mptc
-
వైఎస్సార్సీపీలోకి ఆ ఐదుగురు ఎంపీటీసీలు
యర్రగొండపాలెం: తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమేనని, ఇకపై ఈ పార్టీలోనే కొనసాగుతామని ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, కంకణాలపల్లి, దూపాడు, వెల్లంపల్లి, సంగం తండాకు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎనిబెర ఏసోబు, బోయలపల్లి చిన్న ఏసు, గార్లపాటి శార, దూదేకుల సిద్ధయ్య, రమావత్ మార్తాబాయి స్పష్టం చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాల వల్ల ఎంపీపీ ఎన్నికలో కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చామని చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో ఆదివారం వారు వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద విలేకరులకు వివరించారు. టీడీపీ అభ్యర్థి చల్లా జ్యోతి భర్త ఎల్లారెడ్డి తన ఇంటిలో ఏర్పాటు చేసిన క్యాంపులో తమను నిర్బంధించాడని తెలిపారు. టీడీపీ కండువాలు కప్పుకోవాలని బలవంతం చేశారని, అందుకు తాము అంగీకరించక పోవడంతో భోజనం చేసే సమయంలో, ఆలయాలకు తీసుకెళ్లి దేవుళ్లపై ప్రమాణం చేయించుకున్నారన్నారు. దీంతో చేసేదిలేక వారు చెప్పినట్లు జ్యోతికి మద్దతుగా చేతులు ఎత్తామని పశ్చాత్తాపపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు ధన దాహంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. -
మా నాయకుడు YS జగన్ వల్లే ఈ ఎన్నికలో గెలిచాం: MLA తాటిపర్తి
-
పరిటాల వర్గీయుల హల్చల్.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, శ్రీ సత్యసాయి: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే అహంతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల హల్చల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దారుణాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లాలోని రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల తాజాగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన లాయర్ కురుబ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు రామాంజనేయులు, హరిలపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిటాల వర్గీయులు.. వాహనం ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక, రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్సీపీ-8, టీడీపీ-1 ఒక్క స్థానంలో విజయం సాధించగా.. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో దాడులు, దౌర్జన్యంతో ఎంపీపీ పదవి కైవసం చేసుకోవాలని టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసులో
-
టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్‌లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. మానవత్వంతో ఆదుకున్నారు మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్‌బాబు, మృతుని తమ్ముని కుమారుడు -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
‘మమ్మల్ని తొలగించే హక్కు ఎవరిచ్చారు?’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో బీజేపీ మండలాల అధ్యక్షులను ఏకపక్షంగా నియమించే అధికారం జిల్లా అధ్యక్షుడికి ఎవరిచ్చారని పెద్దపల్లి మండల అధ్యక్షుడు పర్శ సమ్మయ్య, ఓదెల అధ్యక్షుడు శనిగరపు రమేశ్ ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుగా జిల్లా అధ్యక్షుడినని ప్రకటించుకుని.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టించేలా రాష్ట్ర కార్యవర్గంలోని ఓ నాయకుడి సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తమను తొలగించే హక్కు ఆయనకు ఎక్కడిదని మండల అధ్యక్షులు మామిడాల రమేశ్, రాజు నిలదీశారు. జిల్లా అధ్యక్షుడినని చెప్పుకుంటున్న రాజేందర్ కార్పొరేటర్ పదవికి పోటీచేసి డిపాజిట్ దక్కించుకోలేదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీటీసీగా ఎన్నికై న వ్యక్తికి బీజేపీలో సభ్యత్వం లేకున్నా పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారిని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణా మాలుంటాయని హెచ్చరించారు. నాయకులు కర్రె సంజీవరెడ్డి, పిన్నింటి రాజు, శ్రీనివాసరావు, సదానందం, జనార్ధన్‌రెడ్డి తదితరులున్నారు. -
చట్టపరమైన చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌పై ఫిర్యాదు
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 'బలగం'. చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా బలగం మూవీ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అంతటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వేణుపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు వేణుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. వారు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత) బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజాప్రతినిధి ఇంట్లో పెళ్లికి నేతల జేబులు ఖాళీ.. వాట్సాప్ చాటింగ్ వైరల్
సాక్షి, కరీంనగర్: రాజువారింట్లో వివాహనికి రాజ్యమంతా కదిలి వెళ్తుంది. మరి వెళ్లే ప్రజలంతా ఖాళీ చేతులతో వెళ్తారా? ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు కానుకలు తీసుకెళ్తారు. జిల్లాలో ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి భాజాలు.. నేతల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఇప్పుడు రాష్ట్రమంతటా మోరుమోగిపోతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. అసలే పెద్ద ప్రజాప్రతినిధి. అందులోనూ ఆయన ఇంట్లో శుభకార్యం. ఆయన అనుచరులు ఉత్తినే ఉంటారా? అంతా కలిసి భారీ బహుమతి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో చాటింపు వేశారు. సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఇంత అంటూ రేటు ఫిక్స్ చేశారు. వారిలో ఆ నేతకు వీరాభిమాని అయిన ఓ గ్రామస్థాయి నేత ఈ వ్యవహారాన్ని మొత్తం అన్నీ తానై చూసుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండగా.. మరికొందరు తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటున్నారు. రామడుగు మండలంలోని ఒక గ్రామ మాజీ సర్పంచికి ఆ శుభకార్యానికి కావాల్సిన కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కొడిమ్యాల మండలానికి చెందిన ఒక నాయకునికి చికెన్, చొప్పదండి కేంద్రానికి చెందిన నాయకునికి మటన్ పంపించాల్సి ఉంటుందని సదరు అనుచరుడు హంగామా చేస్తున్నట్లు సమాచారం. చదవండి: మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్ ఈ వ్యవహారంపై ఓ గ్రామ సర్పంచిని ‘సాక్షి’ వివరణ కోరింది. స్పందించిన సదరు సర్పంచి.. ‘మేమంతా కానుకలను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’ అని స్పష్టం చేశాడు. ఇదే నేత సరిగ్గా ఏడాది కింద.. పోలీసు పోస్టింగు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం. ఏడాదిలో మూడోది..! కరీంనగర్ జిల్లాలో నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగిన సమయంలో ఇలాంటి కానుకల కోసం చందాలు సేకరించడం ఏడాదిలో ఇది మూడో ఘటన. ఆగస్టులో ఓ పార్టీ నేత ఇంట్లో వివాహం జరిగినప్పుడు పలు మహిళా సంఘాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చందాలు సేకరించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఏడాదిలో కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పెళ్లి కోసం కూడా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారని ఉద్యోగులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏడాదికాలంలో పెళ్లికానుకల చందాల వసూలులో ఇది మూడోది. ఈ షాదీ ముబారక్ కానుకల వ్యవహారం ఇటు అధికారుల్లో, నేతల్లో ఒక సంప్రదాయంగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
AP MPTC And ZPTC Elections 2021: ముగిసిన పోలింగ్
-
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు బాధ్యతల స్వీకారం
లావేరు: తండ్రి చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తండ్రి లేడన్న బాధను పంటి బిగువన భరిస్తూ.. నీళ్లు నిండిన కళ్లతోనే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడలో రౌతు నారాయణరావు ఎంపీటీసీగా గెలుపొందారు. శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అదే రోజు ఆయన తండ్రి పాపినాయుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం -
దుగ్గిరాలలో టీడీపీ నీచ రాజకీయాలు
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నీచ రాజకీయాలకు దిగింది. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, కొంతమంది ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు సొమ్ములు ఆశ చూపి భంగపడిన నారా లోకేశ్ బృందం.. చివరకుబెదిరింపులకు దిగుతోంది. నారా లోకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఘోర పరాజయం పొందిన నాటినుంచీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా కోర్టులను ఆశ్రయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న విషయం విదితమే. దుగ్గిరాల మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ.. గెలిచిన వారిలో బీసీ మహిళ లేకపోవడంతో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలకు టీడీపీ ఎంపీటీసీలంతా గైర్హాజరయ్యారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో గెలిచిన టీడీపీ అభ్యర్ధులందరినీ విజయవాడలోని నోవా టెల్ హోటల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి వారిని సికింద్రాబాద్ తరలించారు. ఎంపీటీసీలకు బెదిరింపులు వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, మరికొందరు ఎంపీటీసీలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు బీసీ మహిళలకు రూ.50 లక్షలకు పైగా ఇస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపినప్పటికీ వారు సున్నితంగా తిరస్కరించారు. నాయకుల బేరసారాలు ఫలించకపోవడంతో లోకేశ్ బృందం రంగంలోకి దిగింది. బీసీ మహిళా ఎంపీటీసీలకు, ఇతర సభ్యులకు వారి కుల పెద్దలతో ఫోన్లు చేయించి బేరసారాలు చేస్తున్నారు. మరోవైపు వారి బంధువులను ఇళ్లకు పంపించి బెదిరించే కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోపక్క ‘భవిష్యత్‌లో మనకు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి, రేపు పదవి ఉంటుందో ఉండదో. పదవి లేకపోతే ఎవరూ మనవంక చూడరు. లోకేశ్ బాబుకు మద్దతు పలకండి. నాలుగేళ్ల తరువాత జగన్ ఉండడు. జగన్ లేకపోతే వైఎస్సార్ సీపీ ఉండదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మేమిచ్చిన డబ్బులు తీసుకుంటే మీరు ఎంపీపీ అయిన తరువాత అభివృద్ధి పనులు ఏం చేసినా సంతకానికి ఒక రేటు ఉంటుందంటూ ఆశ చూపిస్తున్నారు. వారి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కుటుంబ సభ్యులతో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవినీతి సంపదతో నీతిబాహ్యమైన పద్ధతులతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. -
Volunteer Shantabai: ఎంపీపీగా వలంటీర్!
మార్టూరు: అదృష్టం ఎవరిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ గ్రామ వలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికార పీఠం ఎక్కనున్న భూక్యా శాంతాబాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండాకు చెందిన శాంతాబాయి బీకాం, బీఈడీ పూర్తి చేసింది. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో వివాహమైంది. మార్టూరులో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నది. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక జనార్ధన కాలనీ ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగింది. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీలలో ఎస్టీ కేటగిరీ కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనమే. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఆమె పిన్న వయసు్కరాలు కావడం విశేషం. నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తా.. గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచచ్చిన నేను నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం నచ్చి రాజకీయాల్లో వచ్చా. మండల ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు పడతా. – శాంతాబాయి -
MPTC Ashwini Trending: బాబు చుట్టూ.. ‘23’
కుప్పం: కుప్పం రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల చంద్రబాబు ఏకఛత్రాధిపత్యానికి 23 ఏళ్ల అశ్వని బ్రేక్ వేశారు. కుప్పం మండలం మల్లానూరుకు చెందిన అశ్వని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె పోటీ చేసిన మల్లానూరు–2 సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లే వచ్చాయి. 4 దశాబ్దాలుగా కుప్పం ఎంపీపీగా చంద్రబాబు మద్దతుదారులే చక్రం తిప్పగా, ఈ సారి ఎంపీపీ అభ్యర్థి రేసులో నిలిచి.. బాబు కోటను బద్ధలు కొట్టారు. పీజీ చదివిన అశ్వని మొదటి నుంచీ వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌కు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
సంక్షేమ పథకాల వల్లే పరిషత్ ఎన్నికల్లో విజయం
-
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
-
గెలిచింది.. కానీ ఆమె లేదు!
కర్లపాలెం(బాపట్ల): పాపం.. ఆమె మరణించి గెలిచింది. ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే మృతిచెందిన ఆమె.. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంపీటీసీగా విజయం సాధించింది. ఆమె బతికున్నట్టయితే ఎంపీపీగా ఎన్నికై ఉండేది కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన ఝాన్సీలక్ష్మి ఎన్నికల అనంతరం అనారోగ్యంతో మరణించారు. వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు దొంతిబోయిన సీతారామిరెడ్డి సతీమణి అయిన ఆమెను కర్లపాలెం ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది కూడా. సమీప టీడీపీ అభ్యర్థి పిట్ల వేణుగోపాల్‌రెడ్డిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె గెలిచిందని తెలియగానే.. ఆమెను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఆమె భర్త సీతారామిరెడ్డిని పార్టీ నాయకులు ఊరేగింపుగా ఇంటి వరకూ తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఝాన్సీలక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే.. -
Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!
ద్వారకా తిరుమల: అతి చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆ యువతిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన 21 ఏళ్ల మానుకొండ షహీల డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆమెకు వివాహమైంది. మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది. ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు అభినందించారు. మానుకొండ షహీల -
కుప్పంలో దిమ్మతిరిగిపోయే ఫలితాలు
-
40 ఏళ్ల ఇండస్ట్రీ కుట్రలు ఫలించలేదు
-
తాడేపల్లి : YSRCP పార్టీ కార్యాలయంలో సంబరాలు
-
జనతంత్రం : గొప్ప కార్యక్రమం జరిగినప్పుడల్లా టీడీపీది ఇదే తీరు
-
జగన్ పాలన వల్లే ఈ ఫలితాలు
-
ZPTC MPTC ఎన్నికల ఫలితాల మీద స్పెషల్ డిబేట్
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
-
తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది : జూపూడి
-
‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’
-
పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న కలెక్టర్
-
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల
-
చంద్రబాబు ఇలాకలో ఫ్యాన్ హవా
-
నారావారిపల్లెలో TDP ఘోర పరాజయం
-
అయ్యన్నకు బుద్ధి చెప్పిన ప్రజలు
-
శ్రీకాకుళంలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
-
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కెఎస్ఆర్ స్పెషల్ షో
-
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల హవా
-
కుప్పంలో టీడీపీపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయం
-
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
-
విశాఖలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
-
ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలవద్ద పటిష్ట భద్రత
-
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
వైస్సార్సీపీ హవా..!
-
అనంతపురంలో పరిషత్ ఎన్నికల ఓట్లలెక్కింపునకు ఏర్పాట్లు
-
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’
సాక్షి, చిత్తూరు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే విజయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: ‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’ గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్ -
విజయవాడలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన గిరిజశంకర్
-
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ విజయరావు
-
రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్
-
విశాఖ లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైందన్న అధికారులు
-
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఏపీ: సర్వత్రా ఉత్కంఠ.. ‘పరిషత్’ ఎన్నికలపై నేడే తీర్పు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. (చదవండి: సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ) ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్థిస్తుందా? లేక పూర్తయిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయాలని ఆదేశిస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.(చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్) -
దుప్పలపల్లిలో విషాదం: పాడె మోసిన ఎంపీ కోమటిరెడ్డి
రామగిరి (నల్లగొండ): తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ శివారులో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తానెదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దుర్మరణం చెందారు. వీరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం బుధవారం దుప్పలపల్లికి తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. లారీని ఢీకొని దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి నల్ల గొండలో సొంత ఇల్లు కూడా ఉంది. రెండు రోజుల క్రితం సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ నల్లగొండకు వచ్చారు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి 9.30 గంటలకు స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సుమారు రాత్రి 11.45 గంటల ప్రాంతంతో ఔటర్ రింగ్‌రోడ్డు దాటాక పెద్దఅంబర్‌పేట సమీపంలో ఓ టిప్పర్ లారీ వర్షం పడుతున్న కారణంగా ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న వీరి స్కార్పియో వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియో వాహనంలో ఉన్న దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాలను పోలీసులు అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామమైన దుప్పలపల్లికి తీసుకువచ్చారు. వివాహం జరిగి పదిరోజులు గడవకముందే.. ఎంపీటీసీ దంపతులకు కూతురు ప్రీతిరెడ్డి, కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు సంతానం. కాగా.. ఆగస్టు 22వ తేదీన కుమార్తె ప్రీతిరెడ్డి వివాహం నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుమార్తె వివాహం అయి పదిరోజులు గడవకముందే తల్లిదండ్రులు ఇద్దరూ అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 10, 11 కుమార్తె, అల్లుడిని తీసుకుని తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణం పాలయ్యారు. కాగా.. మంగళవారం తిరుపతిలో రూం కోసం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నుంచి లెటర్ కూడా తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం వేణుగోపాల్‌రెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి మాజీ సర్పంచ్. వీరికి దుప్పలపల్లిలో వ్యవసాయ భూమి కూడా ఉంది. ప్రస్తుతం వేణుగోపాల్‌రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు బిల్డర్‌గా పని చేస్తున్నాడు. గ్రామస్తులతో వీరికి వీడదీయరాని అనుబంధం ఉంది. ఎంపీటీసీ దంపతుల మరణంతో దుప్పలపల్లిలో విషాదం నెలకొంది. ప్రజాప్రతినిధుల నివాళి అంత్యక్రియల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని తానే స్వయంగా పాడె మోశారు. దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాలకు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనిశెట్టి దుప్పలపల్లిలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, లోడంగి గోవర్ధన్, వనపర్తి నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్‌రెడ్డిలు నివాళులర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి
సాక్షి, హయత్‌నగర్/రామగిరి(నల్లగొండ): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలితోపాటు ఆమె భర్త మృతిచెందారు. పోలీసుల కథ నం ప్రకారం నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి చెంది న దొంతం కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్పల్లి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) బిల్డర్. హైదరాబాద్‌లో మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్ సమీపంలో వీరు ఉంటున్నారు. కూతురు వివాహంకోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్‌లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చేందుకు రాత్రి 8.30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌లోని ఔటర్ రింగురోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ పాడె మోస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిప్పర్ కింద ఇరుక్కుపోయిన వాహనం.. టిప్పర్‌ను స్కార్పియో వాహనం వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చిందని, అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కూతురి వివాహం.. అంతలోనే విషాదం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఎంబీబీఎస్ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడం అందరిని కలచి వేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు మృతులకు నివాళులర్పించారు. -
MPTC ZPTC ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టు లో పిటిషన్లు
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరారు. కోర్టు దీనిపై తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. -
ప్రభుత్వ పథకాలే అభ్యర్థుల గెలిపిస్తాయిని ధీమా
-
జనం ఓటేయరనే ఎన్నికల బహిష్కరణ
సాక్షి, అమరావతి: టీడీపీకి ఎలాగూ ప్రజలు ఓటేయరని తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందినవారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆట ఆడారని, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఈసీగా వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేర్ని నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నారా వారి పుత్రరత్నం లోకేశ్ ఎల్ బోర్డ్ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇంకో 30 ఏళ్లయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై లోకేశ్ మాట్లాడుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారని నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతానికిపైగా అమలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
అధికారిపై టీడీపీ మహిళా నేత దాడి!
సాక్షి, విజయనగరం: దేవదాయ శాఖకు చెందిన స్థలంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్న విషయమై సాక్ష్యాధారాలు సేకరించేందుకు వెళ్లిన ఆ శాఖ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవదాయశాఖ అధికారులు, సిబ్బంది ని మెయిన్‌రోడ్‌పై నిలబెట్టి ఆ మాజీ ఎంపీటీసీ, ఆమె కు టుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాక్ష్యాలను వీడియో చిత్రీకరిస్తున్న దేవదాయశాఖ ఉద్యోగిని దగ్గర్లోని ఓ దుకాణంలోకి లాక్కెళ్లి పిడిగుద్దులు కురిపించి, ఆయన వేసుకున్న దుస్తులు చించేసి... ఆయన మొబైల్‌ఫోన్‌ను లా క్కుని బయటకు తోసేశారు. హతాశులైన దేవదాయశాఖ అధికారులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమపై జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. అసలు కథ ఇదీ.. చీపురుపల్లి మెయిన్రోడ్లో శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నంబర్ 45/1లో 1.42 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో మెయిన్‌రోడ్‌ను ఆనుకుని 10/15 అడుగుల వెడల్పున తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఆరతి సాహు, ఆమె భర్త రామచంద్రసాహు ఆక్రమణకు పాల్పడినట్లు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ స్థలం ఆక్రమించుకుని చాలా కాలంగా అందులో ఉన్న దుకా ణం అద్దెకు ఇచ్చుకుని ప్రతీ నెలా వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. ఆ స్థలంపై కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని మాజీ ఎంపీటీసీ వాదిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ స్థలంలో శాశ్వత కట్టడాలు ప్రారంభించడంతో గుర్తించిన దేవదాయశాఖ ఈఓ కిశోర్‌కుమార్ సాక్ష్యాలు సేకరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆరతి సాహుతో పాటు కుటుంబ సభ్యులు అధికారులను అడ్డుకున్నారని, అక్కడ జరుగుతున్న సంఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్న అప్పలరాజు అనే ఉద్యోగిని చితక్కొట్టి, మొబైల్ ఫోన్ లాక్కున్నారని పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. కానీ తాము ఎలాంటి దౌర్జన్యానికీ పాల్పడలేదని, మహిళనైన తనను ఉద్యోగి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడంతోనే అడ్డుకున్నామని ఆరతి వాదిస్తున్నారు. ఫిర్యాదు చేశాం మెయిన్రోడ్లో గల శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వేనంబర్ 45/1లో గల స్థలంలో రామచంద్రసాహు కుటుంబ సభ్యులు చేసిన ఆక్రమణలపై ఆధారాలు సేకరించేందుకు వెళ్లాం. అక్కడ జరుగుతున్న పనులను సాక్ష్యంగా చూపేందుకు వీడియో చిత్రీకరిస్తున్న మా ఉద్యోగి అప్పలరాజుపై దౌర్జన్యం చేసి అతనిని నిర్బంధించారు. బట్టలు చిరిగేలా కొట్టి ఆయన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లాక్కున్నారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – బీహెచ్.వి.ఎస్.ఎన్.కిశోర్‌కుమార్,ఈఓ, దేవదాయశాఖ ఫిర్యాదు అందింది మెయిన్రోడ్లో జరిగిన ఘటనపై దేవదాయశాఖ అధికారులు ఫిర్యాదు చేశా రు. పరిశీలించిన అనంతరం, ప్రాధమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. – సీహెచ్.రాజులునాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్, చీపురుపల్లి. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఆ స్థలంపై మాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అవన్నీ పోలీసులకు చూపించాం. దేవదాయశాఖ అధికారులు, సిబ్బందిపై మేము ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. ఆ ఉద్యోగి వర్షంలో ఉన్న నన్ను అసభ్యకరంగా వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుంటే అడ్డుకుని, వాటిని డిలీట్ చేయాలని కోరాం. ఫోన్ కూడా తిరిగి ఇచ్చేశాం. – ఆరతి సాహు, మాజీ ఎంపీటీసీ, చీపురుపల్లి -
టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్ట్
పరిగి: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరిగి ఎస్ఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఆదివారం మండల వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించి, ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. కొడిగెనహళ్లి శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొడిగెనహళ్లికి చెందిన రామాంజినేయులు, జయరాం, బాబాఫకృద్దీన్‌లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎంపీటీసీ–1 అభ్యర్థి ఎల్.రామాంజినేయులు ఉన్నారు. శాసనకోటలో మరో ఐదుగురు అరెస్ట్ శాసనకోట గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. కృష్ణమూర్తి, నరసింహప్ప, సంజీవప్ప, నరసింహప్ప, నారాయణప్ప అనే ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1370 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
అభివృద్ధిలో ‘స్థానిక’ పాలనే కీలకం
పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం. జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా... జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీటీసీల అధికారాలు.. విధులు ఎంపీటీసీలు మండల పరిషత్‌లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు
-
ఒకే కుటుంబం నుంచి నలుగురు
విజయనగరం,పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం పంచాయతీ తాళ్లపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఎంపీటీసీ స్థానానికి మూడు నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తాళ్లపేట గ్రామానికి చెందిన కంది రామునాయుడు పతివాడ ఎంపీటీసీ స్థానానికి, ఆయన కుమారుడు కంది నాగేశ్వరరావు వెంపడాం ఎంపీటీసీ స్థానానికి, నాగేశ్వరరావు భార్య కంది లక్ష్మి పసుపాం ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. అదే కుటుంబానికి చెందిన కంది సరస్వతి బీజేపీ తరఫున పూసపాటిరేగ మండల జెడ్పీటీసీగా బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఏపీలో మోగిన పుర భేరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలతోపాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 15 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు చోట్ల కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. కాకినాడ స్థానానికి 2017లోనే ఎన్నిక జరిగినందున ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇక 104 మున్సిపల్, నగర పంచాయతీలకుగానూ 75 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసులు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం తదితర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ మీడియాకు తెలిపారు. పామిడి నగర పంచాయతీ డౌన్‌గ్రేడ్‌కు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఎన్నిక జరపడం లేదన్నారు. వాయిదా వేసిన చోట ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తర్వాతే చేపడతామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై ఉండదని పేర్కొన్నారు. - సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డ చోట కొద్ది వారాల వ్యవధిలోనే నిర్వహిస్తాం. - రాజధాని గ్రామాలను అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్ది వారాలకు మించి సమయం పట్టదు. ఎన్నికల డిపాజిట్ నిబంధనలివీ - మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500, ఇతరులు రూ.5,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కౌన్సిలరుగా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1,500, ఇతరులు రూ.3,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పోటీ చేసే వారి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లకు రూ.లక్ష ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిగా నిర్థారించారు. -
మధ్యాహ్నం అభ్యర్ధుల జాబితా ప్రకటన
-
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
మహిళలకే పెద్ద‘పీఠం’
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుకను అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్‌లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్ పదవులను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్పర్సన్లుగా రాబోతున్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే, రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను కూడా శుక్రవారం ఉదయానికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. ఈ జాబితాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీల్లో మహిళలకే పెద్దపీట ఇదిలా ఉండగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలోనూ సగానికి పైగా పదవులు మహిళలకే రిజర్వు అయ్యాయి. 660 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులు ఉండగా.. అందులో 334 పదవులు, 660 జెడ్పీటీసీ స్థానాల్లో 335 మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 9,639 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో 4,769 ఎంపీటీసీ స్థానాలు కూడా మహిళలకే రిజర్వు అయ్యాయి. కాగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. -
వేటగాళ్ల ఉచ్చుకు ఎంపీటీసీ బలి
మందమర్రి రూరల్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు సమీపంలో అటవీ ప్రాంతానికి షికారుకు వెళ్లి విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. షికారుకు వెళ్లిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సండ్రోనిపల్లికి చెందిన బైర్నేని ప్రశాంత్, సారంగపల్లి నివాసి, చిర్రకుంట ఎంపీటీసీ ఎండీ ఆసిఫ్, తుర్కపల్లికి చెందిన ఎండీ అఫ్రోజ్, మామిడిగట్టుకు చెందిన సయ్యద్ షరీఫ్ షికారుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో అడవిజంతువుల కోసం అమర్చిన జే వైర్ ముందుగా వస్తున్న ఆసిఫ్ కాలుకు తగలడంతో ఒక్కసారిగా పైకిఎగిరి కిందపడి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరిపై కేసు నమోదు అడవి జంతువుల షికారుకోసం విద్యుత్ తీగలు అమర్చి ఆసిఫ్ మృతికి కారణమైన మామిడిగట్టుకు చెందిన గజ్జె దుర్గయ్య, నాంపెల్లి రాజంలపై సయ్యద్ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ ఎస్సై రవిప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో అధికారులు అటవీ ప్రాంతంలో అడవిజంతువుల షికారు జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. షికారుకు వెళ్లామని బహిరంగంగానే చెబుతున్నా వారిని కనీసం అదుపులోకి తీసుకోలేదంటే వారి విధి నిర్వహణ అర్ధమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అడవిని, వన్యప్రాణులను రక్షించాలని ఎన్నో ఆంక్షలు విధిస్తూ కఠిన చట్టాలు చేసినా ఇలాంటి వ్యవహారం జరుగుతుందంటే అధికారుల చేయి లేనిదే జరగడం లేదని, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఎంపీటీసీ మృతి చెందేవాడు కాదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. -
‘పుర’ పోరుకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే అదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వాటిలో 14 కార్పొరేషన్లు, 5 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 7 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 12 మొదటి గ్రేడ్ మున్సిపాలిటీలు, 26 రెండో గ్రేడ్ మున్సిపాలిటీలు, 22 మూడో గ్రేడ్ మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కాకినాడ కార్పొరేషన్‌కు 2017లో ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు.. కొత్తగా 10 మున్సిపాలిటీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వీటిపై వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఊపందుకున్న వార్డుల పునర్విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే దాదాపు 90 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్యను పెంచారు. మిగిలిన మున్సిపాలిటీలలోనూ ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు నిర్ణయించే దిశగా పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేయడం, వార్డుల పునర్విభజనపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను రాష్ట్ర మున్సిపల్ కమిషనర్– డైరెక్టర్, జిల్లా కలెక్టర్లకు దఖలుపరుస్తూ పురపాలక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను మూడ్రోజుల్లో పూర్తిచేయాలని పురపాలక కమిషనర్– డైరెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పరిశీలించి ఆమోదించాలని భావిస్తున్నారు. అలాగే, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. వీటితోపాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్ల ప్రక్రియను ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 10కల్లా తుది ఓటర్ల జాబితా మున్సిపల్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన మీదట మొత్తం ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాలను సిద్ధంచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పరోక్ష పద్ధతిలోనే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలు గతంలో నిర్వహించిన విధంగానే మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మార్చి మొదటి వారానికల్లా ముగించాలని పురపాలక శాఖ భావిస్తోంది. అంటే.. ఫిబ్రవరి చివరి వారంలోగానీ మార్చి మొదటి వారంలోగానీ పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. కార్పొరేటర్లు/కౌన్సిలర్ల ఎన్నికలు ముగిసిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. అందుకు వీలుగా ఎన్నికల సన్నాహాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశించారు. -
పంచాయతీల్లో మహిళలకే అగ్రపీఠం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం పదవుల్లో సగానికి పైగా మహిళలకే రిజర్వు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష, జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల్లోనూ సగం స్థానాలను మహిళలకు కేటాయించింది. ఆయా పదవుల రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం మంగళవారమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,55,629 పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయగా.. అందులో 79,485 పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12,951 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవుల్లో 6,472, మొత్తం 1,31,116 వార్డు సభ్యుల పదవుల్లో 67,106 పదవులను మహిళలకు కేటాయించారు. మొత్తం 10,229 ఎంపీటీసీ పదవుల్లో 5,240 పదవులు, 660 మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో 330 పదవులు, మొత్తం 660 జెడ్పీటీసీ పదవుల్లో 331 పదవులు, 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు గాను 6 పదవులను మహిళలకే రిజర్వు చేయడం గమనార్హం. ఎస్సీలు, జనరల్‌కు పెరిగిన అవకాశాలు 2018 ఆగస్టులో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తేల్చలేక పంచాయతీరాజ్ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎవరికీ నష్టం జరగకుండా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 2006లో జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీలకు 18.30 శాతం, 2013 ఎన్నికల్లో 18.88 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించగా, ఈసారి ఆ కేటగిరీకి 19.08 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జనరల్ కేటగిరీకి 2006లో 39.45 శాతం, 2013లో 37.97 శాతం పదవులు రిజర్వు కాగా, ఈసారి ఏకంగా 40.15 శాతం పదవులను రిజర్వు చేశారు. 2006, 2013 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 2020 ఎన్నికల్లో మొత్తం పదవుల్లో ఎవరికెన్ని.. -
నేటి అర్ధరాత్రికల్లా.. ‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు బుధవారం అర్ధరాత్రికల్లా ఖరారు కానున్నాయి. పంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున మొత్తం 59.85 శాతం స్థానాలను ఆయా సామాజికవర్గాలకు రిజర్వ్ చేస్తూ వారం రోజుల క్రితం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జిల్లా, మండలాల వారీగా సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులతో పాటు ఎంపీపీ పదవులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై జిల్లాలో సోమవారం నుంచే కసరత్తు మొదలైంది. రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచి ఎన్నికల కన్నా ముందు పార్టీ గుర్తు ప్రతిపాదికన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆసక్తిగా ఉండడంతో పంచాయతీరాజ్ శాఖాధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టారు. రిజర్వుడ్ స్థానాలను ఏ ప్రతిపాదికన ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాల్లో కలెక్టరు కార్యాలయ సిబ్బందితోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ రెండు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారీగా బుధవారంకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులంటున్నారు. 3న హైకోర్టుకు అందజేత ఇదిలా ఉంటే.. రిజర్వేషన్ల వివరాలను జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అందజేయనుంది. అన్ని జిల్లాల్లోనూ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ బుధవారం పూర్తికాగానే గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం హైకోర్టుకు సమర్పిస్తారు. ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీలు కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే పెద్దఎత్తున కొత్త పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, కొన్ని పంచాయతీలను విలీనం కూడా చేసింది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఒక్కరోజే 66 వేర్వేరు ఉత్తర్వులను జారీచేశారు. -
‘స్థానిక’ సందడి!
ఈసారి మనూరి ప్రెసిడెంట్‌గా వెంకట్రావు పోటీ చేస్తానంటున్నాడట..! ఎంపీటీసీకి పోటీ చేయడానికి ప్రతాప్‌రెడ్డి రెడీ అవుతున్నాడు. వీలైతే మండల ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నిస్తున్నాడు..!! సాక్షి, అమరావతి: త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే లక్షన్నరకు పైగా పదవులకు పోటీ జరగనుంది. దాదాపు ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. తెరపైకి కొత్త తరం! రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. యువ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వపరంగా ప్రోత్సాహంఅందిస్తుండటం యువత ముందుకు రావటానికి కారణమని విశ్లేషిస్తున్నారు. కొత్తవి ఏర్పాటు, విలీనంపై నిషేధం ఎత్తివేత గ్రామ పంచాయతీలను విడదీసి కొత్తవి ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పంచాయితీలుగా ఉన్న వాటిని రెండు మూడు కలిపి ఒకటిగా విలీనం చేయడంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నిషేధం అమలులో ఉంది. పలుచోట్ల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు నాలుగు రోజుల క్రితం నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. డిసెంబరు 20 నాటికి జిల్లాల నుంచి అందే వినతుల మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనం ప్రక్రియను చేపట్టి ఆ తర్వాత తిరిగి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ చివరి వరకే గడువు 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలు కానున్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా, పట్టణ ప్రాంతాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయదలిస్తే డిసెంబరు నెలాఖరుకే పూర్తి చేయాలని సూచిస్తూ కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. జనవరి నుంచి ఆయా ప్రాంతాలలో మార్పులు చేర్పులకు తావు ఉండదని అధికారులు చెబుతున్నారు. కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని చేసేందుకు సిబ్బందిని తాత్కాలికంగా డిప్యుటేషన్, ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు అనుమతి కోరుతూ కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది. సిద్ధంగా ఉన్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేసిన వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు పంచాయితీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తాం. – గిరిజాశంకర్ (పంచాయితీరాజ్ శాఖ కమిషనర్) పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు - ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా ఉన్న 249 గ్రామాలను పట్టణాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు అధికారులు చెబుతున్నారు. - 78 పంచాయతీలను కొత్తగా 36 నగర పంచాయితీలుగా మార్చే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. - వివిధ పట్టణాలు, నగర పాలక సంస్థలకు చుట్టుపక్కల ఉండే మరో 97 గ్రామాలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇవికాకుండా కలెక్టర్ల వద్ద మరో 74 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. - రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్న చోట్ల వాటిని వేరు చేసి కొత్తవి ఏర్పాటు చేయాలంటూ మరో 60 దాకా ప్రతిపాదనలు అందాయి. -
వాళ్లకి వేతనాలు ఇచ్చేదెలా?
సాక్షి, ఆదిలాబాద్ : గళ్లపెట్టే నిండా డబ్బులున్నా.. ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉమ్మడి జిల్లా పరిషత్‌ది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు విడుదల చేసి మూడు నెలలైనా ఇంత వరకు మాజీ సభ్యుల చేతికందలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు జూన్‌లో విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో విడత కూడా విడుదల చేసి జెడ్పీ ఖాతాలో జమ చేసింది. కాని ఆ డబ్బులను సభ్యులకు పంచే అధికారం మాత్రం ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గత కొన్ని నెలలుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చిన వేతనాలు పంపిణీ చేసేందుకు సర్కారు అధికారులకు అధికారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం గత మూడు నెలల క్రితం తాజా మాజీ జెడ్పీ సభ్యులకు గౌరవ వేతనాలు విడుదల చేసింది. కాని స్థానిక సంస్థల ఎన్నికలు ముగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బులను డ్రా చేసే చెక్‌పవర్ ఏ అధికారికి ఇవ్వకపోవడంతో వేతన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మాజీ సభ్యులకు గౌరవ వేతనాలు ఎప్పుడిస్తారని ప్రతిరోజూ ఎవరో ఒకరు పరిషత్ అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చెక్‌పవర్ లేక నిలిచిన చెల్లింపులు జెడ్పీ మాజీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపు చెక్‌పవర్ లేకపోవడంతో నిలిచిపోయాయి. సభ్యులకు చెల్లించాల్సిన రూ.4.64 కోట్ల గౌరవ వేతనాలు ఉమ్మడి జెడ్పీ ఖాతాలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ నిధులు మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా, గత మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యుడికి నెలకు రూ.10వేలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి నెలకు రూ.5 వేల చొప్పున అందరికీ 11 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు రావాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.1.10 లక్షలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి రూ.55 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 52 మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 740 మంది మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి న గౌరవ వేతనాల కింద పాత జెడ్పీకి రూ.4.64 కోట్లు అందాయి. వీటితోపాటు జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌కు చెల్లించాల్సిన 11 నెలల వేతనం కూడా వచ్చినట్లు సమాచారం. వీటిని ఆయా మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా పరిషత్‌లో అధికారికి చెక్‌పవర్ లేకపోవడంతో యంత్రాంగం ఏమి చేయలేని పరిస్థితి. కాని జెడ్పీ ఖాతా నుంచి డబ్బులు తీసేందుకు డ్రా యింగ్ పవర్ లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ‘మాజీ’లపై కనికరమేది.? 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2016లో జెడ్పీసభ్యుల గౌరవ వేతనాలు పెంచింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ వేతనాలు అందుకున్న çసభ్యులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే రెట్టింపు గౌరవాన్ని పొందారు. పెంచిన వేతనాలను సమయానుకూలంగా అందజేయకపోవడంతో అప్పట్లో సభ్యులు ఇబ్బందులు పడ్డారు. నెలనెలా కాకుండా ఏడాది, ఏడాదిన్నరకోసారి వేతనాలు విడుదల చేస్తూ వచ్చింది. తాము అధికారంలో ఉన్నామనే దీమాతో ప్రభుత్వం ఎప్పుడిచ్చిన వేతనాలు తీసుకున్నామని, ఇప్పుడు మాజీలుగా మారిన ప్రభుత్వం కనికరం చూపడం లేదని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వేతనాలు విడుదల చేసేందుకు అధికారులకు చెక్‌పవర్ ఇవ్వాలని కోరుతున్నారు. -
గ్రామాల్ని బాగు చేసుకుందాం
సాక్షి, సిద్దిపేట: ‘మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలి. అందుకు గ్రామస్తుల మధ్య ఐక్యత అవసరం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీశ్ సమీక్ష నిర్వహించారు. ఒక గ్రామంలో ఒకే వినాయకుడిని పెట్టాలన్న హరీశ్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని 34 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఆయా గ్రామాల నేతలు తీర్మాన పత్రాలను హరీశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను హరీశ్ అభినందించారు. ఒక గ్రామంలో ఒకే వినాయకుడిని పెట్టడం మూలంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వారవుతారన్నారు. ప్రభు త్వం నుంచి వచ్చే నిధులే కాకుండా గ్రామ యువత, మహిళా సంఘాలతోపాటు అందరూ కలసి శ్రమదానం చేసి గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మానసిక ప్రశాంతతకు గ్రామాల్లో యోగ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచాలని.. ప్రతీ గ్రామంలో మహిళా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. -
ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీసింగ్?
పై చిత్రంలోని సన్నివేశం అంకుశం సినిమాలో అన్యాయాలు చేస్తున్న రౌడీని కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్తున్న సీన్ మాదిరిగా ఉంది కదూ.. అయితే, విషయం అది కాదు.. బాధితుల తరపున న్యాయం కోసం నిలబడిన ఓ ప్రజాప్రతినిధిని నడిరోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్న పోలీసులను మీరు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాయం అడిగిన వారిపై ఇలా ప్రవర్తిస్తే, పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులతో పోలీసులు ఎలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారో వారే చెప్పాలి. సాక్షి, మహబూబాబాద్ : బాధితులు ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వస్తే వారికి తగిన మర్యాద ఇచ్చి, వారు ఎందుకు వచ్చారో వివరాలు తెలుసుకుని సాయం చేయాలని బాస్‌లు పదేపదే పలు సందర్భాల్లో చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువై, వారికి తగిన సాయం అందించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కింది స్థాయి సిబ్బంది మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మంత్రి ఇలాఖాలో.. ఈనెల 5వ తేదీన తొర్రూరు పెద్ద చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడి శ్రీను మృతి చెందాడు. ఈ ఘటనలో ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్తులు తొర్రూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు మద్దతుగా అమ్మాపురానికి చెందిన ఎంపీటీసీ ముద్దం విక్రంరెడ్డి అక్కడికి చేరుకునే సరికే ట్రాఫిక్‌జామ్ అయింది. అయితే, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా.. న్యాయం చేస్తేనే వెళ్తామని బాధితులు అన్నారు. దీంతో పోలీసులకే ఎదురు చెబుతావా అంటూ.. అక్కడ ఉన్న ఎంపీటీసీ విక్రంరెడ్డిని కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై మీడియాలో వైరల్ కావడంతో ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సా«ధారణ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కాగా, తొర్రూరు మండలం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోకి వస్తుండగా.. దెబ్బలు తిన్న ఎంపీటీసీ విక్రంరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. తొర్రూరు సీఐ, ఎస్సైను సస్పెండ్ చేయాలి: ఎంపీటీసీ ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా తనపై ఇష్టం వచ్చినట్లు దాడిచేసి కొట్టిన తొర్రూరు సీఐ చేరాలు, సెకండ్ ఎస్సై కరీముల్లాను సస్పెండ్ చేయాలని తొర్రూరు మండలం అమ్మాపురం ఎంపీటీసీ సభ్యుడు ముద్దం విక్రంరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఒక ఎంపీటీసీ సభ్యుడిని అని కూడా చూడకుండా తొర్రూరు సీఐ చేరాలు, సెకండ్ ఎస్సై కరీముల్లా కింద పడేసి బూటుకాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లారన్నారు. విచారణ చేపడుతున్నాం తొర్రూరులో జరిగిన సంఘటన పై విచారణ కమిటీ నియమించాం. రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందగానే ఉన్నతాధికారులకు పంపిస్తాం. ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. -నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ మహబూబాబాద్ -
దేవరకద్రలో బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి మంగళవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతు ప్రేమ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య జెడ్పీటీసీ.. కోడలు ఎంపీటీసీ
నవాబుపేట/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబానికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. ఆయన భార్య, కుమారుడు జెడ్పీటీసీలుగా, కోడలు ఎంపీటీసీగా విజయం సాధించారు. నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన యాదయ్య పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఆయనకు అవకాశాలు కలిసి వచ్చాయి. సొసైటీ డైరెక్టర్ నుంచి సింగిల్ విండో చైర్మన్‌గా, అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు. యాదయ్య ప్రాదేశిక ఎన్నికల బరిలో తన భార్య కాలె జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా విజయం సాధించారు. మొయినాబాద్ జెడ్పీటీసీగా కొడుకు శ్రీకాంత్ గెలిచారు. ఆయన రెండో కోడలు దుర్గాభవాని నవాబుపేట మండలం చించల్‌పేట ఎంపీటీసీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. నవాబుపేట ఎంపీపీ బరిలో దుర్గాభవాని ఉందని విశ్వసనీయ సమాచారం. -
సంఖ్యాబలం ఉన్నా అభ్యర్థి కరువు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఐదింటిలో విజయం సాధించగా.. టీఆర్ఎస్ నాలుగు స్థానాలకే పరిమితమైంది. అయితే అత్యధిక స్థానాలను గెలిచిన ఆనందం కాంగ్రెస్ పార్టీకి లేకుండాపోయింది. దోమకొండ ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు బీసీ మహిళలూ ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పార్టీకి ఎంపీపీ అభ్యర్థి లేకుండా పోయారు. ఎంపీపీ పీఠం కైవసం చేసుకునే సంఖ్యాబలం ఉన్నా.. ఎంపీపీ పదవి కోసం బీసీ మహిళ లేకపోవడంతో ఆ పదవిని వదులుకునే పరిస్థితి వచ్చింది. అన్నాసాగర్‌లో ఒకే ఒక్కటి ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హన్మన్నగారి శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు దక్కింది. ఆయనకు కూలర్ గుర్తు కేటాయించారు. అయితే మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. మరో స్వతంత్ర అభ్యర్థి జంగింటి ఉమాదేవి 1,005 ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. 661 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గోలి వసంతం రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చిలుక నర్సింలుకు 263 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి 32 ఓట్లు పోలయ్యాయి. -
పరిషత్ ఫలితాలు నేడే
-
వారంలోనే పరిషత్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్.. మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో వారంలో రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. వెంటనే జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలు సైతం పూర్తి కానున్నాయి. జూన్ 10లోపే ఫలితాల వెల్లడి, పరోక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయంలో అధికారిక తేదీలు ప్రకటించనుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14తో ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈనెల 27న నిర్వహించాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. ఆర్డినెన్స్‌లో పలు మార్పులు.. ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘మొదటి సమావేశం’ అనే పదానికి బదులుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ‘ప్రత్యేక సమావేశం’అనే మార్పు చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న మొదటి సమావేశం అంటే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిచిన వారు మొదటిసారి సమావేశమై ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. వెంటనే కొత్తగా ఎన్ని కైన వారి పదవీకాలం మొదలవుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జూలై 4 వరకు ఉన్నందున ఆ తర్వాతే మొదటి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సమావేశం అనే పదాన్ని ‘ప్రత్యేక సమావేశం’ అని చట్టంలో సవరణ చేయడంతో జూలై 4 వరకు వేచి చూడకుండా ఆలోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడించవచ్చు. ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే చేపట్టొచ్చు. చట్టంలో సవరణ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జూలై 3 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రస్తుత ఉమ్మడి జిల్లా ల్లోని 8 జెడ్పీపీల పాలకవర్గాల పదవీకాలం జూలై 4 తో ముగుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ఆగస్టు 6 వరకు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూ డెం జెడ్పీలు ఏర్పాటవుతున్నాయి. ఈ జెడ్పీపీల పదవీకాలం ఆగస్టు 7 నుంచి మొదలుకానుంది. జూలై 3న లెక్కింపు... జిల్లాపరిషత్, మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4న ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు పరోక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు మధ్య ఎక్కువ రోజులు ఉండటం వల్ల పరోక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారని, ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జూలై 3న చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అయితే పాఠశాలలు, విద్యా సంస్థలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. జూన్ మొదటివారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును, పరోక్ష ఎన్నికలను త్వరగా పూర్తి చేసేలా ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదననలు పంపింది. -
క్యాంపులు పెడితే వేటు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ పదవులకు నిర్వహించే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పరోక్ష, ప్రత్యక్ష పద్ధతుల్లో ఎలాంటి క్యాంప్‌లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని, స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు.. డబ్బు, అంగబలమున్న అభ్యర్థులు ఇళ్లు, రిసార్ట్‌లలో క్యాంప్‌లు నిర్వహించి గెలిచిన ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఉంచడం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలుండటంతో ప్రభుత్వ యంత్రాంగా న్ని ఉపయోగించి ఏదోక రూపంలో ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొంది. ఇలాంటి పద్ధతుల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్‌లను ధిక్కరించి ఓటేసే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ప్రలోభాల నివారణకు.. జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ప్రత్యేక సెక్షన్‌ను ఎస్ఈసీ చేర్చింది. పరిషత్ (జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ)ని పదవులకు పరోక్ష పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఈ మేరకు సవరించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అంశాన్ని చేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోడ్ స్థానిక ఫలితాల వెల్లడి నుంచి మొదలై పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు (ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతుల్లో) కోరుకునే ఏ రాజకీయపార్టీకి చెందినవారైనా ప్రజాప్రాతినిథ్య చట్టంలో పొందుపరిచిన లంచం ఇతరత్రా రూపాల్లోని ప్రలోభాలకు పాల్పడొద్దని పేర్కొంది. పార్టీలు ఇచ్చిన విప్‌ను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ఓటేసేలా ఒత్తిళ్లు తేవొద్దని తెలిపింది. విప్‌ను ధిక్కరిస్తే పదవి కానీ ప్రోత్సాహకం కానీ ఇస్తామన్న ప్రలోభాలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అధికార పార్టీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు తమ అధికార హోదా లేదా పదవులను ఉపయోగించి కాంట్రాక్ట్‌ల కల్పన, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, లైసెన్సులు, సర్టిఫికెట్లు అందజేయడం, పెండింగ్‌కేసుల ఎత్తివేత వంటి వాటికి పాల్పడొద్దని స్పష్టంచేసింది. -
ముగిసిన తెలంగాణ పరిషత్ ఎన్నికల పోరు
-
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్‌నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్‌పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
ఎంపీటీసీలకు 439,జెడ్పీటీసీలకు 79 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తుది విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు 439, జెడ్పీటీసీ సీట్లకు 79 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 14న జరగనున్న తుదిదశ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల సమర్పణ ముగియనుంది. నామినేషన్ల దాఖలు తొలిరోజు (మంగళవారం) జెడ్పీటీసీలకు.. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 16, బీజేపీ 12, సీపీఐ 7, సీపీఎం 4, ఇండిపెండెంట్ 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీలకు టీఆర్ఎస్ 158, కాంగ్రెస్ 135, బీజేపీ 52, సీపీఐ 12, సీపీఎం 5, టీడీపీ 4, గుర్తింపు పొందిన, ఎస్ఈసీ వద్ద రిజిష్టరైన పార్టీలు 3, ఇండిపెండెంట్ 70 మంది నామినేషన్లు వేశారు. ఈ మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీలకు, 161 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమర్పణ ముగిశాక, శుక్రవారం సాయంత్రం 5 వరకు పరిశీలన, ఆ తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. ఈ నెల 6, 10ల్లో జరిగే మొదటి, రెండు విడతల ఎన్నికలతో కలిపి, 3 విడతల్లో పడిన ఓట్లను మే 27న ఉదయం 8 తర్వాత లెక్కించి, అది ముగియగానే ఫలితాలను ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఒక్కరోజే నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. వివిధ జిల్లాల్లో రూ.73,661 విలువైన మద్యాన్ని జప్తు చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ.76.40 లక్షల నగదు, రూ.17.50 లక్షల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సమర్పించే వ్యయ ఖాతాలను కనీసం 3 సార్లు వ్యయ పరిశీలకులు తనిఖీ చేయాలన్న గత ఆదేశాలను కనీసం ఒక్కసారి పరిశీలించేలా ఎస్ఈసీ బుధవారం సవరించింది. -
రెండో విడతలో 14,670 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 14,670 నామినేషన్లు దాఖల య్యాయి. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న 180 జెడ్పీటీసీ స్థానాలకు 2,008 నామినేషన్లు, 1,913 ఎంపీటీసీ సీట్లలో 12,552 నామినేషన్లు సమర్పించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబం ధించి మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థులపై కలెక్టర్లు, ఎంపీటీసీ అభ్యర్థులపై ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు అప్పీళ్లను స్వీకరించిన నేపథ్యంలో బుధవారం సాయం త్రం 5 గంటలలోగా వాటిని పరిష్కరిస్తారు. మే 2న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి, సాయంత్రం 3 గంటల తర్వా త పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.ఈనెల 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పార్టీల వారీగా నామినేషన్లు... ఈ విడతలో 180 జెడ్పీటీసీ స్థానాల్లో: టీఆర్ఎస్ నుంచి 525, కాంగ్రెస్ నుంచి 482, బీజేపీ నుంచి 231, టీడీపీ నుంచి 82, సీపీఎం నుంచి 33, సీపీఐ నుంచి 27, ఎంఐఎం నుంచి 3, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లు 213 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో: టీఆర్ఎస్ నుంచి 4,214, కాంగ్రెస్ నుంచి 3,175, బీజేపీ నుంచి 1,289, టీడీపీ నుంచి 266, సీపీఎం నుంచి 171, సీపీఐ నుంచి 114, ఎంఐఎం నుంచి 6, వైసీపీ నుంచి 1, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 137, ఇండిపెండెంట్లు 1,533 మంది నామినేషన్లు వేశారు. -
డుమ్మా కొడితే పదవులకు గండమే!
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు మొదలుకొని ఎంపీటీసీ సభ్యుల వరకు అధికారాలతోపాటు విధులు, బాధ్యతలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త సభ్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలను పొందుపర్చారు. పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నిబంధనలను విధించారు. మూడు విడతల్లో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే జిల్లా, మండల పరిషత్ సభ్యులకు కొత్త చట్టం ప్రకారం వివిధ నిబంధనలు అమల్లోకి రానుండడంతో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. మండలాధ్యక్షుల బాధ్యతలు... కొత్తచట్టంలో ఎంపీపీ అధ్యక్షులపై మరిన్ని బాధ్యతలను పెట్టారు. నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలతో పాటు కొన్ని పరిమితులు కూడా విధించింది. మండల ప్రజా పరిషత్ తీర్మానాలను అమలు చేసేలా ఎంపీడీవోలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారాన్ని ఉపయోగించే అవకాశం ఎంపీపీలకు కల్పించారు. సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షత వహించడం, ప్రజా పరిషత్ రికార్డుల పర్యవేక్షణపై పూర్తి హక్కులు కల్పించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంటు వ్యాధులు ప్రబలడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సంబంధిత అధికారులు, ఎంపీడీవోలతో చర్చించి, ప్రజల సేవ, భద్రత నిమిత్తం అత్యవసర పనుల నిర్వహణకుగాను ఎంపీపీలకు అధికారాలిచ్చారు. అత్యవసర పనులు నిర్వహించాక, వాటిని సర్వసభ్య సమావేశాల్లో మండల పరిషత్‌కు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులను ఉల్లంఘించే నిర్మాణపు పనులు, ఇతర పనుల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, ఆదేశాలిచ్చే విషయంలో ఎంపీపీలపై ఆంక్షలు విధించారు. 15 రోజులు రాకుంటే... జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు వరసగా 15 రోజులపాటు జడ్పీ, మండల కార్యాలయానికి రాకపోతే వారిని విధుల్లోంచి తప్పించే నిబంధన విధించారు. ఆ విధంగా విధులకు హాజరుకాని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో వైస్చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 15 రోజులు వరుసగా ఆఫీసులకు రాకపోతే సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీపీల పరిధిలో జరిగే పనుల్లో నిర్లక్ష్యం, ఆస్తుల నష్టం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులపైనే ఉంటుంది. ఈ విషయంలో వారు ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అధికారం లేదు. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్ నిధిగా ఏర్పాటు చేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో జమ చేసేలా కొత్త పీఆర్ చట్టం నిబంధనల్లో పొందుపరిచారు. పెరిగిన ఎంపీటీసీల భాగస్వామ్యం... గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీల భాగస్వామ్యం పెరగనుంది. ప్రతి ఐదేళ్లకు గ్రామ పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీ సభ్యులు ఆమోదించాలి. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల్లో స్వయం సహాయçస్ఫూర్తిని, చొరవను పెంపొందించడం, జీవన ప్రమాణాలు పెంచడంలో పరిషత్ సభ్యులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పన్నువిధానాల్లో మార్పులు తీసుకువచ్చే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. మండలం, జిల్లా, ఇతర విధానాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులతోపాటు నేరుగా గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేసే బాధ్యతలను పరిషత్ సభ్యులకు అప్పగిస్తారు. భూమి సెస్సు, స్థానిక సెస్సులను గరిష్ట పరిమితికి లోబడి, సర్‌చార్జ్ రూపంలో పన్నులను విధించే అధికారం పరిషత్ సభ్యులకు ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్మిక బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించడం, పనుల పర్యవేక్షణ ఇకపై ఎంపీటీసీ సభ్యులు నిర్వహించవచ్చు. వయోజన విద్య కార్యక్రమాల పర్యవేక్షణ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కార్యకలాపాల అమలు, స్వయం సహాయక బృందాలతో స్వయం ఉపాధి, జీవనోపాధి పథకాలు, బ్యాంకులతో అనుసంధానం వంటి వాటిని పరిషత్ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వహించే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. ఇందు కోసం ఏదైనా సంస్థతో నిర్వహణ ఒప్పందం, నిర్మాణ పనుల అమలు, నిర్వహణ వీరి ప్రత్యేకమైన బాధ్యత. ప్రభుత్వ వైద్యశాలలు, శిశు సంక్షేమ కేంద్రాల నిర్వహణ అధికారం ఎంపీటీసీలకే కల్పించారు. -
‘పరిషత్’ ప్రచారానికి వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వేళైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లా, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రచారంతో వేడి పుట్టించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలతో, ఆ పార్టీలు అధికారికంగా పోటీకి నిలిపే అభ్యర్థులతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న తొలి విడత ఎన్నికల నేపథ్యంలో, ఆ విడతలో బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించనున్నారు. అలాగే గుర్తులు కూడా కేటాయిస్తారు. తొలి విడత ప్రచారం మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ప్రచారం నేపథ్యంలో ఎస్ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా జిల్లా ఎన్నికల అధికారులు, జనరల్ అబ్జర్వర్ల విచారణ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై ప్రకటన చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే... అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ అక్రమ పద్ధతుల్లో గెలిచిన వారిని పదవి నుంచి తొలగించడంతోపాటు ఆరేళ్లు ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార, చర్చా వేదికలుగా ఉపయోగించడం, ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక అధికారులకు కల్పించారు. అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తుల్లో మొదటి గుర్తును, రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయిస్తారు. ఒకవేళ బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే నామినేషన్ సంఖ్య ఆధారంగా గుర్తులను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలం వేస్తే వేటే... ఏకగ్రీవాల కోసం వేలం వేసి ఓటర్లను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, అభివృద్ధి సాధన కోసం అంటూ ఆయా పోస్టులను వేలం వేస్తే జైలు, జరిమానా, అనర్హత వేటు వేసే అధికారం ఎస్ఈసీకి ఉంది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించకుండా విచారణ చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులే ప్రకటించేవారు. కానీ ఈ సారి ఏకగ్రీవమైనట్లుగా దరఖాస్తు చేసుకోవాలని, దాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారి లేదా జనరల్ పరిశీలకులు విచారణ చేసి, ఆ తర్వాత జిల్లా కలెక్టరే ప్రకటిస్తారంది. విచారణలో అనైతిక వ్యవహారాలు, డబ్బు ప్రభావం వంటివి బయటకు వస్తే... రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు కల్పించారు. -
వేములవాడ రూరల్‌లో ఎన్నికలకు బ్రేక్
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ పున:పరిశీలించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని తీగల రాంప్రసాద్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ తాను వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్ మండలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ ద్వారా కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు, వేములవాడ రూరల్ మండల ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది. -
టీఆర్ఎస్లో రెబల్స్ బెడద
సాక్షి,మేడ్చల్ జిల్లా: ఈ మండల పరిషత్ ఎన్నికలు జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. జిల్లా పరిధిలో ఐదు మండలా లు ఉండగా, ఈ ఐదూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మొదటి దశలోనే మే 6న తేదీన పోలింగ్ జరగనుంది. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం చోటుచేసుకుందని, ఈ కారణంగానే రెబల్స్ తప్పడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఐదు జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిన వారికే ప్రాధాన్యం కల్పించారనే భావన మండలస్థాయి నేతల్లో ఉంది.రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయటమో లేదా చూపించటమో ..చేసిన వారికి మాత్రమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు కేటాయించినట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు పలు ఎంపీటీసీ స్థానాల్లో టికెట్ కేటాయించిన వారే కాకుండా ఇతర నాయకులు కూడా పార్టీ రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. జెడ్పీటీసీ స్థానాల్లో ఇలా.... ♦ ఘట్కేసర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డికి టికెట్ కేటాయించగా, రెబల్‌గా చౌదరిగూడకు చెందిన బైరు రాములుగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ♦ మేడ్చల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా శైలజారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వగా, రెబల్‌గా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ సతీమణి అనితాయాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ♦ కీసర జెడ్పీటీసీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బెస్త వెంకటేష్ నామినేషన్ వేయగా, రెబల్‌గా కీసర సర్పంచి భర్త నాయకుపు వెంకటేష్ ముదిరాజ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ♦ మూడుచింతలపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా మద్దుల శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నుంచి నామినేషన్ వేయగా, రెబల్‌గా రామిగి మధుకర్‌రెడ్డి, వంగాలక్ష్మారెడ్డిలు నామినేషన్ వేశారు. ఎంపీటీసీ స్థానాల్లో అంతే... ♦ ఘట్కేసర్ మండల పరిధిలో ఎదులాబాద్ 2వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంకం రవికి రెబల్‌గా బద్దం వెంకటేశ్, చౌదరిగూడ– 2లో టీఆర్ఎస్ అభ్యర్థి సందీప్‌రెడ్డికి రెబల్‌గా బైరు రాములుగౌడ్, చౌదరిగూడ– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాల్‌కు రెబల్‌గా నిరుడి రామారావు, బైరు లక్ష్మణ్‌గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. ♦ కాచవానిసింగారం– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వర్కల లక్షమ్మకు రెబల్‌గా మునికుంట్ల స్వర్ణలత నామినేషన్ వేశారు. ♦ కీసర మండల పరిధిలోని కీసర గ్రామంలో 1వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి జంగయ్యయాదవ్‌కు రెబల్‌గా నారాయణ శర్మ , 2వ ఎంపీటీసీ స్థానంలో పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి రెబల్‌గా రమేష్‌గుప్తా, సతీష్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ♦ అంకిరెడ్డి పల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ♦ శామీర్‌పేట్ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఒకచోట రెబల్ బెడద ఉంది ♦ మేడ్చల్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, తొమ్మిదింటిలో రెబల్స్ బెడద ఉంది. ముగిసిన నామినేషన్ల పర్వం సాక్షి,మేడ్చల్ జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడ్చల్ జిల్లాలో ఐదు జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థుల నుంచి 44 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఎనమిది ఉన్నాయి. 42 ఎంపీటీసీ స్థానాలకు 193మంది అభ్యర్థులు 279 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థులు 92 మంది ఉన్నారు. చివరి జెన జెడ్పీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 218 నామినేషన్లు దాఖలు అయ్యాయి. -
నీకు వేరే దారే లేదా .. రూల్స్ బ్రేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు పాటించడంలేదని ప్రశ్నిస్తూ ప్రజాప్రతినిధిని ఓ యువతి వీడియో తీస్తే.. మమ్మల్నే వీడియో తీస్తావా అంటూ ప్రజాప్రతినిధి కూతురు కూడా ఫోన్‌తో చిత్రీకరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిజాంపేటలో ఎంపీటీసీ సురేష్ యాదవ్ సర్వీస్ రోడ్డుకు అడ్డంగా కారును పార్క్ చేశారు. అయితే అదే రోడ్డుగుండా వెలుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రిషికా రోడ్డుపైనే కారును పార్క్ ఎందుకు చేశారంటూ నిలదీసింది. నీ ఇష్టమొచ్చింది చేసుకో, అసలు నువ్వెందుకు ఈ రూట్లో వచ్చావు, నీకు వేరే దారే లేదా అంటూ సురేష్ యాదవ్ దబాయించాడు. అంతేకాకుండా సురేష్ యాదవ్ కూతురు కూడా వీడియో తీస్తూ యువతిని ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ, నువ్వేం పోలీసువు కాదంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అయితే ఈ ఘటనపై రిషికా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఎంపీటీసీ కారుకు చలానా విధించారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పదవులపై ‘నజర్’
సాక్షి, అడ్డాకుల: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 3న ఎంపీపీల పదవీ కాలం ముగియనున్నందున ఆ లోపు ఎన్నికలు పూర్తయితే కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టే విధంగా సర్కారు ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27న ముగియనుంది. రాష్ట్రంలో ఈనెల 11న మొదట విడతలోనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం జిల్లా, మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక ఎన్నికల వేడి రగులుకుంటోంది. ఆశావహుల ‘ప్రచారం’.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపించడంతో పోటీలో నిలవాలనుకున్న ఆశావహులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగియగానే తమ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరందుకోవడంతో తాజాగా గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ అనుకూలించే నేతలు అందరినీ కలుపుకుపోవడానికి సమాయత్తం అవుతున్నారు. వలస ఓటర్లపై కూడా మెల్లగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వలస ఓటర్లు రెండు సార్లు గ్రామాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. ఒకసారి ఎమ్మెల్యే మరోసారి సర్పంచ్ ఎన్నికలకు వచ్చి ఓట్లు వేశారు. తాజాగా మరో రెండు ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను గ్రామాల నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా వచ్చే రెండు ఎన్నికలకు వచ్చి వలస ఓటర్లు ఓట్లు వేసి పోయే విధంగా ఆశావహులు ఫోన్లు చేస్తున్నారు. జెడ్పీటీసీపై నేతల గురి.. అడ్డాకుల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఈసారి జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో చాలా మంది మండల ముఖ్య నేతలు జెడ్పీటీసీపై గురి పెట్టారు. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఇక్కడ జెడ్పీటీసీగా విజయం సాధిస్తే అదృష్టం వరించి జెడ్పీ చైర్మన్ కావొచ్చన్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి పార్టీ మండల అధ్యక్షుడు డి.నాగార్జున్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహిమూద్, సింగిల్‌విండో అధ్యక్షుడు ఎం.జితేందర్‌రెడ్డి, పెద్దమునుగల్‌ఛేడ్ సర్పంచ్ భర్త రాజశేఖర్‌రెడ్డి, అడ్డాకుల తిరుపతిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, బలీదుపల్లి వేణుయాదవ్‌తో పాటు మరి కొందరు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్ధం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొవడానికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రెండు పార్టీలు తలమునకలయ్యాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ముగ్గురు నేతలు జెడ్పీటీసీ స్థానంపై గురి పెట్టినా పక్క మండలానికి చెందిన ఓ నియోజకవర్గ నేతను ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
మహిళలకు సగభాగం..
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని 25 మండల పరిషత్‌లకు గాను 14 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. 13 మండలాల జెడ్పీటీసీ స్థానాలనూ మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియపై అధికార యంత్రాంగం రెండు, మూడు రోజులుగా కసరత్తు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వివరాలను ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, జెడ్పీసీటీ స్థానాల రిజర్వేషన్లను గురువారం జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ప్రకటించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళల రిజర్వేషన్లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. మండల పరిషత్‌లకు సంబంధించి 25 స్థానాల్లో బీసీలకు ఐదు ఎంపీపీలు,ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు మూడు రిజ ర్వు అయ్యాయి. 13 ఎంపీపీ స్థానాలు జనరల్ అయ్యాయి. ఆయా కేటగిరిల్లో మహిళలకు 14 స్థానాలు వచ్చాయి. బీసీలకు ఆరు జెడ్పీటీసీ స్థానాలు.. ఆయా మండలాల జెడ్పీటీసీ స్థానాల రిజ ర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఆరు జెడ్పీటీసీలు బీసీలకు రిజర్వు అయ్యాయి. అలా గే ఎస్సీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు రెండు జెడ్పీటీసీలు కేటాయించగా, 13 స్థానాలు జనరల్‌కు వచ్చాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిం చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తజ్ముల్, హజ్రాబేగం, కాంగ్రెస్ నుంచి శివకుమార్, బీజేపీకి చెందిన గంగాకిషన్ పాల్గొన్నారు. మండలం ఎంపీపీ రిజర్వేషన్ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఆర్మూర్ ఎస్సీ ఎస్సీ బాల్కొండ బీసీ బీసీ (మహిళ) భీంగల్ జనరల్ బీసీ బోధన్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) ధర్పల్లి జనరల్ (మహిళ) జనరల్ డిచ్పల్లి జనరల్ జనరల్ (మహిళ) ఇందల్వాయి ఎస్టీ జనరల్ (మహిళ) జక్రాన్‌పల్లి జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) కమ్మర్పల్లి బీసీ (మహిళ) బీసీ (మహిళ) కోటగిరి జనరల్ (మహిళ) జనరల్ మాక్లూర్ జనరల్ జనరల్ మెండోరా ఎస్సీ (మహిళ) ఎస్సీ మోర్తాడ్ జనరల్ జనరల్ మోపాల్ ఎస్టీ (మహిళ) ఎస్టీ (మహిళ) ముప్కాల్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) నందిపేట జనరల్ జనరల్ (మహిళ) నవీపేట ఎస్సీ ఎస్సీ (మహిళ) నిజామాబాద్ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ) రెంజల్ బీసీ (మహిళ) బీసీ (మహిళ) రుద్రూరు బీసీ (మహిళ) బీసీ సిరికొండ ఎస్టీ (మహిళ) ఎస్టీ వేల్పూరు ఎస్సీ (మహిళ) ఎస్సీ (మహిళ) వర్ని జనరల్ (మహిళ) జనరల్ ఎడపల్లి బీసీ బీసీ ఏర్గట్ల జనరల్ జనరల్ -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెంచుతారా?
సాక్షి, హైదరాబాద్: జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా కొన్నింటి పరిధి మరీ చిన్నగా మారడం ఇప్పుడు సమస్యగా పరిణమిస్తోంది. గతంలోని ఉమ్మడి 9 జిల్లా పరిషత్‌ల స్థానంలో కొత్తగా 32 జిల్లా పరిషత్‌లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వి భజనలో పరిమితంగా కొన్ని మండలాలతో ఏర్పడిన కొన్ని జెడ్పీలు, పరిమితంగా కొన్ని గ్రామాలతో ఏర్పడిన కొన్ని మండల ప్రజాపరిషత్‌లలో పాలకవర్గాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న మీమాంసకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు గురవుతున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో 4 గ్రామీణ మండలాలు, వరంగల్–అర్బన్ జిల్లాలో 7 గ్రామీణ మండలాలు, నారాయణపేటతోపాటు కొన్ని జిల్లాల్లోనూ తక్కువ సంఖ్యలో మండలాలు ఉండడంతో అలాంటి చోట్ల పాలకవర్గాలను ఎలా ఏర్పాటు చేస్తే బావుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. కొన్ని స్థానాలే ఉన్నచోట జెడ్పీపీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులు పోగా మిగిలినసభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ జెడ్పీ లేదా ఎంపీపీ మనుగడ ఎలా అని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 15–20 వేల జనాభాకు ఒక జెడ్పీటీసీ... గతంలో ఒక మండలాన్ని జెడ్పీటీసీ స్థానంగా, గ్రామాన్ని లేదా మూడున్నర నాలుగు వేల జనాభా గత ప్రాంతాన్ని ఎంపీటీసీగా పరిగణిస్తూ వచ్చారు. కొత్తగా 32 జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా, మండలాల సంఖ్య మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో, గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలను 15–20 వేల మధ్య జనాభాకు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పాటు చేయాలని, రెండున్నర, మూడువేల జనాభాలోపు ఎంపీటీసీ స్థానంగా పరిగణించాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
మహిళలకే ప్రాధాన్యం
సాక్షి, కొల్లాపూర్: దాదాపు అన్ని మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గ మండలాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. నాలుగు మండలాల్లో ఒక్క ఎంపీపీ పదవి మినహా మిగతా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. జనాభా పరంగా ఎస్సీలు, ఎస్టీలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే వీరికి ఎక్కడా రిజర్వేషన్లు కల్పించలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిందని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. మండలాల వారీగా ఇలా.. నియోజకవర్గ పరిధిలో కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలు ఉన్నారు. వీటిలో ఎంపీపీ పదవులకు సంబంధించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, పెద్దకొత్తపల్లి మండలం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ పదవులకు సంభందించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెద్దకొత్లపల్లి మండలం బీసీ జనరల్ అయ్యాయి. గతంలో ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం ఐదు మండలాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఉండే మండలాలకు సంభందించి గతంలో కొల్లాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు జనరల్ స్థానాలకు, పెద్దకొత్తపల్లి మండంలలో ఎంపీపీ స్థానం జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు, కోడేరు మండలంలో ఎంపీపీ, స్థానం జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి వీటికి పూర్తి భిన్నంగా ఒక్క స్థానం మినహాయిస్తే మిగతా అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఆశావహుల లెక్కలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా స్థానాల్లో పోటీలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు రాజకీయంగా లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీలన్నీ మహిళలకే రిజర్వ్ కావడంతో నాయకులు పోటీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో పడ్డారు. అయినా సరే ప్ర త్యర్థి పార్టీ అభ్యర్థి బలాబలాను బేరీజు వేసుకుని బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. -
ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, కామారెడ్డి: మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు సంబంధించి సామాజిక వర్గాలవారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 22 మండలాల పరిధిలో 236 ప్రాదేశిక స్థానాలు ఉన్నాయి. ఇందులో 123 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయా మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఏ ప్రాదేశిక స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో ఖరారు చేయాల్సి ఉంది. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. జిల్లా ప్రాదేశిక స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వాటి వివరాలు వెల్లడించనున్నారు. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు.. రామారెడ్డి మండలం : 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. సదాశివనగర్ మండలం : 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహ/æళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు కాగా, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు. తాడ్వాయి మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనల్కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. ఎల్లారెడ్డి మండలం : ఎనిమిది మండలపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు. గాంధారి మండలం : 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు రెండు, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు మూడు. లింగంపేట మండలం : 14 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. నాగిరెడ్డిపేట మండలం : 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. బాన్సువాడ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలు. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. బీర్కూర్ మండలం : ఏడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జ నరల్కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. నస్రుల్లాబాద్ మండలం : ఎనిమిది స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు. జుక్కల్ మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు. మద్నూర్ మండలం : 17 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు రెండు, ఎస్సీ జనరల్‌కు రెండు, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు నాలుగు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. నిజాంసాగర్ మండలం : 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. పెద్దకొడప్గల్ మండలం : ఆరు స్థానాలున్నాయి. ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. బిచ్కుంద మండలం : 14 ఎంపీటీసీ స్థానా లున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళ కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు, జనర ల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు. పిట్లం మండలం : 13 స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు రెండు స్థానాలు, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు మూడు స్థానాలు. సామాజిక వర్గాలవారీగా.. జిల్లాలో ఎస్టీలకు 21 ఎంపీటీసీ స్థానాలు కేటాయించగా.. అందులో మహిళలకే 16 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఐదు స్థానాలు మాత్రమే ఎస్టీ జనరల్‌కు మిగిలాయి. ఎస్సీలకు 39 స్థానాలు కేటాయించగా.. 19 స్థానాలు ఎస్సీ మహిళలకు, 20 స్థానాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. బీసీలకు 63 స్థానాలు కేటాయించగా.. బీసీ మహిళకు 36 స్థానాలు బీసీ జనరల్‌కు 27 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మిగతా 113 స్థానాలలో 52 స్థానాలు జనరల్ మహిళకు, 61 స్థానాలు జనరల్‌కు ఉన్నాయి. కామారెడ్డి మండలం: ఆరు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్‌రిజర్వుడు రెండు. భిక్కనూరు మండలం : 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి.. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు మూడు, బీసీ జనరల్‌కు రెండు, జనరల్ మహిళకు మూడు, అన్‌రిజర్వుడు నాలుగు స్థానాలు. బీబీపేట మండలం : ఏడు స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, అన్ రిజర్వుడు రెండు. దోమకొండ మండలం : తొమ్మిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, బీసీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు రెండు, అన్‌రిజర్వుడు రెండు స్థానాలు. రాజంపేట మండలం : 8 స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు 1, ఎస్సీ మహిళకు 1, బీసీ మహిళకు 1, బీసీ జనరల్‌కు 1, జనరల్ మహిళకు 2, అన్‌రిజర్వుడు 2. మాచారెడ్డి మండలం : 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళకు రెండు, జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు మూడు, జనరల్‌కు మూడు స్థానాలు. -
ఎంపీటీసిల లెక్క తేలింది..!
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) లెక్క తేలింది. సవరించిన జాబితా ప్రకారం ఎంపీటీసీల సంఖ్య 177గా నిర్ధారించారు. జిల్లాలో కలిసిన గుండాలతో కలుపుకుని 17 మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాలను రూపొందించారు. తుది జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను 16 మండలాలతో ఏర్పాటు చేశారు. అయితే పాత మండలాలు 14 మాత్రమే ఉండగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతోపాటు జిల్లాలో మోటకొండూరు, అడ్డగూడురు రెండు నూతన మండలాలు ఏర్పాటు చేశారు. మూడు మండలాలు అదనంగా చేరడంతో జిల్లాలో ప్రస్తుతం మండలా సంఖ్య 17కు చేరింది. ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 17 మండలాలతో కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. 3,500 జనాభాకు ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తక్కువగా ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ముందుగా జారీ చేసిన ముసాయిదా పై పలు అభ్యంతరాలు వచ్చాయి. ఎంపీటీసీల్లో విలీనమైన గ్రామాల మధ్యన దూరం తగ్గించాలని, ఓటర్ల సంఖ్యను 3,500 నుంచి 2000 కు తగ్గించాలంటూ సుమారు 20 అభ్యంతరాలు వచ్చాయి. 177 ఎంపీటీసీలు నూతన ముసాయిదా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలను ఖరా రయ్యాయి. గతంలో జిల్లాలో 207 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 177కు తగ్గిపోయాయి. మేజర్ గ్రామపంచాయతీలైన ఆలే రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలుగా మారాయి. భువనగిరి మున్సిపాలిటీలో రాయిగిరి, బొమ్మాయపల్లి, పగిడిపల్లి గ్రామాలు ఇలా మొత్తం మున్సిపాలటీల్లో 17 పంచాయతీలు విలీనం అయ్యాయి. గతంలో 2,500 మందికి ఒక ఎంపీటీసీ స్థానం ఉండగా ప్రస్తుతం 3,500కు పెంచారు. కాగా జిల్లాలో వలిగొండ మండలంలో17 అత్యధికంగా ఎంపిటీసీలు ఉండగా,మోత్కూరులో అతి తక్కువగా 4 ఎంపిటీసీలు ఉన్నాయి. ఆలేరు అడ్డగూడురు, మోటకొండూరులో ఏడేసీ చొప్పున ఎంపీటీసీలు ఉండగా, ఆత్మకూర్(ఎం) లోఎనిమిది ఎంపిటీసీ స్థానాలుఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. ఎంపీటీసీ,జెడ్పీటీసీల సంఖ్య ఖరారు కావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది.రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడు ఆదేశించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు జాబితాలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేస్తోంది. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు ఆలేరు 7, భువనగిరి 13, బీబీనగర్ 14 , బొ మ్మలరామారం 11, చౌటుప్పల్ 12, మోట కొండూర్ 7, మోత్కూర్ 4, నారాయణపురం13, రాజాపేట 11, వలిగొండ 17, యాద గిరిగుట్ట 9, ఆత్మకూర్ 8, భూదాన్‌పోచంపల్లి 10, అడ్డగూడూరు 7, రామన్నపేట 15, తుర్కపల్లి 10, గుండాల 9 ఉన్నాయి. రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి భువనగిరి(వలిగొండ) : జిల్లాలో చాలా మం దికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదని వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. వలిగొండలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చాలా మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేదన్నారు. దీంతో వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రానివారందరికీ వెంటనే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వేముల మహేందర్, మా టూరి బాలరాజు, చిర శ్రీశైలంరెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, ముగిలి పాక గోపాల్, కృష్ణ, అంజనేయులు, సత్తిరెడ్డి, కిష్టయ్య, రాంచందర్ పాల్గొన్నారు. 3న భాషా పండితుల సమావేశం భువనగిరిటౌన్ : హైదరాబాద్‌లోని కొత్తపేటలో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఈనెల 3వ తేదీన భాషా పండితుల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జీడిపల్లి సైదులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలుగు, హిందీ ఉర్దూ పండిట్లతో పాటు పీఈటీలందరూ హాజరుకావాలని కోరారు. -
ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోని ఎంపీటీసీ స్థానాలతో పోలిస్తే ఇప్పుడు 493 స్థానాలు తగ్గనున్నాయి. 3,500 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేశారు. ఉమ్మడి 9 జిల్లా ల పరిధిలో మొత్తం 6,473 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పుడు 5,977కి తగ్గనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 535 జడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర కు సోమవారం ముసాయిదా ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది. రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. పట్టణ స్వరూప మున్న మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. మార్చి 30న పంచాయతీవార్డులవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ నియోజకవర్గాల సంఖ్య అత్యధికంగా 98 పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 89 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. -
లెక్క తేలుస్తున్నారు!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మరో ఎన్నికల సమరానికి అ«ధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సంకేతాలు వస్తున్నాయి. ఇదేకాకుండా ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై నెలతో ముగియనుంది. ఇక ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్నాయి. మే నెలాఖరులోగా ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాల కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు.. అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వీటిని పరిశీలించి సోమవారం తుది జాబితా ప్రచురించనున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మండలలకు నూతనంగా జెడ్పీటీసీ నియోజకవర్గం ఏర్పాటు చేయాల్సి చేయనున్నారు. అందులో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎంత జనాభా ఉంటందనే వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మండల జనాభాను 3,500 తో భాగించి వచ్చే సంఖ్యను ఎంపీటీసీ స్థానాలుగా గుర్తిస్తారు. అంటే ప్రతీ ఎంపీటీసీ నియోజకవర్గంలో 3 వేల నుంచి 4 లోపు జనాభా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే 6 వేల వరకు కూడా జనాభాతో కూడా ఎంపీటీసీ స్థానం ఏర్పాటుచేస్తారు. ఇలా చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను 22వ తేదీ వరకు స్వీకరించారు. ఇక వచ్చిన అభ్యంతరాలను శని, ఆదివారాల్లో పరిశీలించి సోమవారం తుది జాబితా వెల్లడించనున్నారు. 25లోగా ప్రతిపాదలు కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ప్రతిపాదనలను పూర్తిచేసి ఈనెల 25లోగా పంపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఆ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల వచ్చే నెలాఖరులోగా ఖరారు చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇటీవల గ్రామపంచాయతీలకు అమలు చేసినట్లు రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా ఖరారు చేయనున్నారు. ఇక గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్, ఎస్పీల నివేదికకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. 950 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా పరిదిలోని 6 జిల్లా వ్యాప్తంగా 950 ఎంపీటీసీ స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉండగా ఆ ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్థారించారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2014లో 982 ఎంపీటీసీ స్థానాలు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ప్రభుత్వం నూతన జిల్లాలతోపాటు మండలాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మండలాల సంఖ్య 84కు చేరడంతో అదే సంఖ్యలో జెడ్పీటీసీల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. పెరిగిన జెడ్పీటీసీలు.. తగ్గిన ఎంపీటీసీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 జెడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో 64గా ఉన్న మండలాల సంఖ్య 84కు చేరిన విషయం విదితమే. దీంతో ప్రతీ మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేస్తూ డ్రాఫ్ట్ విడుదల చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముసాపేట, రాజాపూర్, గండీడ్(రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ.దొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణా, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు ఏర్పాడ్డాయి. వీటికి కూడా అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ మేరకు ఆయా స్థానాలు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 950కి తగ్గింది. అంటే 32 స్థానాలు తగ్గాయి. ఎంపీటీసీ స్థానాలు ఉన్న ప్రాంతాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఓటరు జాబితాల తయారీ ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడినా పాత జిల్లా పరిషత్, వాటి పరిధిలోని మండల పరిషత్‌లో కాలపరిమితి ముగియలేదు. దీంతో వాటి విభజన చేపట్టలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో పాతవి 64 మండలాలు ఉండగా అందుకు అనుగుణంగా జెడ్పీటీసీలు, 982 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయలని కలెక్టర్లను పంచాయతీ శాఖ ఆదేశించింది. -
జెడ్పీటీసీలు.. 21 ఎంపీటీసీలు: 258
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పరిధి తగ్గింది. జిల్లాల పునర్విభజనతో జెడ్పీటీసీల సంఖ్యతోపాటు.. మండల ప్రాదేశిక స్థానాల సంఖ్యకు కూడా కోత పడింది. చాలా గ్రామాలు పురపాలనలో విలీనం కావడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో జెడ్పీటీసీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లా ప్రాదేశిక స్థానాలుండగా తాజాగా కేవలం రంగారెడ్డి జిల్లా వరకే చూస్తే ఈ సంఖ్య 21 పరిమితమైంది. ఎంపీటీసీల విషయానికి వస్తే.. పాత జిల్లాలో 753 ఉండగా ప్రస్తుతం మన జిల్లాలో 258 ఎంపీటీసీలు మిగిలాయి. ఒక్క కొత్త రంగారెడ్డి జిల్లాలోనే 116 ఎంపీటీసీలకు కత్తెర పడింది. రాజేంద్రనగర్, సరూర్‌నగర్ గ్రామీణ మండలాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడంతో పాటు శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. వీటిలో పరిసర గ్రామాలు కలవడంతో మండల ప్రాదేశిక స్థానాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో పాలమూరు జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో సమీపంలోని కొన్ని గ్రామాల ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. ముసాయిదా రెడీ ప్రస్తుత జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి జులై మొదటి వారంలో ముగియనుండగా.. ఆ లోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు పట్టణ ప్రాంత ప్రాంతాలు కావడంతో వీటిని పంచాయతీరాజ్ విభాగం నుంచి తొలగించారు. ఇలా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో 71 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగు అయ్యాయి. ఇక కొన్ని గ్రామాలు నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆమనగల్లు, శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఎంపీటీసీలు కలిసిపోయాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా కడ్తాల్, చౌదిరిగూడ, నందిగామ మండలాలుగా అవతరించాయి. ఈ మండలాల్లో నూతనంగా 28 ఎంపీటీసీ స్థానాలు తోడయ్యాయి. అలాగే ఫరూఖ్‌నగర్‌లో అదనంగా ఒక స్థానం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముసాయిదా జాబితా ప్రకారం కొత్త రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 258కి తగ్గింది. 21 జెడ్పీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల సంఖ్య కుదింపుకాగా జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి పెరిగింది. ప్రస్తుతం కొత్త జిల్లా ప్రకారం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ముసాయిదా జాబితాను అనుసరించి ఈ సంఖ్య 21కు చేరుకుంది. పట్టణీకరణ కారణంగా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ స్థానాలు గల్లంతుకాగా.. కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ జెడ్పీటీసీ స్థానాలుగా అవతరించనున్నాయి. 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ మండలాల ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ధిష్ట జనాభా ఒక పంచాయతీలోనే ఉంటే.. ఆ గ్రామాన్ని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా విభజించారు. వీటిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే ఎంపీటీసీ స్థానంగా నిర్ణయిస్తారు. 25న తుది జాబితా 258 ఎంపీటీసీ, 21జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 22 వరకు ఉంది. అందిన అభ్యంతరాలను 23, 24 తేదీల్లో పరిష్కరించి 25వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేస్తారు. -
టీడీపీ నేత ఉద్యోగం ఇప్పిస్తానని..
-
టీడీపీ నేత మోసం.. ఉద్యోగం ఇప్పిస్తానని..
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికార పార్టీ అండచూసుకుని కొందరు నేతలు మోసాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ టీడీపీ ఎంపీటీసీ ఆమె వద్దనుంచి లక్షలు కాచేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ పెద్దాడ వెంకటరమణ అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంతోష కుమారి అనే మహిళ దగ్గర 4లక్షలు వసూలు చేశాడు. డబ్బుతీసుకుని ఉద్యోగం ఇప్పించకపోగా తన బంధువుల మహిళకు ఇప్పించాడు. దీంతో బాధితురాలు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సంతోష కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. -
అసంతృప్తి సెగలు
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ పాలకవర్గంపై అసంతృప్తి సెగలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి పనులు, సభ్యుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థాయి సంఘ సమావేశాలకు హాజరుకావడం లేదు. జిల్లాపరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఇన్చార్జి సీఈఓ రవికుమార్నాయుడి అధ్యక్షతన 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో 3 (వ్యవసాయం కమిటీ), 5 (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ) కమిటీలకు కోరం లేకపోవడంతో వాయిదాపడ్డాయి. మొదట ప్రారంభమైన 1, 7 కమిటీల సమావేశంలో జీఎస్టీ సమస్య ఎక్కువగా ఉందని అనేక సార్లు సమావేశాల్లో చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జెడ్పీ కార్యాలయంలో గణాంకశాఖాధికారి వెంకటరత్నాన్ని నిధుల వివరాలను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. నాణ్యత లేని రోడ్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని అధికార పార్టీ కలకడ జెడ్పీటీసీ తిరుమలనాయుడు సమావేశంలో తేల్చి చెప్పారు. పెండింగ్‌లో ఉన్న నీరు–చెట్టు నిధులు రూ.13 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్అండ్బీ పరిధిలోని మట్టిరోడ్లను బీటీ రోడ్లగా మార్చాలని ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అందుకోసం జిల్లాలో నాబార్డు నుంచి ఫేజ్ –1 లో 13 రోడ్లకు రూ.34.55 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 6వ కమిటీ చైర్పర్సన్ తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసినీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులకు రుణాల కింద అందించే పాడి ఆవులు కేవలం కమిటీల ఆదేశాల మేరకే అందించడం జరుగుతోందన్నారు. కమిటీ, వెటర్నరి డాక్టర్లు కుమ్ముకై రైతులను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్‌ను నియమించి పర్యవేక్షించాలని తీర్మానం చేశారు. కలికిరి జెడ్పీటీసీ మాలతి మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకర్లు రుణాల సబ్సిడీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రన్న పెళ్లికానుక పథకంలో మార్పులు చేసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి పెళ్లిళ్లు చేసుకునే వారికి ఆ పథకం వర్తించేలా చూడాలని సభ్యులు కోరారు. ఎర్రావారిపాళ్యం జెడ్పీటీసీ కుమారస్వామి, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసిని మాట్లాడుతూ తమ మండలంలో ఎస్సీ కమ్యూనిటీ హాలును మంజూరు చేయాలని కోరారు. పనిముట్లు చోరీకి గురైనాపట్టించుకోవడం లేదు.. గంగాధరనెల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం మంజూరు చేసిన పనిముట్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయని వైఎస్సార్సీపీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. ఆ పనిముట్లను స్థానికంగా ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు తీసుకెళ్తున్నట్లు స్థానికులు చూసి తన దృష్టికి సమస్యను తీసుకొచ్చారన్నారు. ఆ విషయంపై అక్కడి పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, తాము ఏమీ చేయలేమని పోలీసులే సమాధానమిస్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఈ విషయంపై డ్వామా పీడీ కుర్మానాథ్, సీఈఓ రవికుమార్ విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదలు బాగుపడాలంటే ఆఫీసర్లు బాగుండాలని.. నిజాయితీగా విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణిని కోరారు. జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వారు తీసుకెళ్లే ట్రాక్టర్ల బాడుగకు కూడా డబ్బులు రావడం లేదని చెప్పారు. తోతాపురి రకం మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లకు ఇచ్చిన విధంగానే ప్రైవేటు మార్కెట్లలో కూడా కిలోకు రూ.7.50 ధరను నిర్ణయించాలన్నారు. -
ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం
మేళ్లచెరువు (హుజూర్నగర్) : ఎంపీటీసీ దంపతులపై హత్యాహత్నం జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చింతలపాలెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చింతలపాలెం ఎంపీటీసీ–2 లకావత్ రామారావు, అతని భార్య తమ్మవరం ఎంపీటీసీ–2 లకావత్ సుభద్ర మేళ్లచెరువులో నివాసముంటున్నారు. చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాకు చెందిన భూక్యా గోపి బుధవారం తెల్లవారుజామున వచ్చి ఇంటి తలుపు తట్టాడు. వారు తలుపులు తీయలేదు. రామారావు నిద్ర లేవలేదని భార్య సుభద్ర చెప్పింది. తిరిగి ఉదయం 7గంటల సమయంలో మళ్లీ వచ్చాడు. పేపరు, పెన్ను కావలని అడిగాడు. సుభద్ర ఇవ్వబోగా ఒక్కసారిగా గోపి ఆమెపై తల్వార్ (కత్తితో) దాడి చేయగా ఆమె చేతికి గాయమైంది. వెంటనే తేరుకున్న ఆమె అక్కడున్న కూర్చీని కత్తికి అడ్డుపెట్టి కేకలు వేయడంతో చట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. దీంతో రామారావును హత్య చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. నాయకులు మేళ్లచెరువు మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు. అక్కడి చేరుకున్న ఎస్ఐ.సత్యనారాయణ నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. నిందితుడు గోపితో పాటు మరో 27 మందిపై ఎంపీటీసీ సుభద్ర ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థాలాన్ని కోదాడ రూరల్ సీఐ రవి పరిశీలించారు. పోలీస్ పికెట్ ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం మండలంలోని పీక్లానాయక్‌తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చింతలపాలెం ఎంపీటీసీలు లకావత్ రామారావు, లకావత్ సుభద్రపై మేళ్లచెరువులో జరిగిన హత్యాత్నం నేపథ్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు. -
ఎంపీటీసీపై హత్యాయత్నం
-
టీఆర్ఎస్ ఎంపీటీసీపై హత్యాయత్నం
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతలపాలెం ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం జరిగింది. చింతలపాలెం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ లకావత్ రామారావుపై మేళ్లచెరువులో కత్తితో దాడి చేశారు. అదే విధంగా రామారావు భార్య సుభద్రపై కూడా నిందితుడు దాడికి దిగాడు. ఈ దాడితో దంపతులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. పాతకక్ష్యలే దాడికి కారణంగా చెబుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు . -
మాపై ఎందుకీ వివక్ష
మహిళలంటే వివక్ష ... ‘ఆ... ఏం చేస్తారు...ఏమి అడుగుతారులే ... మనం ఏదంటే అదే అనే ధీమా’. ఆ అధికార అహంకారమే గత నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రతినిధులైన ఈ మహిళామణులు వినతులతో విజ్ఞప్తులు చేశారు. అవస్థలు...అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించారు. సంబంధిత మండల టీడీపీ ప్రజా ప్రతినిధులు పెడ చెవిన పెట్టారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ... జన్మభూమి కమిటీల కన్నెర్రతోపాటు కలంపోటులకు భయపడి చూసీ చూడనట్టు వ్యవహరించడంతో కొంగు నడుంకు చుట్టి పిడికిలి బిగించారు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన ప్రజావాణిని వేదికగా చేసుకొని బైఠాయించారు. తాము ‘అబలలం కాదు సబలలం’ అని నినదించారు. గోకవరం (జగ్గంపేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీలమైన తమపై అధికారులు వివక్ష చూపుతున్నారని, పింఛన్లు కేటాయించకుండా చులకనగా చూస్తున్నారని మహిళా ఎంపీటీసీలు నిరసన తెలిపారు. గోకవరంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రతిపక్షనేత వరసాల కుమారి, గోకవరం–2 ఎంపీటీసీ కారం నాగమణిలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజావాణి జరుగుతున్న ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలిపారు. దళిత, గిరిజన ఎంపీటీసీలమైన తమ వార్డులకు పింఛన్లు కేటాయించకుండా, రేషన్‌కార్డులు మంజూరు చేయకుండా వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలకే పింఛన్లు పంపిణీ చేసే అధికారం కట్టబెట్టడంతో తమ వార్డులకు చెందిన అర్హులకు పింఛన్లు అందించకుండా వారికిష్టమైన వారికి అందిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలో కనీసం వీధిరోడ్లు వేయడంలేదని, ఇళ్ల స్థలాలు, ఇంటి రుణాలు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఈ చర్యల ద్వారా తమను అవమానపరుస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సైలు జి.ఉమామహేశ్వరరావు, ఎ.తిరుమలరావులు సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కేవలం తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన ఎంపీటీసీలను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం.వెంకటరమణారావు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ అధికారం తనకు లేదన్నారు. జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికే పింఛన్లు అందిస్తున్నామన్నారు. దీనిపై మహిళా ఎంపీటీసీలు, కో ఆర్డినేటర్, ఇతర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రాంతంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసే వరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులకు రేషన్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముత్యం నాని, ఎంపీటీసీ నల్లల వెంకన్నబాబు, నాయకులు కర్రి సూరారెడ్డి, దాసరి ధర్మరాజు, గౌడు లక్ష్మీ, మంగరౌతు శ్రీను, బిజ్జి రాజు, మచ్చా జయలక్ష్మి, తేలు ఈశ్వరి, ఏనుగుపల్లి సుబ్బలక్ష్మి, ఉంగరాల ఆదివిష్ణు, దాకారపు ధర్మరాజు, మైపాల పాండు, ఆండ్రు నాగేంద్రుడు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఎంపీటీసీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 16 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కిష్టాపురంలో 208 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. అదే విధంగా ఎర్రబెల్లిలో 563 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 561 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలిచారు. భద్రాచలం ఎంపీటీసీ ఏడో స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 74 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి స్వరూప గెలుపొందారు. ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. సీపీఎం అభ్యర్థిపై 228 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని కన్మనూర్ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో 382 ఓట్లతో టీఆర్ఎస్ విజయం సాధించింది. ద వనపర్తి జిల్లా గోపాల్ దిన్నె ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై 491 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల ఫలితాలు అందాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాలు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని నేట్నూరు, కౌతాల కరీంనగర్ జిల్లాలోని గంగాధర, అచ్చంపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంకుషాపూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏడో సెగ్మెంట్ ఖమ్మం జిల్లాలోని జక్కేపల్లి మహబూబ్‌నగర్ జిల్లాలోని కన్మానూర్, లింగంపల్లి వనపర్తి జిల్లాలోని గోపాలదిన్నె నల్లగొండ జిల్లాలోని కిష్టాపురం, ఎర్రబెల్లి కామారెడ్డి జిల్లాలోని మద్నూరు 2 రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ, జన్వాడ సిద్దిపేట జిల్లాలోని ఆకునూరు 1 -
నకిలీ డాక్యుమెంట్ల సృష్టి
పటాన్చెరు టౌన్ : నకిలీ ఇళ్ల పత్రాలను సృష్టించిన 11 మందిలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్న సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. శుక్రవారం స్థానిక పటాన్చెరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సీతారాం, అమీన్పూర్ సీఐ రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్సీ తెలిపిన వివరాల మేరకు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ నకిలీ డాక్యుమెంట్లు వ్యవహారం బయటపడిందని, దీనికి సంబంధించిన ఇద్దరు బిల్డర్లు,రిటైర్డ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి, మధ్యవర్తులు, బిల్ కలెక్టర్, ఇందులో ముఖ్య పాత్ర పోషించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ అధికారి ఫిర్యాదు మేరకు నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో బిల్డర్‌గా పనిచేసే దామోదర్, రిటైర్డ్ పంచాయితీ సెక్రెటరీ తిరుమలయ్య, మీడియేటర్లు ఏడుకొండలు, మహేష్, సురేందర్ రెడ్డి, బిల్డర్ లక్ష్మీనారాయణ, కారోబార్ కుంతి నర్సింలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు టీఆర్ఎస్ అమీన్పూర్ ఎంపీటీసీ అనిల్ కుమార్, బిల్డర్ శ్రీనివాస్, మీడియేటర్ లింగారావు, అమీన్పూర్ పంచాయతీ మాజీ సెక్రెటరీ సోమనారాయణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలతో పాటు, నకిలీ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని కూడా త్వరలోనే ఆదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సుమారు 29 ఇళ్లు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మించినట్టు తెలిపారు. -
4 ఓట్లు గల్లంతు.. ఎన్నిక చెల్లదంటూ తీర్పు
నాగర్ కర్నూలు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తాడూరు మండల ఎంపీటీసీ విజయలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు సూచించారు. 2014లో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో న్యాయం కోసం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి రేణుక కోర్టును ఆశ్రయించారు. మొత్తం పోలైన ఓట్లు 2589 కాగా, కౌంటింగ్ అయిన ఓట్లు 2585. నాలుగు ఓట్లు గల్లంతయ్యాయి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మి పై కేవలం 2 ఓట్ల తేడాతో రేణుక ఓడిపోయారు. దీంతో రేణుక 2014లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. -
టీడీపీకి మాజీ ఎంపీటీసీ గుడ్‌బై
నల్లమాడ: మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు డి.కుళ్లాయినాయక్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నల్లమాడలోని 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు కుళ్లాయినాయక్ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం (నేడు) నల్లమాడకు విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. తనతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు వైఎస్సార్సీపీలో చేరతారని పేర్కొన్నారు. -
బాబును నమ్మి మోసపోయాం..
ఆళ్లగడ్డ: ‘ఎన్నికల సమయంలో వాల్మీకులందరినీ ఎస్టీల జాబితాల్లో చేరుస్తామని చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం’ అన్నా అని వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి మహిళా విభాగం నాయకురాలు, ఎంపీటీసీ పుష్పలత వైఎస్‌జగన్‌తో అన్నారు. మంగళవారం బేతంచర్లకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్‌కు ఆమె వాల్మీకి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ‘వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు తాము నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని ఆమె వైఎస్జగన్ను కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ దీనిపై విచారించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకులు భువనేశ్వరి, సులోచన, నాగజ్యోతి తదితరులు ఉన్నారు. -
ఎంపీటీసీలకు ఏటా రూ.20 లక్షల నిధులివ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని ఎంపీటీసీల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం ఎంపీటీసీలకు ఏటా రూ.20 లక్షల నిధులివ్వాలని ఆ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలు, నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థలకే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు ఎంపీటీసీలకు ఏదైనా జరిగితే రూ.20 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. -
ఎంపీటీసీలకు ‘బాబు’ ఝలక్!
సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు నెరవేర్చలేదని రైతులు, డ్వాక్రా సభ్యులు, యువత, నిరుద్యోగులు ఇప్పటికే రగిలిపోతున్నారు! అలాంటి సామాన్యులకే కాదు రాజకీయ నాయకులకూ ఝలక్ తగిలింది! స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎంపీటీసీల గౌరవవేతనం పెంపు తాయిలం కూడా హుష్‌కాకి అయ్యింది! నెలనెలా ఇస్తున్న రూ.750 వేతనం ఏకంగా రూ.3 వేలకు పెంచామని, మూణ్నెల్ల మొత్తాన్ని ఒకేసారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని టీడీపీ నాయకులు ఢంకా భజాయించి చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ఎంపీటీసీ సభ్యులకు తెలిసిందేమిటంటే.. తాము మోసపోయామని! సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గత నెలలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక సంస్థల కోటా సీట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం ముగియడంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు నగరపాలక, పురపాలక సంఘాల సభ్యులకు ఓటుహక్కు ఉంటుంది. వారిలో ఎంపీటీసీల ఓట్లే అధికం. అభ్యర్థి విజయాన్ని శాసించేదీ వారే! ఇది ముందే గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం ఎంపీటీసీల నెలవారీ గౌరవ వేతనం రూ.750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతకు కొన్నాళ్ల ముందే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు పంపింది చంద్రబాబు ప్రభుత్వమే! అంతేకాదు రాజ్యాంగ స్ఫూర్తికి గండికొడుతూ జన్మభూమి కమిటీలను తమ నెత్తినపెట్టారని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఇప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలకు గౌరవ వేతనం పెంపు... అదీ మూడు రెట్లు పెంచారంటేనే అమలుపై పలువురిలో సందేహం కలిగింది! ఎన్నికల తాయిలం కదా! కచ్చితంగా అమలవుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ముందే చెల్లించేస్తామని చెప్పి... గౌరవ వేతనం పెంపుపై ఎంపీటీసీలకు అనుమానం వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీన్ని ఊహించిన అధికార పార్టీ నాయకులు... గౌరవ వేతనం మూణ్నెల్లదీ ఒకేసారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిపోతుందని నమ్మించారు. వాస్తవానికి మార్చి నెల వేతనం ఏప్రిల్‌లో జమ కావాలి. కానీ జనవరి నుంచి మార్చి వరకూ అంటే మూణ్నెల్లదీ ఒకేసారి రూ.9 వేల చొప్పున వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం జిల్లాలోని 676 మంది ఎంపీటీసీ సభ్యులకు రూ. 60.84 లక్షలు అందాలి. ఆ మేరకు జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) నుంచి జిల్లా ట్రెజరీకి నిధులు వెళ్లాయి. అక్కడి నుంచి సబ్ ట్రెజరీలకు చేరాయి. ఇక బ్యాంకు ఖాతాల్లో జమే తరువాయి కావడంతో మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎంపీటీసీలు ఎదురు చూశారు. తెల్లారితే ఏప్రిల్ ఒకటో తేదీ! వెనక్కి మళ్లిన నిధులు.. ఈ మూడు నెలల గౌరవ వేతనం నిధులు జిల్లా ట్రెజరీకి పంపినా రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే చెల్లింపులు నిలిపేయాలంటూ అనధికార ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించింది. దీని ఫలితంగా గౌరవ వేతనం ఎంపీటీసీల బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు. అంతేకాదు ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో ఆ నిధులు కాస్తా వెనక్కిమళ్లిపోయాయి. దీంతో ఎంపీటీసీలకు నిరాశే మిగిలింది. ఖాతాల నంబర్లు తీసుకుంటే నమ్మాం మాకు రావాల్సిన గౌరవ వేతనం కూడా కొన్ని నెలలుగా రావట్లేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వేతనం పెంపు అని ప్రకటించారు. మా బ్యాంకు ఖాతా ల నంబర్లు కూడా తీసుకుంటే నమ్మాం. తీరా ఇప్పటికీ చెల్లింపులు లేవు. – బొత్స పుష్ప, ఎంపీటీసీ, వెలగవాడ, పాలకొండ మండలం ఎన్నికల లబ్ధి కోసమే హామీ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టెక్కడం కోసం గౌరవ వేతనం పెంపు ప్రకటించారు. తీరా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఒకపక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థనే రద్దు చేయాలని చూస్తున్న చంద్రబాబు అంతకన్నా మేలు చేస్తారని ఊహించలేం. – నడుపూరు శ్రీరామమూర్తి, ఎంపీటీసీ, నందిగాం–2 -
ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి
మండలి ప్రత్యేక ప్రస్తావనల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనల సందర్భంగా ఎంపీటీసీల సమస్యలను ఆయన ప్రస్తావిం చారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించి, ఎస్ఎఫ్సీ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు. మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి మరమ్మత్తు పనులు వెంటనే పూర్తిచేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కామారెడ్డిలోని డైరీ కోర్సులు నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాలను పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. -
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు
తహసీల్దారు ఎదుట స్పష్టం చేసిన గండవరం ఎంపీటీసీ కొడవలూరు: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కొడవలూరు మండలం గండవరం ఎంపీటీసీ సభ్యుడు ఎందోటి శ్రీనివాసులు తహసీల్దారు రామకృష్ణ ఎదుట సోమవారం రాత పూర్వకంగా తెలియజేశారు. గండవరం ఎంపీటీసీ సభ్యుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యుడే స్వతహాగా సోమవారం ఉదయం తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు ఇక్కడికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యుడు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే స్వతహాగా వ్యక్తిగత అవసరాలపై గత కొద్దిరోజులుగా గ్రామంలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో తెలపాలని కోరారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనందున తాను స్టేట్మెంట్ తీసుకోకూడదంటూ తహసీల్దారు దాటవేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకుని మండల మేజిస్ట్రేట్‌గా ప్రజలు కోరితే తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, ఒక వేళ తీసుకునేందుకు వీలులేని పక్షంలో ఆ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేయాలని తహసీల్దారును కోరుతూ కోట మండలంలో జరిగిన ఇదే ఉదంతాన్ని గుర్తు చేశారు. అనంతరం నెల్లూరు ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడిన తహసీల్దారు ఎంపీటీసీ సభ్యుని నుంచి రాత పూర్వక స్టేట్మెంట్ తీసుకున్నారు. తానే స్వతహాగా సొంత పనులపై వెళ్లానే తప్ప ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆ విషయాన్ని స్టేషన్ ఎస్ఐకి దృష్టికి తీసుకుపోవాలని అందులో ఎంపీటీసీ సభ్యుడు కోరారు. ఆ స్టేట్ మెంట్ కాపీని తహసీల్దారు ధ్రువీకరించాక ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నాయకుడు రూప్‌కుమార్ యాదవ్ తదితరులున్నారు. -
804 మంది ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు
కర్నూలు(అర్బన్): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 804 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. మొత్తం 815 మంది ఎంపీటీసీ సభ్యులగాను 9 మంది మృతి చెందారు. వివిధ కారణాలతో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును కోల్పోయారు. దీంతో మిగిలిన 804 మంది ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓర్వకల్లు మండలం కన్నమడకల, ప్యాపిలి మండలం ఊటకొండ, ప్యాపిలి–1, నందవరం–3, హాలహర్వి మండలం గూళ్యం –2, కోడుమూరు మండలం లద్దగిరి –2, ఆదోని మండలం కపటి, కోసిగి మండలం జుమాల్‌దిన్నె, కోసిగి–6 ఎంపీటీసీ సభ్యులు మృతి చెందారు. నంద్యాల పెద్ద కొట్టాల ఎంపీటీసీ ఎన్నిక జరగలేదు. వెలుగోడు ఎంపీటీసీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవి నుంచి తొలగించారు. -
నిద్రాణంగా ‘పరిషత్’ వ్యవస్థ!
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేవ్.. విధుల్లేవ్.. అధికారాలూ లేవ్.. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ వ్యవస్థల దుస్థితి ఇదీ. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ప్రజలతో నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వీస మెత్తు విలువ లేదు. ప్రభుత్వం చేపడుతున్న గ్రామజ్యోతి, ఉపాధిహామీ, ఇందిరాక్రాంతి పథకం కార్యక్రమాల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయలేక పోవడం వల్ల, ప్రజల్లో వారిపట్ల ఒక విధమైన చులకనభావం ఏర్పడుతోంది. స్థానిక సంస్థ లకు 29 ప్రభుత్వ విభాగాలపై ఆజమాయిషీ కల్పించాలని, ఈ మేరకు అధికారాలను బదలాయించాలని రాజ్యాంగం చెబుతున్నా, గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 14వ ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందు తుండటంతో మండల, జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల్లేకుండా పోయాయి. తెలం గాణలో ఎస్‌ఎఫ్‌సీని గతేడాది ఏర్పాటు చేసినా నేటివరకు దానికి చైర్మన్‌నుగానీ, సభ్యులను గానీ ప్రభుత్వం నియమించలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సర్పం చులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలే వారికిష్టమైన రీతిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క పైసా కూడా ప్రభు త్వాలు కేటాయించకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌లు నిద్రాణంగా మారాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. రాష్ట్రంలోని 5,850 మంది ఎంపీటీసీలు, 456 మంది ఎంపీటీసీలకు వేతన బకాయిల నిమిత్తం రూ.18.12 కోట్లు విడుదల చేస్తూ గత అక్టో బర్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు అమలుకు నోచుకో లేదు. మరోవైపు మండల పరిషత్‌లకు నిధు ల్లేక ఆయా మండలాల్లో అభివృద్ధి పనులేమీ జరగకపోయినా సిబ్బందికి వేత నాల ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. ఆందోళన బాట పడతాం పరిషత్ వ్యవస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయింది. గ్రామ జ్యోతిలో భాగస్వాములను చేస్తామని కరీంనగర్‌సభలో సీఎం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయింది. గతంలో ఇందిరాక్రాంతి, ఉపాధిహామీ పథకం సిబ్బంది ఎంపీటీసీల ఆధ్వర్యంలోనే పని చేసేవారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో పాలన ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల చేతుల్లోకి పోయింది. పరిషత్ వ్యవస్థలపై ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా త్వరలోనే ఆందోళనబాట పట్టాలని నిర్ణయించాం. – యు. మనోహర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి
కృష్ణగిరి: మండల పరిధిలోని చిట్యాల ఎంపీటీసీ సభ్యుడు చిన్న మాదన్నతోపాటు పైగేరి రంగనాయకులు, కమ్మరి వెంకటేశ్వర్లు, పెద్దనాగన్న, తురుక పెద్దలాలు, వంకాయల రంగన్న, తురక అబ్దుల్లాబాషా, మాదిగ పెద్ద అచ్చన్న, కేశన్న, మేకల సత్తన్న, దాసరి శేషయ్య, కొత్తరాముడుతోపాటు మరో 30మంది టీడీపీ నుంచి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు లక్ష్మినారాయణరెడ్డి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. 2014ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ పోటీ చేసిన గెలిచిన చిన్నమాదన్న ఆ తర్వాత టీడీపీలో చేరడం తెలిసిందే. అయితే అక్కడ ఆ పార్టీ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, యూత్ అధ్యక్షుడు లక్ష్మికాంతరెడ్డి, చిట్యాల నాయకులు సుధాకర్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ మాజీ సభ్యుడి దారుణ హత్య
► పొలంలో కత్తులతో పొడిచి చంపిన దుండగులు ►గిద్దలూరు మండలం గడికోట శివారులో ఘటన.. గిద్దలూరు రూరల్ :ఎంపీటీసీ మాజీ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యూడు. ఆయన పొలంలో ఉండగా దుండగులు కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన మండలంలోని గడికోట గ్రామ శివారు పొలంలో సోమవారం వేకువ జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గడికోటకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ధనపాటి రమణ (38) గ్రామ శివారులో ఉన్న తన వరి పంటకు కాపలా కోసం ఇంటి నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు బయల్దేరి వెళ్లాడు. పంట పొలం వద్ద నిద్రిస్తున్న రమణపై దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచారు. అనంతరం గొంతు వద్ద రెండు చోట్ల నరికారు. ఊపిరి పోరుున అనంతరం రమణ మృతదేహాన్ని వరి పైరులో పడేసి వెళ్లిపోయారు. భర్తను వెతుక్కుంటూ వెళ్లిన భార్య పొలానికి రాత్రి వెళ్లిన భర్త ఉదయమైనా ఇంటికి రాకపోవడంతో భార్య సుజాత వెతుక్కుంటూ పొలానికి వెళ్లింది. అక్కడ భర్త రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించడంతో కన్నీటిపర్యంతమైంది. తన భర్తను చంపారంటూ కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించింది. రమణ గతంలో కలప వ్యాపారం చేశాడు. గ్రామంలో ఎవరితోనూ వివాదం లేదు. ఘర్షణలకు దూరంగా ఉంటాడు. రమణను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందా.. అని గ్రామస్తులు, పోలీసులు చర్చించుకుంటున్నారు. రమణకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విషయం తెలుసుకున్న మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రమణ హత్యకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సంఘటన స్థలం చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఎటువంటి ఆధారాలూ లభించలేదు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ పోయిన త ర్వాతే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల చుట్టూ ఉన్న రైతుల వివరాలు సేకరించారు. హత్యకు కారణాలు పాతకక్షలా? కలప వ్యాపారంలో లావాదేవిలా? వివాహేతర సంబంధాలా? అన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీఎస్పీతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్సై కె.మల్లికార్జున, కానిస్టేబుళ్లు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
లేఖ కలకలం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ గ్రామపాలన అధ్వానంగా మారుతుందంటున్న నేతలు కేంద్రం ఆమోదిస్తే జిల్లాలో 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులకు ఎసరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం జిల్లాలో కలకలం రేపింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లాలోని 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులు రద్దవుతాయి. అదే జరిగితే గ్రామ పాలన మరింత అధ్వానంగా మారుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మండపేట : పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మూడంచెలు ఉండేవి. గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ ఉండేవారు. పరిపాలన సౌలభ్యం కోసం 1994లో అప్పటి ప్రభుత్వం మూడంచెల స్థానంలో ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం పై ముగ్గురితోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా తోడయ్యారు. మండల పరిషత్ నుంచి ఎంపీటీసీ సభ్యులకు, జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులు జరిగేవి. వారు తమ పరిధిలో అభివృద్ధి పనులకు ఆ నిధులు వెచ్చించేవారు. తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జెడ్పీ సమావేశాల్లో ఆయా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఫలితంగా గ్రామ పాలనలో సౌలభ్యం మరింత పెరిగింది. ఇటువంటి కీలక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దయితే గతంలో మాదిరిగా సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు మాత్రమే కొనసాగుతాయి. గ్రామస్థాయిలో ఎన్నికైన సర్పంచులు మండల స్థాయిలో ఎంపీపీలను ఎన్నుకుంటే, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేవిధంగా మూడంచెల విధానం ఉంటుంది. కాగా, దాదాపు ఆరు నెలలుగా ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపును నిలిపివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తం ఆ పదవుల రద్దుకే పావులు కదుపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు.. నేడు ఆ పదవులనే రద్దు చేయాలని లేఖ రాయడం ఆయన కుట్ర పూరిత రాజకీయాలకు నిదర్శనం. అధికార వికేంద్రీకరణ జరగకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొన్ని అధికారాల బదలాయింపులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు, విధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే వ్యవస్థ ఇది. దీనిని రద్దు చేయాలనుకోవడం దురదృష్టకరం. – సాకా ప్రనన్నకుమార్, జెడ్పీ ప్రతిపక్ష నేత, రావులపాలెం సరైన ఆలోచన కాదు జెడ్పీటీసీ, ఎంపీటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచన సరైంది కాదు. నాలాంటి గృహిణులు ఈ వ్యవస్థ వల్లే జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నిక కాగలుగుతున్నారు. మండల వ్యవస్థలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆ మండల స్థాయి అభివృద్ధి కోసం చర్చించుకుంటారు. మండలాల్లో జిల్లా పరిషత్ పనులు, నిధులకు సంబంధించి చర్చించేందుకు కచ్చితంగా మండలం నుంచి ఎన్నికయ్యే జెడ్పీటీసీ సభ్యుడు ఉన్నప్పుడే వాటికి సరైన న్యాయం జరుగుతుంది. – అధికారి జయవెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, అమలాపురం రూరల్ పరిషత్తుల్లో ప్రాతినిధ్యం తొలగించేందుకే.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేదిగా ఉంది. ఐదంచెల పరిపాలనతో గ్రామాభివృద్ధే ఆశయంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తే పాలన స్థంభిస్తుంది. గ్రామాల నుంచి మండల, జిల్లా పరిషత్‌లలో ప్రాతినిధ్యం తొలగించేందుకే ఈ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం పూనుకుంటోంది. – పల్లేటి నీరజ, ఎంపీపీ, తుని -
స్థలం కనపడితే కబ్జానే.....
–అధికార పార్టీ ఎంపీటీసీ దౌర్జన్యం –దళితులపై దాడి జరిగినా పట్టించుకోని పోలీసులు –బాధితులకు జరగని న్యాయం సాక్షి ప్రతినిధి, ఏలూరు ః బలహీనులైతే చాలు వారి పేరుతో ఉన్న భూములను ఏదోవిధంగా సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వెనకాడటం లేదు. అవసరమైతే వారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు. ఈ దాడులపై విడియో సాక్ష్యం ఉన్నా కొంతమంది పోలీసు అధికారులు స్పందించడం లేదు. తమ బంధువులపై దాడి జరుగుతోందని ఎస్ఐకి ఫోన్ చేస్తే నువ్వు వెళ్లి విడదీయమంటూ ఉచిత సలహా ఒక్కటి ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి బంధువు అని చెప్పుకుంటున్న ఆ అధికారి తెలుగుదేశం పార్టీ నేతల కన్నా ఎక్కువగా స్పందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ... వివరాల్లోకి వెళ్తే.... లింగపాలెం మండలం కె. గోకవరం శివారు అన్నపనేనివారి గూడెం గ్రామానికి చెందిన రాచప్రోలు రమణమ్మకు సర్వే నెంబర్ 317–3డిలో 64 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో గత 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు, వారికి మద్దతుగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కలిసి ఈ భూమిని ఆక్రమించారు. దీంతో బాధితురాలు జిల్లా కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో వారు తమ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. మరుసటిరోజున ఎంపీటీసీ, ఇతరులు జెసీబీ సాయంతో వీటిని తొలగించారు. అడ్డువెళ్లిన వారిపై దాడి చేశారు. దళిత మహిళ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చేశారు. వారి పనులను అడ్డుకున్న రమణమ్మను స్థంబాల కోసం వేసిన గోతిలోనే ఉంచి పూడ్చివేసే ప్రయత్నం ఎంపీటీసీ చేశారు.ఈ తతంగమంతా స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. పైగా ప్రత్యర్ధులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని æ ఎదురు కేసులు పెట్టారు. గొడవ జరిగిన రోజున గ్రామంలో లేనివారిపై కూడా కేసులు పెట్టారు. దీంతో బాధితులు గత నెల నాల్గవ తేదీన దర్మాజీగూడెం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదే నెల ఏడున ఎస్ఐ బా«ధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఆ భూమిని వదులుకోకపోతే అందరిపై కేసులు కట్టి రిమాండ్‌కు పంపిస్తానని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులను స్టేషన్లోనే ఉంచి అదే రోజున ఆ స్థలంలో ప్రత్యర్ధులు మట్టి తోలించారు. ఆ స్థలంలో చిన్న షెడ్ వేసి అక్కడ ప్రజావైద్యశాల అంటూ బోర్డు పెట్టారు. గత నెల 4న దాడి జరిగినా ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదు. ప్రత్యర్ధులను అరెస్టు కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ పురోగతి లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారు తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో ఎస్ఐ కూడా వారికి సహకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తమ ప్రాణాలకు హాని కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
స్థలం కనపడితే కబ్జానే
–అధికార పార్టీ ఎంపీటీసీ దౌర్జన్యం –దళితులపై దాడి జరిగినా పట్టించుకోని పోలీసులు –బాధితులకు జరగని న్యాయం సాక్షి ప్రతినిధి, ఏలూరు ః బలహీనులైతే చాలు వారి పేరుతో ఉన్న భూములను ఏదోవిధంగా సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వెనకాడటం లేదు. అవసరమైతే వారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు. ఈ దాడులపై విడియో సాక్ష్యం ఉన్నా కొంతమంది పోలీసు అధికారులు స్పందించడం లేదు. తమ బంధువులపై దాడి జరుగుతోందని ఎస్ఐకి ఫోన్ చేస్తే నువ్వు వెళ్లి విడదీయమంటూ ఉచిత సలహా ఒక్కటి ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి బంధువు అని చెప్పుకుంటున్న ఆ అధికారి తెలుగుదేశం పార్టీ నేతల కన్నా ఎక్కువగా స్పందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ... వివరాల్లోకి వెళ్తే.... లింగపాలెం మండలం కె. గోకవరం శివారు అన్నపనేనివారి గూడెం గ్రామానికి చెందిన రాచప్రోలు రమణమ్మకు సర్వే నెంబర్ 317–3డిలో 64 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో గత 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు, వారికి మద్దతుగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కలిసి ఈ భూమిని ఆక్రమించారు. దీంతో బాధితురాలు జిల్లా కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో వారు తమ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. మరుసటిరోజున ఎంపీటీసీ, ఇతరులు జెసీబీ సాయంతో వీటిని తొలగించారు. అడ్డువెళ్లిన వారిపై దాడి చేశారు. దళిత మహిళ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చేశారు. వారి పనులను అడ్డుకున్న రమణమ్మను స్థంబాల కోసం వేసిన గోతిలోనే ఉంచి పూడ్చివేసే ప్రయత్నం ఎంపీటీసీ చేశారు.ఈ తతంగమంతా స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. పైగా ప్రత్యర్ధులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని æ ఎదురు కేసులు పెట్టారు. గొడవ జరిగిన రోజున గ్రామంలో లేనివారిపై కూడా కేసులు పెట్టారు. దీంతో బాధితులు గత నెల నాల్గవ తేదీన దర్మాజీగూడెం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదే నెల ఏడున ఎస్ఐ బా«ధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఆ భూమిని వదులుకోకపోతే అందరిపై కేసులు కట్టి రిమాండ్‌కు పంపిస్తానని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులను స్టేషన్లోనే ఉంచి అదే రోజున ఆ స్థలంలో ప్రత్యర్ధులు మట్టి తోలించారు. ఆ స్థలంలో చిన్న షెడ్ వేసి అక్కడ ప్రజావైద్యశాల అంటూ బోర్డు పెట్టారు. గత నెల 4న దాడి జరిగినా ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదు. ప్రత్యర్ధులను అరెస్టు కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ పురోగతి లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారు తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో ఎస్ఐ కూడా వారికి సహకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తమ ప్రాణాలకు హాని కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
గ్రామాల్లో ఉపవేఢీ
తణుకు టౌన్ :జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు పదవులకు ఎట్టకేలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం అక్టోబర్ 20వ తేదీలోగా ఓటరు జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీన జిల్లా పంచాయతీ అధికారితోపాటు మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. మూడు సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు జెడ్పీటీసీలతోపాటు కుక్కునూరు మండలంలో 8 ఎంపీటీసీ, వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవికాకుండా జిల్లాలో 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, 123 పంచాయతీ వార్డు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో వీటన్నిటికీ త్వరలో నగారా మోగనుంది. ఖాళీలు ఇలా.. : మొగల్తూరు మండలం మోడి సర్పంచ్‌తోపాటు వార్డు పదవులకు, ఇదే మండలంలోని శేరేపాలెం సర్పంచ్, పెదవేగి మండలం పెదకడిమి, తాళ్లపూడి మండలం పెద్దేవం, దెందులూరు మండలం చల్ల చింతలపూడి, ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొవ్వూరు మండలం కుమారదేవం, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, ఉండి మండలం పాములపర్రు, టి.నర్సాపురం మండలం వెలగపాడు, కాళ్ల మండలం కోమటిగుంట, జక్కరం, పల్లిపాలెం, వీరవాసరం మండలం మత్స్యపురి, తోలేరు, పెర్కిపాలెం, పెదపాడు మండలం తాళ్లగూడెం, భీమవరం మండలం తుందుర్రు సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ పదవులకు సంబంధించి చాగల్లు మండలం నెలటూరు, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నిడమర్రు మండలం తోకలపల్లి, యలమంచిలి మండలం పెనుమర్రు, కుక్కునూరు మండలం అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు 1, 2, దాచారం, వేలేరుపాడు మండలంలో మిడిపల్లె, తాట్కూరు, నర్లవరం, తాట్కూరు గొమ్ము, భూదేవి పేట, రేపాకగొమ్ము, రామవరం, ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న 123 వార్డు సభ్యుల పదవులకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
గ్రామాల్లో ఉపవేఢీ
తణుకు టౌన్ :జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు పదవులకు ఎట్టకేలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం అక్టోబర్ 20వ తేదీలోగా ఓటరు జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీన జిల్లా పంచాయతీ అధికారితోపాటు మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. మూడు సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు జెడ్పీటీసీలతోపాటు కుక్కునూరు మండలంలో 8 ఎంపీటీసీ, వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవికాకుండా జిల్లాలో 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, 123 పంచాయతీ వార్డు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో వీటన్నిటికీ త్వరలో నగారా మోగనుంది. ఖాళీలు ఇలా.. : మొగల్తూరు మండలం మోడి సర్పంచ్‌తోపాటు వార్డు పదవులకు, ఇదే మండలంలోని శేరేపాలెం సర్పంచ్, పెదవేగి మండలం పెదకడిమి, తాళ్లపూడి మండలం పెద్దేవం, దెందులూరు మండలం చల్ల చింతలపూడి, ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొవ్వూరు మండలం కుమారదేవం, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, ఉండి మండలం పాములపర్రు, టి.నర్సాపురం మండలం వెలగపాడు, కాళ్ల మండలం కోమటిగుంట, జక్కరం, పల్లిపాలెం, వీరవాసరం మండలం మత్స్యపురి, తోలేరు, పెర్కిపాలెం, పెదపాడు మండలం తాళ్లగూడెం, భీమవరం మండలం తుందుర్రు సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ పదవులకు సంబంధించి చాగల్లు మండలం నెలటూరు, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నిడమర్రు మండలం తోకలపల్లి, యలమంచిలి మండలం పెనుమర్రు, కుక్కునూరు మండలం అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు 1, 2, దాచారం, వేలేరుపాడు మండలంలో మిడిపల్లె, తాట్కూరు, నర్లవరం, తాట్కూరు గొమ్ము, భూదేవి పేట, రేపాకగొమ్ము, రామవరం, ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న 123 వార్డు సభ్యుల పదవులకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
మరిగడి–చౌడారం ఎంపీటీసీగా సిద్ధయ్య విజయం
ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజు మూడో స్థానంలో సీపీఎం అభ్యర్థి.. టీడీపీ అభ్యర్థికి దక్కని డిపాజిట్ జనగామ : జనగామ మండలంలోని మరిగడి–చౌడారం ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈనెల 8న ఎన్నికలు నిర్వహించగా పోలైన ఓట్లను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లెక్కించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హసీమ్ నేతత్వంలో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా 25 నిమిషాల్లో ఫలితం వెల్లడైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దూడల సిద్ధయ్య, టీఆర్ఎస్ నుంచి మేకల కళింగరాజు, సీపీఎం నుంచి బాల్నె వెంకట్రాజు, టీడీపీ నుంచి సల్లూరి అశోక్ బరిలో నిలిచిన విషయం విదితమే. ఈ మేరకు మరిగడి పోలింగ్ కేంద్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 287, కాంగ్రెస్ 181, సీపీఎం 211, టీడీపీ 75 ఓట్లు, రెండో రౌండ్లో టీఆర్ఎస్ 147, కాంగ్రెస్ 253, సీపీఎం 265, టీడీపీ అభ్యర్థికి 50 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రెండో రౌండ్‌కు వచ్చే సరికి 106 ఓట్ల ఆధిక్యానికి వచ్చారు. ఇక చౌడారం పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను మూడో రౌండ్‌గా లెక్కించగా టీఆర్ఎస్కు 276, కాంగ్రెస్ 529, సీపీఎం 36, టీడీపీ 41 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు 963 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కళింగరాజు రెండో స్థానంలో, సీపీఎం అభ్యర్థి వెంకట్రాజు మూడో స్థానంలో నిలవగా టీడీపీ అభ్యర్థి అశోక్ డిపాజిట్ కోల్పోయారు. నోటాకు సైతం 28 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు అధికార పార్టీ అభ్య ర్థి ఓటమి పాలు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి విజయంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. దాసరి రవి మృతితో ఉప ఎన్నిక మరిగడి–చౌడారం ఎంపీటీసీగా ఉన్న దాసరి రవి మృతి చెందగా ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇండిపెండెంట్‌గా నిలిచి విజయం సాధించిన రవి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఆయన గుండెపోటుతో మరణించగా ఏడాది తర్వాత ఉప ఎన్నిక నిర్వహించగా ఆ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. నారాయణపురంలో సీపీఎం అభ్యర్థి విజయం బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎండీ.మహబూబ్ విజయం సాధించా రు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, ఎంపీడీవో రమేష్ నేతృత్వంలో శనివారం ఈవీఎంలను తెరిచి ఓట్లను లెక్కించారు. నారాయణపురంలో రెండు, నక్కవానిగూడేనికి సంబంధించి ఒక్క ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కించిన అధికారులు మొత్తం 1,178 ఓట్లు నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో సీపీఎం అభ్యర్థి మహబూబ్‌కు 633 ఓట్లు, స్వతంత్రlఅభ్యర్థి పరిదె అయిలమ్మకు 519 ఓట్లు, 26 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఈ మేరకు మహబూబ్ 114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు వెల్లడించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
తెలంగాణలో MPTC, ZPTCలకు మంగళం
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మంగళం!
* పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం నిర్ణయం * విధివిధానాలు రూపొందించాలని సీఎస్‌కు ఆదేశాలు * మూడంచెల విధానాన్ని అనుసరించేలా చర్యలు * చట్టపరంగా చేపట్టాల్సిన అంశాలను పరిశీలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కొనసాగించాలని, అదనపు సమాం తర పదవులు మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను రద్దు చేయనుంది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సీఎస్ రాజీవ్‌శర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసేందుకు చట్టప్రకారం అనుసరించాల్సిన చర్యలు పరిశీలించాలని, సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. సమాంతర పదవులు.. స్థానిక సంస్థల పాలనలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారికి నిర్దిష్ట అధికారాలు కూడా లేవు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సమాంతర స్థాయిలో ఉండగా.. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు. దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 42 శాతానికి పెంచినా.. అందులో చాలా వరకు నిధులను నేరుగా గ్రామాలకు కేటాయిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఆర్థిక అంశాల్లో ప్రమేయం లేకుండా పోయింది. వారు కేవలం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించి జిల్లా, మండలం, గ్రామం యూనిట్లుగా మూడంచెల విధానాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పంచాయతీరాజ్ చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సూచించారు. అనవసర రాజకీయ జోక్యం తగ్గేలా, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలంకారప్రాయంగా పదవులు.. 1987కు ముందున్న పంచాయతీ సమితులను అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక ఈ వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా మూడంచెల వ్యవస్థతో పాటు మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు కొత్తగా వచ్చాయి. 1995లో తొలిసారిగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. కానీ స్థానిక పాలనలో ఈ పదవులు అలంకార ప్రాయంగా మారడంతో దీనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ 73వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న అంశం కావటంతో... ఈ వ్యవస్థలో మార్పులు చేయటం సాధ్యమా, కాదా అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర పరిధిలోని అంశం కావటంతో.. ప్రస్తుత చట్టానికి మార్పులు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
మొక్కలు పెంచకపోతే అనర్హత వేటే
* సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ముఖ్యమంత్రి హెచ్చరిక * ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే * ‘చేనేతల రుణ విముక్తి’ సభలో చంద్రబాబు వెల్లడి సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టౌన్: ‘‘అందరూ మొక్కలు నాటండి. మొక్కలు నాటని సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై అనర్హత వేటు వేస్తాం. మొక్కలు నాటే విద్యార్థులకు అదనంగా మార్కులు వేస్తాం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇస్తాం. రెవెన్యూ శాఖలో 50 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వీటిని కుదిస్తాం. కొందరు అధికారులు తప్పులు చేస్తున్నారు. వారి కథ చూస్తా. డబ్బులు వసూలు చేసే అవినీతి అధికారులపై ప్రజలు తిరగబడాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో ‘చేనేతకు చంద్రన్న చేయూత’ పేరుతో సభ నిర్వహించారు. తర్వాత శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ రెండు కార్యక్రమాల్లోబాబు ప్రసంగించారు. చేనేత కార్మికులను ఆదుకుంటాం విభజన చట్టంలోని హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలన్నారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీపై ఉందన్నారు. చేనేత కార్మికుల కోసం రూ.110 కోట్లు విడుదల చేసి, రుణమాఫీ చేశామన్నారు. వెంకటగిరిలో ఐహెచ్టీ ఉంది. కొత్త కోర్సుల కోసం రూ.9.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి, రాబడికి మధ్య తేడా ఎక్కువగా ఉంటుండడం వల్లే రైతులత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. దీన్ని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామన్నారు.పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే పరికరాలు అందిస్తామనీ వారు తయారు చేసిన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిసామనీ బాబు చెప్పారు. హెచ్చరించారు. కాగా, ‘సాక్షి’ పత్రికపై సీఎం చంద్రబాబు మరోసారి అక్కసు వెలగక్కారు. ధర్మవరం సభలో ఆయన మాట్లాడుతూ... సాక్షి పత్రిక కు శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. ఆ పత్రికను చదవొద్దని సూచించారు. -
ఎంపీటీసీపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
కుటుంబ కలహాల నేపథ్యంలో వరుసకు అన్నయ్య అయిన ఎంపీటీసీ పై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీటీసీ చంద్రమౌళి(35)పై వరుసకు తమ్ముడైన సత్యనారాయణ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంపీటీసీల వేతనం స్వాహా
ఫోర్జరీ సంతకాలతో ఎంపీటీసీల జీతం స్వాహా చేసిన వైనం ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు ఎంపీటీసీ సభ్యురాలి ఫిర్యాదు సంక్షేమ పథకాలు.. సామాన్యులకు ఇచ్చే సబ్సిడీలు.. పింఛన్లు తదితర వాటిల్లో ప్రభుత్వ శాఖల సిబ్బంది స్వాహా చేయడం మామూలే. అయితే ఆ మండల కార్యాలయ సిబ్బంది ఏకంగా ప్రజాప్రతినిధులకే టోకరా వేశారు. వారి వేతనాలను స్వాహా చేశారు. ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్నవారు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుపతి: ఏకంగా ఎంపీటీసీ సభ్యులకే మస్కా కొట్టి వారి వేతనాలను స్వాహా చేసిన సంఘటన ఐరాల మండలంలో కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ఆరా తీశారు. ప్రజాప్రతినిధుల వేతనాల పంపిణీలో సిబ్బం ది చేతివాటం ప్రదర్శించినట్లు తేలడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఐరాల మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. 20 14లో వారుఎన్నికైన సమయంలో గౌరవ వేతనం రూ.750 ఉండేది. వారు జూన్ 2015 వరకు జీతాలుడ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి ఏప్రిల్ వరకే వేతనం అందింది. అటు తర్వాత ఇంతవరకు జీతం చెల్లించలేదు. అక్టోబర్ 2015 నుంచి వీరి జీతంరూ.3,000 చేశారు. గుట్టు రట్టయింది ఇలా... తనకు రెండేళ్లుగా జీతం రావడం లేదని కోళ్లపల్లె ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మ ఇటీవల పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన చిత్తూరులోని జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కు వెంటనే ఫోన్ చేశారు. ఎంపీటీసీ సభ్యుల జీతాల విషయమై ఆరా తీయగా నిధులను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. దీంతో ఆయన ఎంపీడీఓను జీతాల విషయమై ప్రశ్నిం చారు. డొంక తిరుగుడు సమాధానం రావడంతో ఎమ్మెల్యేకి అనుమానం వచ్చింది. వెంటనే ఐరాల మండల పరి షత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్క డ ఎంపీడీవో పార్వతమ్మ సమక్షంలో కార్యాలయ రికార్డులను తనిఖీ చేయగా, అక్విటెన్స్ రిజిస్టర్లో సంతకాలు ఫోర్జరీ చేసి జీతాలు స్వాహా చేసిన విషయం, కొట్టివేతలను గమనించారు. ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మను కార్యాలయానికి పిలిపించి సంతకాలు పరిశీలించగా ఫోర్జరీ అని తేలింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలను పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గత సంవత్సరం పంపిణీ చేసిన గౌరవ వేతనంలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో తారుమారయ్యాయన్నారు. లెక్కల్లో ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
గోడ కూలి ఎంపీటీసీ మృతి
కర్లపాలెం (గుంటూరు) : పాత ఇంటి పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు గోడ కూలి ఎంపీటీసీ సభ్యురాలు మృతిచెందింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మరక వెంకటరమణ(50) ఆదివారం తన పాత ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడింది. హుటాహుటిన ఆమెను శిథిలాల మధ్య నుంచి బయటకు తీయగా అప్పటికే ఆమె మృతిచెందింది. -
ఎంపీటీసీ సభ్యురాలి ఆత్మహత్యాయత్నం
గ్రామసభలో అవమానపరిచారని ఆవేదన గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చల్ల నిర్మల శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసిన నోట్లో వివరాలిలా ఉన్నారుు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈజీఎస్ పనులపై చర్చ జరుగుతుండగా సర్పంచ్ బానోత్ సంధ్య, ఆమె భర్త నాగయ్య ఎంపీటీసీ సభ్యురాలైన నిర్మలను, ఆమె భర్త వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కూడా తమను కులం పేరుతో దూషించారంటూ ఎంపీటీసీ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వెంకటేశ్వర్రావు గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిర్మల, వెంకటరెడ్డిపై అట్రాసిటీ కేసు న మోదు చేశారు. తాము చెప్పిన విషయూలను సీఐ పట్టించుకోలేదని నిర్మల నోట్లో ఆరోపించారు. రూ. 20 వేలు డిమాండ్.. గురువారం సాయంత్రం ఏఎస్సై భావ్‌సింగ్ వెంకటరెడ్డికి ఫోన్ చేసి సీఐకి రూ. 20 వేలు ఇస్తే కేసు లేకుండా చేస్తారని చెప్పారని, ఈ విషయూన్ని వెంకటరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పట్టించుకోలేదని వాపోయూరు. తన ఆత్మహత్యాయత్నానికి సర్పంచ్, ఆమె భర్తతోపాటు స్థానిక నాయకుడు చల్ల లింగారెడ్డి కారణమని నోట్లో పేర్కొన్నారు. నిర్మల ప్రస్తుతం నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
అలిగిన కుప్పం టీడీపీ నేతలు
జన్మభూమికి ఆరుగురు ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరు పంచాయతీ పాలకవర్గం గౌరవించలేదని నిరసన కుప్పం: స్థానిక పంచాయుతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి పట్టణంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు (టీడీపీ) గైర్హాజరయ్యారు. పంచాయతీ పాలకవర్గం తమను గౌరవించడం లేదని వారు అలిగినట్లు సమాచారం. కుప్పం గ్రామ పంచాయితీలో 20 మంది వార్డు సభ్యులు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. జన్యభూమి కమిటీల్లో ఎంపీటీసీ సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే పంచాయితీ పాలకవర్గం వద్ద తమకు గౌరవ మర్యాదలు లేవని, పంచాయితీలో తగిన స్థానం కల్పించలేదని ఎంపీటీసీ సభ్యులు తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా తమను కించపరిచే విధంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యవహరించారని, గౌరవం ఇవ్వలేదని సర్పంచ్, అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎంపీటీసీ సభ్యులు అక్కడి నుంచి వెనుతిరిగారు. తాము గెలిచినప్పటి నుంచి పంచాయుతీ కార్యాలయుంలో తవును గౌరవించడం లేదని ఎంపీటీసీ సభ్యుల్లో నలుగురు రాజీనావూ చేస్తున్నట్లు టీడీపీ ఇన్చార్జి పీ ఎస్ వుునిరత్నానికి రాతపూర్వక లేఖలు అందజేశారు. సోవువారం జన్మభూమి కార్యక్రమంలో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రవూనికి పలువురు పార్టీ నేతలు ఎంపీటీసీ సభ్యులను ఆహ్వానించినా వారు హాజరుకాలేదు. ఈ పట్టణంలో తీవ్ర చర్చనీయూంశంగా వూరింది. -
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎంపిటిసి 2కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేశ్మసుల్తాన ఇండిపెండెంట్ అభ్యర్థి హశ్రసుల్తానా పై 17 ఓట్ల తేడాతో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థికి 573 ఓట్లు రాగా స్వసంత్ర అభ్యర్థి 556 ఓట్లు సాధించారు. టిడిపి, బిజెపి మిత్రపక్షల అభ్యర్థిగా పోటి చేసిన సరిత కు 498 ఓఓట్లు పోలయ్యాయి. అదికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి ధీపామల్లేష్ మాత్రం 192 ఓట్లతో నాలుగో స్థానాని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జులేఖబేగం ఆకస్మికంగా మృతి చెందడంతో ఆదికారులు ఉపఎన్నిక నిర్వహించారు. దీంతో ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి.. పొందలేక పోయిన.. మాజీ ఎంపీటీసీ జహింగీర్.. తన భార్య హశ్రసుల్తానాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిపారు. అధికారపార్టీ అభ్యర్థిగా దీపామల్లేష్ పోటీ చేశారు. ఎన్నికల్లో మొత్తం 2430 ఓట్లు ఉండగా.. వీటిలో 1030 ఉండం.. మైనార్టీ వర్గానికే చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీలో ఉండంతో ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ కలిగించింది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లా నవాబుపేట జడ్పీటీసీ ఉప ఉన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డిపై 699 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శంషాబాద్ ఎంపీటీసీ-2 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రేష్మా సుల్తానా 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ దేవకొండమండలలోని గురకొండ ఎంపీటీసీక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మమ్మ విజయం సాధించారు. -
నేడే ‘ఉప’ సమరం
పంచాయతీలు : 21 ఓటర్లు : 30,824 పోలింగ్ కేంద్రాలు : 43 ప్రిసైడింగ్ అధికారులు: 43 విధుల్లో పాల్గొనే సిబ్బంది: 172 ఈవీఎంలు : 43 నవాబుపేట జెడ్పీటీసీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి మరో ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకూ ఎన్నికలు నవాబుపేట: జిల్లాల్లోని ఓ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, రెండు సర్పంచ్ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీ స్థానంతోపాటు, శంషాబాద్ ఎంపీటీసీ-2 స్థానానికి, కందుకూరు మండలం చిప్పలపల్లి, వికారాబాద్ మండలం నారాయణపూర్ సర్పంచ్ స్థానాలకు సైతం శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవాబుపేట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచాక ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి ఆ తర్వాత జెడ్పీటీసీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి పోలీసు రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిట్టెకు మల్లారెడ్డి, టీడీపీ నుంచి జీ. వెంకటేష్‌యాదవ్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎం.ఆనంద్‌లు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. నవాబుపేట మండలంలోని 21 పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాల్లో కలిపి 30,824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకు మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 43 మంది ప్రిసైడింగ్ అధికారులు, 141 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 43 పోలింగ్ కేంద్రాలకు 43 ఈవీఎంలు ఏర్పాటు చేయగా, ఎక్కడైనా అనివార్య కారణాలతో ఈవీఎంలు మొరాయిస్తే తక్షణమే ఏర్పాటు చేయడానికి అదనంగా మరో పది ఈవీఎంలు, ఇంజినీరింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఇప్పటికే పోల్ స్లిప్పులను ఓటర్లు పంపిణీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ రాధ శనివారం స్థానిక విలేకరులకు వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో కలిపి 172 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో గ్రామాలకు తరలినట్టు చెప్పారు. ఓటర్ల స్లిప్పులు అందని వారు స్థానిక వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శుల వద్ద తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తామన్నారు. కౌంటింగ్‌కు 8వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా గ్రామాల్లోని బూత్‌లను చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ యాదయ్యలు పరిశీలించారు. -
ఆత్మగౌరవం కోసమే ‘ఎమ్మెల్సీ’ బరిలోకి
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక, విధుల్లేక, ప్రభుత్వ పథకాల అమలులో చోటు దక్కక ఎంపీటీసీలు ఏడాదిన్నరగా ఎన్నో అవమానాలకు గురవుతున్నారని, అందుకే ఎంపీటీసీల ఆత్మగౌరవం కోసం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 12 స్థానాలకు ఫోరం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతరం అధ్యక్షుడు కరుణాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లనే నిలుపుతున్న అధికార, విపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలకు ఎందుకు అవకాశం కల్పించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఓటర్లలో 80 శాతం ఉన్న ఎంపీటీసీల తరపున ఎమ్మెల్సీ ఉంటేనే.. తమ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు వీలుకలుగుతుందని భావిస్తున్నామన్నారు. ఎంపీటీసీలనే తమ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్సీ బరిలో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటిస్తే ఓడించాలని ఆయన ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు. మద్దతుగా నిలవండి ఏడాదిన్నరగా ఎంపీటీసీలు అవమానాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం గ్రామజ్యోతిలోనూ ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించలేదని ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎంపీటీసీలే ఎమ్మెల్సీలు కావాలనే ఉద్దేశంతో ఫోరం తరఫున అన్ని స్థానాలకూ అభ్యర్థులను నిలుపుతున్నామన్నారు. ఎంపీటీసీల ఫోరం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,441 మంది ఎంపీటీసీలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, గోవర్ధన్‌రావు, పార్వతమ్మ, మహబూబ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య
మాచర్ల టౌన్(గుంటూరు జిల్లా): రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మర్రి శ్రీనివాస్(36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు రూ.6 లక్షలు అప్పుల అయినట్లు తెలిసింది. గతంలో ఆయన ఎంపీటీసీగా పనిచేశారు. -
మూకుమ్మడి బహిష్కరణ
రంగారెడ్డి జిల్లా కీసరలో సోమవారం జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. మండలంలోని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీపీ సుజాత, ఎండీవో విజయ్‌కుమార్ మండల పరిషత్ ఆదాయ వ్యయాలపై వివరాలు ఇవ్వడం లేదంటూ 14 ఎంపీటీసీలు ఆరోపించారు. ఒక స్థాయిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు. -
‘గ్రామజ్యోతి’లో ఎంపీటీసీలకు స్థానం కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు విధులు, నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ఎంపీటీసీలు నిరశన దీక్ష నిర్వహించారు. దీక్షల్లో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, ప్రధానకార్యదర్శి అన్నారపు యాకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం మల్లేశం, పి. గోవర్ధన్‌రావు, జి. పార్వతమ్మ, కోశాధికారి మహబూబ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ నామినేట్ అయిన వారికి కేబినెట్లో అవకాశం కల్పించిన సీఎం.. ప్రజల ఓట్లతో గెల్చిన ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామాల అబివృద్ధి కోసం పనిచేసే ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, నాయకుడు గుజ్జకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీమంత్రి రాములు, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం నాయకులు యాదగిరి, రియాజ్, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీల దీక్ష
హైదరాబాద్: ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తమను దూరం చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీలు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఎంపీటీసీలను ఆహ్వానించకపోవటం తగదన్నారు దీక్షల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పోచారాన్ని నిలదీసిన ఎంపీటీసీలు
నిజామాబాద్: గ్రామజ్యోతి కార్యక్రమంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీలు నిలదీశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీటీసీలు నిలదీశారు. గ్రామ జ్యోతిలో ఎంపీటీసీలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు నిధులు, విధులు కల్పించాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి సీఎంతో మాట్లాడి ఆదుకుంటానని ఎంపీటీసీలకు హామినిచ్చారు. -
మమ్మల్ని గుర్తించండి
కరీంనగర్ సిటీ : ‘పాలనలో మా పాత్రేంటో చెప్పండి... విధులు, నిధులు ఇవ్వండి... ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వండి... కనీసం మమ్మల్ని గుర్తించండి’ అంటూ ఎంపీటీసీలు ఆక్రోశం వెల్లగక్కారు. మధ్యాహ్నం సదస్సు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంపీటీసీలు లేచినిలబడి నినాదాలు చేశారు. తమకు హక్కులు కావాలని, ముందు తమను గుర్తించాలని బిగ్గరగా అరిచారు. కొద్దిమంది వేదిక వద్దకు దూసుకువచ్చి, వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్‌విప్ కొప్పుల సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికి వారు వినలేదు. చివరకు మంత్రి ఈటల జోక్యం చేసుకొని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడినే తానని, సమస్యలుంటే చెప్పుకోవాలి తప్ప, గొడవ చేస్తే లాభం లేదని అన్నారు. దీంతో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. తాము ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా క న్వీనర్ తులా బాలయ్య మాట్లాడుతూ పంచాయతీల్లో సర్పంచ్‌కు, వార్డుసభ్యులకు కుర్చీ ఉంది కాని తమకు లేదన్నారు. కనీసం పింఛన్ ఫారంపై కూడా సంతకం చేసే అధికారం లేదన్నారు. గ్రామజ్యోతిలో సర్పంచ్‌లతో సమానంగా ఎంపీటీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. పలువురు ఎంపీటీసీలు... మండల పరిషత్ నుంచి తాము చేసే పనులకు పంచాయతీ తీర్మానం కావాలనడంతో సర్పంచ్‌లు వేధిస్తున్నారని చెప్పారు. పంచాయతీ తీర్మానాలపై ఎంపీటీసీల సంతకం తప్పనిసరిచేయాలన్నారు. మండల పరిషత్ కార్యక్రమాల్లో జెడ్పీటీసీలను భాగస్వాములు చేయాలని జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి కోరారు. మంత్రి ఈటల స్పందిస్తూ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గౌరవం పెంచేందుకు ప్రయత్నిస్తామని బదులిచ్చారు. -
ఎంపీటీసీ దారుణ హత్య
దేవరకద్ర(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు అరుణాచలం రాజు (50) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మాటువేసిన దుండగులు అరుణాచలం రాజు ఇంటి నుంచి వాకింగ్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే స్థానిక ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయం సమీపంలో నడిరోడ్డుపై వేటకొడవళ్లతో వెంటాడి నరికి చంపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పాతకక్షలే ఈ ఘటనకు దారి తీశాయని పోలీసుల అనుమానం. రాజు తల, మెడ, చేతులపై పడిన గాయాలను బట్టి ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా దేవరకద్రలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. స్థానికంగా జరగాల్సిన పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు వాయిదా వేసుకుని, స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అరుణాచలం రాజు మృత దేహంతో కాంగ్రెస్ నాయకులు రాయచూర్ అంతరాష్ట్ర రహదారిపై కాసేపు ధర్నా నిర్వహించారు. తక్షణమే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ బాలకోటి తెలిపారు. దీనికి గాను ఒక ఎస్సై 10 మంది పోలీసులతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అరుణాచ లం రాజుకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. దేవరకద్ర పంచాయతీ వార్డు సభ్యునిగా, సర్పంచిగా రాజు పనిచేశారు. -
‘గౌరవ’మేదీ...?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవాన్ని ఇనుమడింపజేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ గాల్లో కలసిపోతోంది. అట్టహాసంగా గౌరవ వేతనాల పెంపును ప్రకటించినా.. ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచే వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఐదు నెలలు గడిచినా... రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క సర్పంచ్‌కు గానీ, ఎంపీటీసీకి గానీ పెంచిన గౌరవ వేతనం అందలేదు. జూన్‌లో ఉత్తర్వులొచ్చినా..: ప్రభుత్వం ప్రకటించిన విధంగా గౌరవ వేతనాలను పెంచకపోవడంతో జూన్‌లో సర్పంచులు, ఎంపీటీసీల సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలకడంతో దిగివచ్చిన సర్కారు... హడావుడిగా వేతనాల పెంపునకు సంబంధించి జీవో నంబరు 53 (జూన్ 24న)ను జారీచేసింది. ఇది వచ్చి నెలన్నర దాటినా... పెరిగిన వేతనం జమ కాలేదని సర్పంచులు, ఎంపీటీసీలు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందున మరోమారు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సర్పంచుల సంఘాలు ప్రకటించాయి. అయితే గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థికశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. చెక్‌పవర్ అనిశ్చితి..: గ్రామాల్లో అభివృద్ధి నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి ఉమ్మడిగా అధికారమిచ్చే జాయింట్ చెక్‌పవర్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. దీనిపై జూన్ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ ఊసే మరిచారు. దీంతో జాయింట్ చెక్‌పవర్‌తో పంచాయతీల్లో కార్యదర్శులే పైచేయిగా మారిందని, ప్రజాప్రతినిధులకు వీసమెత్తు విలువ లేకుండా పోయిందని సర్పంచులు వాపోతున్నారు. ఏకగ్రీవ పంచాయతీ సం‘గతేంటి’?: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నగదు పురస్కారాలను అందిస్తామని 2013లో ఎన్నికలప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్న మేజర్ గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీకి రూ.5లక్షలు ఇస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. వీటికి సంబంధించి రూ.54కోట్ల సర్కారు అందజేయాల్సి ఉంది. కానీ ఎన్నికలై రెండేళ్లవుతున్నా ‘ఏకగ్రీవ’ పంచాయతీలకు నగదు పురస్కారాలు అందలేదు. రూ.2.20కోట్లను మాత్రం విడుదల చేశారు. -
ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే
-
పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం
ఇందూరు : జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మూడు ఎంపీటీసీ, నాలుగు సర్పంచ్, 63 వార్డు స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్, వార్డులకు పగలు ఒంటిగం ట వరకు పోలింగ్ జరగగా, రెండు గంట లకు కౌటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. నాలుగు సర్పంచ్ స్థానాలనూ టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఎంపీటీసీలకు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈవీఎంలను సంబంధిత మండలాలలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ఆరవ తేదీన జరుగనుంది. మూడు ఎంపీటీసీ, రెండు స ర్పంచ్ స్థానాలకు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపారు. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. 63 వార్డు స్థానాలకుగాను 31 ఏకగ్రీవం కాగా, 28 వార్డుకు బ్యా లెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. రెండు వార్డు స్థానాలకు నామినేషన్లు రాకపోవడంతో వీటికి ఎన్నికలు జరగలేదు. ఎంపీటీసీ స్థానాలకు 77.88శాతం పోలింగ్ తాడ్వాయి మండలం నందివాడ స్థానానికి 2,573ఓట్లు ఉండగా,2,004 ఓట్లు పోల్ అయ్యాయి. 77.88 శాతం పోలింగ్ నమోదైంది. డిచ్పల్లి మండలం పడిపల్లి- 2 స్థానానికి 2,844 ఓట్లు ఉండగా, 1,511 ఓట్లు నమోదయ్యాయి. 53.16 పోలింగ్ శాతం నమోదైంది. నవీపేట్ మండలం యంచ స్థానానికి 2,461 ఓట్లకు గాను 1,911 ఓట్లు పోలయ్యాయి. 77.65 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి 7,874 ఓట్లకు గాను 5,426 ఓట్లు నమోదు అయ్యాయి. 68.91 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మూడు స్థానాలకు తొమ్మిది మంది పోటి పడ్డారు. సర్పంచ్, వార్డు స్థానాలకు 77.33 శాతం పోలింగ్ నాలుగు సర్పంచ్ స్థానాలకు బాన్సువాడ మండలం కొల్లూరు సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌గా పల్లికొండ శోభరాణిని ఎన్నికయ్యారు. మిగిలిన బిచ్కుంద మండలం, కిష్టాపూర్(జె) సర్పంచ్ స్థానానికి గంగోండ, మద్నూరు మండలం తాడ్గూర్ (బీ) స్థానానికి కొండవార్ గంగాధర్ ఎన్నికయ్యారు. లింగంపేట్ మండలం భ వానీపేట్ స్థానానికి కమ్మరి పండరి ఎన్నికయ్యారు. సర్పంచ్, వార్డు స్థానాలలో 14,550 ఓట్లకుగాను 11,251 ఓట్లు పోలయ్యాయి. 77.33 శాతం పోలింగ్ నమోదైంది. -
ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే
‘హరితహారం’ అమలుపై సర్పంచులు, ఎంపీటీసీలకు ముఖ్యమంత్రి హెచ్చరిక కరీంనగర్/సంగారెడ్డి: ‘‘ఒక్కో గ్రామానికీ 40 వేల మొక్కలు సరఫరా చేసే బాధ్యత మాది. మీకు నయాపైసా ఖర్చు లేదు. ట్రాలీ ద్వారా మీ ఊరికే తెచ్చి మొక్కలు సరఫరా చేస్తాం. ఆ మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత మాత్రం మీదే. ఏ ఊర్లో 40 వేల కంటే ఒక్క మొక్క తక్కువగా బతికినా ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల స్వయంగా మొక్కలు నాటిన కేసీఆర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హరితహారమంటే నాలుగు మొక్కలు పెట్టి మంచిగ సాకుడే. దానికి ఇంత హడావుడి ఎందుకు? ఇంత కథ ఏంది? సీఎం వచ్చి మొత్తుకునుడేంది? ఎక్కడో తప్పు జరిగింది. దారి తప్పిపోయినం. సర్పంచులు, ఎంపీటీలకు తెలివి ఉంటే మీ గ్రామంలోనే నర్సరీ పెంచుకుని ఉంటే... ప్రభుత్వం ఇంత బాధపడాల్సిన అవసరమేముంది? పంచాయతీ వ్యవస్థ ఫెయిలైంది. చెట్టు పెంచాలనే సోయి కూడా మర్చిపోయినం కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు సర్పంచులు ఊళ్లల్లో ఉంటలేరు. పొద్దున లేవగానే పంచె సదురుకుని పట్టణాల్లో పడుతుండ్రు. హుస్నాబాద్‌లోనే కాదు. తెలంగాణ అంత టా పరిస్థితి ఇట్లనే తయారైంది’’అని చురకలంటించారు. సభలో మంత్రులు ఈటల, జోగు రామన్న, కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను... ‘‘నేను సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను. ఇయ్యాల పెద్దగ పెరిగి నీడపట్టి తెలంగాణ అంతటా విస్తరించాను. మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి’’ అని కేసీఆర్ ప్రజలను కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని ‘తెలంగాణ రిలే దీక్షల స్ఫూర్తి’ పైలాన్ వద్ద మొక్కను నాటాక జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ హరితహారం పథకం అమల్లో 100 శాతం విజయం సాధించిన ప్రతి నియోజకవర్గానికీ రూ. 5 కోట్ల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఓ రైతే తనకు స్ఫూర్తినిచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి తన వ్యవసాయ పొలాన్ని చూసేందుకు వచ్చిన ఒక రైతుతో కలసి భోజనం చేస్తూ ‘మీ దగ్గర వర్షాలు కురుస్తున్నాయా?’ అని అడగ్గా ... ‘జంగల్ ఉంది కాబట్టి మాకు వర్షాలకు ఇబ్బంది లేదు’ అని ఆ రైతు చెప్పినప్పుడే తెలంగాణవ్యాప్తంగా చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ వస్తే బంగారు కిరీటం చేయిస్తా స్వామీ’ అని తన భార్య కాళేశ్వరస్వామికి మొక్కుకుందని, త్వరలోనే కిరీటం చేయించి స్వామికి తొడిగుతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నార్త్‌లో శామీర్‌పేట్ వద్ద మరో పెద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా చేయబోతున్నామని సీఎం తెలిపారు. మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, జె డ్పీచైర్మన్ రాజమణిముర ళీయాదవ్ పాల్గొన్నారు.