బంధువులు, అనుచరులతో కలిసి రాస్తారోకోకు దిగిన ఎంపీటీసీ దంపతులు
మేళ్లచెరువు (హుజూర్‌నగర్) : ఎంపీటీసీ దంపతులపై హత్యాహత్నం జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చింతలపాలెం మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, చింతలపాలెం ఎంపీటీసీ–2 లకావత్ రామారావు, అతని భార్య తమ్మవరం ఎంపీటీసీ–2 లకావత్ సుభద్ర మేళ్లచెరువులో నివాసముంటున్నారు. చింతలపాలెం మండలంలోని పిక్లానాయక్‌తండాకు చెందిన భూక్యా గోపి బుధవారం తెల్లవారుజామున వచ్చి ఇంటి తలుపు తట్టాడు.
వారు తలుపులు తీయలేదు. రామారావు నిద్ర లేవలేదని భార్య సుభద్ర చెప్పింది. తిరిగి ఉదయం 7గంటల సమయంలో మళ్లీ వచ్చాడు. పేపరు, పెన్ను కావలని అడిగాడు. సుభద్ర ఇవ్వబోగా ఒక్కసారిగా గోపి ఆమెపై తల్వార్ (కత్తితో) దాడి చేయగా ఆమె చేతికి గాయమైంది. వెంటనే తేరుకున్న ఆమె అక్కడున్న కూర్చీని కత్తికి అడ్డుపెట్టి కేకలు వేయడంతో చట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు.
దీంతో రామారావును హత్య చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. నాయకులు మేళ్లచెరువు మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు. అక్కడి చేరుకున్న ఎస్‌ఐ.సత్యనారాయణ నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. నిందితుడు గోపితో పాటు మరో 27 మందిపై ఎంపీటీసీ సుభద్ర ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థాలాన్ని కోదాడ రూరల్ సీఐ రవి పరిశీలించారు.
పోలీస్ పికెట్
ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం మండలంలోని పీక్లానాయక్‌తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చింతలపాలెం ఎంపీటీసీలు లకావత్ రామారావు, లకావత్ సుభద్రపై మేళ్లచెరువులో జరిగిన హత్యాత్నం నేపథ్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ పరమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment