Kakatiya festivities
-
గ్రామాభ్యుదయమే లక్ష్యం
పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి కృషి కాకతీయ ఉత్సవాల స్ఫూర్తితో మేడారం ఏర్పాట్లు 1.26 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు ఇప్పటివరకు ‘దేవాదుల’ ఖర్చు రూ. 6,723 కోట్లు పథకాలు పేదలందరికీ చేరేలా ప్రతిఒక్కరూ పాటుపడాలి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ గంగాధర కిషన్ కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు... వాటి అభివృద్ధే నిజమైన స్వరాజ్యం’ అన్న మహాత్మాగాంధీ మాటలు స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో మండల స్థాయి అధికారులను గ్రామాభ్యుదయ అధికారులుగా నియమించానని, పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి, పోలీసు బలగాల వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి గణతంత్ర సందేశం ఇచ్చారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కాకతీయ ఉత్సవాలను ఏడాదిపాటు అత్యంత వైభవంగా జరుపుకున్నామని, అదే స్ఫూర్తితో కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణతో పర్యాటక పరంగా జిల్లా ప్రగతి సాధించిందని, 60 లక్షలకుపైగా దేశీయులు, 800కు పైగా విదేశీ పర్యాటకులు జిల్లాను సందర్శించారని వెల్లడించారు. ఈ సారి ప్రకృతి కరుణించడంతో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైందని, రబీలో రైతులు 86,320 హెక్టార్లలో వరి, మొక్కజొన్న వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తున్నారన్నారు. రూ.2.94 కోట్ల రాయితీపై రైతులకు 11,688 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పరంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద 1,26,260 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు చేపట్టారని, ఇప్పటివరకు భూసేకరణ, పునరావాస పనులకు రూ. 338 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం అమలుకు మూడు దశల్లో ఇప్పటివరకు రూ. 6,723 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎత్తిపోతల ద్వారా సుమారు 2.50 టీఎంసీల నీటిని ధర్మసాగర్, ఘన్పూర్, అశ్వరావుపల్లి, చీటకోడూరు, గంటరామారం, బొమ్మకూరు టపాసుపల్లి రిజర్వాయర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో 1.41 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ సంవత్సరం రూ.160 కోట్లతో 5.58 లక్షల మంది కూలీలకు పనిక ల్పించామని, రైతాంగం కోసం రూ.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద నర్సరీలు ఏర్పాటు చేసి జిల్లాలో 23.20 లక్షల మొక్కలను 8,772 మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. రూ.9.96 కోట్ల వ్యయంతో మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూముల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. విద్యాపరంగా జిల్లాలో రూ.4.80కోట్లుతో 24 నూతన పాఠశాలల భవనాలు ప్రారంభించామని, బడిబయట ఉన్న విద్యార్థులను ప్రత్యేక కార్యక్రమం ద్వారా బడిలో చేర్పించామన్నారు. నూతనంగా ఆదర్శ పాఠశాలల్లో 271 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసినట్లు వెల్లడించారు. ఐటీడీఏ ద్వారా రూ.5.58కోట్లతో గ్రామాల్లో తాగునీటి పనులు పూర్తి చేశామని, నాబార్డు నిధులు రూ.3 కోట్లతో రోడ్లు వేయించామన్నారు. అటవీహక్కు గుర్తింపు చట్టం కింద 1,18,122 ఎకరాల భూమి హక్కు పత్రాలను 134 సామాజిక సంఘాలకు... 41,314 ఎకరాల భూమిని 14,016 మందికి అందజేశామన్నారు. జిల్లాలో అమ్మహస్తం, అమృతహస్తం, పేదలకు బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఉపకారవేతనాల పంపిణీ జిల్లాలో పక్కాగా అమలవుతున్నాయని, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో వసతి గృహాల నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... వాటిని అన్నివర్గాలవారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే సర్కారు లక్ష్యం నెరవేరినట్లు భావించాలని పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని నేరవేర్చేందుకు ప్రతిఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పండగ మేడారం ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుందని, ఈ సారి కోటి మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశామన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తుల రద్దీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా తుమ్మల వాగు, వట్టి వాగుపై ైెహ లెవల్బ్రిడ్జి, జంపన్నవాగుపై స్నానఘట్టాల నుంచి గద్దెల వరకు నాలుగు లేన్లరోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు మేడారంలో అభవృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు కలెక్టర్ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పౌసుమి బసు, ఎన్పడీసీఎల్ సీఎండీ కార్తికయమిశ్రా, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణపండాదాస్, శిక్షణట్రెరుునీ కలెక్టర్ హన్మంతు, ఏజేసీ సంజీవయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, వెంకటేశ్వర్రావు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంపులో గోవిందా..! గ ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా చేపట్టే ఆవార్డుల కార్యక్రమంలో ఈ సారి జిల్లా యంత్రాంగం అనుసరించిన పద్ధతిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గుంపులో గోవిందా.. అన్నట్లు ప్రశంస పత్రాలు అందజేయడమే ఇందుకు కారణం. ఉద్యోగి సర్వీసులో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తముడిగా అవార్డు అందుకునే అవకాశం మహా అయితే ఒకటి రెండుసార్లకన్నా ఎక్కువ రాదు... అది కూడా అందరికీ రాదు... ఇలాంటి సమయంలో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ప్రశంసాపత్రాలు అందుకునే సమయానికి అంతా గుంపుగా వచ్చి అందుకోవాలని ప్రకటన చేయడంతో ద్యుగులు తీవ్ర నిరాశకు గురయ్యూరు. ఇక ముందయినా అధికారులు ఇలాంటి కార్యక్రమాల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. -
శిల్పారామం..ఎల్లిపోతాంది!
నిధులున్నా ప్రారంభంకాని పనులు =స్థలం ఆక్రమణ వల్లే అంటున్న పర్యాటక శాఖ.. =ఆ బూచితో తరలించాలని చూస్తున్నదంటున్న రెవెన్యూ శాఖ =కలెక్టర్ ఆదేశంతో తిరిగి సర్వే.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : కనుమరుగవుతున్న పల్లె సంస్కృతిని ప్రస్తుత తరాలకు చాటిచెప్పే శిల్పారామం నిర్మాణంపై సందిగ్ధం నెలకొంది. హస్తకళలకు పునరుజ్జీవం కల్పించే శిల్పారామం జిల్లాలో నిర్మాణమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకున్నా అధికారుల చిత్తశుద్ధిలేమి సమస్యగా మారింది. శిల్పారామం ప్రాజెక్టుకు కేటాయించిన స్థలం ఆక్రమణలకు గురవడం వల్లే నిర్మాణ పనులు మొదలు పెట్టడం లేదని పర్యాటక శాఖ... కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేవని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పుకుంటూపోతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయలేమితో శిల్పారామం నిర్మాణం ముందుకు సాగడం లేదు. కేటాయించిన స్థలంలో ఆక్రమణలను సాకుగా చూపి శిల్పారామం ప్రాజెక్టును జిల్లా నుంచి తరలిం చేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నా యి. ప్రాజెక్టు పనుల తీరు చూసినా ఇదే పరిస్థి తి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్మించే శిల్పారామం కోసం నాలుగు నెలల క్రితమే రూ.5 కో ట్ల గ్రాంటు విడుదలైంది. కాకతీయ ఉత్సవాల ప్రారంభం సమయంలోనే శిల్పారామంను ప్రారంభిస్తామని చెప్పిన పర్యాటక శాఖ... ఉత్సవాలు మగిసినా ఇప్పటికీ స్థలం చదును చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చిన శిల్పారామం విభాగం అధికారులు సైతం వెంటనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పినా పనులకు మోక్షం లభించడం లేదు. మంచినీటి రిజర్వాయర్లకు సంబంధించి కార్పొరేషన్ అధికారులతో మంగళవారం కలెక్టర్ జి.కిషన్ వద్ద జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి కేటాయింపు పై చర్చ జరిగింది. శిల్పారామం ప్రారంభం కాకపోవడానికి ఆక్రమణలే కారణమని ప్రస్తావన వచ్చింది. దీంతో కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. శిల్పారామం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణలూ లేకుండా చూ డాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సెలవు రోజైన బుధవారం శిల్పారామం స్థలానికి వెళ్లి సర్వే చేశారు. నివేదికను తయారు చేసి కలెక్టరుకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సర్వే తర్వాత కూడా పనులు మొదలుకాకుంటే... శిల్పారామం ఇతర జిల్లాలకు వెళ్లిపోవడం ఖాయమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2008లోనే నిర్ణయం వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోని గోపాలపురంలో రూ.5 కోట్లతో శిల్పారామం ఏర్పా టు చేయాలని చేయాలని 2008లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 89 సర్వే నంబరులోని చెరువు శిఖం భూమిలో 17.5 ఎకరాలను రెవెన్యూ శాఖ ఈ ప్రాజెక్టు కోసం ఇ చ్చింది. హస్తకళలను, కళాకృతులను ప్రదర్శిం చేందుకు 25 స్టాళ్లు, ఆడిటోరియం, ఓపెన్ఎయి ర్ థియేటర్‌తో శిల్పారామం నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన హస్తకళాకారులు జి ల్లాలో ఉన్నప్పటికీ వారి కళలను ప్రదర్శించేం దుకు వేదిక కరువైంది. శిల్పారామం పూర్తయితే పెంబర్తి, చేర్యాల కళాకారులకు మంచి ఊతం లభించేంది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక అందుబాటులోకి వచ్చేంది. జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల చిత్తశుద్ధితో ఇప్పుడు శిల్పారామం ఏర్పాటు డోలాయమానంలో పడింది. -
15లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల ముగిం పు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు 15వ తేదీలో పూర్తి చేయాలని కలెక్టర్ కిషన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏర్పా ట్ల పరిశీలనలో భాగంగా సోమవారం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, మునిసిపల్ కమిషనర్ సువర్ణదాస్ పాండ, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లేషం, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్డీఓ మధు, ఎమ్మార్వో విజయ్‌కుమార్ సందర్శిం చారు. ఈ సందర్భంగా కల్యాణమండప నిర్మాణపై ఆధికారులతో సమీక్షించారు. స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి వెళ్లే మా ర్గం కుదించుకుపోయిందని, గ్రానెట్ రాళ్లతో సందర్శకులకు గాయాలయ్యే అవకాశం ఉంద ని రోడ్డును వెడల్పు చేయడంతోపాటు దేవాదా య శాఖ వారు పుజాసామగ్రి స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆరు గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆదేశించారు. 2014 జూన్‌లోగా కల్యాణమండపం పూర్తికావాలని, నిర్మాణంలో భాగంగా అక్కడక్కడా ఉన్న రాళ్లను నాలుగు రోజుల్లో తొలగించాలని పురావస్తుశాఖ జిల్లా అధికారి గురుమూర్తికి చెప్పారు. విద్యుత్ దీపాల అలంకరణ, సౌండ్ అండ్ లైట్ సిస్టం, స్టేజీ, వీఐపీల కోసం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఉపేంద్రసింగ్, మనోహ ర్, డీపీఆర్వో వెంకటరమణ. ఆలయ ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముం దు అధికారులు రుద్రేశ్వరస్వామి వారికి ప్రదోషకాల పూజలు నిర్వహించారు. ఖిలాలో వేదిక స్థలాల పరిశీలన ఖిలావరంగల్ : కాకతీయ ఉత్సవాల ముగిం పు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో అనువైన స్థలం కోసం సోమవారం ఖిలావరంగల్‌లోని స్వయంభు శ్రీశంభులింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని శిల్పాల ప్రాంగణం, ఖుష్ మహల్ పక్కన స్థలాన్ని కలెక్టర్ బృందం పరిశీలించారు. పర్యాటకులకు శిల్పాల ప్రాంగ ణం అనువుగా ఉంటుందని, అనుమతివ్వాల ని కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ కోరారు. ముందస్తుగా మరో స్థలాన్ని చూసారు. ఉత్సవాల వేదిక స్థలానికి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పా రు. అలాగే రూ.5కోట్లతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న సౌండ్ అండ్ లైటింగ్ పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్య కలెక్టర్ ను కలిసి తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ‘నాఊరు ఓరుగల్లు’ చారిత్రక పుస్తకాన్ని అందజేశారు. రుద్రేశ్వరుడికి గుమ్మడి గోపాలకృష్ణ పూజలు హన్మకొండ కల్చరల్ : ప్రముఖ టీవీ, సినీనటుడు యోగివేమన పాత్రధారి గుమ్మడి గోపాలకృష్ణ సోమవారం సాయంత్రం శ్రీరుద్రేశ్వరస్వామికి పూజలు చేశారు. వారితో పాటు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో కాకతీయ ఉత్సవాల ముగింపు
=నిట్‌లో నీటిపారుదలకు కాకతీయులు చేసిన కృషిపై సెమినార్ =జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబర్ 20, 21, 22 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపా రు. సోమవారం హన్మకొండలోని కలెక్టరేట్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొ దటి రోజు కలెక్టరేట్ నుంచి ఖిలా వరంగల్ వర కు కాగడాల ప్రదర్శన.. 20న ఖిలా వరంగల్ లో, 21న రామప్ప, 22న హన్మకొండలోని వేయిస్తంభాల ఆయలంలో ఘనంగా నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పా టు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నామన్నారు. ఈ మూడ రోజుల పా టు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. నగరంలో పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిన్న వడ్డెపల్లి చెరువులో నగర వాసుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ బోటింగ్ నిరంతరం కొనసాగేల చర్యలు తీసుకొంటున్నామన్నారు. ‘మినీ రవీంద్రభారతి’కి నిధులు మంజూరు పోచమ్మమైదాన్‌లో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని నిర్మాణ పనులు మొదలు పెట్టామన్నారు. గోపాల్పూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో రూ.5.5 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో అన్ని పాఠశాలలో ఈ నెల 11 నుంచి 14వరకు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు సాహి త్య, సాంస్కృతిక కళా రంగాలలో పోటీలు నిర్వహించాలన్నారు. కాకతీయ బాల ల సృజనోత్సవం పేరుతో నిర్వహించే ఈ పోటీలలో 4 వేల మంది బాల బాలికలు, తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారన్నారు. గత నెల 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయుల చరిత్ర సం స్కృతి, కట్టడాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సదస్సులో వచ్చి న అధ్యయన పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించనున్నామన్నారు. ‘నిట్’లో మరో జాతీయ సదస్సు నవంబర్ 8, 9 తేదీలలో ఎన్ఐటీ, ఇంటాక్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కాకతీయుల నీటి పారుదల సాంకేతిక విధానం అనే అంశంపై నిట్‌లో మరో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ నిపుణులు త మ అధ్యయన పత్రాలు సమర్పించనున్నారన్నా రు. ఇప్పటి వరకు కాకతీయ ఉత్సవాలలో భాగంగా 2012 డిసెంబర్ 21వ, 22, 23 తేదీ లలో ఉత్సవాల ప్రారంభకార్యక్రమాలను ఖిలా వరంగల్, రామప్ప, వేయిస్తంభాల ఆలయం లో నిర్వహించామన్నారు. ఉత్సవాలను తెలంగాణలోని వివిధ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కాకతీయులు పాలించిన ప్రాంతాలైన నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో రోజు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పర్యాటకాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, టూర్ ఆపరేటర్లను ఆహ్వానించి రోడ్‌షోను నిర్వహించనున్నామన్నారు. వందేళ్ల సినిమా ఉత్సవాలు.. వరంగల్‌లో వందేళ్ల సినిమా ఉత్సవాలను నిర్వహించనున్నామన్నారు. డిసెంబర్ మొదటి వా రంలో మూడురోజులు సినీ ఉత్సవాలు నిర్వహించి స్థానిక నేపథ్యంలో వచ్చిన చారిత్రక, సామాజిక సినిమాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాకతీయ ఉత్సవాల ప్రా రంభం సందర్భంగా కేంద్రపర్యాటకశాఖ మంత్రి చిరంజీవి టూరిజం సర్క్యూట్‌కు నిధులు మం జూరు చేస్తామన్నారని, ఈ పనుల ఎంత దూ రం వచ్చాయని ప్రశ్నించగా ఈ విష యం తన కు తెలియదన్నారు. పర్యాటకశాఖచే ప్రతి పాధనలు తయారు చేయించి పంపిస్తామన్నారు. పైలాన్ డిజైన్ కాకతీయ ఉత్సవాలకు సంబంధించిన పైలాన్‌ను డిజైన్ చేయిస్తున్నామన్నారు. సావనీర్ తీసుకరావడానికి కమిటీ వేశామని కలెక్టర్ చెప్పారు. ఇంటాక్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగరావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వారి సామ్రాజ్యంలో 25 వేల నిటీ వనరులు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని 50 మండలాల్లో నీటి వనరులను గుర్తించామన్నారు. సముద్రంలో కలుస్తున్న 2 వేల టీఎంసీల నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందన్నారు. నిట్ డైరక్టర్ శ్రీని వాస్‌రావు మాట్లాడారు. నిట్ ప్రొఫెసర్ జయకుమార్, డీపీఆర్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదు కావాలి 18ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ యువతకు పిలుపునిచ్చారు. నేరుగా వీలుకాకుంటే పోస్టర్ బ్యాలెట్‌తో కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15న గ్రామాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వివరించారు. 19, 20వ తేదీలలో గ్రామసభలో జాబితాను ఉంచుతామన్నారు. ఇతర అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 17, 24 తేదీలలో చేపట్టనున్నామన్నారు. డిసెంబర్ 16 వరకు అన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జవనరి 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు వివరించారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.