General election 2014
-
వార్ వన్ సైడే..
సాక్షిప్రతినిధి, గుంటూరు :జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా సాగింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో జెండా ఎత్తేయగా టీడీపీ సైతం పోలింగ్‌కు ముందే చేతులెత్తేసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్నింటా దాదాపు విజయదుంధుబి మోగించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రవేటు ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో సైతం జిల్లాలో అన్ని సీట్లు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోనున్నట్లు ముందే గుర్తించారు. దీంతో ఓటర్లను అదిరించి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సాధించుకోజూసిన ఆ పార్టీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. అంతర్గత కుమ్ములాటలు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన రోజు నుంచే టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యం పాటించకపోవడం, కాపులకు చివరి నిమిషంలో టికెట్టు కేటాయించడంతో పాటు 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ఆఖరు సమయంలో ప్రకటించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. టికెట్లు కేటాయించినా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయలేమంటూ చేతులెత్తేయడంతోనే జిల్లాలో ఆ పార్టీ పనైపోయిందన్న ప్రచారం జరిగింది. దింపుడు కళ్లం ఆశలతో ఓటర్లకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారు మాత్రం లొంగలేదు. అలాగే మోడీ, చంద్రబాబు బహిరంగ సభ సైతం విజయవంతం కాలేదు. జననేతకు జేజేలు.. వైఎస్సార్ సీపీకి జల్లా ప్రజలు తొలి నుంచి అండగా నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు జగన్ నాయకత్వాన్ని బలపరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి ప్రేమ, అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారు. నోటిఫికేషన్‌కు మందే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. అలాగే అధినేత జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రతో పాటు జిల్లాలో నిర్వహించిన రైతుదీక్ష, వరదల్లో నష్టపోయిన సమయంలో రైతుపరామర్శ యాత్రలతో ప్రజలకు అండగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. విశ్వసనీయతకు, కుట్రలకు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు జననేతకే జై కొట్టారు. ఫలించని కుట్రలు.: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిచేందుకు టీడీపీ చేయని కుట్రంటూ లేదు. జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులను గంపగుత్తగా డబ్బుతో కొనుగోలు చేసి పోటీ నుంచి విరమింపచేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. దీంతో పోలింగ్ రోజైన బుధవారం ఉదయం నుంచి జరిగిన ఓటింగ్ సరళిని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, గుంటూరు ఈస్ట్, తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. అయినా ఓటర్లు ఏమాత్రం వెనుకాడలేదు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవడంతో రాష్ట్రంలోనే 83 శాతం పోలింగ్‌తో ప్రథమస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మహిళలు సైతం పెద్ద ఎత్తున క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చొని ఓటు వేశారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు. -
చివరి విడత నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 12న చివరి విడతగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ ఆఖరి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 18 స్థానాలకు, పశ్చిమబెంగాల్లో 17 సీట్లకు, బీహార్‌లో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 24 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వాటిని 25న పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఏప్రిల్ 28 చివరి తేదీ. కాగా, చివరి విడత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మోడీ పోటీలో నిలిచిన వారణాసికి ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పోటీ చేస్తున్న యూపీలోని ఆజంగఢ్ కు కూడా ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. నామినేషన్ల హోరు: చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి బేణిప్రసాద్ వర్మతోపాటు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్‌లు నామినేషన్లు దాఖలుచేసినవారిలో ఉన్నారు. అలహాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్ష్ శాస్త్రి నామినేషన్ దాఖలు చేశారు. -
ఐదో విడతలో 65% పోలింగ్
*అతి పెద్ద విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతం *12 రాష్ట్రాల్లోని 121 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో, అతిపెద్ద విడత పోలింగ్ గురువారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 రాష్ట్రాల్లోని 121 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ సగటున 65 శాతం నమోదైంది. ఇది 2009 నాటి పోలింగ్‌కంటే ఎక్కువ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఈసారి పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. తాజా విడతలో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78.89 శాతం, మధ్యప్రదేశ్‌లో అతి తక్కువగా 54.41 శాతం రికార్డయింది. అయితే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల నాటి 46.2 శాతం కంటే ఇది మెరుగ్గా ఉండడం విశేషం. తాజా పోలింగ్‌లో జార్ఖండ్‌లో స్వల్పహింస చోటు చేసుకుంది. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. నక్సల్స్ ఓ రైల్వే ట్రాక్‌ను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. బాంబులూ పేల్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఎన్నికల బృందం లక్ష్యంగా దాడి చేసినా ఎవరూ గాయపడలేదు. 1,769 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఐదో విడత ముగింపుతో మొత్తం తొమ్మిది విడతల ఎన్నికల్లో సగం ప్రక్రియ పూర్తయింది. తొలి నాలుగు విడతల్లో 111 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.16 కోట్ల మందికిపైగా ఓటర్లున్న ఐదో విడతలోని 121 స్థానాల్లో ప్రస్తుతం 46 బీజేపీ దాని మిత్రపక్షాల ఖాతాలో, 46 కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఖాతాలో ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల్లో ఈ పోలింగ్ కీలకం కానుంది. ఈ విడతలో బీహార్‌లోని 7 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 3, జమ్మూకాశ్మీర్‌లో 1(ఉధంపూర్), జార్ఖండ్‌లోని 6, కర్ణాటకలోని మొత్తం 28, మధ్యప్రదేశ్‌లోని 10, మహారాష్ట్రలోని 19, మణిపూర్‌లో 1(మణిపూర్ ఇన్నర్), ఒడిశాలోని 11, రాజస్థాన్‌లోని 20, ఉత్తరప్రదేశ్‌లోని 11, పశ్చిమ బెంగాల్‌లోని 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒడిశాలో 77 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిపి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగించారు. ఇక్కడ మూడో విడతలో 70 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఇలా.. : దేశంలో బీజేపీ గాలి వీస్తోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 68 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇది తోడ్పడొచ్చని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ 59 శాతం పోలింగ్ జరిగింది. నాటి ఎన్నికల్లో 18 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. - మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో 61.7, బీహార్‌లో 56 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో బీహార్ పోలింగ్ 39.3 శాతమే. తాజా ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చినప్పటికీ జార్ఖండ్‌లో 62, ఛత్తీస్‌గఢ్‌లో 65, ఉత్తరప్రదేశ్‌లో 62.62, ఒడిశాలో 70 శాతం నమోదైంది. రాజస్థాన్‌లో గత ఎన్నికలకంటే 15 శాతం పెరిగి 63.4కు చేరింది. - మణిపూర్‌లో 74, జమ్మూకాశ్మీర్‌లో 69 శాతం రికార్డయింది. కాశ్మీర్ పోలింగ్ గత ఎన్నికలకంటే 24 శాతం ఎక్కువ. - ఒడిశాలోని నక్సల్స్ ప్రభావమున్న చిత్రకొండ అసెంబ్లీ స్థానంలో రీపోలింగ్ కోసం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 8 కేంద్రాల్లో ఒక్కరు కూడా ఓటేయలేదు. బరిలోని ప్రముఖులు.. ఈ విడతలో తలపడిన అభ్యర్థుల్లో.. నందన్ నీలేకని, మాజీ ప్రధాని దేవెగౌడ, బీజేపీ నేతలు మేనకా గాంధీ, గోపీనాథ్ ముండే, కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, సుప్రియా సూలే, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ నేత అజిత్ జోగీ తదితర ప్రముఖులు ఉన్నారు. బీహార్‌లోని పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తనకు ఓటు లేని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ ఘటన తర్వాత 50 మంది బూత్‌లోకి వెళ్లి గొడవ చేసి, ఈవీఎంను ధ్వంసం చేశారు. -
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రశాం త నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికల సమయం లో ఒకే చోట అన్నిరకాల అనుమతులు వచ్చేలా సింగిల్ విండో పద్ధతి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థులకు కలెక్టరేట్లో, అసెంబ్లీ అభ్యర్థులకు ఆర్ఓ కార్యాలయంలో ఈ అనుమతులు సింగిల్ విండో ద్వారా పొందవచ్చని వివరించారు. పోలింగ్‌కు ఏడు రోజుల ముందు ఓటర్లకు పోల్ చిట్టీలు ఇంటిం టికీ తిరిగి బీఎల్ఓలు పంచుతారని వివరించారు. మద్యం,డబ్బుతో ఓటర్లను ప్ర లోభపెట్టకుండా చూడాలని సూచిం చా రు. అలాంటివి ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రూ.10 కంటే ఎక్కువ ఉన్నా ఖర్చులకు సంబంధించి విధిగా రశీదులు అందజేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రతి పైసా కూడా బ్యాంకు ద్వారానే ఖర్చు చేయాలని, ఆ ఖర్చుల లెక్కలు రాయాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేలోగా మూ డుసార్లు అధికారులకు లెక్కలు చూపాలన్నారు. ఎన్నికలు ముగిసిన 30 రోజు ల్లోగా తుది లెక్కలు చూపాలని లేనిపక్షంలో అధికారులు రాసిన లెక్కలే అంతి మంగా భావించి లెక్కిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. లోక్‌సభ అభ్యర్థికి రూ. 70 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.28 లక్షలు మాత్రమే పరిమితి ఉంటుందని, పరిధి దాటకుండా ఖర్చుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 6నుంచి రా త్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచా రం నిర్వహించాలన్నారు. పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రచార సామగ్రిని పంపిణీ చేయాలని కోరారు. ప్రచా ర సీడీలు, డీవీడీలు ఎంసీఎంసీకి చూ పించి అనుమతి పొందాలన్నారు. పో లింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నామని, వైద్య బృందాలు అందుబాటులో ఉం టాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికల సాధారణ పరిశీ లకులు ఎల్.కింగ్లే, సంతోష్‌కుమార్ సారంగి, నిత్యానంద్ పలాయి, ఏజే.భోంస్లే, పూసారం పండాయి ఆనంద్‌చంద్ర, వ్యయపరిశీలకులు జి.చంద్రబాబు, ఎన్.జైశంకర్, ఎస్.రాజ్‌కుమార్, డీపీ.శర్మ, పీ కే.జైరాజ్,అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రా వు, రూరల్ ఎస్పీ కాళిదాసు, జేసీ పౌసుమిబసు ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్, వైఎ స్సార్ సీపీ అభ్యర్థి భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు బస్వారెడ్డి, అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు. -
దేశాన్ని ప్రేమిస్తే ఓటేయండి
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం రాజకీయ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సినిమా వాళ్ల పాత్ర అధికంగానే ఉంది. కొందరు ప్రత్యక్షంగాను, మరి కొందరు పరోక్షంగానూ రాజకీయాల్లో మమేకం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నటుడు మాధవన్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. తానే పార్టీ గురించి మాట్లాడడం లేదంటూనే ఓటు హక్కును ఉపయోగించుకోండంటూ ప్రకటనలు చేయడంతో ఆయన ఆలోచనా ధోరణి ఏమిటి అన్న ఆరా తీసే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. ఇంతకీ నటుడు మాధవన్ ఏమన్నారంటే రానున్న పార్లమెంటు ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది సగటు మనిషి బాధ్యత. అయితే నేనే రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించడం లేదు. ‘‘దేశాన్ని ప్రేమించే వారైతే ఓటేయండి. మీ ఓటు ఈ దేశ తలరాతను మారుస్తుంద’’ని మాధవన్ వ్యాఖ్యానించారు. -
చివరిరోజు భారీగా నామినేషన్లు
{పముఖుల్లో కేసీఆర్, జైపాల్‌రెడ్డి, పొన్నాల, కిషన్‌రెడ్డి, దినేష్‌రెడ్డి, ఎర్రబెల్లి నేడు నామినేషన్ల పరిశీలన.. 12న ఉపసంహరణకు ఆఖరి రోజు హైదరాబాద్: తెలంగాణలో సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులంతా చివరిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను దశల వారీగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత , బుధవారం ఉదయం కూడా ప్రకటించడంతో ‘బీ’ ఫారాలు తీసుకోవడం, నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ యూవత్తూ హడావుడిగా సాగింది. దశమి మంచిరోజు అనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు బుధవారం వరకు వేచి చూసి నామినేషన్లు దాఖలు చే శారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు కాగా.. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుుతే సమయంలోగా క్యూలో నిలబడినవారికి టోకెన్లు ఇచ్చి వారంతా నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. చివరిరోజున నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ), ఆయన కుమార్తె కవిత (నిజామాబాద్ లోక్‌సభ), కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్ లోక్‌సభ), టీపీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (జనగామ), పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆంధోల్), మాజీ మంత్రి కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), వైఎస్సార్సీపీ తరఫున మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి (మల్కాజిగిరి లోక్‌సభ), పీజేఆర్ కుమార్తె విజయూరెడ్డి (ఖైరతాబాద్), ఎం.ఎ.రహమాన్ (మహబూబ్‌నగర్ లోక్‌సభ), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్ లోక్‌సభ), టీడీపీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), మోత్కుపల్లి నర్సింహులు (మధిర), సీపీఐ నాయకుడు నారాయణ (ఖమ్మం లోక్‌సభ) తదితరులు ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్‌సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి అత్యధిక నామినేషన్లు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 68 నామినేషన్లు దాఖలయ్యూరుు. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యూరుు. ఇక అసెంబ్లీకి వస్తే అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌కు 55 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌కు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
గణపురం,న్యూస్‌లైన్: అభివృద్ధిని కోరుకునే వారందు రూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీలు గా పోటీ పడుతున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందు జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నా రు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి విజయాన్ని అందిస్తే తెలంగా ణ రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చిదిద్దుతాని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల కంటే రెండింతలు అభివృద్ధి చేశానని చెప్పారు. కార్యకర్తలు చిత్తశుద్ధి తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. చేసిన అభివృద్ధిని ప్రజల కు వివరించి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు తాళ్ళపెల్లి భాస్కర్‌రావు, నాయకులు కోల జనార్దన్, గండ్ర సత్యనారాయణరెడ్డి, గర్రెపెల్లి శివశంకర్, అయిలోని రామచంద్రారెడ్డి, దూడపాక శంకర్, అగుర్రం తిరుపతి, తిరుమల రావు, లక్ష్మీనర్సింహారావు, ఉపేందర్‌రావు, రాజేశ్వర్‌రావు, మలహల్రావు, పెంచాల రవీందర్ , మాదాటి నారాయణరెడ్డి, సర్పంచులు సత్యలక్ష్మి, రవీందర్, ఓదాకర్, కొత్త పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్లతో పొత్తుకు సిద్ధం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారామయ్య మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం స్థానిక షాదీఖానాలో నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ కాంగ్రెసేతరా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించిందన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర వహించినందున ఆ పార్టీని దూరం చేయలేమని రాష్ట్ర నాయకత్వం భావించిందని తెలిపారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పొత్తుకు చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నట్లు చెప్పారు. తొలుత పురపాలక సంఘం ఎన్నికల్లో మంచిర్యాలలో 1, బెల్లంపల్లిలో 8, ఆదిలాబాద్‌లో 3 సీట్లు ఖరారు కాగా నిర్మల్‌లో రెండు స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తుల విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతాయన్నారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పార్టీ పురోగతి, భవిష్యత్ ప్రణాళిక, ఎన్నికల్లో అనుసరించవల్సిన వ్యూహాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కత్తెరశాల పోశం, విలాస్, ఏవైఎఫ్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవేణి కుమారస్వామి, నాయకులు, వీరభద్రయ్య, మల్లారెడ్డి, నగేశ్, శఫీ, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ: సీఈసీ
* హైదరాబాద్ వచ్చిన సంపత్.. నేడు తిరుమలకు సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తేదీల్లో ఎలాంటి మార్పులుండవని జాతీయ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉండడంవల్ల సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. శనివారం ఉదయం ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరనున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయంలో సంపత్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో బస చేసిన సంపత్‌కు రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఆయన శనివారం ఉదయం బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ నేరుగా వెళ్తారు. -
ఏఓబీలో అలజడి?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏఓబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లో మావోయిస్టుల అలజడి రేగుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉనికి చాటుకోవాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వ్యూహాలకు ప్రతీకారేచ్ఛగా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు బహిష్కరించాలన్న పిలుపుతో చెలరేగడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి దాడులకు దిగే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్వతీ పురం పరిసర ఏఓబీ ప్రాంతంలో సుమారు 150 మంది వరకు యాక్షన్ టీమ్ సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ టీమ్‌లోని కొంతమంది సభ్యులు పార్వతీపురం టౌన్ రైల్వేస్టేషన్‌తో పాటు పట్టణంలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టడంతో అక్కడున్న దళాలు ఏఓబీని షెల్టర్ జోన్‌గా తీసుకుని వలస లొస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఒడిశా, ఇటు ఆంధ్రపదేశ్‌లో ఏకకాలంలో ఎన్నికలు జరగనుం డడంతో పోలీసుల దృష్టి మళ్లుతుందని, బలం పెంచుకు ని దాడులకు దిగొచ్చని మావోయిస్టులు యోచిస్తున్నట్టు భోగట్టా. పార్వతీపురంలో రెక్కీ అనంతరం రాయగడ వెళ్లే రైలులో గుమడరైల్వే స్టేషన్ దాటి కొంత దూరం వెళ్లాక రైలు అనుకోకుండా ఆగినప్పుడు దిగి కొమరాడ మండలంలోని కొండలవైపు వెళ్లినట్లు సమాచారం. ఈ నెలాఖరున జరగనున్న మున్సిపల్, తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే ఈ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పట్టణంలో ఏదైనా భారీ విధ్వంసానికి పాల్పడనున్నారా...? ఎన్నికల వేళ టార్గెట్‌లో ఉన్న రాజకీయ నాయకులపై దాడులకు దిగనున్నారా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల అడ్డాగా పిలవబడే ఏఓబీకి పార్వతీపురం కూతవేటు దూరంలో ఉండడంతో మావోయిస్టుల కార్యకలాపాలకు పట్టణం అనువుగా ఉండే అవకాశాలున్నాయి. అంతే కాకుండా పార్వతీపురం పరిసరాలు, కొమరాడ మండలంలోని గుమడ, కూనేరు రైల్వే స్టేషన్లలో గతంలో పలు సంఘటనలకు పాల్పడ్డారు. అలాగే 2002లో పట్టణ నడిబొడ్డున ఉన్న పార్వతీపురం టౌన్ ఠాణాను రాత్రి 7 గంటల ప్రాంతంలోనే పేల్చివేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు మళ్లీ అటువంటి సంఘటనలకేమైనా పాల్పడే అవకాశాలున్నాయా...? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో బలమైన పట్టుకోసం కేడర్‌ను పెంపొందించుకునే చర్యలు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. -
‘కోడ్’ కూసింది
-
తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికల సమరం
-
‘కోడ్’ కూసింది
* అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి: భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో బుధవారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది. అలాగే రాజకీయ పార్టీలు ఏం చేయవచ్చు.. ఏమి చేయరాదు.. ఎన్నికల ప్రచారం సరళి ఏ విధంగా ఉండాలి అనే వివరాలను రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై వారికి వివరించారు. నియమావళిని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను స్పష్టం చే శారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున ఏం చేయవచ్చు.. ఏమి చేయరాదనే వివరాలు తెలిపారు. ఆ వివరాలివీ.. * రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలో ఆచరణ సాధ్యమైన వాగ్దానాలను, హామీలనే పేర్కొనాలి. అలాగే ఇచ్చే హామీలకు అయ్యే వ్యయాన్ని కూడా ఉజ్జాయింపుగా స్పష్టం చేయాలి. * అభ్యర్థులు ఇక నుంచి ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకులో అకౌంట్‌ను తెరవాలి. ఆ అకౌంట్ నుంచే ఎన్నికల వ్యయం చేయాలి. ఎన్నికలకు సంబంధించి ఏ వ్యయమైనా ఆ అకౌంటు నుంచే చెక్ ఇవ్వాలి. * అభ్యర్థులు ఆస్తులకు సంబంధించి అఫిడవిట్లో పేర్కొన్న అన్ని కాలమ్‌లను పూర్తి చేయాలి. ఏ కాలమ్‌ను కూడా ఖాళీగా వదలరాదు. ఏమీ లేకపోతే ఆ విషయాన్ని ఆ కాలంలో రాయాలి. ఖాళీగా వదిలితే నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లోని బ్యాంకుల్లో, సంస్థల్లో డిపాజిట్లు, పెట్టుబడులు, అప్పుల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. అభ్యర్థుల పేరు మీదే కాకుండా భార్య పేరు మీద, తనపై ఆధారపడిన వ్యక్తుల ఆస్తుల వివరాలను వెల్లడించాలి. అభ్యర్థులు తనపై గల అన్ని రకాల కేసులను అఫిడవిట్లో పేర్కొనాలి. * లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు ఎన్నికల వ్యయం చేయవచ్చు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. అంతకు మించి వ్యయం చేస్తే అనర్హులవుతారు. * పార్టీల ఎన్నికల వ్యయంపై ఆంక్షలు లేవు. కానీ ప్రతి పార్టీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 75 రోజుల్లోగా పార్టీ ఎన్నికల వ్యయం లెక్కలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. * ఏ ప్రభుత్వ శాఖల్లోగాని అడ్హాక్ పోస్టింగ్‌లు వంటి నిర్ణయాలు తీసుకోరాదు. కొత్త కార్యక్రమాలు పథకాలకు ఉత్తర్వులను జారీ చేయరాదు. కొనసాగుతున్న కార్యక్రమాలను మాత్రం యథాతథంగా కొనసాగించవచ్చు. * పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల సర్వేలను రాష్ట్రంలో తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ జారీ ముందు రోజు వరకు ప్రసారం చేసుకోవచ్చు. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ జారీ అయ్యాక సర్వేలు ప్రచురించడం, ప్రసారం చేయడం చివరి దశ పోలింగ్ ముగిసే వరకు నిషేధం. * టీవీల్లో పార్టీలు ఇచ్చే ప్రకటనలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఏ పార్టీ అయినా టీవీల్లో ఇచ్చే ప్రకటనలను ముందుగా కమిటీకి చూపించి అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ప్రకటనలు ఇస్తే ఆ పార్టీలు, ప్రసారం చేసిన మీడియాపైన చర్యలుంటాయి. * అభ్యర్థులు గాని, రాజకీయ పార్టీల నేతలుగాని ప్రచార కాన్వాయ్‌లో మూడు వాహనాలను మించి అనుమతించరు. అంతకన్నా ఎక్కువ వాహనాలను వినియోగిస్తే ఆభ్యర్థి లేదా పార్టీ ఎన్నికల వ్యయంలో లెక్క రాస్తారు. * ప్రచార సభలు నిర్వహణలకు, మైకుల ఏర్పాటుకు ముందుగా స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సభలు, ప్రచారం నిర్వహించరాదు. వ్యక్తుల ఇంటి ముందు ధర్నాలు, పికెటింగ్‌లు చేయరాదు. ఒక పార్టీ పోస్టర్‌ను మరో పార్టీ తొలగించరాదు. రాత్రి పది గంటల తరువాత మైక్‌లతో ప్రచారం నిర్వహించరాదు. * ఎన్నికల ప్రచారంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత జీవితాలపై విమర్శలు, ఆరోపణలు చేయరాదు. కుల, మత, ప్రాంత భావాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు. పరస్పరం అగౌరవం, విభేదాలు పెంచే విధంగా కులాలు, జాతుల మధ్య విద్వేషాలు సృష్టించే భాషాపరమైన ప్రసంగాలు చేయరాదు. * మసీదులు, దేవాలయాలు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అలాగే ప్రభుత్వ ఆస్తులు, భవనాలను కూడా ప్రచారానికి వినియోగించరాదు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారానికి సంబంధించిన రాతలు, పోస్టర్లు, బోర్డులు ఉండరాదు. * ప్రభుత్వ, పబ్లిక్ ఆస్తులు, భవనాలు, గోడలపై ఎన్నికలకు సంబంధించిన రాతలు ఏమీ రాయరాదు. అలాగే ప్రచారానికి సంబంధించిన బోర్డులను అమర్చరాదు. ప్రైవేట్ ఆస్తులపై వారి అనుమతి తీసుకునే ప్రచారానికి వినియోగించుకోవాలి. -
తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికల సమరం
* షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం * మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 9 విడతల్లో పోలింగ్ * ఏప్రిల్-7 మొదలుకుని మే-12 వరకూ పోలింగ్ నిర్వహణ * మే-16న ఓట్ల లెక్కింపు.. అదే రోజున ఫలితాల వెల్లడి * లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, * ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు * ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికలు.. 2 విడతలుగా పోలింగ్ * 7వ విడతలో తెలంగాణలో.. 8వ విడతలో సీమాంధ్రలో * షెడ్యూలు ప్రకటనతో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 543 లోక్‌సభ స్థానాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈసారి రికార్డు స్థాయిలో 9 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 7న, చివరి విడత మే 12న జరుగుతుంది. మే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. మే 28వ తేదీకి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. లోక్‌సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరగనున్నాయి. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, చట్టాల్లోని నిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ స్పష్టంచేశారు. ‘‘ఎన్నికైన లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక.. రాజ్యాంగంలోని నిబంధనలు, అపాయింటెడ్ డే మేరకు ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఆయా రాష్ట్రాల్లోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు’’ అని ఆయన వివరించారు. సీఈసీ సంపత్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల అధికారులు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీలతో కలిసి 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. లోక్‌సభ, మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు.. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు. షెడ్యూల్ విడుదలతో బుధవారం నుంచే దేశంలో రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని.. దీనిని మే 28వ తేదీన ఉపసంహరిస్తామని స్పష్టంచేశారు. పారదర్శకతతో పోలింగ్ రాబోయే ఎన్నికలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో మైలు రాయి అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ అభివర్ణించారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా, పారదర్శకంగా, భాగస్వామ్యయుతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు మీడియా సంస్థలు, పాత్రికేయులు చైతన్యవంతమైన సహకారం అందించాలని కోరారు. చెల్లింపు వార్తల నియంత్రణకు ఇప్పటికీ చట్టం లేదని, ఈ దృష్ట్యా వాటిని ఎన్నికల నేరంగా మార్చాలని న్యాయశాఖకు ప్రతిపాదించిట్లు వెల్లడించారు. అలాగే పత్రికల్లో చెల్లింపు వార్తలపై వచ్చే ఫిర్యాదులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేవాటిపై కేసులను నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు పంపిస్తామని వివరించారు. అయితే ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలన్న డిమాండ్లపై ఒక ప్రశ్నకు సీఈసీ స్పందిస్తూ, దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచార క్రమంలో రాజకీయ చర్చల్లో ఉన్నత ప్రమాణాలను పాటించటం, నిజాయితీగా వ్యవహరించటం ద్వారా దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టాలని ఆయన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తి సమాచారం తెలుసుకుని, నైతిక పద్ధతిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. సీఈసీ ఇంకా ఏమన్నారంటే... * 2014 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం బుధవారం నుంచి 72 రోజులు సాగనుంది. ఇది 2009 సార్వత్రిక ఎన్నికలకు పట్టిన సమయం కన్నా మూడు రోజులు తక్కువ. * ఈ సార్వత్రిక ఎన్నికల్లో 81.4 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో సుమారు 10 కోట్ల మందికిపైగా కొత్త ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో తొలిసారిగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నాం. * మార్చి 9వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవచ్చు. రాబోయే ఎన్నికల ముందు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ 98.6 శాతం మందికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు అందచేశాం. * దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 2009తో పోలిస్తే లక్ష పోలింగ్ కేంద్రాలు అదనం. * పోలింగ్‌లో ఓటర్లను భాగస్వామ్యం చేయడానికి వీలుగా పోలింగ్‌కు వారం రోజుల ముందు నుంచే ఫొటో ఓటరు స్లిప్పులను ఓటర్లకు ఇంటి వద్ద అందచేస్తాం. * పోలింగ్ మొత్తం ఈవీఎంలతోనే జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా (‘పైవారెవరూ కాదు’ అంటూ తిరస్కరించే) బటన్‌ను ఈవీఎంలో పొందుపర్చాం. * ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) వ్యవస్థను అమలు చేయనున్నాం. ఓటరు పార్టీ ఎన్నికల గుర్తున్న బటన్ నొక్కగానే సదరు ఓటు వేసిన పార్టీ గుర్తుతో ఉన్న స్లిప్ ఈవీఎం నుంచి బయటకు వస్తుంది. దీనికోసం ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద 600 యూనిట్ల పేపరు అందుబాటులో ఉండగా, మరో 20 వేల యూనిట్లకు ఆర్డరు చేశాం. * పెయిడ్ వార్తల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం. పత్రికల్లో, టీవీల్లో పెయిడ్ కథనాల ప్రచురణ, ప్రసారమైనట్టు నిర్ధారణ అయితే తగు చర్యలు తీసుకునేలా ప్రెస్‌కౌన్సిల్, జాతీయ బ్రాడ్కాస్ట్ అథారిటీలను ఆదేశిస్తాం. * ఎన్నికల్లో ధన బలం వినియోగం ఆందోళన కలిగించే అంశం. ఈ ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో అభ్యర్థులు ధనాన్ని వినియోగించటాన్ని నిలువరించేందుకు సంచార తనిఖీ బృందాలు, వీడియో నిఘా బృందాలను నియమిస్తాం. * అభ్యర్థుల వ్యయాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఎన్నికల వ్యయాన్ని క్షుణ్నంగా పరి శీలించి, ప్రజలు చూసేందుకు వీలుగా వెబ్సైట్లో పెడతాం. * సున్నిత, అత్యంత సున్నిత నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్... మార్చి-5 (బుధవారం) ఎన్నికల షెడ్యూల్ విడుదల మొదటి విడత: 6 లోక్‌సభ స్థానాలు (అస్సాం 5, త్రిపుర 1) నోటిఫికేషన్ జారీ: మార్చి 14 (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 21 (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన: మార్చి 22 (శనివారం) నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 24 (సోమవారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 7 (సోమవారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 2వ విడత: 7 స్థానాలు (అరుణాచల్‌ప్రదేశ్ 2, మేఘాలయ 2, మణిపూర్ 1, మిజోరం 1, నాగాలాండ్ 1) నోటిఫికేషన్ జారీ: మార్చి 15 (శనివారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 22 (శనివారం) నామినేషన్ల పరిశీలన: మార్చి 24 (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 26 (బుధవారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 9 (బుధవారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 3వ విడత: 92 స్థానాలు (బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, హర్యానా 10, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 5, కేరళ 20, మధ్యప్రదేశ్ 9, మహారాష్ట్ర 10, ఒడిషా 10, ఉత్తరప్రదేశ్ 10, అండమాన్ నికోబార్ దీవులు 1, చండీగఢ్ 1, లక్ష్యద్వీప్ 1, ఢిల్లీ 7) నోటిఫికేషన్ జారీ: మార్చి 15 (శనివారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 22 (శనివారం) నామినేషన్ల పరిశీలన: మార్చి 24 (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 26 (బుధవారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 10 (గురువారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 4వ విడత: 5 స్థానాలు (అస్సాం 3, సిక్కిం 1, త్రిపుర 1) నోటిఫికేషన్ జారీ: మార్చి 19 (బుధవారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 26 (బుధవారం) నామినేషన్ల పరిశీలన: మార్చి 27 (గురువారం) నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 29 (సోమవారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 12 (శనివారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 5వ విడత: 122 స్థానాలు (బీహార్ 7, ఛత్తీస్‌గఢ్ 3, గోవా 2, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 5, కర్ణాటక 28, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర 19, మణిపూర్1,ఒడిషా 11, రాజస్థాన్ 20, ఉత్తరప్రదేశ్ 11, పశ్చిమబెంగాల్ 4) నోటిఫికేషన్ జారీ: మార్చి 19 (బుధవారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: మార్చి 26 (బుధవారం) నామినేషన్ల పరిశీలన: మార్చి 27 (గురువారం) నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 29 (శనివారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 17 (గురువారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 6వ విడత - 117 స్థానాలు (అస్సాం 6, బీహార్ 7, ఛత్తీస్‌గఢ్ 7, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర 19, రాజస్థాన్ 5, తమిళనాడు39, ఉత్తరప్రదేశ్ 12, పశ్చిమబెంగాల్ 6, పాండిచ్చేరి 1) నోటిఫికేషన్ జారీ: మార్చి 29 (శనివారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 5 (శనివారం) నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 9 (బుధవారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 24 (గురువారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 7వ విడత: 89 స్థానాలు (ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ)) 17, బీహార్ 7, గుజరాత్ 26, జమ్మూకాశ్మీర్ 1, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమబెంగాల్ 9, దాదర్ నాగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1) నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 2 (బుధవారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 9 (బుధవారం) నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 10 (గురువారం) నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 12 (శనివారం) పోలింగ్ తేది: ఏప్రిల్ 30 (బుధవారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 8వ విడత: 64 స్థానాలు (ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) 25, బీహార్ 7, హిమాచల్‌ప్రదేశ్ 4, జమ్ముకాశ్మీర్ 2, ఉత్తర్‌ప్రదేశ్ 15, ఉత్తరాఖండ్ 5, పశ్చిమబెంగాల్6) నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 12 (శనివారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 19 (శనివారం) నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21 (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 23 (బుధవారం) పోలింగ్ తేది: మే 7 (బుధవారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) 9వ విడత: 41 స్థానాలు (బీహార్ 6, ఉత్తర్‌ప్రదేశ్ 18, పశ్చిమబెంగాల్ 17) నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 17 (గురువారం) నామినేషన్ల స్వీకరణ ఆఖరు గడువు: ఏప్రిల్ 24 (గురువారం) నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25 (శుక్రవారం) నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 28 (సోమవారం) పోలింగ్ తేది: మే 12 (సోమవారం) ఓట్ల లెక్కింపు: మే 16 (శుక్రవారం) ఒడిశా అసెంబ్లీకీ రెండు విడతలు... * ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడతలో 70 నియోజకవర్గాలకు ఏప్రిల్ 10న, రెండో విడతలో 77 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17వ తేదిన పోలింగ్ జరగనుంది. * సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 12వ తేదిన పోలింగ్ నిర్వహించనున్నారు. * బీహార్-2, గుజరాత్-7, మధ్యప్రదేశ్ -1, మహారాష్ట్ర-1, మిజోరం-1, ఉత్తరప్రదేశ్-4, తమిళనాడు-1, పశ్చిమబెంగాల్-6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. -
నేడే ఎన్నికల సెరైన్
-
నేడే ఎన్నికల సైరన్
* సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ * దేశవ్యాప్తంగా 6 లేదా 7 విడతల్లో పోలింగ్! * ఆంధ్రప్రదేశ్‌లో చివరి రెండు దశల్లో ఎన్నికలు? సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠతో కొంత కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లో దేశంలో సాధారణ ఎన్నికల నగారా మోగనుంది. 15వ లోక్‌సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. ఎంపిక చేసిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందని వారిలో పీఐబీ కార్డులు ఉన్నవారికి ప్రవేశం కల్పించనుంది. ఆరు లేదా ఏడు విడతల్లో ఎన్నికలు..! * ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టి మే 15వ తేదీకల్లా మొత్తం ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసేందుకు ఈసీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలను మొత్తం ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. * 2004లో నాలుగు విడతలుగా, 2009లో ఐదు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. ఈసారి అంతకంటే ఎక్కువగా ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. * ఈ ఎన్నికల్లో దాదాపు 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ కొత్తగా 9.71 కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు. * ఈ అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ.. బుధవారం మొదలుకుని 75 రోజుల పాటు కొనసాగనుంది. ఏప్రిల్ రెండో వారాంతం నుంచి మే 15వ తేదీకి అటూఇటుగా పోలింగ్ ముగియనుంది. * భద్రతా బలగాలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకే ఎక్కువ విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. * నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటి మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను ముగించనున్నారు. * విద్యార్థులకు వేసవి సెలవులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మిగిలిన మూడు విడతల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలపై ఉత్కంఠ సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూలు విడుదల కావటంతో.. రాష్ట్రంలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చివరి విడతల్లో జరుగుతాయన్న ప్రచారం తెరపైకి వచ్చింది. నిజానికి 2004, 2009లో రాష్ట్రంలో తొలి రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తయింది. అవి ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్వం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈసారి కూడా తొలి రెండు విడతల్లో నిర్వహిస్తారా? లేక చివరి విడతల్లో నిర్వహిస్తారా? అన్న విషయం బుధవారం స్పష్టంకానుంది. -
సాధారణ ఎన్నికలపై మున్సిపల్ ఫలితాల ప్రభావం!
-
ఆనాటి మాటకే కట్టుబడి ఉన్నా..
భీమడోలు/ఉంగుటూరు, న్యూస్‌లైన్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఈ విషయూన్ని 2009లో రెండోసారి ఉంగుటూరు నుంచి గెలిచినప్పుడే చెప్పానని తాజా మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ అన్నారు. తన నిర్ణయంపై అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తను చూసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగితే.. ఆయనకు కారణాలు కూడా అప్పుడే చెప్పానని వసంత్ పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండలం పూళ్ల సొసైటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సభకు పార్టీ భీమడోలు మండలాధ్యక్షుడు ఆల్తి సాంబ శివరావు అధ్యక్షత వహించగా వసంత్ కుమార్ మాట్లాడారు. తనను రెండుసార్లు ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలి పించినందుకు నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మారిన పరిస్థితులకు భయపడో.. గెలుపుపై అనుమానం వచ్చో.. పోటీ చేయటానికి వెనుకాడడం లేదని, ఆనాడు ప్రకటించిన నిర్ణయూనికే క ట్టుబడి ఉన్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని, నాకు 60 సంవత్సరాలు దాటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిల బెట్టిన ఆ అభ్యర్థిని గెలిపిస్తానన్నారు. పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేద్దామని అనుకున్నానని, అరుుతే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరపడంతో పార్టీలో ఉండిపోయానన్నారు. పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. పోటీ చేయాలన్న కార్యకర్తలు వసంత్ కుమార్ ప్రకటనతో కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహం చెందారు. పోటీ చేయాలని కార్యకర్తలు ముక్తకంఠంతో కోరారు. నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద సంఖ్య కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. డీసీసీబీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల వెంకటరత్నం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కనకదుర్గ, అఖిల భారత చేనేత కేంద్ర డెరైక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
సాధారణ ఎన్నికలపై మున్సిపల్ ఫలితాల ప్రభావం!
* రేపో మాపో సాధారణ ఎన్నికల షెడ్యూల్! * లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి * ప్రభావం పడకూడదంటోన్న నియమావళి * రాష్ట్రంలో ‘సార్వత్రిక’ పోలింగ్ ముగిసేవరకు * మున్సిపల్ ఫలితాలు నిలిపేస్తే మేలనే భావన సాక్షి, హైదరాబాద్: ఒకవైపు నుంచి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తుండగానే.. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫలితాలు ఏప్రిల్ 2న వెలువడనున్నాయి. ఇవి ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎటువంటి ప్రభావం పడకుండా చూడాలనే నిబంధన ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అదే చెబుతోంది. 2009లో రాష్ట్రంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 16, 23 తేదీల్లో రెండు విడతల్లో జరిగింది. అయితే ఈ ఫలితాలు వెల్లడిస్తే మిగతా దశల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల పై ప్రభావం చూపుతాయనే కారణంతో ఎన్నికల కమిషన్ మే 16 వరకు ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఇప్పుడు మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌కు ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఆ ప్రభావం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పోలింగ్‌పై పడుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలను మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసిన తరువాత వెలువరిస్తే సరిపోతుందనే భావనను ఓ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతోనే జరగనున్నందున ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని విశ్లేషించారు. అవి ఒక విధమైన అధికారిక సర్వేగా నిలుస్తాయని, ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసే చర్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలను సంప్రదించగా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పనిసరిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధమనే అభిప్రాయూన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు!
* గెజిట్‌లో అపాయింటెడ్ డే ప్రకటించని కేంద్రం * ఎన్నికల అనంతరమే రాష్ట్ర విభజన, వేర్వేరు ప్రభుత్వాల ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతాయా? లేక ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా? అనే ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం రాజపత్రాన్ని (గెజిట్) జారీ చేసినప్పటికీ అందులో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ను ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని చిక్కుముడులు, విభజన ప్రక్రియ పూర్తి చేయటం వంటి అంశాలను తేల్చిన తర్వాతే అపాయింటెడ్ డే ఖరారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అపాయింటెడ్ డే ను ప్రకటించే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఫలితాల అనంతరం ప్రత్యేక తెలంగాణ, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. తెలంగాణ విభజనకు రాజపత్రం విడుదలైన నేపథ్యంలో తెలంగాణ మొత్తం ఒక విడత, ఆంధ్రప్రదేశ్‌లో మరో విడత పోలింగ్ జరిగే విధంగా షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2009 ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కీలకం కానున్న టీఆర్ఎస్ విలీనం ఇదిలావుంటే.. సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనా? లేక వేర్వేరుగానా? అనేది టీఆర్ఎస్ విలీనంపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి వెంటనే అపాయింటెడ్ డేను ప్రకటించడంతోపాటు తెలంగాణ, సీమాంధ్రలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుకోగలుగుతామని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తోంది. విలీనంపై కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపై సోమవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్
పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్ చిదంబరం ‘ఓటాన్ అకౌంట్’లో ‘గత ఘనత’ల ఏకరువు 2014-15 ఏడాదికి రూ. 17,63,214 కోట్లతో మధ్యంతర బడ్జెట్ విశేషాలు లేకుండా సాదాసీదాగా రూపకల్పన ఎకై్సజ్ సుంకాల తగ్గింపు.. తగ్గనున్న కార్లు, బైక్‌ల ధరలు.. టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల రేట్లు కూడా.. చవక మొబైల్ ఫోన్లు కాస్త ప్రియం.. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహం పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు లేవు యథాతథంగా ప్రత్యక్ష పన్నురేటు సైన్యంలో ‘ఒకే హోదాకు ఒకే పింఛను’కు ఓకే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు 2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీ మీద మారటోరియం 9 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం ఎన్నికల వేళ సొంత డబ్బా కొట్టుకోవటంతో పాటు.. ఇటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు.. అటు తయారీ రంగానికీ కొంత ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం తన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రయత్నించారు. ఇందులో భాగంగా వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను కొంతమేర తగ్గించే చర్యలతో పాటు.. కొన్ని సబ్సిడీలను, సంక్షేమ పథకాలకు కేటాయింపులను స్వల్పంగా పెంచారు. కార్పొ రేట్లు, సంపన్నులపై అధిక సర్‌చార్జ్ కొనసాగించటం మినహా.. ఇతరత్రా పన్నుల జోలికి పెద్దగా పోకుండా జాగ్రత్తపడ్డారు. పనిలో పనిగా తమ యూపీఏ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన ఘనతలను ఏకరువు పెట్టడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఎప్పట్లాగానే చిదంబరం బడ్జెట్ చాలా సమతూకంగా, వాస్తవికతకు అద్దం పట్టేలా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కితాబు ఇవ్వగా.. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే తప్ప ఇందులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించటం సాధ్యంకాదని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. పాత విషయాలన్నీ ఏకరువు పెట్టడం తప్ప ఇందులో కొత్త విశేషాలేమీ లేవంటూ విపక్షాలు పెదవి విరిచాయి. చిదంబరం సోమవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. స్టాక్ మార్కెట్ స్వల్పంగా అర శాతం మేర పెరిగింది. న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలోకి వచ్చిన తరుణంలో.. పెద్దగా విన్యాసాల జోలికి పోకుండా కొన్ని జనాకర్షక చర్యలతో పాటు పరిశ్రమకు తోడ్పడేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం. వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో.. అంతా ఊహించినట్లే విధానపరంగా కీలకమైన నిర్ణయాలేమీ లేవు. అయితే.. పదేళ్ల యూపీఏ పాలనలో చివరి బడ్జెట్ కావటంతో.. యూపీఏ పాలన ప్రోగ్రెస్ రిపోర్టును తలపింపజేసేలా సాధించిన విజయాల చిట్టా చదివారు. సంక్షేమ పథకాలకు మరిన్ని నిధుల కేటాయింపులతో ఎస్సీలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, సైనిక సిబ్బందిని ఆకట్టుకునేందుకూ ప్రయత్నం చేశారు. ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు, యంత్ర పరికరాలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు వంటి వినియోగ వస్తువుల ఎకై్సజ్ సుంకాలను తగ్గించారు. తద్వారా ఆయా వస్తువుల ధరలు కొంతమేర తగ్గనుండటంతో.. మధ్యతరగతి వర్గం మెప్పుపొందటంతో పాటు.. పరిశ్రమలకూ ప్రోత్సాహాన్నందించేదుకు యత్నించారు. దీనికి అనుగుణంగా కార్ల తయారీ దిగ్గజం ఆడి సంస్థ.. తమ కార్ల రేట్లు తగ్గిస్తున్నట్లు తక్షణమే ప్రకటించగా.. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ సైతం అదే బాటలో ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు.. మధ్యంతర బడ్జెట్ (ఓటాన్ అకౌంట్) కావటం వల్ల పన్నుల విధానాల్లో భారీ మార్పులు చేసేందుకు ఆస్కారం లేకపోవటంతో చిదంబరం వాటి జోలికి వెళ్లలేదు. ప్రత్యక్ష పన్నుల రేట్లను యధాతథంగా ఉంచారు. ‘‘సంప్రదాయానికి అనుగుణంగా నేను పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయటం లేదు’’ అని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పరోక్ష పన్నులపరమైన మినహాయింపుల (ఎకై్సజ్ సుంకాల తగ్గిం పు) కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 40 రోజుల్లో సుమారు రూ. 300-400 కోట్ల ఆదాయానికి గండి పడగలదని బడ్జెట్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ మినహాయింపులు జూన్ 30 దాకా వర్తిస్తాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీటిని సమీక్షించే అవకాశం ఉందని చెప్పారు. మాజీ సైనికోద్యోగులకు ఊరట: చిరకాలంగా మాజీ సైనికోద్యోగులు కోరుతున్నట్లుగా.. ఒక హోదాలో ఉన్నవారందరికీ ఒకే మొత్తం పింఛను వర్తింపచేసే అంశాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు. ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని జనాకర్షక చర్యల్లో భాగంగా వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యా రుణాల మీద వడ్డీపై మారటోరియం విధించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు సుమారు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చనుంది. కార్లపై సుంకాలు తగ్గింపు: మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవటంతో పాటు.. అమ్మకాలు పడిపోయి కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటు ఇచ్చేలా చిదంబరం మరికొన్ని చర్యలు ప్రకటించారు. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలపై ఎకై్సజ్ సుంకాలను 12 శాతం నుంచి 8 శాతానికి త గ్గించారు. అలాగే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) పైనా ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతం మేర తగ్గించారు. దీంతో ఇది 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. భారీ, మధ్య స్థాయి కార్లపై ఇప్పటిదాకా ఎకై్సజ్ సుంకం 24/20 శాతంగా ఉండగా దీన్ని 27/24 శాతానికి తగ్గించారు. చాసిస్ తదితరాలపైనా సముచిత స్థాయిలో సుంకాలు తగ్గుతాయని చిదంబరం పేర్కొన్నారు. యంత్రా లు, యంత్ర పరికరాల ఉత్పత్తికీ ఊతమిచ్చేలా.. ఎకై్సజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. దేశీయంగా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీని ప్రోత్సహించే దిశగా అన్ని రకాల మొబైల్స్‌పై ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతంగా క్రమబద్ధీకరించారు. ఫలితంగా రూ. 2,000 కన్నా ఎక్కువ ధర పలికే హ్యాండ్సెట్ల రేట్లు యథాతథంగా ఉన్నా.. అంతకన్నా తక్కువగా ఉండే వాటి రేట్లు మాత్రం పెరిగే అవకాశముంది. సబ్బులు, రసాయనాల్లో ఉపయోగించే నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి పరిమితం చేశారు. అందర్నీ మెప్పించాలని కాదు: ‘ఎన్నికల్లో ఓటర్లకు గాలమేసేందుకే జనాకర్షక చర్యలను ప్రకటించారా?’ అన్న ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ .. ‘‘అందర్నీ మెప్పించడం నా అభిమతం కాదు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకుల గుండా సాగుతోందని ప్రజలకు నేరుగా తెలియజేయాలన్నదే నా ఉద్దేశం’’ అని బదులిచ్చారు. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండటంతోనే పరిశ్రమలకు ఎకై్సజ్ సుంకాలపరంగా వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ముఖ్యంగా తయారీ రంగానికి తక్షణమే తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని చిదంబరం చె ప్పారు. ‘‘ఇప్పుడు ఎవరూ డౌన్గ్రేడ్ల గురించి మాట్లాడటం లేదు. విధాన జడత్వం అంటూ ఏమీ లేదు.. రెండేళ్ల కిందటి కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి పరంగా మన దేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశం. ఇది ఎంత మందికి తెలుసు. ఇలాంటి మరెన్నో గొప్ప పరిణామాలు రానున్న రోజుల్లో జరగనున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికన్నా తక్కువగానే ఉండగలదని చిదంబరం చెప్పారు. 4.8 శాతాన్ని దాటనివ్వకూడదని నిర్దేశించుకోగా.. అంతకన్నా తక్కువగా 4.6 శాతంగా ఉండ గలదన్నారు. ఈసారి వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పైగా వృద్ధి సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. -
బదిలీల జ్వరం
ఏలూరు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారులు మూడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తుంటే బదిలీ చేయూలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈనెల 10వ తేదీ నాటికి అధికారులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో)గా వ్యవహరిస్తున్న జిల్లాస్థారుు అధికారులకు బదిలీలు ఉంటాయూ, ఉండవా అన్న విషయం చర్చనీయూంశంగా మారింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదని కలెక్టరేట్ వర్గాలు భావిస్తున్నారుు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎస్డీసీ డీవీఆర్ఎల్ఆర్ఎం యల్లారమ్మ (నిడదవోలు ఈఆర్వో), ఇందిరాసాగర్ యూనిట్-2 ఎస్డీసీ జీవీఎస్ఎస్ నాగలక్ష్మి (పాలకొల్లు ఈ ఆర్వో), డ్వామా అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ సీహెచ్.వెంకటేశ్వరరావు (భీమవరం ఈ ఆర్వో), జంగారెడ్డిగూడెం ఆర్డీవో వి.నాన్‌రాజు (గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల ఈఆర్వో), డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ(చింతలపూడి ఈఆర్వో)లకు బదిలీ ఉండొచ్చంటున్నారు. ఈ ఐదుగురిలోనూ యల్లారమ్మ, వి.నాన్‌రాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు ఈ జిల్లాకు చెందిన వారే. ఇటీవల మైక్రో ఇరిగేషన్ పీడీ ఆర్వీ సూర్యనారాయణను ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఇదే సందర్భంలో ఆయనను గోపాలపురం ఈఆర్వోగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరటానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఆయన అక్కడి బాధ్యతలను స్వీకరించలేదని తెలిసింది. వీరికీ బదిలీలుంటాయా? డ్వామా పీడీగా వ్యవహరిస్తున్న నరాల రామచంద్రారెడ్డికి ఇక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన తొలుత హౌసింగ్ పీడీగా పనిచేశారు. రెండేళ్లుగా డ్వామా పీడీగా పనిచేస్తున్నారు. మరోైవె పు జిల్లాకు చెందిన ఎన్వీవీ సత్యనారాయణ కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆయన జిల్లాలోనే ఎస్డీసీగా, అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచే శారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పని చేస్తున్నారు. ఆయనది సొంత జిల్లా కావడంతో బదిలీ తప్పనిసరి అని భావిస్తున్నారు. నరసాపురం ఆర్డీవోగా పనిచేస్తున్న జె.వసంతరావు (నరసాపురం ఈఆర్వో)కు ఇక్కడ రెండున్నరేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన ఈ ఏడాది జూన్ నాటికి పదవీ విరమణ చేయనున్నారు. -
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆప్’ పోటీ
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు సి.వినోద్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మొదట తెలంగాణ జిల్లాల్లో, ఆపై సీమాంధ్ర జిల్లాల్లో సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామని తెలిపారు. మరో నెలలో తెలంగాణ జిల్లాల్లో లక్షకు పైగా సభ్యత్వం నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తయిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ చేసే వారందర్ని స్థానిక ప్రజలే ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. సభ్యత్వం తీసుకున్న తరువాత క్రియాశీలంగా పనిచేసి స్థానికుల్లో పేరు తెచ్చుకున్నవారికే టికెట్ ఇస్తామన్నారు. -
ఎన్నికలయ్యాక పెట్టుబడుల ప్రవాహం
ఇన్వెస్టర్లకు పార్టీలు ముఖ్యం కాదు.. స్థిరమైన పాలనే ప్రాధాన్యం కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం వారు ఎదురుచూస్తున్నారు ఇండియా రేటింగ్స్ చీఫ్ అతుల్ జోషీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి విదేశీ పెట్టుబడులు మళ్లీ ఊపందుకోవడం మొదలవుతుందని ఇండియా రేటింగ్స్ చీఫ్ అతుల్ జోషి చెప్పారు. అయితే, మొత్తం ఎకానమీని సంభ్రమంలో ముంచెత్తే మ్యాజిక్ ఏదీ సమీప భవిష్యత్‌లో జరిగే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం వేచి చూస్తున్నారని అతుల్ జోషి తెలిపారు. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న దానికన్నా స్థిరమైన పాలనే ప్రాతిపదికగా వారు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన వివరించారు. ‘వాళ్లు భారత్‌కి రావద్దనుకోవడం లేదు. తప్పకుండా వస్తారు. అయితే వారు ప్రభుత్వం ఏర్పాటు కోసం వేచి చూస్తున్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న దానిపై వారికి పెద్ద పట్టింపు లేదు’ అని జోషి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థిరంగా అయిదేళ్లూ కొనసాగుతుందన్న భరోసానే వారికి కావాల్సి ఉందన్నారు. దేశీ కార్పొరేట్ల రుణభారం పెరిగిపోవడం, డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల కొత్తగా భారీ ప్రాజెక్టులు రావడం లేదని జోషి చెప్పారు. దేశీ కార్పొరేట్లు తమ కంపెనీలను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. కొత్త ప్రాజెక్టులు రాకపోవడానికి ప్రభుత్వాన్నే నిందించడం తగదని, ఇందులో కార్పొరేట్ల పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, వచ్చే రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ఎకాయెకిన 8 శాతానికి ఎగిసిపోయేలా మాయలేమీ జరగవన్నారు. దీనిపై ఎన్నికల ప్రభావమేమీ ఉండదని జోషి వివరించారు. రికవరీ ప్రక్రియ క్రమంగా జరుగుతోందని, ప్రభుత్వం కొన్ని సంస్కరణలను వెనక్కి తీసుకుంటే తప్ప ఇది ఆగే అవకాశం లేదని జోషి పేర్కొన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవచ్చన్నారు.