rajeshwari
-
జ్ఞాపకాల గని
ఆ తరం ఈ తరం అనే తేడా లేకుండా అన్ని తరాలకు స్ఫూర్తినిచ్చే పేరు... రాజేశ్వరి ఛటర్జీ(Rajeshwari Chatterjee). కర్నాటక తొలి తరం మహిళా ఇంజినీర్(woman engineer)గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఆనాటి కుటుంబ పరిమితులు, కాలపరిమితులు అధిగమించి పెద్ద చదువులు చదువుకుంది. ఆమె చరిత్ర అంటే... మన దేశంలో కంప్యూటర్ సాంకేతికత తొలి తరం చరిత్ర. అనేకానేక పరిమితులు అధిగమించి విద్యాఉద్యోగాల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకున్న మహిళల చరిత్ర.ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఐఐఎస్సీ, బెంగళూరు) చైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేసిన తరువాత రాజేశ్వరి ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. విశ్రాంత జీవితంలోనూ విలువైన పనులెన్నో చేసింది. ఆర్కైవ్లకు ఉపయోగపడే పనులెన్నో చేసింది.‘ఆర్కైవ్ తొలినాళ్లలో ఆమె స్వచ్ఛందంగా సహాయం చేసింది. తన సహోద్యోగులు, విద్యార్థుల గురించి తెలుసుకోవడానికి మాకు సహాయపడింది. ఎన్నో వ్యక్తిగత ఫోటోలు సేకరించి ఆర్కైవ్కు బహుమతిగా ఇచ్చింది’ అని గుర్తు చేసుకున్నారు ఐఐఎస్సీ ఆర్కైవ్ అండ్ పబ్లికేషన్స్ సెల్ మాజీ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శరత్ అహుజా.బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో మొదటి మహిళా ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఛటర్జీ అత్యంత క్లిష్టమైన పనిని చేపట్టింది. ఐఐఎస్సీ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా ఆర్కైవల్ కలెక్షన్‌తోపాటు పూర్వవిద్యార్థుల పుస్తకాన్ని సంకలనం చేసింది.కంప్యూటర్ల హవా, ఇంటర్నెట్ ఊసులేని కాలంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా తన కాలానికి సంబంధించిన పరిమితులు అధిగమించింది.‘1949లో సెలవుల్లో ఎంఐటీకి వెళ్లినప్పుడు విశాలమైన గదుల్లో ఉంచిన తొలితరం కంప్యూటర్లలో ఒకదాన్ని చూశాను. మీ అరచేతిలో పట్టుకోగలిగే ఆధునిక లాప్టాప్లుప్రారంభరోజుల్లోని ఆ భారీ కంప్యూటర్ల కంటే ఎక్కువ పని చేయగలవని ఊహించగలరా?’ అని ఐఐఎస్సీ పూర్వ విద్యార్థుల పుస్తకంలో రాసింది. పీహెచ్డీ చేయాలనే రాజేశ్వరి కల రెండోప్రపంచ యుద్ధంతో భగ్నం అయింది. అయినప్పటికీ ఆమె తన ఆకాంక్షను వదులుకోలేదు. పరిశోధనను కొనసాగించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి, రసాయన శాస్త్రవేత్త రోషన్ ఇరానీల తర్వాత ఐఐఎస్సీ నుంచి స్కాలర్షిప్ పొందిన మూడో మహిళగా ఛటర్జీ గుర్తింపు పొందింది. -
భారత ట్రాప్ షూటర్లకు నిరాశ
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో తొలిరోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల, పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగాల్లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి 113 పాయింట్లతో 8వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–6లో నిలిచినవారు ఫైనల్ చేరుకుంటారు. భారత్‌కే చెందిన భవ్య 19వ ర్యాంక్‌లో, మనీషా 24వ ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో భౌనీష్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్ రాజేశ్వరి కుమారి ఐదో స్థానంలో నిలిచింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో రాజేశ్వరి 19 పాయింట్లు సాధించింది. రాజేశ్వరి ప్రదర్శనతో భారత్‌కు ఈ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. ఇప్పటివరకు షూటింగ్ క్రీడాంశంలో భారత్‌కు ఏడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. -
R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం!
గృహిణిగా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎలాగూ తప్పదు. ఇక ఆదాయ మార్గం గురించి ఆలోచించడం, వాటిని అమలులో పెట్టడం అంటే తగిన వనరులే కాదు ఇంటిల్లిపాదీ అందుకు సహకరించాలి. హైదరాబాద్ బండ్లగూడ నాగోల్‌లో ఉంటున్న ఆర్.రాజేశ్వరి ని కలిసినప్పుడు ‘పదేళ్లుగా చేస్తున్న పచ్చళ్లు, పొడుల వ్యాపారం... ఆదాయంతో పాటు బిజినెస్ ఉమన్‌గానూ గుర్తింపును తెచ్చిపెట్టింది’ అని వివరించింది. ‘మన ఇళ్లల్లో అన్ని కాలాల్లోనూ ఏవో ఒక పచ్చళ్లు పెట్టడం అనేది గృహిణులకు అలవాటైన పనే. ఇంట్లో నేనూ అలాగే చేస్తుండేదాన్ని. నా చేతి పచ్చళ్లు రుచికరంగా ఉంటాయని ఇంట్లోనూ, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్లు బాగా మెచ్చుకునేవారు. అడిగి మరీ చేయించుకునేవారు. దీనికితోడు నాకు తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన పచ్చడి, పొడులు తయారు చేసిమ్మని అడిగేవారు. పదేళ్ల క్రితం... నోటి మాటతోనే ఒకరొకరుగా పచ్చళ్లు చేసిమ్మని అడిగేవారి సంఖ్య పెరగడం మొదలయ్యింది. దీనినే చిన్న వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. మా ఊరు గుంటూరుకు వెళ్లినప్పుడల్లా అక్కడ రైతుల దగ్గరకు వెళ్లి, కావల్సిన సరుకులను నేరుగా పొలాల నుంచే సేకరించేదాన్ని. ఒకటే నియమం పెట్టుకున్నాను. కేవలం వెజ్ పచ్చళ్లును మాత్రమే పెట్టాలి. అలాగే, రసాయనిక ఎరువు వాడకుండా పండించిన ఆర్గానిక్ పంటల నుంచే సేకరించాలనుకున్నాను. నేరుగా రైతులను కలిసి, వారి ద్వారా పంటలను కొనుగోలు చేయడం, వాటిని బాగుచేయించి, తీసుకురావడమూ పెరిగింది. మిర్చి, పసుపు, మసాలా దినుసులు వంటివి ఏయే ప్రాంతాల్లో ఏయే ఏవి అధికంగా పండుతాయో తెలుసుకుని, ఆ దినుసులను సేకరిస్తూ ఉంటాను. ఒక్కరిగానే... మొదట్లో ఒక్కదాన్నే పచ్చళ్లకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని. అందుకు తగిన పనుల ప్లానింగ్ కూడా చేసుకున్నాను. మెల్లగా మార్కెట్ పెరుగుతుండటంతో సాయానికి మరొకరిని నియమించుకుని, పనులు చేస్తూ వచ్చాను. కామాక్షి ఫుడ్స్ పేరుతో పదేళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని రిజస్టర్ చేయించుకొని, ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. మొదట్లో అంతగా తెలియకపోయినా మార్కెట్ గురించి నాకు నేనుగానే ఓ అంచనా వేసుకుంటూ షాప్స్, ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ల ద్వారానూ పచ్చళ్లు సిద్ధం చేస్తుంటాను. టొమాటో, గోంగూర, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ.. వంటి పచ్చళ్లు, పొడుల తయారీ రోజూ ఉంటుంది. రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యే నా దినచర్య తిరిగి, రాత్రి పదిగంటలకే పూర్తవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు ఉద్యోగి. ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. ఏడాదికి ఇరవై లక్షల ఆదాయంతో ఈ మార్గం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా చేత్తో నలుగురికి రుచికరమైన పచ్చళ్లను అందివ్వడమే కాదు, నాతో పాటు ఇంకొందరికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది. ఆర్డర్లను బట్టి తయారీ విధానాన్ని ఎంచుకుంటాను కాబట్టి నష్టం అనే సమస్య ఎప్పుడూ రాలేదు. చేసే పనిలో ముందుగానే అంచనా ఉంటే అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇంటితోపాటు సమర్థవంతంగా నిర్వర్తించే సత్తా మహిళలకెలాగూ ఉంటుంది’ అని వివరిస్తుంది రాజేశ్వరి. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
ఆమె మనోస్థైర్యం ఎంతో అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ కొనియాడారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి.. ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోస్థైర్యం నిరూపించిందన్నారు కేటీఆర్. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమన్న ఆయన.. రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం కమ్ముకుంది. కానీ, చెదరని గుండె నిబ్బరంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారామె. ఆత్మవిశ్వాసంతో ఆమె రాసిన కవితలు మంచి ఆదరణ పొందాయి. ‘‘సంకల్పం ముందు వైకల్యం ఎంత!. ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!. ఎదురీత ముందు విధిరాత ఎంత!. పోరాటం ముందు ఆరాటం ఎంత!.. అంటూ రాజేశ్వరి ఓ కవిత రాసిందామె. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి ‘‘జీవితమే కవిత్వం..’’ అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే. కానీ అమె మాత్రం జీవిస్తుంది.. అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం అంటూ పేర్కొన్నారు. సంబంధిత వార్త: కాళ్లతో కవితలు రాసిన ‘సిరిసిల్ల’ రాజేశ్వరి ఇక లేరు -
Sircilla Rajeshwari: సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆమె వైకల్యాన్ని ఎదురించింది. కాలి వేళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి. ఆ కవితలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె గాథ.. మరికొందరిలో స్పూర్తి నింపింది కూడా. కానీ, దురదృష్టవశాత్తూ.. కాళ్లతో కవితలు రాసే కవయిత్రిగా దక్కించుకున్న ఆమె ఇక లేరు. కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లో ఓ పేద నేతన్న కుటుంబంలో మూడో సంతానంగా జన్మించింది బూర రాజేశ్వరి. పదిహేనవ ఏట దాకా ఆమె నడవలేదు. అయితే.. వైకల్యాన్ని చూసి ఏనాడూ ఆమె బాధపడలేదు. కసిగా కవితలు రాయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు సాంబయ్య, అనసూయల ప్రోత్సాహంతో చదువుకుంది. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారామె. సుమారు 700ల దాకా కవితలు రాసి అందరినీ ఆకట్టుకున్నారామె.ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయట. రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు. తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.ఈ విషయాన్ని కేవీ రమణాచారి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ సాహిత్యంలో ఆమె రాణించడం.. కేసీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. దివ్యాంగురాలు కావడంతో.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను ఆమె కవిత రూపంలో రాశారు. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో రాజేశ్వరి జీవిథ గాధను చాలా టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే 42 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స అందినా ప్రాణం నిలవలేకపోయింది. రాజేశ్వరి మృతి పట్ల స్థానికంగా సంతాపం వెల్లడిస్తున్నారు. ఆమె మృతి వార్తను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె సాహిత్య ప్రయాణాన్ని.. మహారాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ సిలబస్‌లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించడం గమనార్హం. -
సూపర్ మార్కెట్లో టీమిండియా క్రికెటర్ గొడవ
టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఒక సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడింది. తన స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఏదో విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కాసేపటికే ఆ గొడవ పెద్దదిగా మారింది. ఎంతలా అంటే రాజేశ్వరి గైక్వాడ్ కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేసే వరకు వెళ్లింది. కర్నాటకలోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గొడవ చేసిన తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికి తర్వాత ఆమె సన్నిహితులు వచ్చి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవకు సంబంధించిందంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.దీంతో సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్ మార్కెట్ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. 2014లో ఇండియా తరఫున శ్రీలంకతో మ్యాచ్ ద్వారా రాజేశ్వరి గైక్వాడ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2017లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్‌లో రాజేశ్వరి సభ్యురాలు. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది. -
పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, జంతికలు.. మొత్తం 80 రకాలు! ఇంట్లోనే పిండివంటలు చేస్తూ..
‘‘అక్కా! ఈ జంతికలు సరిగ్గా కాలాయో లేదో ఓ సారి చూస్తావా!’’.. ‘‘ఉషా! తోటకూర వేపుడు పొడి చేయిస్తున్నావా? కమ్మటి వాసన వస్తోంది!!’’ ... ‘‘పెద్దమ్మాయి పిల్లలకు మునగాకు పొడి కావాలట. ప్యాక్ చేయించక్కా!’’.. ‘‘పాలు వచ్చాయి... కోవా బాణలి స్టవ్ మీద పెట్టమ్మాయ్. నేను వస్తున్నా... అడుగంటకుండా కాగాలి పాలు. గులాబ్ జామూన్ మృదువుగా ఉండాలి’’ సికింద్రాబాద్, న్యూ బోయిన్ పల్లి, ‘బాణలి’లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇది. ఇద్దరూ అరవయ్యేళ్లు దాటిన వాళ్లే. వాళ్లకు అధిక బరువు సమస్య ఎలా ఉంటుందో తెలియదు. జుట్టుకు డై వేయాల్సిన అవసరమూ రాలేదు. ‘ఆరోగ్యంగా తింటే అనారోగ్యం ఎందుకు వస్తుంది’ అంటారు. ఆరోగ్యంగా తినడం అంటే... మన సంప్రదాయ వంటకాలేనంటారు వాళ్లు. ‘‘మేము రోజూ ఆవకాయతో మొదలు పెట్టి గడ్డపెరుగుతో పూర్తి చేస్తాం. ఏ అనారోగ్యమూ లేదు. రోజూ ఒక ముద్ద వేడి అన్నంలో నెయ్యి, మునగాకు పొడి కలిపి తినండి. రోజూ సున్నుండ, నువ్వులుండ తినండి. మెత్తగా జారిపోయే కేకుల బదులు వేరుశనగ పట్టీని పటపటా కొరికి బాగా నమిలి తినండి. మా ఇంట్లో అలాగే తింటాం. ఆరోగ్యంగా ఉన్నాం. అనారోగ్యం పాలవుతున్న కొత్తతరానికి ఆరోగ్యపు బాట వేయడానికే ఈ పని మొదలు పెట్టాం’’ అంటూ ‘బాణలి’ పేరుతో హోమ్‌ఫుడ్ సెంటర్ ప్రారంభించడానికి కారణాన్ని వివరించారు ఈ అక్కాచెల్లెళ్లు దాట్ల రాజేశ్వరి, పెన్మెత్స ఉష. వంటలన్నీ ఇంట్లోనే ‘‘మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, దర్భరేవు గ్రామం. పదహారేళ్లకే మాకు పిండివంటలు చేయడం నేర్పించింది మా అమ్మ. మా నాన్న కలిదిండి సత్యనారాయణ రాజు. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో రోజూ అతిథులుండేవారు. రకరకాలు వండడం వడ్డించడంలో మా అమ్మకు రోజు సరిపోయేది కాదు. పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ మామగారు మునసబు. గ్రామానికి ఏ ఉద్యోగి వచ్చినా భోజనం మా ఇంట్లోనే. ఏ ఫంక్షన్ అయినా అన్నీ ఇంట్లోనే వండేవాళ్లం. పెళ్లి, పేరంటాలకు పాతిక కావిళ్లు సారె పంపించడం... ఇలా ఎప్పుడూ వండడమే. ఒక్కమాటలో చెప్పాలంటే వండడం తప్ప మరొకటి తెలియదు, వంటల్లో మాకు తెలియనిది లేదు’’ అన్నారు రాజేశ్వరి. వంద రుచులు వచ్చు! ‘‘పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, చెగోడీ–జంతికల వంటివి మొత్తం ఎనభై రకాలు వండుతాం. ఇతర వంటకాలన్నీ కలిపి వంద రకాలు వచ్చు. మాకు వంటల పుస్తకాలు తెలియదు. దినుసులన్నీ ఉజ్జాయింపుగా వేయడమే. వంటల పుస్తకాలు రాయమని చెప్తున్నారు. కానీ దేనికీ కొలతలు పాటించం, కొలతలతో వండడం మాకు తెలియదు. కొలతలతో చెప్పడమూ తెలియదు. మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నాం. మా దగ్గర పని చేసే వాళ్లకూ అలాగే నేర్పించాం’’ అన్నారు ఉష. పలాస జీడిపప్పు... నర్సాపురం బెల్లం ‘‘వండడం వస్తే సరిపోదు, దినుసుల్లో నాణ్యత కూడా ముఖ్యమే. బెల్లం నర్సాపురం నుంచి, కారం బోధన్ నుంచి, జీడిపప్పు పలాస నుంచి, మంచి ఆవునెయ్యి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో దినుసులు ఎలాగ మంచివి తెచ్చుకుంటామో అలాగే ఇదీనూ. మా అమ్మాయి హైదరాబాద్‌లో ఉండడంతో తరచూ అమ్మాయి ఇంట్లో పది– ఇరవై రోజులుండేవాళ్లం. మనుమడు ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లు తింటుంటే... ఇదేం తిండి అనిపించేది. ఒంటికి బలం రాని తిండితో పిల్లలు ఊబదేలుతారు, ఎముక పుష్టితో పెరగరు. అందుకే ఇంట్లో రకరకాల పిండివంటలు చేసేదాన్ని. అమ్మాయి స్నేహితులు, వాళ్ల పిల్లలు ఎంతో మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించేది. ‘మీ చేతిలో ఉన్న విద్య విలువ మీకు తెలియడం లేదు. చాలామందికి మన గోదారి జిల్లాల వంటల పేర్లు తప్ప రుచి కూడా తెలియదు. అందరికీ పరిచయం చేయవచ్చు కదా! నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించనూ వచ్చు. అన్నింటికంటే ముందు మన పిల్లలతోపాటు అందరి పిల్లలూ ఆరోగ్యంగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులు కూడా వస్తాయి’ అని మా వియ్యంకులు చెబితే... ఎందుకో చాలా బిడియం వేసింది. మాకు చక్కగా వండి పెట్టడమే తెలుసు, వంటను అమ్మడం చిన్నతనంగా అనిపించింది. కానీ వాళ్ల మాటలు కాదనలేక మొదలుపెట్టాం. గత ఏడాది ఉగాది రోజు మొదలైంది. ఇప్పుడు మా వంటల్ని కొన్నవాళ్లు నాలుగువేల మంది. ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌గారు ఈ సెంటర్‌ను చూసి మమ్మల్ని అభినందించారు. ‘ఈ వంటలు మీ తరంతో అంతరించి పోకూడదమ్మా. కొత్త తరానికి అందించండి’ అని చెప్పారాయన. అంతపెద్ద ఆఫీసర్‌గారు ప్రశంసిస్తుంటే మేము చేస్తున్న పని మంచిదే అని మాకు ధైర్యం వచ్చింది’’ అన్నారు ఉష. అక్కడ ఇడ్లీ ప్రియం! ‘ఈ స్టోర్ చూసిన వాళ్లు మీ ఇద్దరే ఇన్ని చేస్తున్నారా! అని ఆశ్చర్యపడుతుంటారు. ఈ వయసులో చక్కటి ఆరోగ్యం మీది’ అని మెచ్చుకుంటారు. దేహానికి మంచి ఆహారం, తగినంత శ్రమ ఉంటే అనారోగ్యాలెందుకు వస్తాయి? అంటారు రాజేశ్వరి. ‘చపాతీలు చేయాలంటే గోధుమలు రోట్లో దంచాం, పిండి తిరగలితో విసిరాం. గారెలకు పిండి రోట్లో రుబ్బాం. ఈ చేతులకు ఈ పని పెద్ద పనేమీ కాదు’’ అని స్టోర్‌లో ఉన్న రకరకాల పిండివంటలను చూపించారీ సీనియర్ సిస్టర్స్. ఇంకా... ‘‘మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం ఉంది. ముందు తరాలకు అందివ్వాలి. వీటిని మన తరంతో అంతరించిపోనివ్వకండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ల పిల్లలకు వీటిని వండడం నేర్పించండి. మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడం ఫ్యాషన్ అనుకుంటున్నాం. పాశ్చాత్యదేశాల వాళ్లు మన ఇడ్లీ, దోశెలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మన రుచిని మర్చిపోవద్దు. మన పోపుల పెట్టె ఔషధాల గని. తరతరాలకు అందించండి’’ అని సాటి మహిళలకు ఓ మంచిమాట చెప్పారు. మరొక్క చిన్నమాట... ‘మేము స్వీట్లు చేస్తాం. కానీ తినం. రోజూ ప్రతి స్వీట్నీ తయారైనప్పుడు తప్పకుండా రుచి చూస్తాం. ఎక్కువ మోతాదులో తింటే రుచిని గుర్తించడం కష్టం’ అన్నారు. బహుశా! వీళ్ల విజయ రహస్యం, ఆరోగ్య రహస్యం ఇదే కావచ్చు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్ చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు -
ఆకాశవాణి... యూఎస్ కేంద్రం!
ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం. తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం. ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్‌లో తెలుగు వాణి ఆమె. యూఎస్ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి. ‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్ ప్రోగ్రామ్స్‌లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి. ‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్‌కి ప్రమోట్ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్. అందుకే నిన్ను స్టేజ్ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్పోజర్ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది. రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్ ట్రాక్స్, యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్ స్క్రీన్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడాయన సీరియల్స్‌లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్ స్క్రీన్ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను. ఎంసీఏ తర్వాత వెబ్స్మార్ట్లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్‌లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్‌కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్ చేసుకోవడం అనే ఒక రొటీన్ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ. అమ్మ చెప్పింది అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్‌లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్‌లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు. ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్ఎమ్ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది. సినిమాను స్టేజ్ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్‌లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది. మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్‌లో నెరేషన్ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్‌లో ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె. హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్ హైస్కూల్ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి. రెండు గంటలు ఎవరూ కదల్లేదు యూఎస్... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్గా చిత్రీకరించి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. – ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి. -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి తేజస్వీ, రాజ్శ్రీల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు కుటుంబానికి సన్నిహితులు, బంధువులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
అమ్మ మనసు చాటారు
పోలీసులుగా మగువలు తమ సత్తా చాటుతున్నారు. అడ్డంకులను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఆపదల్లో, విపత్తుల్లో మానవత్వాన్ని చూపుతూ ఖాకీ విలువను పెంచుతున్నారు. అమ్మగా బిడ్డ ఆలన చూస్తూనే విధులనూ అంతే నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. జనం మధ్య జనం కోసం ఎదుగుతున్న ఈ మహిళా పోలీసులు జనం నోట వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు తమ పని పట్ల గొప్ప నిబద్ధత చూపుతూనే ఉన్నారు. వ్యవస్థను నియంత్రణలో ఉంచడంలో కరకుగా వ్యవహరిస్తూ, ఆపదలో రక్షణ ఇస్తూ, విపత్కర పరిస్థితుల్లో స్నేహహస్తాన్ని అందిస్తూ తన ప్రాధాన్యతను చాటుతోంది ఖాకీ నారి. ఆపదలో రక్షణ ఇటీవల చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఓ చెట్టుకూలి మీద పడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఓ 28 ఏళ్ల వ్యక్తిని రక్షించి, భుజాల మీద మోసుకెళ్లి, ఆటోరిక్షా వద్దకు చేర్చిన మహిళా పోలీసు వీడియో వార్తల్లో నిలిచింది. ఆమె చూపిన తెగువకు ఎంతో మంది అభినందనలు తెలిపారు. ఆ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు రాజేశ్వరి. 53 ఏళ్ల వయసు. వార్తా కథనాల ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు రాజేశ్వరికి ఫోన్‌కాల్ వచ్చింది. టిపి ఛత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో ఉదయకుమార్ అనే వ్యక్తి చెట్టు కొమ్మ మీద పడటంతో మరణించాడని ఆ ఫోన్ సారాంశం. మహిళా పోలీసు తన బృందంతో ఆ శ్మశానవాటికకు వెళ్లింది. కూలిన చెట్టును తొలగించి చూడగా ఉదయకుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. శ్మశాన వాటికలో పనిచేసే ఉదయకుమార్, స్నేహితుడితో కలిసి అతిగా మద్యం సేవించడం వల్ల అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అయితే ఉదయకుమార్ మరణించాడనుకున్న అతని స్నేహతుడు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న రాజేశ్వరి అతని స్నేహితుడిని మందలించి, సకాలంలో ఉదయకుమార్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేసింది. ఆపద సమయాల్లో తను మహిళ అని, మధ్యవయస్కురాలని ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసు విధిని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆమెను ఎంతోమంది కొనియాడారు. నిస్సహాయతలో ... అక్టోబర్ 31న అస్సామ్‌లో బొకాజన్ హెచ్ఎస్ స్కూల్ సెంటర్లో టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ రాయడానికి ఓ తల్లి తన చంటిబిడ్డతో సహా వెళ్లింది. బయట ఆ బిడ్డను చూసుకునేవారు ఎవరూ లేక, పరీక్షకు హాజరు కాలేనేమోనన్న భయంతో ఉన్న ఆ తల్లి పరిస్థితిని చూíసి చలించిపోయిన అక్కడి మహిళా పోలీసు ఆ బిడ్డను తన అక్కున చేర్చుకుంది. పరీక్ష జరిగినంత సేపు ఆ పసివాడిని జాగ్రత్తగా చూసుకుంది. ఈ మహిళా పోలీసు బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్న చిత్రాన్ని ఎమ్మెల్యే నుమల్ మోమిన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ‘మానవ స్పర్శ ఎల్లప్పుడూ అవసరం. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ చిత్రం ఎన్నో అర్థాలను చెబుతుంది. ఈ రోజు ఆ తల్లి సమస్యను పరిష్కరించి, బిడ్డను చూసుకున్న లేడీ కానిస్టేబుల్ శ్రీమితి కాచే బేపి కి సెల్యూట్ చేస్తున్నాను’ అని పోస్ట్ పెట్టిన గంటలోపే ఆ మహిళా పోలీసుకు అభినందనలు వెల్లువలా వచ్చాయి. 2019లో అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో టెట్ పరీక్షకు హాజరైన వారి పిల్లలను పట్టుకున్న మహిళా పోలీసు కూడా ఇలాగే అధికారుల ప్రశంసలు పొందారు. కాబోయే అమ్మ... గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డ గురించి తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో మనకు తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తన బాధ్యతను గుర్తెరిగి గర్భవతిగా ఉన్నా విధి నిర్వహణలో పాల్గొంది ఛత్తీస్‌గడ్‌లోని డీఎస్పీ శిల్పా సాహూ. కరోనా మహమ్మారి కారణంగా గత ఏప్రిల్‌లో చాలా చోట్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించారు. అలాంటి సమయంలో ఛత్తీస్గడ్ బస్తర్‌లోని దంతెవాడలో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ విధులను నిర్వర్తిస్తున్న ఐదునెలల గర్భిణి డీఎïస్పీ శిల్పాసాహూ వీడియో వెలుగులోకి వచ్చింది. ‘నక్సల్ ఆపరేషన్లలో కూడా అత్యుత్తమంగా పనిచేసిన సాహూ, ఈ కష్టకాలంలోనూ తన పరిస్థితిని లెక్కచేయకుండా విధులను నిర్వర్తించడం అభినందనీయం’ అని పోలీసు డైరెక్టర్ జనరల్ అవస్తి ట్విటర్ వేదికగా ప్రశంసించారు. అదే వేదికగా ఎంతోమంది సాహూకి తమ అభినందనలు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ ముంౖ»ñ ని వరదలు ముంచెత్తుతున్నప్పుడు ఓ మహిళా పోలీసు వృద్ధ దంపతులను రక్షించిన సందర్భం ఎంతోమంది హృదయాలను కదిలించింది. దాదర్‌లోని హింద్మాతా ప్రాంతంలోని వీధి మొత్తం నీళ్లు. అలాంటి వీధి గుండా వెళ్లేందుకు వృద్ధ దంపతులు ప్రయత్నిస్తున్నారు. ఆ నీళ్ల నుండి బయటపడే మార్గం లేక, ప్రాణాలను అరచేతుల్లో పట్టుకున్నారు. ఆ వీధిలో ప్రజలకు సాయం చేస్తూ, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ క్షణం విరామం తీసుకోకుండా పనిచేస్తున్న మహిళా పోలీసు ఈ జంటను రక్షించడానికి చేసిన ప్రయత్నం ఎంతోమందిని కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో తిరిగిన ఈ వీడియోకు నెటిజన్లు ఎన్నో ప్రశంసలు అందజేసి, పోలీసులకు అభివాదం తెలిపారు. ముంబై వరదల్లో వృద్ధ జంటను రక్షిస్తున్న మహిళా పోలీస్ -
షఫాలీ, రాజేశ్వరి, పూనమ్ రౌత్‌లకు ప్రమోషన్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేశారు. వార్షిక కాంట్రాక్ట్ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గ్రేడ్ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్ ‘బి’ వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్ ‘సి’ వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి. గత ఏడాది కాంట్రాక్ట్ పొందిన ఏక్తా బిష్త్, వేద కృష్ణమూర్తి, హేమలత, అనూజా పాటిల్‌లకు ఈసారి స్థానం లభించలేదు. టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్, ఓపెనర్ పూనమ్ రౌత్‌లకు ప్రమోషన్ లభించింది. ఈ ముగ్గురు గ్రేడ్ ‘సి’ నుంచి గ్రేడ్ ‘బి’లోకి వచ్చారు. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ గ్రేడ్ ‘బి’లోనే కొనసాగనుండగా... బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షల చొప్పున): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షల చొప్పున): మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షల చొప్పున): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్. -
రాజేశ్వరి అబ్దుల్లా కూతురు
ఇటీవలే మసీదులో ఒక హిందూ జంట పెళ్లి జరిపించి లౌకిక తత్వాన్ని చాటుకుంది కేరళ. ఇప్పుడు మళ్లీ అలాంటి వేడుకతో మానవత్వానికీ ప్రతీకగా నిలిచింది. కేరళలోని కున్నరియమ్ పట్టణానికి చెందిన అబ్దుల్లా కుటుంబం రాజేశ్వరి అనే హిందూ అమ్మాయికి విష్ణు అనే అబ్బాయితో గుడిలో పెళ్లి జరిపించింది. కున్నరియమ్‌కు చెందిన శరవణన్ అనే రైతుకూలీ కూతురు రాజేశ్వరి. అబ్దుల్లా ఇంట్లో, అతని తోటలో పనిచేసేవాడు శరవణన్. దాంతో చిన్నప్పటినుంచీ రాజేశ్వరికీ అబ్దుల్లా కుటుంబంతో చనువుండేది. రాజేశ్వరి తల్లిలేని పిల్ల. తండ్రితో రోజూ అబ్దుల్లా వాళ్లింటికి రావడం.. అక్కడే అతని పిల్లలతో ఆడుకోవడం చేస్తూండేది. ఈ క్రమంలో శరవణన్ కూడా అనారోగ్యం బారినపడి.. కన్నుమూశాడు. అప్పటికి రాజేశ్వరి వయసు ఏడేళ్లు. అనాథ అయిన ఆ అమ్మాయిని అబ్దుల్లా కుటుంబం అక్కున చేర్చుకుంది. తమ ముగ్గురు కొడుకులతోపాటు రాజేశ్వరినీ పెంచింది. ఇప్పుడు రాజేశ్వరికి ఇరవై రెండేళ్లు. ఆ ఊరికే చెందిన విష్ణు అనే అబ్బాయి రాజేశ్వరిని ఇష్టపడ్డాడు. ఈ విషయం అబ్దుల్లా వాళ్లింట్లో తెలిసి పెళ్లి విషయం మాట్లాడ్డానికి అబ్బాయి వాళ్లింటికి వెళ్లాడు అబ్దుల్లా తన భార్యను తీసుకొని. ఆ ఇంటి వియ్యం అందుకోడానికి విష్ణు తల్లిదండ్రులు జయంతి, బాలచంద్రన్ సంతోషంగా ఒప్పుకున్నారు. కాని పెళ్లి గుడిలోనే జరగాలనే ఒక షరతుతో. ‘దానికేముంది తప్పకుండా’ అని వియ్యాల వారి కోరికను మన్నించారు అబ్దుల్లా అండ్ ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాలు కలిసి.. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండే గుడి కోసం వెదికి.. చివరకు కసరగాడ్ లోని మన్యొట్టు దేవాలయాన్ని ఓకే చేసుకున్నారు. ఆ గుడిలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంటుంది. పెళ్లిరోజు అమ్మాయి వాళ్లకన్నా ముందే అబ్బాయి వాళ్లు ఆ గుడికి చేరుకుని.. పెళ్లి కూతురి తరపు వాళ్లకు స్వాగతం పలికారు. ఆలయం లోపల.. వేడుక జరిగే చోట .. కాస్త దూరంగా నిలబడి చూస్తున్న అబ్దుల్లా కుటుంబాన్ని చేయిపట్టుకొని మరీ తీసుకొచ్చి అమ్మాయి పక్కన నిలబెట్టారు విష్ణు తల్లిదండ్రులు. ఈ పెళ్లికి అబ్దుల్లా తల్లి .. 84 ఏళ్ల సఫియుమ్మతో సహా అబ్దుల్లా బంధువులంతా హాజరయ్యారు. ఇదీ రాజేశ్వరీ పరిణయకథ. -
సీనియర్ సినీ గాయని ఎంఎస్. రాజేశ్వరి కన్నుమూత
ప్రఖ్యాత సినీ గాయని ఎంఎస్.రాజేశ్వరి (87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. రాజేశ్వరి పూర్తి పేరు మదురై శఠగోపన్ రాజేశ్వరి. శఠగోపన్, రాజసుందరి కూతురైన రాజేశ్వరి 1932 ఫిబ్రవరి 24న చెన్నైలో జన్మించారు. రాజేశ్వరి తల్లి రంగస్థల నటి. బామ్మ కన్నామణియమ్మాళ్ కర్ణాటక సంగీత గాయని. ఎంఎస్.రాజేశ్వరి 12 ఏళ్ల ప్రాయంలోనే గాయనిగా పరిచయం అయ్యారు. రాజేశ్వరిని ప్రఖ్యాత దివంగత దర్శకుడు బీఆర్.పంతులు స్టార్ ప్రొడక్షన్స్ సంస్థలో పరిచయం చేశారు. 1946లో ‘విజయలక్ష్మి’ అనే చిత్రంలో తొలిసారిగా పాడారు. గోవిందరాజులు నాయుడు సంగీత దర్శకత్వంలో ‘మైయల్ మిగవుమ్ మీరుదే’ అనే పాటను పాడారు.ఆ తరువాత ‘సంసార నౌక’ చిత్రంలో ఒక పాట పాడారు. 1948లో ‘రాజముక్తి’ చిత్రంలో త్యాగరాజ భాగవతార్‌తో కలిసి ‘కణ్వళి నుళైందు ఎన్ ఉళ్లమ్ కవంర్ద ’ అనే పాటను పాడారు. అయితే ఈ పాట చిత్రంలో చోటు చేసుకోలేదు. కాగా ఏవీఎం సంస్థలో కంపెనీ గాయనిగా ఏడు సంవత్సరాలు తన సేవలను అందించారు. ఆ సంస్థ నిర్మించిన ‘నామ్ ఇరువర్’ చిత్రంలోని ‘మహాన్ గాంధీ మహాన్..’ అనే పాట ఎంతో పాచుర్యం పొందింది. అప్పట్లో చిన్నారుల గొంతుకు రాజేశ్వరి గుర్తింపు పొందారు. మియా మియా పూనైకుట్టి, కోళి ఒరు గూట్టిలే సేవల్ ఒరు గూట్టిలే లాంటి పలు పాటలు రాజేశ్వరి గానంతో మధుర గీతాలుగా నేటికీ వినిపిస్తున్నాయి. తమిళ, తెలుగు మొదలగు దక్షిణాది భాషల్లో 500లకు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆమె చివరిగా ‘శివరాత్రి’ (1993) సినిమాలో ‘నటరాజు హారాన్ని నాగరాజు..’ ఆనే పాట పాడారు. ఏవీ. మెయ్యప్పన్ నుంచి బీఆర్. పంతులు, సోము, బీమ్సింగ్, పి.నీలకంఠన్, ఎంవీ.రామన్, కేవీ.శ్రీనివాసన్, మణిరత్నం, రామనాథన్ తదితర పలువురు దర్శకుల చిత్రాల్లో రాజేశ్వరి ఆలపించారు. ఎంఎస్.రాజేశ్వరికి వెంకటేశన్ అనే కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అనారోగ్యంతో మరణించిన రాజేశ్వరి భౌతికకాయానికి గురువారం సాయంత్రం క్రోమ్‌పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
(విశాఖపట్నం) : ఎంవీపీ లాసన్స్ బే కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని మూడో పట్టణ పోలీసులు కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం మార్చురీ వద్ద మృతురాలి తల్లి సుబ్బలక్ష్మి, సోదరి శిరీష తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరుకు చెందిన సునీల్ రాజు (36), విశాఖపట్నం పాత ఐటీఐ వద్ద నివాసం ఉంటున్న రాజేశ్వరి (33)లకు గత ఏడాది ఆగస్టులో ఏలూరులోని ఓ చర్చిలో ఫాస్టర్ సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరూ లాసన్స్‌బే కాలనీలో కాపురం పెట్టారు. రాజేశ్వరి నగరానికి చెందిన ఫుల్‌క్రం గ్లోబల్ టెక్నాలజీస్‌లో సీనియర్ బిల్లర్‌గా పనిచేస్తోంది. సునీల్రాజు మాత్రం పనిచేస్తున్నానని ఇంట్లో చెప్పినా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇటీవల సునీల్రాజు తన తల్లిదండ్రులతో రాజేశ్వరి తల్లి సుబ్బలక్ష్మికి ఫోన్ చేయించి రూ.3లక్షలు కట్నంగా ఇవ్వాలని, లేదంటే వారి వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని తన పేరున రాయించాలని కోరాడు. అందుకు రాజేశ్వరి తల్లి నిరాకరిచండంతో వారితో వివాదానికి దిగాడు. అప్పుడప్పుడు తన భార్యతో కట్నం విషయంలో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న సునీల్రాజు పుట్టినరోజు వేడుకను ఇంట్లో రాజేశ్వరి ఘనంగా నిర్వహించింది. అదేరోజు రాత్రి చివరిసారిగా తల్లితో మాట్లాడి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పింది. సోమవారం ఉదయం నుంచి రాజేశ్వరి, సునీల్‌రాజుల ఫోన్లు పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు అక్క బావ ఉంటున్న ఇంటికి వెళ్లి రాజేశ్వరి సోదరి శిరీష చూడగా తాళం వేసి ఉండడంతో వెనుతిరిగింది. దిక్కుతోచని స్థితిలో ఏలూరులో ఉంటున్న సునీల్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని వారు సలహా ఇచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సునీల్రాజు ఫోన్ కలవడంతో వివరాలు అడిగారు. ఇంటికి వెళ్లి కిటికీ తెరిచి చూడమని సునీల్ రాజు చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు ముందుగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో ఇంటి తలుపును బలవంతంగా తెరిచారు. బెడ్ రూంలోని మంచంపై రాజేశ్వరి మృతదేహం పడి ఉంది. దుస్తులతో ఉన్న సూట్‌కేస్ బాత్రూంలోను, కప్‌బోర్డ్‌లో ఉన్న చీరలు ఆ గదినిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం సునీల్రాజు పరారీలో ఉన్నాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి సుబ్బలక్ష్మి ఆరోపిస్తోంది. కట్నం కోసమే తన కుమార్తెను బలి తీసుకున్నారని, విషయం ఏలూరులో ఉన్న సునీల్రాజు తల్లిదండ్రులకు కూడా తెలుసని చెబుతున్నారు. పోలీసులు తమకు తగిన న్యాయం చేయాలని మృతురాలి బంధువులు, స్నేహితులు కోరుతున్నారు. -
మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి
సిద్దిపేట: దుబ్బాకలో మంత్రాల నెపంతో దాడి.. ఘటనలో గాయపడిన భార్యాభర్తలు శుక్రవారం మృతి చెందారు. బంధువులు, స్థానికులు స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని గాంధీ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో గురువారం సుదర్శన్ సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సుదర్శన్‌కు సోదరులు మల్లేష్, శ్రీనివాస్‌లతో గత కొంత కాలంగా ఆస్తితగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వారు స్థానికులను రెచ్చగొట్టి సుదర్శన్‌పై దాడి చేశారని సమాచారం. నిందితులు మల్లేష్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: దంపతుల సజీవ దహనం -
శిశువు తొడల్లో మంటలు
శిశువు తొడల్లో మంటలు వచ్చి చర్మం కాలిపోయే వ్యాధి ఏమిటో అంతు చిక్కడం లేదు. ఇది వైద్య వర్గాలకు ఓ సవాల్‌గా మారింది. విల్లుపురం నుంచి ఆ శిశువును కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో కెమెరా పర్యవేక్షణలో ఐదుగురు వైద్య బృందం ఆ శిశువుకు చికిత్స అందిస్తోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మైలం సమీపం నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో నర్మద పెద్దది. కుమారుడు రాహుల్ పుట్టగానే వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలిపోవడంతో మైలం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. రాజేశ్వరి, కర్ణన్ దంపతులకు మళ్లీ వింత శిశువు జన్మించిన సమాచారం మీడియాల్లో చూసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. సీఎం పన్నీరు సెల్వం ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఆ శిశువు పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వార్డు : ఆ శిశువును మైలం ఆస్పత్రి నుంచి శనివారం రాత్రి చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఆ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. ఆ వార్డులో ఆ శిశువును ఫోకస్ చేస్తూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలిన గాయాలకు వైద్య పరీక్షలు అందించారు. మెరుగైన వైద్య పరీక్షలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వైద్య బృందం అందిస్తోంది. ఆ ఆసుపత్రి డీన్ గుణ శేఖరన్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఆ శిశువును 24 గంటల పాటుగా పరీక్షిస్తోంది. మంత్రి విజయ భాస్కర్ ఆ శిశువును పరిశీలించారు. తల్లిదండ్రుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆందోళన వద్దని, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ వేదనను పరిగణించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అంతు చిక్కని వింత : గతంలో రాహుల్ శరీరంలో మళ్లీ మంటలు రాకుండా కట్టడి చేసిన వైద్యులు, ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో తలలు పట్టుకుంటున్నారు. అంతు చిక్కని ఈ వ్యాధి మళ్లీ రాహుల్ సోదరుడిని వెంటాడడంతో పరిశోధనల్ని తీవ్రతరం చేశారు. రాజేశ్వరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల్ని నిర్వహించి పరిశోధనకు నిర్ణయించారు. ఆమెలో ఏదేని లోపం ఉన్నదా? తద్వారా, ఈ మంటలు వస్తున్నాయూ? అన్న అన్వేషణ మొదలైంది. రాజేశ్వరి, కర్ణన్ స్వగ్రామంలో అయితే, కొత్త ప్రచారం ఊపందుకుంది. తమ గ్రామంలో దుష్ట శక్తి తిష్ట వేసిందని, ఆ కుటుంబంలో పుట్టిన మగ బిడ్డల మీద ఆ శక్తి తన ఆగ్రహాన్ని చూపుతోందన్న ప్రచారం బయలు దేరడం కొసమెరుపు. -
చట్టసభకు రానున్న నిరుపేద ఎమ్మెల్యే
-
భూ వివాదంతో కుటుంబం వెలి
మంథనిరూరల్, న్యూస్‌లైన్: భూ సంబంధమైన గొడవలో కేసు పెట్టించాడనే అక్కసుతో ఓ కుటుంబాన్ని వెలి వేసిన వైనం వెలుగు చూసింది. ఇది భరించలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. గురువారం మండలంలోని సిరిపురం పంచాయతీ పరిధిలోని చిల్లపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గురువారం గ్రామస్తులంతా గ్రామ దేవతకు మొక్కులు చెల్లించే వేడుక జరుపుకున్నారు. పోచమ్మను కొలిచేందుకు ఇంటింటికీ డబ్బులు వసూలు చేసుకొని పండుగ జరుపుకున్నారు. అయితే గ్రామానికి చెందిన తుంగల సత్తయ్య ఇంటికి ఎవరూ వెళ్లలేదు. ఆయన కుటుంబ సభ్యులను వేడుకకు పిలవలేదు. తమకు తెలియకుండానే వేడుక జరుపుకోవడంతో సత్తయ్య పెద్దమనుషుల వద్దకు వెళ్లి అడిగాడు. ఓ భూ వివాదంలో తమపై కేసు పెట్టించడంతోనే వేడుకల్లో పాల్గొనకుండా బహిష్కరించామని తేల్చి చెప్పారు. దీంతో అవమానానికి గురైన సత్తయ్య తన భార్య రాజేశ్వరితో కలిసి ఆత్మహత్యకు యత్నించగా గుమ్మడి సంపత్ అడ్డుకున్నాడు.