compliant
-
సన్‌బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు
గోవాలో నిర్వహించిన సన్‌బర్న్ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ విషయంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహించారు. అక్కడితో ఆగకుండా కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు జరిగిన సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డీజే షోలో భాగంగా డిజటల్ స్క్రీన్‌పై శివుడి ఫొటో ప్రదర్శించడం వివాదం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్ నేత విజయ్ బైకే తీవ్రగా ఖండించారు. దీనిపై ఆయన శుక్రవారం గోవాలోని మాపూసా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై స్పందించిన గోవా ఆప్ అధ్యక్షుడు అమిత్ పాలేఖర్.. సనాతన ధర్మాన్ని అవమానించిన సన్ బర్న్ డీజే షో నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు గోవాలోని వాగ్‌తోర్‌లో జరిగిన ఈ షోలో.. అందరూ మద్యం తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో అక్కడి డిజిటల్ స్క్రీన్‌పై శివుడి ఫొటో ప్రదర్శించారని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమాన పరిచిన షో నిర్వాహకులపై చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విజయ్ బైకే మాట్లాడుతూ.. ఉద్దేశపూరితంగా తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో షో నిర్వాహకులు శివుడి ఫొటో స్క్రీన్‌పై వేశారని అన్నారు. ఇలాంటి చర్యలలో హిందూవుల మనోభావాలను కించపరిచినట్లు అవుతుందని మండిపడ్డారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారని చెప్పారు. చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం -
అనిరుధ్ సంగీతంపై బాలీవుడ్ కంప్లైంట్
-
హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న'లియో' మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'నా రెడీ' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. ఆమె పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌ని టార్గెట్ చేసి తప్పబట్టిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ ఫిర్యాదు చేశారు. విజయ్ సినిమాలో వచ్చిన స్మోకింగ్ వీడియోలపై నిరసనలు వ్యక్తం చేసినందుకే... స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందనే పదాలను చిత్ర బృందం పాటలో పెట్టిందని ఆమె తెలిపింది. తను చేసిన ఈ పోరాటం వల్ల హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ నిరంతరం బెదిరిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ అందరూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారని పేర్కొంది. హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని తెలిపింది. (ఇదీ చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య) ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానులను ప్రేరేపించిన విజయ్‌ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో అందరూ సిగరెట్లు తాగుతారు.. మరీ విజయ్‌పై మాత్రమే ఫిర్యాదు ఎందుకు? అని ప్రశ్నించగా.. గతంలో రజనీకాంత్‌పై కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని ఆమె గుర్తు చేసింది. -
అనుమతి లేకుండా సచిన్ ఫోటో వాడుకుంటున్న డిగ్రీ కంపెనీ
-
చట్టపరమైన చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌పై ఫిర్యాదు
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 'బలగం'. చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా బలగం మూవీ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అంతటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వేణుపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు వేణుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. వారు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత) బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. -
పాఠశాలలో చేర్పించమని సీఎంనే అభ్యర్థించిన బాలుడు: వీడియో వైరల్
Bihar Boy Complains Nitish Kumar About Lack of Quality Education: ఇటీవలకాలంలో ప్రముఖులు, సెలబ్రెట్రీలు అధికారుల లేదా ప్రభుత్వ సంస్థల నుంచి తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు గురించి విన్నాం. అధికారులు కూడా వెంటనే స్పందించి ఫిర్యాదులను స్వీకరించిన సందర్భాలు అనేకం. ఐతే ఇక్కడొక బాలుడు తనను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించమని సాక్షాత్తు ముఖ్యమంత్రినే అభ్యర్థించాడు. వివరాల్లోకెళ్తే...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన పూర్వీకులు గ్రామమైన నలంద జిల్లాలోని కళ్యాణ్ బిగహాల్ పర్యటించారు. ఈ మేరకు ఆయన ఆ గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, ఫిర్యాదులను వినడమే కాకుండా వారి వద్ద నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారు. ఇంతలో ఆ ప్రజల సముహం నుంచి 11 ఏళ్ల సోను అనే బాలుడు చేతులు ఊపుతూ సీఎంతో మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం లేదని అందువల్ల తనని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అని ముఖ్యమంత్రిని అభ్యర్థించాడు. అంతేగాదు ప్రభుత్వ పాఠశాలలోని బోధన ప్రమాణాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఉపాధ్యాయులకు గణితం, బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్పడం రాదంటూ ఫిర్యాదు చేశాడు. తాను ఐఏఎస్ కావలనుకుంటున్నాని కానీ అందుకు తన కుటుంబ ఆర్థిక సరిపోదని, పైగా తన తండ్రి సంపాదన అంతా అతని తాగుడుకే ఖర్చు అయిపోతుందంటూ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. దీంతో నితీష్ కుమార్ తనతో ఉన్న అధికారులు ఆ పిల్లవాడి ఆవేదనను వినవల్సిందిగా సూచించారు. అంతేగాదు అక్కడకు వచ్చిన మీడియా వాళ్లతో కూడా ఆ బాలుడు చాలా ధైర్యంగా మాట్లాడాటమే కాకుండా తన సమస్యను వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఆ బాలుడి వాగ్ధాటిని చూసి అబ్బురుపడటమే కాకుండా ఏ మాత్రం తడబడకుండా ధైర్యంగా తన సమస్యను అధికారులతో చెప్పడం గ్రేట్ అంటూ ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. वाक़ई एक भावुक कर देने वाला दृश्य है ये। हर एक बच्चा को क्वालिटी एजुकेशन ज़रूरी ताकि वो अपनी और अपनों को एक क्वालिटी लाइफ़ दे पाए। बिहार की मिट्टी ऐसे टैलेंट से भरी पड़ी है। Credits: News Pick . . . .#bihar #biharsehai #nitishkumar #bihargovernment pic.twitter.com/y9Bn8KzFGv — Bihar_se_hai (@Bihar_se_hai) May 15, 2022 (చదవండి: వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి చివాట్లు తిన్న ఎమ్మెల్యే) -
అవాక్కయ్యే ఫిర్యాదు! సార్ మోదీ ఫోటో తీసేయమంటున్నారు
landlords threatened Take Down The photo of PM Modi: పోలీస్‌స్టేషన్‌లో కొంతమంది చాలా విచిత్రమైన ఫిర్యాదులు చేస్తుంటారు. ఇవన్నీ పోలీసులకు మాములే. కానీ కొన్ని ఫన్నీగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులు ఆగ్రహానికి గురై సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక వ్యక్తి పోలీసులకు ఒక విచిత్రమైన కంప్లైయింట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇండోర్‌లోని పీర్ గలి నివాసి యూసుఫ్ మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. తనకు ప్రధాని మోదీ అంటే ఇష్టం అని, ఆయన సిద్ధాంతల పట్ల గౌరవంతో తాను అద్దెకు తీసుకుంటున్న ఇంట్లో మోదీ ఫోటోను పెట్టుకున్నాని యాసుఫ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే భూస్వాములు యాకూబ్ మన్సూరి సుల్తాన్ మన్సూరీ ప్రధాని మోదీ చిత్రపటాన్ని తొలగించాలని ఒత్తిడి చేయడమే కాకుండా తీయకపోతే ఇంట్లోంచి గెట్టేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పాడు. దీంతో డీసీపీ మనీషా పాఠక్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు సదర్ బజార్ టీఐని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: 74 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా... నెటిజన్లు ఫిదా) -
టీడీపీ నేత అయ్యన్నపై విశాఖ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నాయకులు
-
Tamilnadu: సీఐ సమక్షంలో ఎస్ఐల డిష్యుం..డిష్యుం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్లో ఈ నెల 13వ తేదీ ఎస్ఐ కామరాజ్ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు. మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి ఎస్ఐ దురైకన్నుకు ఫిర్యాదు చేసి ముందు రోజు జరిగిన విషయం చెప్పాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశన్ సమయంలో ఎస్ఐలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయం ఎస్పీ రవళిప్రియ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఇద్దరిని పిలిపించి విచారణ చేశారు. వారిని తంజావూరు సాయుధ దళం విభాగానికి బదిలీ చేశారు. -
శశి థరూర్‌పై స్పీకర్‌కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ వివాదానికి సంబంధించి ఎంపీ శశి థరూర్ ట్వీట్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా దిగ్గజం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ వివరణ కోరనుందని, ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ తమతో చర్చించకముందే ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేశారని, బహిరంగ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. శశి ధరూర్ నిబంధనల ఉల్లంఘనపై తాను స్పీకర్‌కు లేఖ రాశానని, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు. ఏ సంస్ధ ప్రతినిధినైనా పిలిపించి మాట్లాడేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆయన (శశి థరూర్) తమతో చర్చించకుండా మీడియాతో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో ఫేస్బుక్ బీజేపీకి వత్తాసు పలుకుతూ తమ వేదికపై కాషాయ నేతలు విద్వేష ప్రసంగం, సందేశాలు పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఫేస్‌బుక్‌ను తమ కమిటీ ఎదుట హాజరు కావాలని ఐటీ స్టాండింగ్ కమిటీ చీఫ్ శశి థరూర్ సమన్లు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే థరూర్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. పార్లమెంటరీ విధానాలు, పద్ధతులు పాటించకుండా శశి థరూర్ ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపారని దూబే ఆరోపించారు. చదవండి : కోళీకోడ్ ఘటన: ‘మీరు దేశానికే ఆదర్శం’ -
ఆ లేఖ వెనుక రాజకీయ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్నంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. లేఖపై ఎస్ఈసీ స్పష్టత ఇవ్వకున్నా ఎల్లో మీడియా కథనాలు వండి వార్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయటాన్ని ఖండించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కైలే అనిల్‌కుమార్ తదితరులు డీజీపీ సవాంగ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. డీజీపీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యాంశాలు .. 1 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారిక లెటర్ హెడ్‌పై, ఆయన చేశారంటున్న సంతకంతో ఓ వర్గం మీడియా ద్వారా విడుదలైన లేఖ రాజ్యాంగబద్ధ పదవి హోదాను దిగజార్చేలా ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధికారి ఉపయోగించే పదజాలం కాకుండా రాజకీయ శత్రువులు, కుట్రదారులు వాడే భాషతో ఈ లేఖ విడుదలైంది. టీడీపీ అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం దీనిపై బుధవారం మూడు గంటల పాటు పనిగట్టుకుని కథనాలు ప్రసారం చేసింది. 2 జాతీయ మీడియాకు చెందిన కొన్ని పత్రికలు గురువారం ఈ లేఖను ప్రచురించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టకు ఈ వ్యవహారం భంగం కలిగిస్తోంది. రమేశ్‌కుమార్ పేరుతో విడుదలైన లేఖపై రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం. 3 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఎవరెవరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో, ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని అస్థిరపరచటానికి ఎవరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. 4 ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనరే రాశారా? లేక ఇతరులు రాశారా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ కాకుండా తానే నేరుగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి రాజకీయంలో ఆయన భాగం అయ్యారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. 5 రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అసెంబ్లీలో 86 శాతం సీట్లు, 51 శాతం ఓట్లు, 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టో వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజల సంతృప్తి మరింత పెరిగి ఏకగ్రీవాలు కావటం సహజ పరిణామం. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలపై విభేదిస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ లేఖ పేరుతో ప్రచారం చేయడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పటమే. 6 ఎస్ఈసీ రమేష్‌కుమార్ ప్రతిపక్ష టీడీపీ కక్ష సాధింపు వ్యూçహాలు, కుట్రల్లో తానూ భాగమైనట్లుగా వ్యవహరిస్తున్నారు. చివరికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎందుకు కేవియట్ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి? 7 రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించాల్సిన వ్యక్తికి ఉండాల్సిన స్వతంత్రత, నిష్పాక్షికతకు ఇంతగా భంగం కలగటం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, కమిషనర్ పదవికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరుతున్నాం. 8 ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతోపాటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేలా ఈ కాలానికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కనపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలతో తీవ్ర ఆరోపణలు చేస్తూ గంటల వ్యవధిలోనే ఆయన పేరుతో లేఖ విడుదల కావడం అనుమానాలకు తావిస్తోంది. 9 టీడీపీ అనుకూల మీడియా ఈ లేఖను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వాడుకుంది. ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఆ లేఖ తాను రాసిందో కాదో చెప్పకుండా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యారంటే ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని భావిస్తున్నాం. 10 నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ లేఖను ధ్రువీకరించటంగానీ, నకిలీ ఉత్తరం అయితే బహిరంగంగా ఖండించటంగానీ చేయాలి. ఆ రెండూ చేయకుండా టీడీపీ రాజకీయ ఎత్తుగడల్ని బలపరిచేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరచేలా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన భౌతికంగా, మానసికంగా ఎవరికి బందీగా ఉన్నారు? ఈ విషయాలపై ఒక పనిగా పెట్టుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పాత్రికేయుల మీద సత్వరం విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుని నిజాలను బహిర్గతం చేయాలని అభ్యర్థిస్తున్నాం. -
మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్‌మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్‌మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్‌మిల్లు వద్ద విచారించారు. -
‘నా హృదయం పోయింది.. వెతికి పెట్టండి’
ముంబై : సాధరణంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి డబ్బులు పోయాయనో లేదా వస్తువులు పోయాయనో లేదా ఇతర వివాదాల గురించి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి వీటికి భిన్నమైన ఫిర్యాదులు వస్తూంటాయని తెలిపారు నాగపూర్ పోలీసులు. ఇటీవల ఓ దొంగతనం కేసులో నాగపూర్ పోలీసులు దాదాపు రూ. 82 లక్షల విలువైన సొత్తును వెతికి పెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగపూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. పోయిన వస్తువులను మేం వెతికి పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక్కోసారి కాస్తా డిఫరెంట్ కేసులు మా ముందుకు వస్తూంటాయని గతంలో తనకెదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నా హృదయం చోరికి గురయ్యిందంటూ కంప్లైంట్ ఇచ్చాడు. ‘ఓ అమ్మాయి నా హృదయాన్ని దోచుకుంది. మీరు ఎలాగైన తన వద్ద ఉన్న నా హృదయాన్ని తిరిగి నాకు ఇప్పించాలని’ కోరాడు. ఇది విని మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు తేరుకుని ఇలాంటి సమస్యల్ని మేం పరిష్కరించలేము బాబు అని చెప్పారు. అంతేకాక ఇలాంటి ఫిర్యాదులు నమోదు చేయడం కూడా కుదరదని తేల్చిచెప్పారు పోలీసులు. అయినా ఆ యువకుడు వారి మాట వినలేదు. దాంతో ఏం చేయాలో తెలీక స్టేషన్ ఇన్స్పెక్టర్ పై అధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు యువకుడికి నచ్చజెప్పి పంపించారంటూ చెప్పుకొచ్చారు భూషణ్ కుమార్. -
సీఎం కేసీఆర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీని కించపరిచేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకుగాను సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మొర్చా ఉపాధ్యాక్షుడు, న్యాయవాది ఎమ్ఏ ఖావి అబ్బాసీ మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గౌరవనీయులైన ప్రధాని మోదీపై కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. -
ఏఎన్‌యూ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
* నిధుల వినియోగం, పనుల కేటాయింపులపై ఆరోపణలు * ఫిర్యాదు దాఖలు చేసిన గుంటూరు వాసి * నవంబర్ 22న హాజరు కావాలని ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు లోకాయుక్త సూచన ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థికపరమైన లావాదేవీలు, ఉద్యోగులకు చెల్లింపులు, వివిధ పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులకు అధికంగా చెల్లింపులు చేశారనే అంశాలపై గుంటూరుకు చెందిన కేవీఆర్ శివరాంప్రసాద్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి ప్రహరీ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ రూ.76 లక్షలకు పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటే వర్సిటీ అధికారులు మరో కాంట్రాక్టర్‌కు అదే పనిని కోటి రూపాయలకు పైగా ఇచ్చి చేయించారని, దూరవిద్యా కేంద్రంలో కొన్ని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజువారీ వేతన ఉద్యోగుల నియామకం ఉన్నతాధికారుల అనుమతులతో జరగలేదని, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులను మూడు నెలల కాల వ్యవధితో నియమించుకుని వారికి నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్ట్రర్‌ను సక్రమంగా నిర్వహించటం లేదని, పీఆర్సీ బకాయిల చెల్లింపులో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. పర్చేజింగ్ కమిటీ నిబంధనలు, అనుమతులు పొందకుండానే కొన్ని కొనుగోళ్లు చేశారని, టెండర్లు లేకుండానే ఆస్ట్రేలియా నుంచి రూ.25.46 లక్షల విలువ చేసే పరికరం కొనుగోలు చేశారని, 2012–13లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌కు సంబంధించి రూ.18.45 లక్షల పనులకు టెండర్లు పిలవలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యాపకులు రూ.4.16 కోట్ల యూజీసీ నిధులను అడ్వాన్స్‌ల రూపంలో తీసుకుని వాటికి లెక్కలు చేపలేదని, కార్ అలవెన్స్‌ల రూపంలో రూ.1.48 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ ఏడాది నవంబర్ 22వ తేదీ∙హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయంలో హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ పంపింది. -
నయీం ముఠా నన్ను బెదిరిస్తుంది
-
ఎయిర్ హోస్టెస్‌ను వీడియో తీసి..
హైదరాబాద్: విమానంలో బుద్ధిగా కూర్చుని రాకుండా ఓ యువకుడు ఎయిర్‌హోస్టెస్‌ను వీడియో తీసి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన ప్రణవ్ అనే యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించాడు. విమానంలో ఆయన అత్యుత్సాహం చూపి ఎయిర్‌హోస్టెస్‌ను వీడియో తీశాడు. ఈ ఘటనపై ఎయిర్‌హోస్టెస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.