Misa Bharti
-
Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
పాటలీపుత్ర లోక్‌సభ స్థానం బీజేపీ, ఆర్జేడీ మధ్య హోరాహోరీ పోరుకు వేదికైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. ఆయన చేతిలో రెండుసార్లు ఓడిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కూతురిని ఎలాగైనా గెలిపించుకోవాలని లాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు... బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైంది. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూడటం విశేషం. అది కూడా ఒకప్పటి తన శిష్యుడు జేడీ(యూ) నేత రంజన్ ప్రసాద్ యాదవ్ చేతిలో! తర్వాత మీసా భారతిని బరిలో దింపారు. తనను కాదని కూతురికి టికెటివ్వడంతో లాలుతో విభేదించిన రామ్‌కృపాల్ 2014లో ఆర్జేడీని వీడి బీజేపీలో చేరారు. 2014, 2019ల్లో రెండుసార్లు మీసా భారతిని ఓడించారు. విద్యార్థి సంఘాల నుంచి ఎదిగిన రామ్ కృపాల్ 1993లో ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1996లో, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు ఎంపీగా చేసిన ఆయనకు బిహార్‌లో గట్టి రాజకీయ బలం ఉంది. పాటలీపుత్ర నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధముంది. పిలిస్తే పలికే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గమంతా కలియదిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. రామమందిర నిర్మాణ ప్రభావం కూడా ఇక్కడి ఓటర్లపై బాగా ఉండటం ఆయనకు మరింత కలిసి రానుంది.మీసా... మూడోసారిపాటలీపుత్రలో ఆర్జేడీ ఓటమి పరంపరకు ఈసారి ఎలాగైనా బ్రేక్ వేయడానికి మీసా ప్రయతి్నస్తున్నారు. లాలు, భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సహా కుటుంబమంతా ఆమె గెలుపు కోసం పని చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం 2019లో మీసాకు బాగా మైనస్‌గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపప్రథను కూడగట్టుకున్నారు. ఈసారి కూడా ఎన్నికలవగానే మాయమవుతారా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో ఉండి పని చేస్తారా అంటూ ప్రచారం పొడవునా ప్రజలు ఆమెను నిలదీస్తున్న పరిస్థితి! అయితే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ 2019లో ఉన్నంత బలంగా లేకపోవడం మీసాకు కాస్త ఊరట. పైగా పాటలీపుత్ర లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలూ ఆర్జేడీ, దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రచారా్రస్తాలుగా సంధిస్తున్నారామె.కుల సమీకరణాలు... బీజేపీకి మద్దతిచ్చే బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాల ఓట్లు పాటలీపుత్రలో లక్షకు పైగా ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లున్న భూమిహార్ ఓటర్లలోనూ ఆ పార్టీకి బలముంది. 5 లక్షల యాదవ, 1.7 లక్షల కుర్మీ, 3 లక్షల దళిత ఓట్లు రామ్ కృపాల్, మీసా మధ్య చీలనున్నాయి. యాదవులతో పాటు 1.5 లక్షల ముస్లిం ఓట్లను మీసా నమ్ముకున్నారు. కాకపోతే మజ్లిస్ బరిలో ఉండటంతో ముస్లిం ఓట్లు చీలి ఆర్జేడీకి గట్టి నష్టమే చేసేలా కన్పిస్తోంది. హోరాహోరీ పోరు లో ఈసారి పాటలీపుత్రలో లాంతరు వెలుగుతుందో, ముచ్చటగా మూడోసారీ కమలమే వికసిస్తుందో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Video: రాహుల్ గాంధీకి తప్పిన ముప్పు.. కుంగిన స్టేజ్
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. బిహార్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ నిల్చున్న వేదిక కొంతభాగం కుంగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి నేతలు సభ ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, మిసా భారతితో కలిసి రాహుల్ గాంధీ స్టేజ్‌పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉండటంతో స్టేజ్ కొంతమేర కూలింది. దీంతో కొంత బ్యాలెన్స్ కోల్పోయిన రాహుల్.. మిసా భారతి చేతులు పట్టుకుని మళ్లీ సర్దుకున్నారు.వెంటనే రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్ నుంచి దిగిపోవాలని రాహుల్‌కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్ గాంధీ ప్రసంగించారు.मंच टूट सकता है, हौसला नहीं!#Rahul_Gandhi_जीpic.twitter.com/CjvfvibFco— 🇮🇳 Vishal JyotiDev Agarwal 🇮🇳 (@JyotiDevSpeaks) May 27, 2024 -
లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. బీహార్‌లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన.. లాలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మిసా భారతి.. రోహిణి ఆచార్య. అసలు మిసా అంటే ఏమిటి..? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అసలు లాలు యాదవ్ ఆ పేరు పెట్టడం వెనుక ఏమైనా స్టోరీ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేసేస్తున్నారు.మిసా భారతి1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని 'మిసా' అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి కుమార్తెకు లాలూ ప్రసాద్ యాదవ్ 'మిసా భారతి' అని పేరు పెట్టారురోహణి ఆచార్యఇక.. తన రెండో కూతురు రోహణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే.. ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రబ్రీదేవీకి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్‌కు డాక్టర్ కమలా ఆచార్య ధైర్యం చెప్పారు. ఆ తరువాత రబ్దీదేవికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.ఆపరేషన్ పూర్తయిన తరువాత.. ఆపరేషన్‌కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్ నుంచి తీసుకునేందుకు డాక్టర్ కమలా ఆచార్య ఒప్పుకోలేదు. అంతే కాకుండా రెండో కుమార్తె పుట్టిన నక్షత్రం రోహిణి కావడంతో.. డాక్టర్ పేరు, రోహిణి నక్షత్రం వచ్చేలా 'రోహిణి ఆచార్య' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా.. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు.2013లో వరకు లాలూ ప్రసాద్ యాదవ్ సారణ్ సేట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుండగా.. పాటలీపుత్రలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. పాటలిపుత్ర నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే.. లాలూ కూతుళ్లు ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
బెంగాల్ గవర్నర్‌పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాష్ట్రంలో రాజకీయ నేతలు ధ్వజమెత్తారు. ఈ తరుణంలో ఆర్జేడీ నేత మిసా భారతి కూడా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై వచ్చిన అభియోగం ఆందోళన కలిగించే విషయం. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మిసా భారతి అన్నారు. ఈమె పాట్లీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.ఈ విషయం మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు. -
ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత ఈ నెలలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదిలావుండగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి రామాలయ అంశం కలిసివచ్చేదిగా కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా అయోధ్య రామాలయంవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు తాను కూడా త్వరలో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని, ఎన్నికల అనంతరం రామాలయానికి వెళ్తామన్నారు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ పాదాలను తాకడంపై మిసా భారతి మాట్లాడుతూ అది మన సంస్కృతి అని అన్నారు. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి
పాట్నా/గయ: బిహార్‌లో ఇటీవలే ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్త ఈ శైలేష్ కుమార్. ఇటీవల లాలూ పెద్ద కుమారుడు, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో జరిగిన రెండు అధికారిక భేటీల్లో అతడు పాల్గొన్నట్లు వీడియో దృశ్యాలు, ఫొటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ తన అధికారిక విధులను బావ శైలేష్ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చాడని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపించారు. శైలేష్ నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆర్మీలో చేరాలనుకున్నా! కానీ.. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
ప్రధాని డిన్నర్ పార్టీకి ఆర్జేడీ దూరం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో చిన్నారుల మరణాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఎంపీలకు ఇచ్చే విందును తమ పార్టీ బహిష్కరిస్తుందని ఆర్జేడీ నేత మిసా భారతి పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే డిన్నర్ ఖర్చుతో ప్రభుత్వం చిన్నారులకు వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయవచ్చని ఆ పార్టీ నేత, ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి అన్నారు. కాగా, ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో ఇప్పటివరకూ 140 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపుతోంది. చిన్నారులు చికిత్స పొందుతున్న శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్పత్రిని 2500 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో తక్షణమే 1500 నూతన పడకలను ఏర్పాటు చేయాలని ఆస్పత్రిలో చేరిన వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ధర్మశాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. -
‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’
పాట్నా : చేతికి ఉన్న ఐదు వేళ్లు మాదిరిగానే.. కుటుంబంలోని వారంతా కూడా ఒకేలా ఉండరు. అందరి ఇళ్లలో మాదిరే తమ ఇంట్లో కూడా సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయన్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి. పాట్నాలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మిసా ఈ సందర్భంగా తమ సోదరుల గురించి మాట్లాడారు. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లే తమ సోదరుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చలున్నాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వ సాధరణమని తెలిపారు. కానీ ఆ విబేధాలు అన్ని ఇంటికే పరిమితమని.. పార్టీ కోసం మాత్రం అందరూ కలసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు గొడవపడటం వల్ల కార్యకర్తల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీలోని ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోతూ పార్టీకోసం పని చేయాలని మిసా భారతి కోరారు. ప్రస్తుతం లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్విల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాలూ తన కుమారులిద్దరిని గొడవలు మాని.. కలిసిమేలసి ఉండలాని, పార్టీకి కోసం పని చేయాలని సూచించినట్లు సమాచారం. -
లాలూ కుటుంబానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది. ఢిల్లీ, పాట్నలోని కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక లాలూ కూతురు మిసాభారతి, భర్త శైలేష్ కుమార్ ఆస్తులకు తుది అటాచ్మెంట్ ఆర్డర్‌ను జారీచేసింది. బినామి ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఐటీ ఈ చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే లాలూ ప్రసాద్‌పై ఐటీ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 5నే సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో మిసాభారతి ఫామ్‌హౌజ్‌ను ఈడీ అటాచ్ చేసింది. బినామి ఆస్తుల విచారణలో భాగంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా ఐటీ ఆగస్టులో విచారించింది. -
లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు
-
లాలూ కూతురును చుట్టుముడుతున్న కష్టాలు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురును కష్టాలు చుట్టుముడుతున్నాయి. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కూతురు మీసా భారతీ చార్టెడ్ అకౌంటెంట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌కు అదనంగా తాజాగా సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి నరేశ్ కుమార్ మల్హోత్రా ముందు చార్జిషీట్‌ను ఈడీ అధికారులు దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే, దీనిపై వచ్చే నెల(ఆగస్టు) 9న విచారణ చేస్తామని న్యాయమూర్తి చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 35మందిపై ఈడీ అధికారులు చార్జిషీట్ నమోదు చేసింది. -
ఎంపీ మిసా భారతికి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా లాలూ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మిసా భారతికి సోమవారం ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. అలాగే ఢిల్లీలోని మిసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్ చేసే యోచనలో ఉంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రెండో రోజుల క్రితం ఆమె నివాసంతో పాటు ఫాంహౌస్‌లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసిన విషయం తెలిసిందే. మిసా, ఆమె భర్త బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని భావిస్తున్న ఈడీ అధికారులు.. గత నెలలో వారిని విచారించారు. తాజాగా మరోసారి విచారణ పట్టిన అధికారులు.. ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఫోన్లు కూడా సీజ్ చేశారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టి, కేసులు నమోదు చేసింది. -
ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన భార్య రబ్రీ దేవీ, కూతరు మిశా భారతి, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. వీరి బినామీ ఆస్తులను సీజ్ చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులకు అటాచ్ మెంట్ నోటీసులు పంపింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీచేసింది. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.170-రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని పన్ను అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అటాచ్ మెంట్లలో పాట్నాలో ఫుల్వారీ షరీఫ్ లో ఉన్న తొమ్మిది ప్లాట్స్ ఉన్నాయి. ఇవే ఆస్తులను మే నెలలో కూడా డిపార్ట్ మెంట్ సీజ్ చేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఆదాయపన్ను కూడా ఎగ్గొట్టారన్న విమర్శలు వచ్చాయి. లాలూతో పాటు ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అక్రమంగా భూ ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బీజేపీ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మే నెలలో దాడులు జరిపారు. విచారణలో భాగంగా ఐటీ డిపార్ట్ మెంట్ ఢిల్లీ విచారణ వింగ్ ముందు హాజరుకావాలని రెండు సార్లు లాలూ ప్రసాద్ కూతురికి, ఆయన భర్తకు సమన్లు జారీచేసింది. కానీ వాటిని వారు ధిక్కరించారు. ఐటీ సమన్లను ధిక్కరించినందుకు మిశాభారతికి 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు. -
అక్కాతమ్ముళ్లకు ఐటీ ఝలక్
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాలూ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, లాలూ తనయ మీసా భారతిల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. తేజస్వీ, మీసా, ఆమె భర్త శైలేష్‌యాదవ్‌లకు చెందినవిగా భావిస్తోన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. బినామీ ఆస్తుల వ్యవహారంలో విచారణా సంస్థ ఎదుట హాజరుకావాల్సిందిగా మీసా భారతికి గతంలో రెండు సార్లు సమన్లు జారీచేశామని, వాటికి ఆమె స్పందించకపోవడంతో దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు. తాజా వ్యవహారంపై లాలూ స్పందించాల్సిఉంది. -
మిసా భారతికి రూ.10 వేల జరిమానా
న్యూఢిల్లీ: లాలుప్రసాద్ కుమార్తె, ఎంపీ మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది. రూ.1000 కోట్ల బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో ఆమె మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. సమన్లను ఉల్లంఘించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ఐటీ అధికారులను కోరారు. అయితే దీనికి తగిన కారణం తెలియజేయకపోవడంతో అధికారులు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించారు. లాలూ కుమార్తె, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మే 22న ఆదాయపుపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
లాలూ కుమార్తెకు జరిమానా
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపన్ను శాఖ తాజాగా సమన్లు జారీ చేసింది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మిసా భారతి భర్త శైలేశ్‌కుమార్ రేపు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు అధికారి ముందు హాజరుకానున్నారు. రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఈరోజు విచారణ అధికారి ముందు మిసాభారతి హాజరుకావాల్సివుంది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో రూ. 10 వేలు జరిమానా విధించింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా దర్యాప్తు అధికారి తిరస్కరించారు. లాలూ తనయ, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో గత నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వీరి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు మే 22న అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా భారతి, శైలేశ్‌లకు ఆదాయపన్ను శాఖ సమన్లు జారీ చేసింది. -
లాలూ కూతురికి ఐటీ సమన్లు
-
లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు
న్యూఢిల్లీ: రూ.వెయ్యి కోట్లు బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్‌కు ఆదాయపు పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. మే 22న వీరి అకౌంటెంట్ రాజేశ్‌కుమార్ అగర్వాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా జూన్ మొదటి వారంలో ఎంపీ భారతి, శైలేశ్‌కుమార్ తమ ముందు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఐటీ దాడులతో తనను మాట్లాడకుండా ఆపడం బీజేపీకి సాధ్యం కాదని లాలూ ట్వీటర్లో పేర్కొన్నారు. -
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్‌రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు. రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్‌కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. -
మీసా భారతిపై మనీలాండరింగ్ ఆరోపణలు
నకిలీ కంపెనీలతో నల్లధనాన్ని తెలుపుగా మార్చారు: సుశీల్ మోదీ పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కూతురు, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి నకిలీ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని బిహార్ బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. అలా ఆమె ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో చవకగా ఓ వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నారని తెలిపారు. లాలూ కుమారులు, బిహార్‌లో మంత్రులైన తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు రూ.1000 కో ట్లను అక్రమంగా పోగేశారని సుశీల్ ఇంతకు ముందు ఆరోపించారు. మీసా అనుమానాస్పద రీతిలో తన కంపెనీ షేర్లను అమ్మి, తిరిగి కొనుగోలు చేసి నల్ల ధనాన్ని తెలుపుగా మార్చారని వెల్లడించారు. 2008–09లో ఆమె కేవలం రూ.1.41 కోట్లకు కొనుగోలు చేసిన ఫార్మ్‌హౌస్ వెల ఇప్పుడు కనీసం రూ.50 కోట్లుంటుందని పేర్కొన్నారు. లాలూ అధికారిక నివాసాన్నే మీసా తన కంపెనీ చిరునామాగా మార్చి, దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆమె తన ఆదాయ వనరులను వెల్లడించలేదని తెలిపారు. ఈ ఆరోపణలపై ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి స్పందిస్తూ... ఏం పనిలేని సుశీల్ మోదీ నిరాశ, నిస్పృహలో ఉన్నారని, బీజేపీలో తన ఉనికిని కాపాడుకోవడానికే చాలా ఏళ్ల క్రితం న్యాయంగా జరిగిన వ్యాపార లావాదేవీలను తేవనెత్తుతున్నారని అన్నారు. -
మరో వారసురాలు వచ్చేసింది..
పట్నా: బిహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. లాలు కుటుంబం నుంచి రాజకీయవారసులుగా వచ్చినట్టుగా, చట్టసభ ప్రతినిధులుగా ఎన్నికైనట్టుగా ఆ రాష్ట్రం నుంచి మరే కుటుంబం నుంచి రాలేదు. లాలు ప్రసాద్ దాదాపు ఎనిమిదేళ్లు బిహార్ సీఎంగా ఉన్నారు. దాణా కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు రావడంతో భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత లాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు. మధ్యలో కొన్నాళ్లు అధికారానికి దూరమైనా.. గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూతో పొత్తుపెట్టుకుని మళ్లీ పూర్వవైభవం సాధించారు. లాలు ఈసారి వారసులను తెరపైకి తెచ్చారు. లాలు పుత్రరత్నాల్లో తేజస్వి యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్ర మంత్రి అయిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కుటుంబం నుంచి మరో వారసురాలు చట్టసభకు ఎన్నికయ్యారు. లాలు పెద్ద కూతురు మీసా భారతి ఆర్జేడీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఇంతకుమందే రాజకీయాల్లో అరంగేట్రం చేసినా 2014 లోక్‌సభ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. పాటలీపుత్ర నియోజవర్గం నుంచి పోటీచేసిన భారతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఆమె లోక్‌సభ మెట్లు ఎక్కలేకపోయారు. లాలు ఇప్పుడు తన ముద్దుల తనయను రాజ్యసభకు పంపి ఆమె ముచ్చట తీర్చారు. రాజ్యసభ టికెట్ రేసులో స్వయంగా లాలు భార్య రబ్రీదేవి పోటీకి వచ్చినా.. ఆయన కూతురుకే ఓటేశారు. ఈ విషయంలో తేజ్ ప్రతాప్, తేజస్విలు సోదరికే మద్దతుగా నిలిచారు. ఏమైతేనేం లాలు కుటుంబం నుంచి మరొకరు చట్టసభ సభ్యులయ్యారు. మీసా భారతికి 1999లో వివాహమైంది. ఆమె భర్త పేరు శైలేష్ కుమార్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. లాలు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇప్పుడు కుమార్తె, వీరితో పాటు బావమరుదులు.. రాజకీయాల్లో లాలూ ఫ్యామిలీయా మాజాకానా..! -
భార్యకు మొండిచేయి చూపిన లాలూ
పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు. లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి సీటు ఇచ్చారు. సతీమణిని పెద్దల సభకు పంపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం సస్పెన్స్ కొనసాగింది చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెంఠ్మలానీకి మరొ స్థానం కేటాయించారు. ఆదివారం ఆయన ఆర్జేడీలో చేరారు. తాను లాలూ ప్రసాద్ కు స్నేహితుడిని, రక్షకుడిని అని జెంఠ్మలానీ ప్రకటించుకున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఐదు స్థానాలు జులైలో ఖాళీ అవుతాయి. -
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
-
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
బిహార్ అంటే... అందునా లాలు ప్రసాద్ అంటే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన ఇద్దరు కొడుకులు రాష్ట్రంలో మంత్రులు. అందులోనూ చిన్నకొడుకు ఉప ముఖ్యమంత్రి కూడా. అయితే, ఇంతకుముందు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన భార్య, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతురు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఎందుకు ఉండాలి అనుకున్నారేమో గానీ.. వాళ్లిద్దరినీ రాజ్యసభకు పంపాలని లాలు నిర్ణయించేశారు. వచ్చే సంవత్సరం బిహార్ నుంచి రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ ఎంపిక చేశారు. రబ్రీదేవికి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఖాయమని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకోవడంతో ఆర్జేడీ సులభంగా రెండు రాజ్యసభ స్థానాలను పొందుతుంది. ఒక్కో అభ్యర్థికి అసెంబ్లీ నుంచి కేవలం 41 ఓట్లు వస్తే చాలు. అంటే, మిత్రపక్షాలైన జేడీ(యూ) లేదా కాంగ్రెస్ నుంచి ఇద్దరు తమవాళ్లకు ఓట్లేస్తే చాలని లాలు చూస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు 2016 జూలైలో రిటైర్ కానున్నారు. తాను జాతీయస్థాయిలో పనిచేస్తానని, తమ్ముడు నితీష్ బిహార్‌ను చూసుకుంటాడని లాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కావాలి గానీ.. తాను ఎటూ ఎన్నిక కాలేడు కాబట్టి భార్యను, కూతురిని పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రబ్రీదేవి ఎటూ మాజీ సీఎం కాబట్టి, ఆమెకు పెద్ద బంగ్లానే వస్తుంది. మీసాభారతి మాత్రం రాజకీయ పదవి పొందడం ఇదే తొలిసారి అవుతుంది. అది కూడా నేరుగా రాజ్యసభకు వెళ్లడం విశేషం. 2014 ఎన్నికల్లో ఆమె పాటలీపుత్ర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసింది. కానీ, అప్పటివరకు లాలుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రామ్ కృపాల్ బీజేపీలోకి వెళ్లి, ఆమెను ఓడించారు. కానీ మీసాభారతిని ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న లాలు.. ఇప్పుడు అవకాశం రావడంతో పెద్దల సభకు పంపేస్తున్నారు. -
మోదీజీ క్షమాపణలు చెప్పండి: లాలు తనయ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయ మిసా భారతి.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలపై ఫైర్ అయ్యారు. బిహార్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందంటూ తప్పుడు ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన మోదీ, బీజేపీ నాయకులు.. 11 కోట్ల మంది బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2014-15లో జీఎస్డీపీలో బిహార్ 17.6 శాతం నమోదు చేసిందని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నట్టు మిసా భారతి చెప్పారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఓడించడం కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. బీజేపీ నేతల ఆరోపణలు తప్పని నీతి ఆయోగ్ నివేదిక నిరూపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల తరపున స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా మిసా విస్తృతంగా పర్యటించారు. బిహార్‌లో ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
డిప్యూటీ సీఎంగా మీసా భారతి?
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో మూడు పార్టీలు 4:4:2 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రం తన కూతురు మీసా భారతికి ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పట్టుబట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మాత్రమే పోటీచేసే విజయం సాధించారు. మీసాభారతి గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆమెను శాసన మండలికి పంపించి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలు ఆశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండి, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తన పీఏ భోలా యాదవ్ స్థానాన్ని తన కూతురికి కేటాయిస్తారని చెబుతున్నారు. అలాగే కుమారులిద్దరిలో ఒకరికి తప్పనిసరిగా మంత్రిపదవి తీసుకుంటారని అంచనా. అయితే, ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలన్న విషయమై నిర్ణయం తీసుకోవడం మాత్రం లాలుకు కష్టమే. బిహార్ అసెంబ్లీ స్థానాలను బట్టి చూస్తే గరిష్ఠంగా 36 మంది మంత్రులు కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ ముందు జాగ్రత్తగా 8-10 స్థానాలను ఖాళీగా ఉంచుకుని, తర్వాత విస్తరించుకోవాలన్నది సీఎం నితీష్ కుమార్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇక అనూహ్యంగా ఈ ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలనే భావిస్తోంది. ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేస్తామని తాము బిహార్ ప్రజలకు మాటిచ్చామని, దాన్ని అమలుచేస్తామని బిహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సీపీ జోషి అన్నారు. ఈ పార్టీ నుంచి ప్రధానంగా అశోక్ కుమార్ చౌదరి, సదానంద సింగ్, అవధేష్ కుమార్ సింగ్, షకీల్ అహ్మద్ ఖాన్, మహ్మద్ జావేద్‌లలో కొందరికి మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
చీకట్లోనే ఓటేసిన మీసాభారతి
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమార్తె మీసా భారతి చీకట్లోనే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీహార్‌లోని ఏడు లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో భాగంగా గురువారం నాడు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, నలంద, జెహానాబాద్, ముంగేర్, ఆరా, బుక్సర్ స్థానాలు అన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న మీసాభారతి గురువారం ఉదయం ఓటు వేయడానికి వెళ్లేసరికి పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా లేదు. దాంతో చీకట్లోనే ఆమె తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా, హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్, మీసాభారతితో పాటు ఆమె ఇద్దరు బాబాయిలు రాంకృపాల్ యాదవ్, రంజన్ యాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం 42,600 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వారితో పాటు 152 కంపెనీల కేంద్ర బలగాలు, 42 కంపెనీల బీహార్ మిలటరీ పోలీసులను కూడా రంగంలోకి దించారు. -
లాలూ కూతురా..! మజాకా..!
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తన ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కోసం ఏకంగా ఇద్దరు ఐఐటీ పట్టభద్రులను నియమించుకున్నారు. వైద్యురాలైన మీసా భర్త శైలేశ్‌కుమార్ ఐటీ నిపుణుడు. ఆయన తెరవెనుక పాత్ర పోషిస్తుండగా, సోషల్ మీడియా ద్వారా యువతరం ఓట్లను ఆకట్టుకునే పని చేపట్టేందుకు పంకజ్ సుదాన్, పర్వీన్ త్యాగి అనే ఐఐటీ పట్టభద్రులను నియమించుకున్నారు. బీహార్ రాజధాని పాట్నా పరిధిలోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీసా ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తుండటంతో పాటు ప్రచార నిర్వహణపై ఐఐటీ నిపుణులిద్దరూ ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు న్యూయార్క్‌కు చెందిన జమీల్ అక్తర్ అనే వైద్యుడు ఎన్నికల ప్రచార సభల్లో మీసా చేసే ప్రసంగాలకు తుది మెరుగులు దిద్దే పనిలో తలమునకలవుతున్నారు. ఆజాద్‌కుమార్ అనే మరోవైద్యుడు గ్రామీణ ఓటర్ల నాడిని పసిగట్టి, అందుకు అనుగుణంగా ఎన్నికల వ్యూహంలో చేసుకోవలసిన మార్పులపై మీసాకు సలహాలిస్తున్నారు. -
లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్!
పాట్నా: ఓటర్లను ఆకట్టుకునేందుకు సాగించే ఎన్నికల్లో ప్రచారానికి పలు రకాలైన పద్దతులను రాజకీయ నాయకులు చేపడుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తే మిసా భారతి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఐఐటీ నిపుణులు, వైద్యులను మీసా భారతీ ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రచారానికి మీసా భారదీ భర్త శైలేష్ కుమార్ అండదండలు అందిస్తున్నారు. డాక్టర్ గా సేవలందిస్తున్న మీసా పాటలీ పుత్ర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తన ప్రచార మేనేజ్ మెంట్ కు ఇద్దరు ఐఐటీ ప్రొఫెషనల్స్ పంకజ్ సూడన్, పెర్ వీన్ త్యాగిలను నియమించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ వర్గాలను కలిసేందుకు, వారితో వ్యవహరించేందుకు తగిన సలహాలను, సూచనలను అందిస్తున్నారు. సూడన్ గుర్గావ్ లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, త్యాగి స్వంతంగా ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారు రూపొందించిన ఫేస్ బుక్ పేజ్ కు పాట్నా ప్రజల నుంచి ఆమోఘ స్పందన రావడంతో మీసా ఆనందంతో తబ్బిబ్బువుతున్నారు. -
కూతురు ఒత్తిడితో గ్యాంగ్ స్టర్ కు పార్టీ పదవి!
