పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.
వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment