కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రశాం త నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎన్నికల సమయం లో ఒకే చోట అన్నిరకాల అనుమతులు వచ్చేలా సింగిల్ విండో పద్ధతి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థులకు కలెక్టరేట్‌లో, అసెంబ్లీ అభ్యర్థులకు ఆర్‌ఓ కార్యాలయంలో ఈ అనుమతులు సింగిల్ విండో ద్వారా పొందవచ్చని వివరించారు. పోలింగ్‌కు ఏడు రోజుల ముందు ఓటర్లకు పోల్ చిట్టీలు ఇంటిం టికీ తిరిగి బీఎల్‌ఓలు పంచుతారని వివరించారు. మద్యం,డబ్బుతో ఓటర్లను ప్ర లోభపెట్టకుండా చూడాలని సూచిం చా రు.
అలాంటివి ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రూ.10 కంటే ఎక్కువ ఉన్నా ఖర్చులకు సంబంధించి విధిగా రశీదులు అందజేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రతి పైసా కూడా బ్యాంకు ద్వారానే ఖర్చు చేయాలని, ఆ ఖర్చుల లెక్కలు రాయాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేలోగా మూ డుసార్లు అధికారులకు లెక్కలు చూపాలన్నారు. ఎన్నికలు ముగిసిన 30 రోజు ల్లోగా తుది లెక్కలు చూపాలని లేనిపక్షంలో అధికారులు రాసిన లెక్కలే అంతి మంగా భావించి లెక్కిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.
లోక్‌సభ అభ్యర్థికి రూ. 70 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.28 లక్షలు మాత్రమే పరిమితి ఉంటుందని, పరిధి దాటకుండా ఖర్చుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 6నుంచి రా త్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచా రం నిర్వహించాలన్నారు. పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రచార సామగ్రిని పంపిణీ చేయాలని కోరారు. ప్రచా ర సీడీలు, డీవీడీలు ఎంసీఎంసీకి చూ పించి అనుమతి పొందాలన్నారు. పో లింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నామని, వైద్య బృందాలు అందుబాటులో ఉం టాయని కలెక్టర్ వివరించారు.
ఎన్నికల సాధారణ పరిశీ లకులు ఎల్.కింగ్‌లే, సంతోష్‌కుమార్ సారంగి, నిత్యానంద్ పలాయి, ఏజే.భోంస్లే, పూసారం పండాయి ఆనంద్‌చంద్ర, వ్యయపరిశీలకులు జి.చంద్రబాబు, ఎన్.జైశంకర్, ఎస్.రాజ్‌కుమార్, డీపీ.శర్మ, పీ కే.జైరాజ్,అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రా వు, రూరల్ ఎస్పీ కాళిదాసు, జేసీ పౌసుమిబసు ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్, వైఎ స్సార్ సీపీ అభ్యర్థి భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు బస్వారెడ్డి, అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
Published Tue, Apr 15 2014 4:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement