=నిట్‌లో నీటిపారుదలకు కాకతీయులు చేసిన కృషిపై సెమినార్
=జిల్లా కలెక్టర్ జి.కిషన్
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబర్ 20, 21, 22 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపా రు. సోమవారం హన్మకొండలోని కలెక్టరేట్ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొ దటి రోజు కలెక్టరేట్ నుంచి ఖిలా వరంగల్ వర కు కాగడాల ప్రదర్శన.. 20న ఖిలా వరంగల్ లో, 21న రామప్ప, 22న హన్మకొండలోని వేయిస్తంభాల ఆయలంలో ఘనంగా నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పా టు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నామన్నారు. ఈ మూడ రోజుల పా టు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. నగరంలో పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిన్న వడ్డెపల్లి చెరువులో నగర వాసుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ బోటింగ్ నిరంతరం కొనసాగేల చర్యలు తీసుకొంటున్నామన్నారు.
‘మినీ రవీంద్రభారతి’కి నిధులు మంజూరు
పోచమ్మమైదాన్‌లో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని నిర్మాణ పనులు మొదలు పెట్టామన్నారు. గోపాల్‌పూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో రూ.5.5 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో అన్ని పాఠశాలలో ఈ నెల 11 నుంచి 14వరకు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్థులకు సాహి త్య, సాంస్కృతిక కళా రంగాలలో పోటీలు నిర్వహించాలన్నారు. కాకతీయ బాల ల సృజనోత్సవం పేరుతో నిర్వహించే ఈ పోటీలలో 4 వేల మంది బాల బాలికలు, తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారన్నారు. గత నెల 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయుల చరిత్ర సం స్కృతి, కట్టడాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సదస్సులో వచ్చి న అధ్యయన పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించనున్నామన్నారు.
‘నిట్’లో మరో జాతీయ సదస్సు
నవంబర్ 8, 9 తేదీలలో ఎన్‌ఐటీ, ఇంటాక్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కాకతీయుల నీటి పారుదల సాంకేతిక విధానం అనే అంశంపై నిట్‌లో మరో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ నిపుణులు త మ అధ్యయన పత్రాలు సమర్పించనున్నారన్నా రు. ఇప్పటి వరకు కాకతీయ ఉత్సవాలలో భాగంగా 2012 డిసెంబర్ 21వ, 22, 23 తేదీ లలో ఉత్సవాల ప్రారంభకార్యక్రమాలను ఖిలా వరంగల్, రామప్ప, వేయిస్తంభాల ఆలయం లో నిర్వహించామన్నారు. ఉత్సవాలను తెలంగాణలోని వివిధ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కాకతీయులు పాలించిన ప్రాంతాలైన నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో రోజు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పర్యాటకాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, టూర్ ఆపరేటర్లను ఆహ్వానించి రోడ్‌షోను నిర్వహించనున్నామన్నారు.
వందేళ్ల సినిమా ఉత్సవాలు..
వరంగల్‌లో వందేళ్ల సినిమా ఉత్సవాలను నిర్వహించనున్నామన్నారు. డిసెంబర్ మొదటి వా రంలో మూడురోజులు సినీ ఉత్సవాలు నిర్వహించి స్థానిక నేపథ్యంలో వచ్చిన చారిత్రక, సామాజిక సినిమాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాకతీయ ఉత్సవాల ప్రా రంభం సందర్భంగా కేంద్రపర్యాటకశాఖ మంత్రి చిరంజీవి టూరిజం సర్క్యూట్‌కు నిధులు మం జూరు చేస్తామన్నారని, ఈ పనుల ఎంత దూ రం వచ్చాయని ప్రశ్నించగా ఈ విష యం తన కు తెలియదన్నారు. పర్యాటకశాఖచే ప్రతి పాధనలు తయారు చేయించి పంపిస్తామన్నారు.
పైలాన్ డిజైన్
కాకతీయ ఉత్సవాలకు సంబంధించిన పైలాన్‌ను డిజైన్ చేయిస్తున్నామన్నారు. సావనీర్ తీసుకరావడానికి కమిటీ వేశామని కలెక్టర్ చెప్పారు. ఇంటాక్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగరావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వారి సామ్రాజ్యంలో 25 వేల నిటీ వనరులు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని 50 మండలాల్లో నీటి వనరులను గుర్తించామన్నారు. సముద్రంలో కలుస్తున్న 2 వేల టీఎంసీల నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందన్నారు. నిట్ డైరక్టర్ శ్రీని వాస్‌రావు మాట్లాడారు. నిట్ ప్రొఫెసర్ జయకుమార్, డీపీఆర్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.
ఓటర్లుగా నమోదు కావాలి
18ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ యువతకు పిలుపునిచ్చారు. నేరుగా వీలుకాకుంటే పోస్టర్ బ్యాలెట్‌తో కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15న గ్రామాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వివరించారు. 19, 20వ తేదీలలో గ్రామసభలో జాబితాను ఉంచుతామన్నారు. ఇతర అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 17, 24 తేదీలలో చేపట్టనున్నామన్నారు. డిసెంబర్ 16 వరకు అన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జవనరి 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు వివరించారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో కాకతీయ ఉత్సవాల ముగింపు
Published Tue, Nov 5 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement