గ్రామజ్యోతి కార్యక్రమంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీలు నిలదీశారు.
నిజామాబాద్: గ్రామజ్యోతి కార్యక్రమంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీలు నిలదీశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీటీసీలు నిలదీశారు.
గ్రామ జ్యోతిలో ఎంపీటీసీలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు నిధులు, విధులు కల్పించాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి సీఎంతో మాట్లాడి ఆదుకుంటానని ఎంపీటీసీలకు హామినిచ్చారు.