local body election 2014
-
ఏపిలో స్థానిక ఎన్నికల విజేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన, వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజు జరిగాయి. రెండు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలకు, జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ స్థానానికి, పలు మండల అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజేతల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. జిల్లా పరిషత్ ఎన్నికల విజేతలు * ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ - ఈదర హరిబాబు (వైఎస్ఆర్ సిపి మద్దతుతో) వైస్ చైర్మన్ - నూకసాని బాలాజీ (వైఎస్ఆర్ సిపి) * నెల్లూరు జిల్లా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మునిసిపల్ ఎన్నిక విజేతలు * వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మునిసిపల్ చైర్పర్సన్ - తులసమ్మ(వైఎస్ఆర్ సిపి) మునిసిపల్ వైఎస్ చైర్మన్ - ముళ్ల జానీ(టిడిపి) మండలాధ్యక్ష ఎన్నికల్లో విజేతలు * పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలాధ్యక్ష పదవి - టిడిపి కో ఆప్షన్ మెంబర్ - అక్బర్ ఖాన్ (వైఎస్ఆర్ సిపి) * గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలాధ్యక్ష పదవి - టిడిపి * ప్రకాశం జిల్లా అద్దంకి మండలాధ్యక్షురాలు - గోరంట్ల పద్మావతి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షులు అరుణ -(వైఎస్ఆర్ సిపి) కో ఆప్షన్ మెంబర్: ఎస్కే మస్తాన్ వలీ(వైఎస్ఆర్ సిపి) * విజయనగరం జిల్లా మెంటాడ మండలాధ్యక్షుడు - సింహాచలం(వైఎస్ఆర్ సిపి) * చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలాధ్యక్షురాలు - పి.రేవతి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షులు - చెంగమ్మ (వైఎస్ఆర్ సిపి) * కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలాధ్యక్షురాలు - లింగవరపు రామకోటమ్మ (వైఎస్ఆర్ సిపి) కో ఆప్షన్ సభ్యుడు - సయ్యద్ బాబు (వైఎస్ఆర్ సిపి) * వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలాధ్యక్షురాలు - హేమలత (వైఎస్ఆర్ సిపి) * వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలాధ్యక్షురాలు - మల్లెల ఝాన్సీరాణి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షడు - మల్లెల రాజారామ్మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ సిపి) * విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలాధ్యక్షురాలు - వంతల జముల (వైఎస్ఆర్ సిపి) * విశాఖ జిల్లా చింతపల్లి మండలాధ్యక్షురాలు - కవడం మచ్చమ్మ (వైఎస్ఆర్ సిపి) * తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలాధ్యక్షురాలు - ఎ.సత్యవతి (వైఎస్ఆర్ సిపి) * కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలాధ్యక్షురాలు - సావిత్రి (వైఎస్ఆర్ సిపి) -
నువ్వా.. నేనా..!
ఎట్టకేలకు ‘పల్లె’ గుట్టు వీడింది. ఇన్నాళ్లూ ఆశగా చూసిన అభ్యర్థుల టెన్షన్‌కు మంగళవారం వెలువడిన ఫలితాలు సమాధానమిచ్చాయి. జిల్లాలోని వివిధ కౌంటింగు కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమైన దగ్గరనుంచి అందరిలోనూ ఉత్కంఠ సాగేలా ఫలితాలు వచ్చాయి. ‘హస్త’లాఘవం, కారుజోష్, సైకిల్ వ్యూహం, బీజేపీకి ఊరట ఇలా అంతా కలిపి నువ్వా..నేనా అనే చందంగా విజేతల వివరాలు వెల్లడయ్యాయి. ఆలస్యంగా ప్రారంభమైన లెక్కింపు...ఫలితాల వివరణలో జాప్యం అందరి సహనానికి పరీక్షగా మారాయి. కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేక సిబ్బంది నిరసన గళం వంటివి అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపానికి అద్దం పట్టాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ప్రాదేశిక నియోజకవర్గాలకు జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అనే రీతిలో ఫలితాలు సాధించాయి. సోమవారం ప్రకటించిన పురపాలక ఫలితాల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ కొడంగల్, నారాయణపేట మినహా ఎక్కడా చెప్పుకోదగిన రీతిలో సంఖ్యా బలం సాధించలేక పోయింది. మున్సిపల్ ఫలితాల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా రాణించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చతికిల పడినట్లు స్పష్టంగా కనిపించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సింగిల్ డిజిట్ ఫలితాలు సాధించాయి. పలు చోట్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికలో స్వతంత్రులే కీలక పాత్ర పోషించనున్నారు. టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. మక్తల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో మాత్రమే పైచేయి సాధించింది. గద్వాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంతో నాలుగు మండలాల పరిధిలో ఒక్క ఎంపీపీ పదవిని కూడా కాంగ్రెస్ దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలో ఏకపక్ష విజయం సాధించిన మాజీ మంత్రి డీకే అరుణకు ప్రస్తుత ఫలితాలు ఒకింత ఆందోళన కలిగించే రీతిలోనే వున్నాయి. 64 జడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించింది. టీఆర్ఎస్, టీడీపీ జట్టు కడితే ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు అందడం అసాధ్యంగా కనిపిస్తోంది. అనూహ్యంగా బలం పుంజుకుని మున్సిపల్ ఎన్నికల్లో అయిజ మున్సిపాలిటీ మినహా మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపని టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దేవరకద్ర, నాగర్‌కర్నూ లు, కొల్లాపూర్, గద్వాల, జడ్చర్ల నియోజకవర్గాల్లో మెజారీటీ ఎంపీటీసీ స్థానా లు కైవసం చేసుకుంది. లింగాల మండల పరిధిలోని పది ఎంపీటీసీ స్థానాలూ టీఆ ర్ఎస్ ఖాతాలోనే పడటం గమనార్హం. వనపర్తిలో కాంగ్రెస్‌తో సమ ఉజ్జీగా నిలిచింది. హంగ్ ఏర్పడిన చోట టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీపీల ఎన్నికలో కీలక పాత్ర పోషించనున్నారు. కొడంగల్‌లో టీడీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికలో చతికిల పడిన టీడీపీ కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం హవా కొనసాగించింది. నాలుగు జడ్పీటీసీ స్థానాలు, మూడు ఎంపీపీ అధ్యక్ష పదవులు సొంత బలంపై ఆధార పడి గెలుచుకోనుంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు అనూహ్య విజయాన్ని అందించాయి. నారాయణపేట నియోజకవర్గంలోనూ మిత్రపక్షం బీజేపీతో కలిసి టీడీపీ మెజారిటీ ఎంపీపీ అధ్యక్ష పదవి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ సాధించిన ఎనిమిది జడ్పీటీసీ పదవులు చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నాయి. బీజేపీ, స్వతంత్రులపై గురి అమన్‌గల్, నారాయణపేట జడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ మరో 54 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. నారాయణపేట ఎంపీపీ పదవిని కూడా బీజేపీ సునాయాసంగా దక్కించుకోనుంది. స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో గెలవడంతో హంగ్ ఏర్పడిన చోట వీరి మద్దతు కీలకం కానున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొల్లాపూర్‌లో ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు. వనపర్తిలో టీడీపీ అభ్యర్థి కేవలం 24 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో రీ కౌంటింగ్ చేపట్టారు. -
వీడని సీట్ల ముడి
కొలిక్కిరాని టీడీపీ టికెట్ల వ్యవహారం గంటా శిబిరంలో గందరగోళం మచిలీపట్నం ఎంపీ ద్వారా పంచకర్ల ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా బృందం చేరిక, బీజేపీ పొత్తుతో తెలుగుదేశం టికెట్ల వ్యవహారం మరింత జటిలంగా మారింది. నామినేషన్లకు గడువు సమీపిస్తున్నకొద్దీ సమస్య మరింతగా ముదిరిపోతుండడం పార్టీనే కలవరపెడుతోంది. పాతవారితో అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితా చిక్కుముడులు వీడక సతమతమవుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెంట వచ్చిన వారికి సీట్లు సర్దుబాటు కాకపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. యలమంచిలి సీటు వ్యవహారం గంటా శిబిరంలో చిచ్చురేపుతోంది. ఇప్పటికే గంటా వెంట వచ్చిన యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబు), గాజువాక శాసన సభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్యలకు పార్టీ రిక్తహస్తం చూపింది. ఇక ఆ జాబితాలో చేరకుండా పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు గంటాను వదిలేసి మచిలీపట్నం ఎంపీ కొనగళ్ల నారాయణ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏదో సీటు దక్కితే చాలన్న అభిప్రాయానికి వ చ్చేసిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అందుకోసం భీమిలిని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో భీమిలి నుంచి గంటా, శ్రీనివాస్‌ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది. ఇందుకోసం అనకాపల్లి ఎంపీగా పార్టీ ఎంపిక చేసిన పీలా గోవింద్‌ను గంటా శిబిరం ప్రసన్నం చేసుకుంటోంది. అనకాపల్లి ఎంపీకి బదులు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాల్సిందిగా గోవింద్ ను బతిమాలుతున్నారు. ఇందుకు గోవింద్ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటాతో ఉంటే పూర్తిగా మునగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన పంచకర్ల తన సన్నిహితుల ద్వారా యలమంచిలి టికెట్‌కు పావులు కదుపుతున్నారు. యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబును కాదని పంచకర్లకు టికెట్ ఇస్తే గంటా పరువు గంగలో కలసినట్లేనని ఆయన వర్గీయులు ఆందోళన చెందుతు న్నారు. కన్నబాబుకు టికెట్ ఇప్పించలేకపోతే తాను పోటీకి దిగేది లేదని గతంలో గంటా స్పష్టం చేసిన విషయాన్ని కన్నబాబు అనుచరులు గుర్తుచేస్తున్నారు. పార్టీలోనే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబును కాదని పెందుర్తి నుంచి వస్తున్న పంచకర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని ఇప్పుడు గంటా వర్గీయులే ప్రచారం ప్రారంభించారు. టికెట్ తనకే అన్న ఆశతో ఇప్పటికే భారీగా ఖర్చుచేసి ప్రచారం ప్రారంభించిన యలమంచిలి నియోజక వర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ తన భవిష్యత్ ఏమిటో తెలియక కలవరపడుతున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నారాయణ అభ్యర్థుల బలాబలాలు, పార్టీ అవసరాలను బేరిజు వేయకుండా గంటాకు అనుకూలుడిగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నారాయణ వ్యవహారాల వల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని సీనియర్లు కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
స్వతంత్రులే అధికం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానాలకు ప్రధాన పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్థులే అధికంగా నామినేషన్ వేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేసి ఉపసంహరణ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను మంగళవారం ఉదయం ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలు 52 ఉండగా 269 మంది, ఎంపీటీసీ స్థానాలు 636 స్థానాలకు, 2,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు 70 మంది బరిలో ఉండగా,ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు 52 మంది చొప్పున నామినేషన్ వేశారు. ఇక బీజేపీకి 32, టీడీపీకి 43, బీఎస్పీకి 11, సీసీఎం 8, సీసీఐ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒక్కోస్థానానికి ఒక్కో నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ, టీడీపీలకు అభ్యర్థులు కరువయ్యారు. ఇక, 636 ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులు 672 మంది పోటీకి దిగగా, కాంగ్రెస్ 599, టీఆర్ఎస్ 593, టీడీపీ 390, బీజేపీ 247, బీఎస్పీ 84, సీపీఐ 42, సీపీఎం 25, వైఎస్సార్ సీపీ 2కి చొప్పున బరిలో నిలిచారు. అంటే ప్రధాన పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేరు. కాంగ్రెస్‌కు 37, టీఆర్ఎస్కు 43, టీడీపీకి 246, బీజేపీకి 389 స్థానాల నుంచి ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. -
ప్రచార వేడి
సాక్షి, కడప: పుర సమరంలో ప్రచార పర్వం ఉరకలేస్తోంది. వరుస ఎన్నికల పరంపరలో తొలిదైన మున్సిపోల్స్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు మండే ఎన్నికలు పరీక్షగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మున్సిపాల్టీల్లో పాగా వేసి సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేసుకునేందుకు ప్రధాన పార్టీలు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.. వైఎస్సార్సీపీ దూకుడు.... మున్సిపోల్స్‌లో వైఎస్సార్ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఠమొదటిపేజీ తరువాయి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహలకు పదును పెడుతోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావిడి చేస్తున్న డివిజన్లు, వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ అభ్యర్థులకు మట్టి కరిపించేందుకు తన దైన శైలిలో ప్రచారాన్ని ఉధృతం చేసింది. వైఎస్సార్సీపీ ప్రవేశ పెట్టేబోయే పథకాలను వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను దింప లేక ఇప్పటికే చేతులెత్తేసింది. వైఎస్ఆర్ జిల్లా స్థానిక పరిశీలకులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. నాయకులతో మంతనాలు జరుపుతూ గెలుపు బాటలకు మార్గం సుగమం చేస్తున్నారు. కడప కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థి కె.సురేష్ బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథరెడ్డి, నియోజక వర్గ సమన్వయ కర్త అంజాద్బాషాతో పాటు ముఖ్య నేతలు వ్యూహత్మకంగా వెళుతూ అన్నీ తామై నడిపిస్తున్నారు. డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో బాగా వెనకబడింది. ఆపార్టీ నాయకుల మధ్య సయోధ్య లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్ధి బాలకృష్ణా యాదవ్ అంత ప్రభావం చూపలేక పోతున్నారని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మున్సిపాలిటీలలో.... ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అక్కడ వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ఏక తాటిపై నిలబడి గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు. టీడీపీ స్థానిక నేతల మధ్య లుకలుకలతో అక్కడ పార్టీ సతమతమవుతోంది. పులివెందుల్లో వైఎస్సార్సీపీ దూసుకు పోతోంది. అక్కడ టీడీపీ, కాంగ్రెస్ ప్రభావం నామ మాత్రంగానే ఉంది. బద్వేలులో నియోజక వర్గ సమన్వయ కర్త డీసీ గోవిందరెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి అధ్వర్యంలో ఇప్పటికే జనాదరణ పెంచుకున్న వైఎస్సార్సీపీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది. ఇక్కడ టీడీపీ నాయకులు సర్వ శక్తులు ఒడ్డుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆపార్టీ అపసోపాలు పడుతోంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి నేతృత్వంలో అన్నివిధాల పార్టీ ముదంజలో ఉంది. ఇక్కడ టీడీపీ పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై పడరాని పాట్లు పడుతోంది. మైదుకూరు మున్సిపాలిటీలో ఎస్ .రఘరామిరెడ్డి అధ్వర్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులను ఏక తాటిపైకి తెచ్చి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పరువు నిలుపుకునేందుకు డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి సుధాకర యాదవ్ పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తం మీద మున్సిపోల్స్‌కు గడువుకు ఆరు రోజులే ఉండటంతో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. -
గుంటూరు జిల్లాలో వైఎస్ షర్మిల జనపథం
-
నోటుకు ఓటేయొద్దు..
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో కొందరు ఉన్నత విద్యావంతులు, సామాజిక బాధ్యత గుర్తెరిగినవారు ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వస్తున్నారు. డబ్బులకో.. మద్యానికో లొంగిపోయి ఓటును అమ్ముకుంటే ఐదేళ్ల పాటు సమస్యల్లోనే కొట్టుమిట్టాడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముగ్థుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అవుసుల తండాకు చెందిన బానోత్ ప్రకాశ్ ఇలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయన ఎంటెక్ చదివారు. గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పనిలోపనిగా ఓటు విలువ తెలియ చేస్తున్నారు. రూ. 500 ఇచ్చి ఓటు కొనుక్కొని గెలిచినవారు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారని, ఆయన ఇచ్చిన మొత్తాన్ని ఐదేళ్ల కాలానికి లెక్కకడితే రోజుకు 27 పైసలు అవుతుందని పేర్కొంటున్నారు. 27 పైసలకోసం భవిష్యత్‌ను అమ్ముకోవద్దని సూచిస్తున్నారు. మంచి అభ్యర్థినే గెలిపించుకోవాలని కోరుతున్నారు. -
పల్లె గరం గరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపసంహరణ గడువు ఈ నెల 24న ముగియ నుండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ల్లో కొద్దిమేరకు అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. పార్టీ టికెట్లు ద క్కుతాయని భావిస్తున్న వారు తమ గెలుపునకు ఆటంకంగా మారి పోటీలో ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. హామీలు గుప్పిస్తూ తమను గెలి పిం చాలని తీర్మానాలు చేయించుకుంటున్నారు. తమకే ఓట్లు వేయించాలని కోరుతూ కులపెద్దల కాళ్లు వేళ్లూ పట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఈ నేపథ్యం లో కులపెద్దలకు, సంఘాలకు తాము గెలిస్తే ఇచ్చే న జరానాలను ప్రకటిస్తున్నారు.వారిదే కీలక పాత్ర పరిషత్ ఎన్నికలలో తమవారిని గెలిపించుకునేందు కు ఆయా గ్రామాలలో సర్పంచులు,పల్లె గరం గరం వార్డు సభ్యులు కీలక భూమిక పోషిస్తున్నారు.తమకు అనుకూలమైన వారితో సమావేశాలు, బైఠక్‌లు జరుపుతున్నారు. పల్లెల్లో రాత్రీ, పగలు ప్రచార హోరు పెరిగిపోయింది. జిల్లాలో 36 జడ్పీటీసీలు స్థానాలు, 583 ఎంపిటీసీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 157 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానా లకు 1347 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 597 నామినేషన్లు,టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 141 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 1226 నామినేషన్లు, టీడీ పీ నుంచి జడ్పీటీసీ 67 నామినేషన్లు, ఎంపీటీ సీ 609 నామినేషన్లు, వైఎస్సార్సీపీ నుంచి జడ్పీటీసీ 6 నామినేషన్లు, ఎంపీటీసీ 19 నామినేష న్లు, సీపీఐ నుంచి జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 21 నామినేషన్లు, సీపీఎం నుంచి జడ్పీటీసీ 5 నామినేషన్లు,ఎంపీటీసీ 15 నామినేష న్లు, లోక్‌సత్తా జడ్పీటీసీ 4 నామినేషన్లు, ఎంపీటీసీ 7 నామినేషన్లు, బీఎస్పీ జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 9 నామినేషన్లు, ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ 7 నామినేషన్లు,ఎంపీటీసీ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పురపాలక సంఘ ఎన్నికల్లో నిర్వహిస్తున్న బందోబస్తులో భాగంగా పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ కవాతు నిరహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్, పిల్లిడి, మార్కెట్, పెద్ద బజార్, పిట్లం బెస్ మీదుగా చమన్ చౌరస్తా, భారత్ గ్యాస్ రోడ్, హెడ్ పోస్టాఫీస్, బస్ డిపో వరకు సాగింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని 16 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించినందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కవాతులో పట్టణ ఎస్ఐ హన్మంతు, ఏఎస్ఐ రాజశేఖర్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు 300మంది సిబ్బంది
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజున తాండూరులో 300మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. శనివారం తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని టీఆర్సీ (తాండూరు రిక్రియేషన్ క్లబ్)లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మట్లాడుతూ తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌తో పాటు ఒక సీఐ, 8మంది ఎస్ఐల ఆధ్వర్యంలో 300మంది సిబ్బంది మున్సిపల్ ఎన్నికల్లో బందోబస్తు నిర్వహిస్తారని ఆమె చెప్పారు. మున్సిపల్ ఎన్నిక ల ఓట్ల కౌంటింగ్‌ను మొదట తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేయాలనుకున్నామని, అయితే శాంతి భద్రతల దృష్ట్యా టీఆర్‌సీకి మార్చామని ఎస్పీ చెప్పారు. ఎన్నికల కమిషన్ అనుమతితో తాండూరు పట్టణ సీఐని నియమిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మద్యం, సారా, డబ్బు పంపిణీలను నిరోధించేందుకు నిఘా తీవ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రూ.50వేలకు మంచి నగదు, ఆభరణాల వంటివి తీసుకెళ్ల రాదని అన్నారు. ఒకవేళ అలా తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పోలీసులకు చూపించాలని, లేదంటే వాటిని స్వాధీనం చేసుకుంటారని చెప్పారు. ఆమె వెంట డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ రవి, పట్టణ ఎస్ఐలు ప్రణయ్,నాగార్జునరెడ్డి, కరన్‌కోట్ ఎస్ఐలు పవన్, ప్రకాష్‌గౌడ్ ఉన్నారు. -
వీళ్లే కీలకం
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో యువత ఓటు కీలకం కా నుంది. యువతరం మనస్సు దోచుకున్న నేతలు తాము ఆశించిన స్థానం దక్కించుకోవడం ఖాయం. ఈ ఏడాది జనవరి నాటికి జిల్లాలో మొత్తం ఓటర్లు 29,00,500 కాగా అందులో 18 నుంచి 39 సంవత్సరాల వారు 16,15,860 మంది. దీన్నిబట్టి సగానికి పైగా ఓటర్లు యువతేనని స్పష్టం అవుతోంది. వీరిలో 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 71,156 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో యువత తీసుకునే నిర్ణయం అభ్యర్థులతో పాటు ఆయా రాజకీయపార్టీల తలరాతలను నిర్దేశించబోతోంది. యువత మనసు దోచుకుంటే గెలుపు అవకాశాలు మెరుగుపరచుకున్నట్టే. ఇందుకు గత ప్రభుత్వాల హయాంలో యువతకు ఇచ్చిన ప్రాధాన్యం పరిశీలించాల్సిన అవసరం ఉంది.చంద్రబాబు హయాం నుంచి నిన్నటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకు పరిశీలిస్తే మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వయస్సు సడలింపుతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రీ యింబర్స్‌మెంట్ వంటి పథకాలు యువతకు ఎంతో ప్రయోజనం కల్పించాయి. కళాశాల స్థాయి నుంచి వృత్తి విద్యా కోర్సులు, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దోహదం చేసింది. చంద్రబాబు నేతృత్వంలో విద్యార్థులకు సకాలంలో మెస్ చార్జీలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో రకరకాల కారణాలు చూపిం చి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధిదారుల్లో కోత వేశా రు. వైఎస్ హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం కూడా మేలు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులు నయం చేసుకున్న వారిలో నిరుపేద యువత కూడా ఉంది. అంతకుముందు చంద్రబాబు హయాంలో అసలు ఇటువంటి పథకమే లేదు. ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ కూడా అప్పట్లో అంతంతమాత్రమే. వైఎస్ తరువాత ముఖ్యమంత్రులుగా నియమితులైన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కొనసాగించినప్పటికీ పలు జబ్బులను ఈ పథకం నుంచి తొలగించారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వైఎస్ హయాంలో రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం కొనసాగిం చారు. యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారికి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించిన ఘనత వైఎస్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయస్సు సడలింపు ద్వారా జిల్లాలో యువకులకు ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు పాతర వేశారు. ఉపాధ్యాయ నియామకాలు మినహాయిస్తే ప్రభుత్వ కొలువులు పొందిన వారు తక్కువ. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలను ప్రోత్సహించిన ప్రభుత్వం కూడా చంద్రబాబుదే. -
యువతే కీలకం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు నమోదుపై ఈసారి యువత అమితాసక్తిని ప్రదర్శించింది. అది భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. జిల్లాలో ఐదేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే యువత ఓట్లు గణనీయంగా పెరిగాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న కృత నిశ్చయంతో యువత ఓటు హక్కుతో ముందుకు దూసుకెళ్తోంది. గతానికి భిన్నంగా ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు నూరు శాతం ఫలించాయి. విశ్వ విద్యాలయాలు, కళాశాలలలో ప్రత్యేకంగా ఓటరు నమోదుకు భారీ స్పందన లభించింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది జనవరినాటికి 29,530 ఓట్లు పెరిగాయి. ఓటర్ల జాబితాలో 30 శాతం యువకులే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు వారి అనుగ్రహానికి పావులు కదుపుతున్నాయి. ఇదీ పరిస్థితి యువ ఓటర్లు గత ఎన్నికల నుంచి ఇప్పటికీ, అనూహ్యంగా నాలుగు రెట్లు అధికంగా పెరిగా యి. 2009లో 18-19 ఏళ్ల వయసు కలిగిన నూతన ఓటర్లు 13,878 మాత్రమే నమోదు కాగా, ఈ సారి ఇప్పటికే 19,530 మంది ఓట ర్లుగా చేరారు. జిల్లా జనాభాకు అనుగుణంగా ఓటర్లు పెరిగినా, మొత్తం ఓటర్లలో యువకులు 30 శాతం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 18,04,765 ఓట్లలో యువకులు సుమారుగా 5,41,218 వరకు ఉంటారని అధికారుల నివేదికలు చెప్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బోధన్, బాన్సువాడలలో కొత్త ఓటర్ల లో అధిక శాతం యువ ఓటర్లు నమోదయ్యా రు. జిల్లా మొత్తంగా ఐదు నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారనుం డగా, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెం బ్లీ ఎన్నికల్లో వారి అనుగ్రహం పొందేందుకు రాజకీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభిం చా యి. ఏదేమైనా ఇక భవిష్యత్ యువతదేన్న సం కేతాలు రాజకీయ పార్టీల్లో కదలిక తెస్తున్నాయి. ఏమంటున్నారు చాలా మంది యువతీయువకులు ఈసారి ఓటు హక్కును వజ్రాయుధంగా మార్చుకుం టామని చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరుణంలో తెలంగాణ వికాసంలో పాలు పంచుకుంటామన్నారు. ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక పాత తరం రాజకీయానికి చెల్లుచీటీ ఇచ్చి కొత్త బంగారులోకంలోకి దారులు తీస్తామని చెబుతున్నారు. యువతను ఆదరించే, వారికి చక్కని భవితను కల్పించే నాయకత్వాన్ని తాము కోరుకుంటామని అంటున్నారు. జిల్లా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటు పడే యువ నాయకత్వానికి స్వాగతం పలుకు దామం టున్నారు. -
నామినేషన్ల వెల్లువ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆఖరి రోజున నామినేషన్లు వెల్లువెత్తాయి. జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో జిల్లా పరిషత్ ఠ మొదటి పేజీ తరువాయి ప్రాంగణం కిక్కిరిసింది. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నామినేషన్ పత్రాలను పూర్తి చేస్తూ అభ్యర్థులు కనిపించారు. వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గురువారం తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మరో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి గద్దె అనూరాధ తిరువూరు, కంకిపాడు, ఉంగుటూరు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు అందజేశారు. ఆమె వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ మాజీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి, పెడన, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జిలు కాగిత వెంకట్రావు, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు. అనూరాధ మూడు మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయటం చర్చనీయాంశమైంది. మూడు మండలాలకు నామినేషన్లు వేసేందుకు ఉదయం 11.30 గంటల సమయంలో జెడ్పీ సమావేశపు హాలులోకి వచ్చిన గద్దె అనూరాధ టీడీపీ నాయకులతో కలిసి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. పటిష్ట బందోబస్తు జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావటంతో ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందరు డీఎస్పీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థి, వారిని బలపరుస్తూ సంతకం చేసే వారిని మాత్రమే లోనికి అనుమతించారు. 49 మండలాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయగా ప్రతి కౌంటరు వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు, వారి మద్దతుదారులు నిలబడటంతో జెడ్పీ సమావేశపు హాలు కిక్కిరిసిపోయింది. ఒకేసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావటంతో అధికారులు వాటిని క్రమపద్ధతిలో పెట్టడం లేదని, ముందు వచ్చిన దరఖాస్తులను ముందుగానే పిలవాలంటూ పలువురు అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జెడ్పీ సమావేశపు హాలులోకి వచ్చి అభ్యర్థులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధరావతు నగదు చెల్లించిన రసీదును చూపితేనే అభ్యర్థులను, వారి మద్దతుదారులను లోపలకు అనుమతించారు. నామినేషన్లకు గడువు తక్కువ ఉండటంతో చివర్లో జెడ్పీ కార్యాలయానికి చేరుకునేందుకు కొందరు అభ్యర్థులు పరుగులుపెట్టారు. సాయంత్రం ఐదు గంటల తరువాత జెడ్పీ ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు. నువ్వెంతంటే.. నువ్వెంత.. టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి గద్దె అనూరాధ నామినేషన్ దాఖలు చేసేందుకు జెడ్పీ సమావేశపు హాలులోకి వెళ్లే సమయంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు దేవినేని ఉమా, కాగిత వెంకట్రావు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ మాజీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి తదితరులు ఆమెతో పాటు కార్యాలయం లోనికి వెళ్లారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, ఎక్కువ మంది వెళ్లేందుకు వీలు లేదని మచిలీపట్నం టౌన్ సీఐ బీవీ సుబ్బారావు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు సీఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి నువ్వెంతంటే.. నువ్వెంత... అంటూ ఆగ్రహంతో ఇద్దరూ ఊగిపోయారు. పోలీసులు.. టీడీపీ జిల్లా కార్యదర్శి అర్జునుడు ఇరువురికి సర్దిచెప్పారు. మాజీ చైర్పర్సన్.. మాజీ వైస్ చైర్పర్సన్ మాటామంతీ... నామినేషన్ హాలులో అనూరాధ వెంట వచ్చిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, మరో సెట్ దాఖలుకు వచ్చిన తాతినేని పద్మావతి ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం పలకరించుకున్నారు. బాగున్నారా అంటూ సుధారాణి పలకరించి వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతున్నానంటూ పద్మావతితో కరచాలనం చేశారు. ఇరువురు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్న సమయంలో వీరి కుశల ప్రశ్నలు ఆసక్తికరంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు... కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే వారు కరువవ్వటంతో ఆ పార్టీ నాయకుల హడావుడి అంతగా కనిపించలేదు. అభ్యర్థులను బతిమలాడి మరీ పార్టీ తరఫున నామినేషన్లు వేసేంత వరకు ఆ పార్టీ నాయకులు తెరవెనుక కథ నడిపారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. -
ఎన్నికల కిక్కు.. తమ్ముళ్ల తలకెక్కు!
తగరపువలస,న్యూస్‌లైన్: అసలే ఎన్నికలు.. ఆపై నామినేషన్లు.. ఇక తమ్ముళ్ల సందడికి అంతేముందీ? అంతే.. మూడు సీసాలు, ఆరు‘గళాసుల’ తీరులో ఉత్సాహం ఉరకలు వేసింది.. ఎంపీటీసీ నామినేషన్ల చివరిరోజైన గురువారం భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తల ‘క్రమశిక్షణ’ మాబాగా కనిపించింది. ఓపక్క అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా కార్యకర్తలు పచ్చటోపీలు,కండువాలు దరించి రోడ్లపై తూలుతూ సందడి చేయడం ‘ఔరా’ అనిపించింది. -
పరిషత్’ను పట్టించుకోరేం?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గతంలో ప్రధాన పార్టీలు పరిషత్ ఎన్నికలను ప్రతి ష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు ‘స్థానిక’ ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం కూడా పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినప్పటికీ ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జెడ్పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై ప్రాథమికంగా ఏ పార్టీ నిర్ణయానికి రాలేకపోయింది. ఈ విషయమే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీ ఎన్నికలపై అనాసక్తి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 583 ఎంపీటీసి స్థానాలు, 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పా ర్టీల ప్రధాన నేతలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశీస్సులకోసం అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో జెండాలు మోసామని, ఇప్పుడు మాకు అవకాశం వస్తే బడా నేతలు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజామా బాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ బల్దియాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులదీ ఇదే పరిస్థితి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎం పీల అనుచరులు తప్ప బడా నేతలు ఎవరూ తమవైపు చూడడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేనెల 30వ తేదీన జరగనున్నాయి. అదే నెల 2వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆ ఎన్నికలపైనే దృష్టి సారించారు. దీంతో వారు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భాగ్యం ఎవరికో.. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా జిల్లా పరిషత్ పీఠం బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్‌లో 1995 నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి బీసీలకు రిజర్వ్ అయ్యింది. 2001, 2006లలో వరుసగా జనరల్‌కు కేటాయించారు. ఈసారి మళ్లీ బీసీ జనరల్‌కు దక్కింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని భావించా రు. అయితే అందుకు భిన్నంగా పరి స్థితులున్నాయి. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియనుండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో జడ్పీ పీఠాన్ని అధిష్టించే ఆ బీసీ నేత ఎవరనే చర్చ జరుగుతోంది. -
నామినేషన్ల హోరు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జెడ్పీ, మండల పరిషత్ పోరు వేడి ఇప్పుడిప్పుడే రాజుకుం టోంది. మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బుధవారం ఒక్కరోజే జెడ్పీటీసీలకు104, ఎంపీటీసీలకు1720 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పర్వం గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం అభ్యర్థులు పోటాపోటీగా వేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ నామినేషన్ల హోరు అభ్యర్థుల విషయంలో కసరత్తు కొలిక్కి రాలేదు. 39 జెడ్పీటీసీ స్థానాల నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచే పరిస్థితి కనిపిం చడం లేదు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థులు మాత్రం ఒక్కొక్కరు రెండు, మూ డు నామినేషన్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా డెమ్మీ నామినేషన్లు వేయించారు. టీడీపీ తరపున 57, వైఎస్ఆర్సీపీ 45, కాంగ్రెస్ 6, సీపీఎం 12, సీపీఐ 2, బీజేపీ 4, బీఎస్పీ 1, ఇండిపెం డెంట్లు 4 మంది నామినేషన్లు వేశారు. జిల్లాలో 656 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క రోజునే 1720 నామినేషన్లు వచ్చాయి. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
గణపురం,న్యూస్‌లైన్: అభివృద్ధిని కోరుకునే వారందు రూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీలు గా పోటీ పడుతున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందు జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నా రు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి విజయాన్ని అందిస్తే తెలంగా ణ రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చిదిద్దుతాని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల కంటే రెండింతలు అభివృద్ధి చేశానని చెప్పారు. కార్యకర్తలు చిత్తశుద్ధి తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. చేసిన అభివృద్ధిని ప్రజల కు వివరించి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు తాళ్ళపెల్లి భాస్కర్‌రావు, నాయకులు కోల జనార్దన్, గండ్ర సత్యనారాయణరెడ్డి, గర్రెపెల్లి శివశంకర్, అయిలోని రామచంద్రారెడ్డి, దూడపాక శంకర్, అగుర్రం తిరుపతి, తిరుమల రావు, లక్ష్మీనర్సింహారావు, ఉపేందర్‌రావు, రాజేశ్వర్‌రావు, మలహల్రావు, పెంచాల రవీందర్ , మాదాటి నారాయణరెడ్డి, సర్పంచులు సత్యలక్ష్మి, రవీందర్, ఓదాకర్, కొత్త పద్మ తదితరులు పాల్గొన్నారు. -
స్థానికం జోరు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ స్థానిక సంస్థల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. బుధవారం శుభ మూహూర్తం ఉండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం 17న ప్రారంభం కాగా.. గడిచిన రెండు రోజుల్లో కేవలం మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటి వరకు 158 నామినేషన్లు దాఖలైనట్లు నామినేషన్ల స్వీకరణ అధికారులు తెలిపారు. అభ్యర్థులను పోటీకి దింపే ప్రయత్నాల్లో పార్టీలకు చెందిన నేతలు కింది స్థాయి నాయకులతో మంతనాలు చేయడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల నామినేషన్లు వేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. గురువారం ఆఖరు రోజు అయినందున పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. పరిశీలనతో ఆలస్యం.. జెడ్పీటీసీగా పోటీ చే సే అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందించేముందు ఏఆర్ఓలు పరిశీలన చేసి వారి నుంచి దరావత్తు తీసుకుని రశీదు ఇస్తారు. బుధవారం నామినేషను ్ల ఏఆర్ఓలు సునిశితంగా పరిశీలన చేసి పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నామినేషన్లు వేసే అభ్యర్థులు మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. కొంత మంది అక్కడే ఉండి అధికారులతో నింపించడంతో సమయం అంతా వృథా అయింది. దీంతో కేవలం 155 నామినేషన్ల స్వీకరణకు రాత్రి 10 గంటలు అరుుంది. మహబూబాబాద్ నుంచి పోటి చేసే అభ్యర్థులు రాత్రి 9.30 గంటలకు వచ్చి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ విషయంపై ఆరా తీయగా కొంత మంది ఇప్పుడే వచ్చారని, కొంత మంది లైన్లో ఉండి రశీదు తీసుకున్నారని చెప్పడం గమనార్హం. గురువారం ఆఖరి రోజు అయినందున సుమరు 300 వరకు నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. నామినేషన్లు స్కృట్నీ చేయకుండా తీసుకుంటేనే సమయానికి ముగుస్తుందని పలువురు భావిస్తున్నారు. బోణీ కాని మండలాలు... జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఐదు మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నర్సింహులపేట, దేవరుప్పుల, కొడకండ్ల, మద్దూరు. హన్మకొండ, వర్ధన్నపేట మండలాలకు చెందిన ఏ పార్టీ వారు కూడా నామినేషన్లు వేయలేదు. గురువారం ఆఖరు రోజైనందున ఈ మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.