రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మర్రి శ్రీనివాస్(36) అనే కు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మాచర్ల టౌన్(గుంటూరు జిల్లా): రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మర్రి శ్రీనివాస్(36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు రూ.6 లక్షలు అప్పుల అయినట్లు తెలిసింది. గతంలో ఆయన ఎంపీటీసీగా పనిచేశారు.