రాజకీయాల్లో ఎంత ఉద్దండులైనా ఒక్కోసారి కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలవొగ్గాల్సిందేనని లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రుజువు చేశారు. తన కూతురు ఒత్తిడి కారణంగా గ్యాంగ్ స్టర్ రిత్ లాల్ యాదవ్ కు పార్టీలో చోటు కల్పించారు. కూతురు మిసా భారతి కారణంగా రిత్ లాల్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని కట్టబెట్టారు. బీహార్ లోని పాటలీ పుత్ర లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి గెలుపు కోసం రిత్ లాల్ కృషి చేయనున్నారు. దాంతో రిత్ లాల్ సేవలకు గుర్తుగా పార్టీ పదవిని కట్టబెట్టేందుకు తండ్రి లాలూపై మిసా పలు అస్త్రాలను ప్రయోగించినట్టు తెలుస్తోంది. పాటలీ పుత్ర నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టున్న రిత్ లాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలువనున్నట్టు చేసిన ప్రకటనతో కంగారు పడిన లాలూకి పార్టీ పదవి కట్టబెట్టక తప్పలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేత సత్య నారాయణ్ సిన్హా హత్య కేసులో పాట్నాలోని బేర్ జైలులో రిత్ లాల్ శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిత్ లాల్ కు అనుమతి మంజూరైంది. ఈ నియోజకవర్గంలో జేడీ(యూ) అభ్యర్థి రంజన్ ప్రసాద్ యాదవ్, బీజేపీ నుంచి రామ్ కృపాల్ యాదవ్, ఆర్జేడి పార్టీ నుంచి మిసా భారతి బరిలో ఉన్నారు. రిత్ లాల్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే మిసా భారతి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో పార్టీ పదవిని లాలూ కట్టబెట్టారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 2015లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రిత్ లాల్ భార్యకు టికెట్ ఇస్తానని లాలూ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
మీసా భారతి దెబ్బా.. మజాకా!
లాలూ ప్రసాద్ పెద్ద కూతురు మీసా భారతి దెబ్బకు ఆర్జేడీ ఎంపీ ఒకరు ఏకంగా తన ఇల్లు వదిలి వెళ్లిపోయి.. మళ్లీ తిరిగొస్తే ఒట్టు! అంతేకాదు, ఆయన ఆర్జేడీకి రాజీనామా కూడా చేసిపారేశారు. తన పెద్ద కూతురు మీసా భారతి ఈసారి బీహార్‌లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని లాలూ ప్రకటించారు. దాంతో లాలూకు రెండు దశాబ్దాలుగా సన్నిహితుడిగా పేరొందిన రాం కృపాల్ యాదవ్ తాను పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఆయన పాటలీపుత్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతో.. మీసాభారతి నేరుగా రాంకృపాల్ యాదవ్ ఇంటికి వెళ్లి, రాజీ ప్రయత్నాలు చేద్దామనుకున్నారు. కానీ ఆమె వస్తున్న విషయం తెలిసి రాంకృపాల్ బయటకు వెళ్లిపోయారు. ''నేను రాంకృపాల్ బాబాయ్‌ని కలవాలని వచ్చాను. ఆయన నా అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం కావాలంటే నేను పోటీనుంచి తప్పుకుంటా. చాచాతో మాట్లాడకుండా ఇక్కడినుంచి వెళ్లేది లేదు. ఎప్పటికైనా ఆయన తిరిగొస్తారు'' అని ఆమె చెప్పారు. కానీ ఎంతసేపటికీ ఆయన రాకపోవడంతో మళ్లీ వస్తానంటూ వెళ్లిపోయారు. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) కింద లాలూ ప్రసాద్ ఎమర్జెన్సీ సమయంలో 1975-77 మధ్య కాలంలో జైల్లో ఉన్న లాలూ, తన పెద్ద కూతురికి ఆ పేరే పెట్టేశారు. లాలూకు మొత్తం తొమ్మిది మంది సంతానం ఉండగా, వారిలో పెద్దకుమార్తె మీసా (37). ఆయన కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నా.. వాళ్లకింకా ఎన్నికల్లో పోటీచేసేంత వయసు లేదు.