉంటుంది. మొదటి ప్రదర్శనకు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉన్నా రెండో ప్రదర్శన(ముఖ్యంగా తెలుగు) కు జనం తగ్గిపోయారు. సాధారణంగా ఒక ప్రదర్శనకు రూ.2,800 విద్యుత్ ఖర్చవుతుండగా అందులో సగం వసూళ్లు ఉంటేనే షో నిర్వహించే పద్ధతి ఉంది. ఇటీవల సందర్శకుల సంఖ్య తగ్గటంతో అంతమొత్తం వసూలు కాక షో నిర్వహణ డోలాయమానంలో పడింది. దీంతో వచ్చే అరకొర సందర్శకులను కచ్చితంగా రూ.140 ఉండే ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. చిన్నపిల్లకు రూ.110 వసూలు చేయాల్సి ఉండగా వారికీ ఫుల్ టికెట్ విక్రయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పర్యాటకులు వస్తే షో లేదని పంపేస్తున్నారు. ఒకేసారి 15 మంది వస్తేనే షో ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. కొసమెరుపు: కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా డబ్బులు రాకుంటే ఎగ్జిక్యూటివ్ టికెట్ కొనాల్సిందేనని పర్యాటక శాఖ వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు. అప్పటికప్పుడు సిబ్బంది చెప్పి హడలగొడుతున్నారు. రూ.18 లక్షల నష్టం..? సౌండ్ అండ్ లైట్ షోకు సంవత్సరానికి రూ.కోటి పైనే ఆదాయం ఉంటుంది. ఏటా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య పెరుగుతూ ఉంటుం ది. అయితే 2015–16లో రూ.1.32 కోట్లు వసూలవగా 2016–17లో రూ.1.26 కోట్లే వసూలైంది. పెరగాల్సిన రూ.12 లక్షల ఆదాయం సమకూరకపోగా రూ.6 లక్షల నికర నష్టం వచ్చింది. వెరసి రూ.18 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో నష్టం నుంచి బయటపడేందుకు రూ.140 టికెట్లను అంటగట్టి సందర్శ కుల జేబుకు చిల్లు పెడుతున్నారు. -
గోల్కొండ ఖ్యాతికి ‘మసక’
♦ సౌండ్ అండ్ లైట్ షోలో తరచూ సాంకేతిక సమస్యలు ♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న ప్రదర్శనలు ♦ ఉత్సాహంగా వచ్చి ఉసూరుమంటున్న విదేశీ పర్యాటకులు సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యాటకులు ముచ్చటపడి వచ్చారు.. క్యూలో నిలబడి టికెట్ కొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో అంతా చీకటి.. ఓ మూలన తళుక్కుమంటూ కాంతి విరజిమ్మింది..! ‘‘రండి.. రండి.. మీకు సాదర స్వాగతం.. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గల ఈ గోల్కొండ కథ చెబుతాను.. ఇక్కడి రాళ్లకు జీవమే వస్తే హృదయాన్ని హత్తుకునేలా ఎన్ని కమనీయ కథలు చెప్పేవో.. ’’ అంటూ హిందీ, ఇంగ్లిష్‌లో గంభీరంగా అమితాబ్ బచ్చన్ గొంతు..! అంతే అందరిలో తెలియని పులకింత. మరోపక్క ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగు లైట్ల కాంతి లయబద్ధంగా కదలాడుతుంటే ప్రేక్షకుల్లో తన్మయత్వం! ఇంతలో గర్ర్ర్మంటూ శబ్దం.. ఆ వెంటనే నిలిచిపోయిన మాటలు.. లైట్ల కాంతిలోనూ మసక... షో ఆగిపోయింది. ‘‘సారీ.. సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేస్తున్నాం. మీ టికెట్ డబ్బులు వాపసు చేస్తాం తీసుకోండి..’’ అంటూ సిబ్బంది సూచన. విదేశీ పర్యాటకుల్లో తీవ్ర అసంతృప్తి... ఉసూరుమంటూ నిష్ర్కమణ.. గోల్కొండ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలో పరిస్థితి ఇదీ! ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద నిర్వహించే ఈ సౌండ్ అండ్ లైట్ షో అన్నింట్లోకెల్లా గోల్కొండ వద్ద ప్రదర్శించే షో ప్రత్యేకతే వేరు! దీన్ని అనుసరిస్తూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు గొప్ప ఖ్యాతిని మూటగట్టుకున్న ఈ షో ఇప్పుడు సాంకేతిక లోపాలతో విదేశీ పర్యాటకుల ముందు మన పరువు తీస్తోంది. మధ్యలో నిలిచిపోతున్న షోలు కోట వద్ద ప్రతిరోజూ తొలుత గంటపాటు ఆంగ్లంలో, ఆ తర్వాత గంటపాటు హిందీ/తెలుగు భాషల్లో రెండు విడతలుగా సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన 23 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పాతబడ్డ సౌండ్ అండ్ లైట్ షో వ్యవస్థ మొరాయిస్తోంది. దీంతో మధ్యలోనే ఆపేసి పర్యాటకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించి పంపుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఆ షోను ఎలాగోలా నిర్వహించేందుకు పర్యాటకశాఖ అధికారులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీన్ని ఆధునీకరించేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించటం లేదు. మరమ్మతు చేసినా మారని పరిస్థితి ఈజిప్టులో ఇలాంటి ప్రదర్శన గురించి 1988లో తెలుసుకున్న అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశం మేరకు 1993లో గోల్కొండలో ఈ ప్రదర్శన మొదలైంది. అప్పుడు ఏర్పాటు చేసిన లైట్లు, సౌం డింగ్ వ్యవస్థనే ఇప్పటివరకూ కొనసాగుతోంది. దీంతో అది దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితమే రూ.కోటితో మరమ్మతు చేయించా రు. అయినా తరచూ షో మొరాయిస్తోంది. పాతకాలం నాటి హాలోజన్ లైట్లను మార్చేసి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో కాకతీయ ఉత్సవాల ముగింపు
=నిట్‌లో నీటిపారుదలకు కాకతీయులు చేసిన కృషిపై సెమినార్ =జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబర్ 20, 21, 22 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపా రు. సోమవారం హన్మకొండలోని కలెక్టరేట్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొ దటి రోజు కలెక్టరేట్ నుంచి ఖిలా వరంగల్ వర కు కాగడాల ప్రదర్శన.. 20న ఖిలా వరంగల్ లో, 21న రామప్ప, 22న హన్మకొండలోని వేయిస్తంభాల ఆయలంలో ఘనంగా నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పా టు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నామన్నారు. ఈ మూడ రోజుల పా టు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. నగరంలో పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిన్న వడ్డెపల్లి చెరువులో నగర వాసుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ బోటింగ్ నిరంతరం కొనసాగేల చర్యలు తీసుకొంటున్నామన్నారు. ‘మినీ రవీంద్రభారతి’కి నిధులు మంజూరు పోచమ్మమైదాన్‌లో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని నిర్మాణ పనులు మొదలు పెట్టామన్నారు. గోపాల్పూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో రూ.5.5 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో అన్ని పాఠశాలలో ఈ నెల 11 నుంచి 14వరకు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు సాహి త్య, సాంస్కృతిక కళా రంగాలలో పోటీలు నిర్వహించాలన్నారు. కాకతీయ బాల ల సృజనోత్సవం పేరుతో నిర్వహించే ఈ పోటీలలో 4 వేల మంది బాల బాలికలు, తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారన్నారు. గత నెల 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయుల చరిత్ర సం స్కృతి, కట్టడాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సదస్సులో వచ్చి న అధ్యయన పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించనున్నామన్నారు. ‘నిట్’లో మరో జాతీయ సదస్సు నవంబర్ 8, 9 తేదీలలో ఎన్ఐటీ, ఇంటాక్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కాకతీయుల నీటి పారుదల సాంకేతిక విధానం అనే అంశంపై నిట్‌లో మరో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ నిపుణులు త మ అధ్యయన పత్రాలు సమర్పించనున్నారన్నా రు. ఇప్పటి వరకు కాకతీయ ఉత్సవాలలో భాగంగా 2012 డిసెంబర్ 21వ, 22, 23 తేదీ లలో ఉత్సవాల ప్రారంభకార్యక్రమాలను ఖిలా వరంగల్, రామప్ప, వేయిస్తంభాల ఆలయం లో నిర్వహించామన్నారు. ఉత్సవాలను తెలంగాణలోని వివిధ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కాకతీయులు పాలించిన ప్రాంతాలైన నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో రోజు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పర్యాటకాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, టూర్ ఆపరేటర్లను ఆహ్వానించి రోడ్‌షోను నిర్వహించనున్నామన్నారు. వందేళ్ల సినిమా ఉత్సవాలు.. వరంగల్‌లో వందేళ్ల సినిమా ఉత్సవాలను నిర్వహించనున్నామన్నారు. డిసెంబర్ మొదటి వా రంలో మూడురోజులు సినీ ఉత్సవాలు నిర్వహించి స్థానిక నేపథ్యంలో వచ్చిన చారిత్రక, సామాజిక సినిమాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాకతీయ ఉత్సవాల ప్రా రంభం సందర్భంగా కేంద్రపర్యాటకశాఖ మంత్రి చిరంజీవి టూరిజం సర్క్యూట్‌కు నిధులు మం జూరు చేస్తామన్నారని, ఈ పనుల ఎంత దూ రం వచ్చాయని ప్రశ్నించగా ఈ విష యం తన కు తెలియదన్నారు. పర్యాటకశాఖచే ప్రతి పాధనలు తయారు చేయించి పంపిస్తామన్నారు. పైలాన్ డిజైన్ కాకతీయ ఉత్సవాలకు సంబంధించిన పైలాన్‌ను డిజైన్ చేయిస్తున్నామన్నారు. సావనీర్ తీసుకరావడానికి కమిటీ వేశామని కలెక్టర్ చెప్పారు. ఇంటాక్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగరావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వారి సామ్రాజ్యంలో 25 వేల నిటీ వనరులు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని 50 మండలాల్లో నీటి వనరులను గుర్తించామన్నారు. సముద్రంలో కలుస్తున్న 2 వేల టీఎంసీల నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందన్నారు. నిట్ డైరక్టర్ శ్రీని వాస్‌రావు మాట్లాడారు. నిట్ ప్రొఫెసర్ జయకుమార్, డీపీఆర్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదు కావాలి 18ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ యువతకు పిలుపునిచ్చారు. నేరుగా వీలుకాకుంటే పోస్టర్ బ్యాలెట్‌తో కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15న గ్రామాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వివరించారు. 19, 20వ తేదీలలో గ్రామసభలో జాబితాను ఉంచుతామన్నారు. ఇతర అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 17, 24 తేదీలలో చేపట్టనున్నామన్నారు. డిసెంబర్ 16 వరకు అన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జవనరి 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు వివరించారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.