
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 'బలగం'. చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా బలగం మూవీ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అంతటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వేణుపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు వేణుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. వారు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
(ఇది చదవండి: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత)
బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment