
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీని కించపరిచేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకుగాను సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మొర్చా ఉపాధ్యాక్షుడు, న్యాయవాది ఎమ్‌ఏ ఖావి అబ్బాసీ మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గౌరవనీయులైన ప్రధాని మోదీపై కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment