సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడియత్నం విఫలమైంది. ఆదివారం రాత్రి నుంచే బీజేపీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డిని తెల్లవారుజామున బర్కత్‌పురలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను ఇంటి నుంచి కదలనీయకుండా పోలీసులు కట్టడి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కిషన్‌రెడ్డిని కలసి సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌ను చిక్కడపల్లి క్యాంప్ ఆఫీస్‌లోనే పోలీసులు నిర్బంధించారు. 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన్ను కదలనీయకుండా కట్టడి చేశారు. చివరకు అనారోగ్యంగా ఉన్నాను, ఇంటికెళ్లి భోజనం చేస్తానని చెప్పడంతో పోలీసులను ఎస్కార్ట్‌గా పంపి ఇంటి నుంచీ బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కార్యకర్తలతో కలసి ప్రగతిభవన్ వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యలోనే అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి పోలీసు వాహనాలను అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment