పల్లె గరం గరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపసంహరణ గడువు ఈ నెల 24న ముగియ నుండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ల్లో కొద్దిమేరకు అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. పార్టీ టికెట్లు ద క్కుతాయని భావిస్తున్న వారు తమ గెలుపునకు ఆటంకంగా మారి పోటీలో ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. హామీలు గుప్పిస్తూ తమను గెలి పిం చాలని తీర్మానాలు చేయించుకుంటున్నారు. తమకే ఓట్లు వేయించాలని కోరుతూ కులపెద్దల కాళ్లు వేళ్లూ పట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఈ నేపథ్యం లో కులపెద్దలకు, సంఘాలకు తాము గెలిస్తే ఇచ్చే న జరానాలను ప్రకటిస్తున్నారు.వారిదే కీలక పాత్ర
పరిషత్ ఎన్నికలలో తమవారిని గెలిపించుకునేందు కు ఆయా గ్రామాలలో సర్పంచులు,పల్లె గరం గరం వార్డు సభ్యులు కీలక భూమిక పోషిస్తున్నారు.తమకు అనుకూలమైన వారితో సమావేశాలు, బైఠక్‌లు జరుపుతున్నారు. పల్లెల్లో రాత్రీ, పగలు ప్రచార హోరు పెరిగిపోయింది. జిల్లాలో 36 జడ్పీటీసీలు స్థానాలు, 583 ఎంపిటీసీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంది.
కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 157 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానా లకు 1347 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 597 నామినేషన్లు,టీఆర్‌ఎస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 141 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 1226 నామినేషన్లు, టీడీ పీ నుంచి జడ్‌పీటీసీ 67 నామినేషన్లు, ఎంపీటీ సీ 609 నామినేషన్లు, వైఎస్సార్‌సీపీ నుంచి జడ్‌పీటీసీ 6 నామినేషన్లు, ఎంపీటీసీ 19 నామినేష న్లు, సీపీఐ నుంచి జడ్‌పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 21 నామినేషన్లు, సీపీఎం నుంచి జడ్‌పీటీసీ 5 నామినేషన్లు,ఎంపీటీసీ 15 నామినేష న్లు, లోక్‌సత్తా జడ్‌పీటీసీ 4 నామినేషన్లు, ఎంపీటీసీ 7 నామినేషన్లు, బీఎస్పీ జడ్‌పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 9 నామినేషన్లు, ఇతర పార్టీల నుంచి జడ్‌పీటీసీ 7 నామినేషన్లు,ఎంపీటీసీ 18 నామినేషన్లు దాఖలయ్యాయి.