
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్‌శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు.
మంగళవారం రాత్రి తేజస్వీ, రాజ్‌శ్రీల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు కుటుంబానికి సన్నిహితులు, బంధువులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి.
చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి)
Comments
Please login to add a commentAdd a comment