Quality of education
-
పాఠశాలలో చేర్పించమని సీఎంనే అభ్యర్థించిన బాలుడు: వీడియో వైరల్
Bihar Boy Complains Nitish Kumar About Lack of Quality Education: ఇటీవలకాలంలో ప్రముఖులు, సెలబ్రెట్రీలు అధికారుల లేదా ప్రభుత్వ సంస్థల నుంచి తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు గురించి విన్నాం. అధికారులు కూడా వెంటనే స్పందించి ఫిర్యాదులను స్వీకరించిన సందర్భాలు అనేకం. ఐతే ఇక్కడొక బాలుడు తనను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించమని సాక్షాత్తు ముఖ్యమంత్రినే అభ్యర్థించాడు. వివరాల్లోకెళ్తే...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన పూర్వీకులు గ్రామమైన నలంద జిల్లాలోని కళ్యాణ్ బిగహాల్ పర్యటించారు. ఈ మేరకు ఆయన ఆ గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, ఫిర్యాదులను వినడమే కాకుండా వారి వద్ద నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారు. ఇంతలో ఆ ప్రజల సముహం నుంచి 11 ఏళ్ల సోను అనే బాలుడు చేతులు ఊపుతూ సీఎంతో మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం లేదని అందువల్ల తనని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అని ముఖ్యమంత్రిని అభ్యర్థించాడు. అంతేగాదు ప్రభుత్వ పాఠశాలలోని బోధన ప్రమాణాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఉపాధ్యాయులకు గణితం, బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్పడం రాదంటూ ఫిర్యాదు చేశాడు. తాను ఐఏఎస్ కావలనుకుంటున్నాని కానీ అందుకు తన కుటుంబ ఆర్థిక సరిపోదని, పైగా తన తండ్రి సంపాదన అంతా అతని తాగుడుకే ఖర్చు అయిపోతుందంటూ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. దీంతో నితీష్ కుమార్ తనతో ఉన్న అధికారులు ఆ పిల్లవాడి ఆవేదనను వినవల్సిందిగా సూచించారు. అంతేగాదు అక్కడకు వచ్చిన మీడియా వాళ్లతో కూడా ఆ బాలుడు చాలా ధైర్యంగా మాట్లాడాటమే కాకుండా తన సమస్యను వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఆ బాలుడి వాగ్ధాటిని చూసి అబ్బురుపడటమే కాకుండా ఏ మాత్రం తడబడకుండా ధైర్యంగా తన సమస్యను అధికారులతో చెప్పడం గ్రేట్ అంటూ ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. वाक़ई एक भावुक कर देने वाला दृश्य है ये। हर एक बच्चा को क्वालिटी एजुकेशन ज़रूरी ताकि वो अपनी और अपनों को एक क्वालिटी लाइफ़ दे पाए। बिहार की मिट्टी ऐसे टैलेंट से भरी पड़ी है। Credits: News Pick . . . .#bihar #biharsehai #nitishkumar #bihargovernment pic.twitter.com/y9Bn8KzFGv — Bihar_se_hai (@Bihar_se_hai) May 15, 2022 (చదవండి: వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి చివాట్లు తిన్న ఎమ్మెల్యే) -
‘నవోదయ’= నాణ్యమైన విద్య
నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన నవోదయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా దేశంలోనే అగ్రస్థానంలో వెలుగొందుతున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏవై రెడ్డి మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు పాఠశాల స్థాయిలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు. నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాలో పక్కా భవనాలు, మౌలిక వసతులు, యోగా, క్రీడలు, కంప్యూటర్, పోటీ పరీక్షల శిక్షణతో విద్యార్థుల సంపూర్ణ వికాసానాకి తోడ్పతున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో సేవలు అందిస్తున్నారని వివరించారు. ఫలితాల సాధనలో హైదరాబాద్ రీజియన్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డైరెక్టర్ జంధ్యాల వెంకట రమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, జగదీశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యాన్ని అక్రమంగా నిల్వచేయడం, బ్లాక్ మార్కెటింగ్‌లకు పాల్పడే మిల్లర్లపై, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు ధాన్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుకొని, కృత్రిమ కొరత సృష్టించకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 5.5లక్షల బోగస్ కార్డులు సరెండర్ అయ్యాయని, ఆధార్‌ను పీడీఎస్‌కు అనుసంధానించడం ద్వారా మరో 34 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను ఏరివేశామని మంత్రి వివరించారు. నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం అందరికి నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) నాల్గవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘మన తెలంగాణ - మన విద్యా విధానం’పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖకు అందించే నిధులను పెట్టుబడి అని అనాలి అంతేకానీ ఖర్చు చేశాం అనకూడదని, పిల్లలు ప్రపంచంలో పోటీపడే నైపుణ్యాన్ని సంపాదించుకుంటే సమాజానికి ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆటవీ మంత్రి జోగు రామన్న, టీయూటీఎఫ్ అధ్యక్షులు స్వామిరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి డి.మల్లారెడ్డి తదిరతులు పాల్గొన్నారు.