Bihar Boy Complains Nitish Kumar About Lack of Quality Education: ఇటీవలకాలంలో ప్రముఖులు, సెలబ్రెట్రీలు అధికారుల లేదా ప్రభుత్వ సంస్థల నుంచి తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు గురించి విన్నాం. అధికారులు కూడా వెంటనే స్పందించి ఫిర్యాదులను స్వీకరించిన సందర్భాలు అనేకం. ఐతే ఇక్కడొక బాలుడు తనను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించమని సాక్షాత్తు ముఖ్యమంత్రినే అభ్యర్థించాడు.
వివరాల్లోకెళ్తే...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన పూర్వీకులు గ్రామమైన నలంద జిల్లాలోని కళ్యాణ్ బిగహాల్ పర్యటించారు. ఈ మేరకు ఆయన ఆ గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, ఫిర్యాదులను వినడమే కాకుండా వారి వద్ద నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారు. ఇంతలో ఆ ప్రజల సముహం నుంచి 11 ఏళ్ల సోను అనే బాలుడు చేతులు ఊపుతూ సీఎంతో మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు.
తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం లేదని అందువల్ల తనని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అని ముఖ్యమంత్రిని అభ్యర్థించాడు. అంతేగాదు ప్రభుత్వ పాఠశాలలోని బోధన ప్రమాణాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఉపాధ్యాయులకు గణితం, బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్పడం రాదంటూ ఫిర్యాదు చేశాడు. తాను ఐఏఎస్ కావలనుకుంటున్నాని కానీ అందుకు తన కుటుంబ ఆర్థిక సరిపోదని, పైగా తన తండ్రి సంపాదన అంతా అతని తాగుడుకే ఖర్చు అయిపోతుందంటూ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. దీంతో నితీష్ కుమార్ తనతో ఉన్న అధికారులు ఆ పిల్లవాడి ఆవేదనను వినవల్సిందిగా సూచించారు.
అంతేగాదు అక్కడకు వచ్చిన మీడియా వాళ్లతో కూడా ఆ బాలుడు చాలా ధైర్యంగా మాట్లాడాటమే కాకుండా తన సమస్యను వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఆ బాలుడి వాగ్ధాటిని చూసి అబ్బురుపడటమే కాకుండా ఏ మాత్రం తడబడకుండా ధైర్యంగా తన సమస్యను అధికారులతో చెప్పడం గ్రేట్ అంటూ ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
वाक़ई एक भावुक कर देने वाला दृश्य है ये। हर एक बच्चा को क्वालिटी एजुकेशन ज़रूरी ताकि वो अपनी और अपनों को एक क्वालिटी लाइफ़ दे पाए। बिहार की मिट्टी ऐसे टैलेंट से भरी पड़ी है।
— Bihar_se_hai (@Bihar_se_hai) May 15, 2022
Credits: News Pick
.
.
.
.#bihar #biharsehai #nitishkumar #bihargovernment pic.twitter.com/y9Bn8KzFGv
(చదవండి: వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి చివాట్లు తిన్న ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment