‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’ | Misa Bharti Said That Tejashwi and Tej Pratap Are Fighting | Sakshi
Sakshi News home page

‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’

Published Tue, Oct 9 2018 11:27 AM | Last Updated on Tue, Oct 9 2018 11:29 AM

Misa Bharti Said That Tejashwi and Tej Pratap Are Fighting - Sakshi

తేజశ్వి యాదవ్‌ - తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (ఫైల్‌ ఫోటో)

పాట్నా : చేతికి ఉన్న ఐదు వేళ్లు మాదిరిగానే.. కుటుంబంలోని  వారంతా కూడా ఒకేలా ఉండరు. అందరి ఇళ్లలో మాదిరే తమ ఇంట్లో కూడా సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయన్నారు బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి. పాట్నాలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మిసా ఈ సందర్భంగా తమ సోదరుల గురించి మాట్లాడారు.

ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లే తమ సోదరుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చలున్నాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వ సాధరణమని తెలిపారు. కానీ ఆ విబేధాలు అన్ని ఇంటికే పరిమితమని.. పార్టీ కోసం మాత్రం అందరూ కలసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు గొడవపడటం వల్ల కార్యకర్తల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీలోని ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోతూ పార్టీకోసం పని చేయాలని మిసా భారతి కోరారు.

ప్రస్తుతం లాలూ కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజశ్విల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాలూ తన కుమారులిద్దరిని గొడవలు మాని.. కలిసిమేలసి ఉండలాని, పార్టీకి కోసం పని చేయాలని సూచించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement