G. Kishan
-
నేటి నుంచి దసరా సెలవులు
విజయదశమి సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 30 శుక్రవారం నుంచి అక్టోబరు 12 వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ జి. కిషన్ తెలిపారు. అక్టోబర్ 13న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఈ నిబంధనలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు విధిగా పాటించాలని ఆయన సూచించారు. -
కాకతీయ ఉత్సవాలు డిసెంబర్ 27 నుంచి...
హన్మకొండ అర్బన్ : వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హన్మకొండలోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం కాకతీయ ఉత్సవాలపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు వివరించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరంగల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలంపూర్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి ప్రదేశాల్లో వైభవంగా నిర్వహించాలని ఇదివరకే ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ గంగాధర కిషన్ తెలిపారు. -
పేదలకు వ్యక్తిగత రేషన్‌కార్డులు
హన్మకొండ అర్బన్ : పేదలకు రేషన్ సరఫరా కోసం వ్యక్తిగత రేషన్‌కార్డులు జారీ చేయాలని దీని ద్వారా వ్యక్తి వలస వెళ్లిన ప్రాంతంలో కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. నవంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ, నిరు పేదలకు ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పథకాల అమలు కోసం కలెక్టర్ల అభిప్రాయాలు అడిగారు. లబ్ధిదారులకు వలస వెళ్లిన చోట రేషన్ సరుకులు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పథకాల అమలులో పారద్శకత కోసం రేషన్ సరుకుల పంపిణీ ఆన్లైన్ విధానం ద్వారా చేయాలని, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఏటీఎం, ఆధార్‌కార్డుల మాదిరిగా పేదలకు ఒక్కొక్కరికీ ఒక కుటుంబ సరఫరా కార్డు ఇవ్వాలని తద్వారా వారు ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ సరుకులు పొందే వెసులు బాటు ఉంటుందని అన్నారు. కలెక్టర్ సూచనలను విన్న రేమండ్ పీటర్ కిషన్‌ను అభినందించారు. పింఛన్‌కు కుటుంబ ఆదాయం, వయస్సు నిర్ధారణకు తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ సూచించారు. కుటుంబంలో ఒక్కరికే పింఛన్.. వికలాంగులకు మినహాయింపు ప్రసుత్తం పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచినందున కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇ్వవాల ని సూచించారు. వికలాంగులకు ఈ విషయం లో మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో అర్హులకు అన్యా యం జరగకుండా పక్కాగా సమాచార సేకర ణ, వాస్తవాల నిర్ధారణ చేయాలన్నారు. అనంతరం పీటర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ విషయంలో కొత్తవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో కొంత సమయం పడుతుందని అన్నారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాండాదాస్, డీఈఓ విజయ్‌కుమార్, డీఆర్వో సురేందర్‌కరణ్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, డీఎస్వో ఉషారాణి పాల్గొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ అధికారులకు సూచించారు. కౌంటింగ్‌ను పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లపై మండల ప్రత్యేక అధికారులు(రిటర్నింగ్), ఎంపీడీఓ(అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు)లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో స్థానిక, సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు తగినన్నీ బా క్స్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి డివిజన్‌కు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తుండగా, ములుగు డివిజన్లో పరకాల, ములుగు మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరింవచారు. సెల్ఫోన్లు, కెమరాలు తీసుకురావద్దు.. కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు సెల్ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ కిషన్ అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం పెన్ను, పేపర్లను మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి పేపర్లు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ అనంతరం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వస్తు సామగ్రి బయటపడడంతో ఎంపీడీఓలతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. పై విషయాలను గుర్తు పెట్టుకుని అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటిపై దృష్టి సారించాలి.. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ కిషన్ కోరారు. తాగునీటి పనులు చేపట్టేందుకు కావాల్సినన్నీ నిధులు మంజూరు చేస్తామన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లోప్రైవేట్ వ్యక్తులకు చెందిన బావులను అద్దెకు తీసుకోవాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నీటిఎద్దడి నివారణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఇంజినీరింగ్ శాఖలకు చెందిన ఏఈలు, ట్రాన్స్‌కో ఏఈలతో సమీక్షించాలన్నారు. కాగా, వెంకటాపూర్ మండలంలో మత్స్య కార్మికుల సొసైటీకి చెందిన వ్యక్తులు గండి పెట్టి నీటిని చెరువునుంచి పంపించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు 9000114547కు కాల్చేయాలని సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్... కాగా, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పీఈటీసీ ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ సమయంలో గుర్తింపు కార్డు ఉన్న మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించాలన్నారు. లెక్కింపు జరుగుతున్న బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీయకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, జెడ్పీ సూపరింటెండెంట్లు వెంకటస్వామి, కృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, రాంమోహన్, వెంకటరమణ, సునీత, నాగమణి, రాంబాబు, నవీన్, మండల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రశాం త నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికల సమయం లో ఒకే చోట అన్నిరకాల అనుమతులు వచ్చేలా సింగిల్ విండో పద్ధతి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థులకు కలెక్టరేట్లో, అసెంబ్లీ అభ్యర్థులకు ఆర్ఓ కార్యాలయంలో ఈ అనుమతులు సింగిల్ విండో ద్వారా పొందవచ్చని వివరించారు. పోలింగ్‌కు ఏడు రోజుల ముందు ఓటర్లకు పోల్ చిట్టీలు ఇంటిం టికీ తిరిగి బీఎల్ఓలు పంచుతారని వివరించారు. మద్యం,డబ్బుతో ఓటర్లను ప్ర లోభపెట్టకుండా చూడాలని సూచిం చా రు. అలాంటివి ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రూ.10 కంటే ఎక్కువ ఉన్నా ఖర్చులకు సంబంధించి విధిగా రశీదులు అందజేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రతి పైసా కూడా బ్యాంకు ద్వారానే ఖర్చు చేయాలని, ఆ ఖర్చుల లెక్కలు రాయాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేలోగా మూ డుసార్లు అధికారులకు లెక్కలు చూపాలన్నారు. ఎన్నికలు ముగిసిన 30 రోజు ల్లోగా తుది లెక్కలు చూపాలని లేనిపక్షంలో అధికారులు రాసిన లెక్కలే అంతి మంగా భావించి లెక్కిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. లోక్‌సభ అభ్యర్థికి రూ. 70 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.28 లక్షలు మాత్రమే పరిమితి ఉంటుందని, పరిధి దాటకుండా ఖర్చుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 6నుంచి రా త్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచా రం నిర్వహించాలన్నారు. పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రచార సామగ్రిని పంపిణీ చేయాలని కోరారు. ప్రచా ర సీడీలు, డీవీడీలు ఎంసీఎంసీకి చూ పించి అనుమతి పొందాలన్నారు. పో లింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నామని, వైద్య బృందాలు అందుబాటులో ఉం టాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికల సాధారణ పరిశీ లకులు ఎల్.కింగ్లే, సంతోష్‌కుమార్ సారంగి, నిత్యానంద్ పలాయి, ఏజే.భోంస్లే, పూసారం పండాయి ఆనంద్‌చంద్ర, వ్యయపరిశీలకులు జి.చంద్రబాబు, ఎన్.జైశంకర్, ఎస్.రాజ్‌కుమార్, డీపీ.శర్మ, పీ కే.జైరాజ్,అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రా వు, రూరల్ ఎస్పీ కాళిదాసు, జేసీ పౌసుమిబసు ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్, వైఎ స్సార్ సీపీ అభ్యర్థి భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు బస్వారెడ్డి, అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు. -
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో కాకతీయ ఉత్సవాల ముగింపు
=నిట్‌లో నీటిపారుదలకు కాకతీయులు చేసిన కృషిపై సెమినార్ =జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబర్ 20, 21, 22 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపా రు. సోమవారం హన్మకొండలోని కలెక్టరేట్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొ దటి రోజు కలెక్టరేట్ నుంచి ఖిలా వరంగల్ వర కు కాగడాల ప్రదర్శన.. 20న ఖిలా వరంగల్ లో, 21న రామప్ప, 22న హన్మకొండలోని వేయిస్తంభాల ఆయలంలో ఘనంగా నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఖిలా వరంగల్‌లో రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పా టు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నామన్నారు. ఈ మూడ రోజుల పా టు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. నగరంలో పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిన్న వడ్డెపల్లి చెరువులో నగర వాసుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ బోటింగ్ నిరంతరం కొనసాగేల చర్యలు తీసుకొంటున్నామన్నారు. ‘మినీ రవీంద్రభారతి’కి నిధులు మంజూరు పోచమ్మమైదాన్‌లో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని నిర్మాణ పనులు మొదలు పెట్టామన్నారు. గోపాల్పూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో రూ.5.5 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో అన్ని పాఠశాలలో ఈ నెల 11 నుంచి 14వరకు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు సాహి త్య, సాంస్కృతిక కళా రంగాలలో పోటీలు నిర్వహించాలన్నారు. కాకతీయ బాల ల సృజనోత్సవం పేరుతో నిర్వహించే ఈ పోటీలలో 4 వేల మంది బాల బాలికలు, తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారన్నారు. గత నెల 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయుల చరిత్ర సం స్కృతి, కట్టడాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సదస్సులో వచ్చి న అధ్యయన పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించనున్నామన్నారు. ‘నిట్’లో మరో జాతీయ సదస్సు నవంబర్ 8, 9 తేదీలలో ఎన్ఐటీ, ఇంటాక్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కాకతీయుల నీటి పారుదల సాంకేతిక విధానం అనే అంశంపై నిట్‌లో మరో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ నిపుణులు త మ అధ్యయన పత్రాలు సమర్పించనున్నారన్నా రు. ఇప్పటి వరకు కాకతీయ ఉత్సవాలలో భాగంగా 2012 డిసెంబర్ 21వ, 22, 23 తేదీ లలో ఉత్సవాల ప్రారంభకార్యక్రమాలను ఖిలా వరంగల్, రామప్ప, వేయిస్తంభాల ఆలయం లో నిర్వహించామన్నారు. ఉత్సవాలను తెలంగాణలోని వివిధ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కాకతీయులు పాలించిన ప్రాంతాలైన నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో రోజు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పర్యాటకాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, టూర్ ఆపరేటర్లను ఆహ్వానించి రోడ్‌షోను నిర్వహించనున్నామన్నారు. వందేళ్ల సినిమా ఉత్సవాలు.. వరంగల్‌లో వందేళ్ల సినిమా ఉత్సవాలను నిర్వహించనున్నామన్నారు. డిసెంబర్ మొదటి వా రంలో మూడురోజులు సినీ ఉత్సవాలు నిర్వహించి స్థానిక నేపథ్యంలో వచ్చిన చారిత్రక, సామాజిక సినిమాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాకతీయ ఉత్సవాల ప్రా రంభం సందర్భంగా కేంద్రపర్యాటకశాఖ మంత్రి చిరంజీవి టూరిజం సర్క్యూట్‌కు నిధులు మం జూరు చేస్తామన్నారని, ఈ పనుల ఎంత దూ రం వచ్చాయని ప్రశ్నించగా ఈ విష యం తన కు తెలియదన్నారు. పర్యాటకశాఖచే ప్రతి పాధనలు తయారు చేయించి పంపిస్తామన్నారు. పైలాన్ డిజైన్ కాకతీయ ఉత్సవాలకు సంబంధించిన పైలాన్‌ను డిజైన్ చేయిస్తున్నామన్నారు. సావనీర్ తీసుకరావడానికి కమిటీ వేశామని కలెక్టర్ చెప్పారు. ఇంటాక్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగరావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో వారి సామ్రాజ్యంలో 25 వేల నిటీ వనరులు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని 50 మండలాల్లో నీటి వనరులను గుర్తించామన్నారు. సముద్రంలో కలుస్తున్న 2 వేల టీఎంసీల నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందన్నారు. నిట్ డైరక్టర్ శ్రీని వాస్‌రావు మాట్లాడారు. నిట్ ప్రొఫెసర్ జయకుమార్, డీపీఆర్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదు కావాలి 18ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ యువతకు పిలుపునిచ్చారు. నేరుగా వీలుకాకుంటే పోస్టర్ బ్యాలెట్‌తో కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15న గ్రామాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వివరించారు. 19, 20వ తేదీలలో గ్రామసభలో జాబితాను ఉంచుతామన్నారు. ఇతర అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 17, 24 తేదీలలో చేపట్టనున్నామన్నారు. డిసెంబర్ 16 వరకు అన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జవనరి 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు వివరించారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
రేపటి నుంచే కాకతీయం
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల కొనసాగింపులో భాగంగా ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2కే రన్‌తో ఉత్సవాలు ప్రారంభించామని చెప్పారు. మూడు రోజులపాటు గణపురం కోటగుళ్లలో 300 మంది కళాకారులతో 30 బృందాలుగా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయని వివరించారు. 27న హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో కాకతీయుల చరిత్ర,సంస్కృతిని ప్రంచస్థాయికి తెలిపే విధంగా జాతీయస్థాయిలో సెమినార్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సెమినార్‌కు కాకతీయుల చరిత్రపై పరిశోధనలు చేసిన వారందరినీ ఆహ్వానిస్తామన్నారు. కాకతీయుల ఇరిగేషన్ టెక్నాలజీని చాటిచెప్పేలా ఆ కాలంనాటి గొలుసు చెరువులు, కట్టడాలపై ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. ఎన్ఐటీ హైడ్రాలజీ విభాగం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో కాకతీయ చరిత్రకు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇన్టాక్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో నిధుల కొరత ఉన్న విషయం వాస్తమేనని... ప్రస్తుతం కొంత మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిధులు విడుదల జేయూలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఉత్సవాల సందర్భంగా కళాకారులకు బకాయిపడ్డ మొత్తం చెల్లింపుల కోసం ప్రస్తుతం రూ. 30 లక్షలు వచ్చాయన్నారు. సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వేయిస్తంభాల దేవాలయం పనులు వచ్చే ఏడాది జూన్ నాటిని పూర్తవుతాయన్నారు. జిల్లాలో దేవాలయాల పురుద్ధరణకు రూ. 20 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. షెడ్యూల్ ఇదే... 24వ తేదీ... -సాయిబాబా గుడినుంచి కోటగుళ్ల వరకు కళాకారుల ర్యాలీ -వరంగల్లు జయాపసేని పేరిణి నృత్యాలయం వారి పేరిణి నృత్యం -చుక్కసత్తయ్య బృందం శివసత్తుల ప్రదర్శన -రాజేష్‌ఖన్నా బృందం కాకతీయ -కళాతోరణం నృత్యరూపకం -వెంకట్రాం నాయక్ జానపద నృత్యం -కన్నా సాంబయ్య బుర్రకథ 25వ తేదీన... -వెంపటి నాగేశ్వరి బృందం కూచిపూడి నృత్యం -ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయగిరిజన నృత్యం -శ్రీలలితా సంగీత నృత్య పాఠశాల భక్తపోతన శాస్త్రీయ నృత్యరూపకం -గడ్డం సారయ్య బృందం చిందుయక్ష గానం -స్వర్ణభారతి గణపురం వారి నృత్యప్రదర్శనలు -జిల్లా జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద కార్యక్రమాలు 26వ తేదీన... -సుధీర్‌రావు శ్రీ శివానంద నృత్యమాల బృందం శాస్త్రీయ నృత్యాలు -అంజయ్య బృందం ఒగ్గుకథ -ఆజ్మీరా గోవింద్‌నాయక్ బృందం బంజారా నృత్యం -రహీమొద్దీన్ బృందం జానపద నృత్యం -పోరిక శ్యాం బృందం ధీంసా కోయ నృత్యం -గణపురం శ్రీసాయి జానపద కోలాట బృందం ప్రదర్శన -ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నృత్యం -మార్తరవి ఇంద్రజాల ప్రదర్శన -నారగోని విశ్వనాథ బృందం బుర్రకథ ప్రదర్శన