మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి | dubbaka incident: couple died at gandhi hospital | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి

Published Fri, Apr 7 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

dubbaka incident: couple died at gandhi hospital

సిద్దిపేట: దుబ్బాకలో మంత్రాల నెపంతో దాడి.. ఘటనలో గాయపడిన భార్యాభర్తలు శుక్రవారం మృతి చెందారు. బంధువులు, స్థానికులు స్తంభానికి కట్టేసి కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టడంతో సుదర్శన్‌, ఆయన భార్య రాజేశ్వరి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

అనంతరం వీరిని గాంధీ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో గురువారం సుదర్శన్‌ సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సుదర్శన్‌కు సోదరులు మల్లేష్‌, శ్రీనివాస్‌లతో గత కొంత కాలంగా ఆస్తితగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వారు స్థానికులను రెచ్చగొట్టి సుదర్శన్‌పై దాడి చేశారని సమాచారం. నిందితులు మల్లేష్‌, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement