కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి | congress winning candidates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

Published Thu, Mar 20 2014 3:29 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర

గణపురం,న్యూస్‌లైన్: అభివృద్ధిని కోరుకునే వారందు రూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీలు గా పోటీ పడుతున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో  గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందు జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నా రు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి విజయాన్ని అందిస్తే తెలంగా ణ రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చిదిద్దుతాని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల కంటే రెండింతలు అభివృద్ధి చేశానని చెప్పారు.

కార్యకర్తలు చిత్తశుద్ధి తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. చేసిన అభివృద్ధిని ప్రజల కు వివరించి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు తాళ్ళపెల్లి భాస్కర్‌రావు, నాయకులు కోల జనార్దన్, గండ్ర సత్యనారాయణరెడ్డి, గర్రెపెల్లి శివశంకర్,  అయిలోని రామచంద్రారెడ్డి, దూడపాక శంకర్, అగుర్రం తిరుపతి, తిరుమల రావు, లక్ష్మీనర్సింహారావు, ఉపేందర్‌రావు, రాజేశ్వర్‌రావు, మలహల్‌రావు, పెంచాల రవీందర్ , మాదాటి నారాయణరెడ్డి, సర్పంచులు సత్యలక్ష్మి, రవీందర్,  ఓదాకర్, కొత్త పద్మ తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement