
ఇండోర్‌లోని పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేలా ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు పై డీసీపీ స్పందించడమే కాకుండా సత్వరమే విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు
landlords threatened Take Down The photo of PM Modi: పోలీస్‌స్టేషన్‌లో కొంతమంది చాలా విచిత్రమైన ఫిర్యాదులు చేస్తుంటారు. ఇవన్నీ పోలీసులకు మాములే. కానీ కొన్ని ఫన్నీగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులు ఆగ్రహానికి గురై సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక వ్యక్తి పోలీసులకు ఒక విచిత్రమైన కంప్లైయింట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...ఇండోర్‌లోని పీర్ గలి నివాసి యూసుఫ్ మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. తనకు ప్రధాని మోదీ అంటే ఇష్టం అని, ఆయన సిద్ధాంతల పట్ల గౌరవంతో తాను అద్దెకు తీసుకుంటున్న ఇంట్లో మోదీ ఫోటోను పెట్టుకున్నాని యాసుఫ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే భూస్వాములు యాకూబ్ మన్సూరి సుల్తాన్ మన్సూరీ ప్రధాని మోదీ చిత్రపటాన్ని తొలగించాలని ఒత్తిడి చేయడమే కాకుండా తీయకపోతే ఇంట్లోంచి గెట్టేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పాడు. దీంతో డీసీపీ మనీషా పాఠక్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు సదర్ బజార్ టీఐని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
(చదవండి: 74 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా... నెటిజన్లు ఫిదా)