sudharshan
-
మిస్టర్ సెలెబ్రిటీ మూవీ రివ్యూ
సీనియర్ కథ, మాటల రచయిత పరచూరి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. ఆయన మనవడు సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా చేశాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కి చెందిన సోషల్ యాక్టివిస్ట్ లలిత (శ్రీ దీక్ష)కు వింత అనుభవం ఎదురవుతుంది. ఆమెపై ఎవరో అత్యాచారానికి పాల్పడినట్లు కల వస్తుంది. పదే పదే అలాంటి కలలే రావడంతో డాక్టర్ని సంప్రదిస్తుంది. ప్రెగ్నెంట్ టెస్ట్ చేయగా..నిజమనే తెలుస్తుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కలలో వచ్చినవాడి పోలీకలతో బొమ్మను గీస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఫేమస్ యూట్యూబర్ లక్కీ(సుదర్శన్) అని తెలుస్తుంది. ఎస్సై నరహరి (రఘుబాబు) అతన్ని అరెస్ట్ చేసి.. ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత లక్కీ నేరస్థుడు కాదని తెలుస్తుంది. కానీ మీడియా ఆ విషయాన్ని పట్టించుకోదు. అసలు లలితకు అలాంటి కలలు వచ్చేలా చేసిందెవరు? ఈ కేసులో లక్కీని ఎందుకు ఇరికించారు? వీరిద్దరితో పాటు ఎస్సై సరహరిని కూడా ఫేమస్ చేసి చంపుతానంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? పద్మశ్రీ గ్రహిత, సైంటిస్ట్ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? ఈ కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది అని ఊరికే అనలేదు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేలోపే అది దేశమంతా వైరల్ అవుతుంది. కొన్నిసార్లైతే అసలు నిజాన్ని బయటపెట్టినా జనాలు వినే స్థితిలో ఉండట్లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా పక్కవారిపై నిందలు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘మిస్టర్ సెలెబ్రిటీ. ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం వల్ల ఎంత నస్టం జరుగుతుంది? తెలియని తప్పుకు నిందలు వేస్తే..వాళ్లు ఎలా బాధపడతారు అనేది ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపైకి తీసుకు రావడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు.ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగుతుంది. రూమర్ల వల్ల ఎవరు ఎలా ఇబ్బందులు పడతారన్నది ఓ మూడు సీన్లు చూపించాడు. ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్.. ఆ తరువాత సాంగ్.. ఆపై హీరోయిన్ పరిచయం, ఆమె సమస్య గురించి చెప్పడం, లలిత ఇచ్చిన ఫిర్యాదుతో లక్కీని నరహరి అరెస్ట్ చేయడం.. ఇలా సీన్లు ముందుకు వెళ్తూనే ఉంటాయి. లక్కీ, లలిత, నరహరి పాత్రలతోనే ఫస్ట్ హాఫ్ గడుస్తుంది. ఇంట్రవెల్‌కు ట్విస్ట్ వస్తుంది. ఓ ముసుగు వ్యక్తి ఇదంతా చేయిస్తాడని తెలుసుకుంటారు. దీంతో సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. వరలక్ష్మీ పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. సుదర్శన్‌కి ఇది తొలి సినిమా. అయినా బాగా నటించాడు. కొన్ని సీన్లలో కాస్త తడబడినా.. కొన్ని చోట్ల అయితే అనుభవం ఉన్నవాడినా నటించాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ చెప్పడంలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ శ్రీ దీక్షకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టు ఆమె కూడా బాగానే నటించింది. నరహరి పాత్రలో రఘుబాబు ఆద్యంతం నవ్వించే ప్రయత్నించాడు. వరలక్ష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారనిపిస్తుంది. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతికతంగానూ ఈ సినిమా మెప్పిస్తాయి. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో ఈ మూవీని చక్కగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు పెట్టిన డబ్బులు, పడిన కష్టం అయితే తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. -
'నువ్వు చేసింది ఉప్మా కాదు.. మర్డర్'.. ఆసక్తిగా ట్రైలర్!
యడ్లపల్లి మహేష్, స్పందన, సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరెన్సీ నగర్'. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా కరెన్సీ నగర్ ట్రైలర్ విడుదల చేశారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.... 'తెలుగులో మొదటిసారిగా వస్తోన్న ఆంథాలజీ చిత్రమింది. ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కుమార్ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడాని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నా' అని అన్నారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంధాన్ని.. నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని, పవన్ సంగీతమందించారు. -
రెండు లక్షలు డిమాండ్ చేశాడు.. సీనియర్ హీరో సుమన్‌పై శివనాగు ఫైర్!
సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు ఫైర్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు ఇస్తేనే వస్తానని చెప్పారని, ఓ సీనియర్ హీరో అలా చెప్పడం బాధాకరం అన్నారు. సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. (చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్ ఫోన్ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్ నటుడు సుమన్. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’ అని మండిపడ్డారు. ‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్ బడ్జెట్ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చికోటి ప్రవీణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
-
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
'దసరా' హంగామా.. థియేటర్లో ఊరమాస్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. భారీ అంచనాల నడుమ నేడు(గురువారం)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుందీ చిత్రం. నాని మాస్ సీన్స్‌కు కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియెన్స్ మనసు దోచుకుంటుంది. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో సందడి చేశారు. ఆ తర్వాత మరో థియేటర్లో నాని, కీర్తిసురేష్‌లు అభిమానుల మధ్య సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఇక నాని, కీర్తిసురేష్‌లను చూసేందుకు, వాళ్లతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. Oora Mass Performance @NameisNani ❤️ Normal story with Best Cinematography , Top Notch BGM 🔥 @Music_Santhosh @KeerthyOfficial Mahanati 🙏@odela_srikanth nachindi anna ni Taking ✨#Dasarareview #dasara #DasaraOnMarch30th #Nani #Sudarshan35MM pic.twitter.com/XyN4AOEZHJ — Rowdy Nani (@Rowdyfan_Nani) March 30, 2023 -
నవ్వించేందుకు రెడీ అవుతున్న 'నటరత్నాలు’
కంటెంట్‌లో దమ్ముంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో చోటా సినిమాలు భారీగా వస్తుంటాయి. డిఫరెంట్ స్టోరీలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్న నేపథ్యంలో.. యంగ్ డైరెక్టర్స్ అలాంటి కథలతో సినిమాలను తెరకెక్కించి, విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాను కూడా అలాంటి డిఫరెంట్ కథతోనే ‘నటరత్నాలు’తెరకెక్కిస్తున్నానని చెబుతున్నాడు దర్శకుడు గాదె నాగభూషణం. ఎన్.ఎస్ నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం 'నటరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్,డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి, తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?
సాక్షి, బెల్లంపల్లి: మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ప్రభుత్వానికి లొంగి పోతారనే ప్రచారం సాగుతోంది. రెండురోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్ డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్లపాటు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు. 1978లో విప్లవోద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 42 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఉన్నత శ్రేణికి ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి కీలకమైన పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో మిలటరీ శిక్షణ ఇవ్వడం.. వ్యూహాలను రచించి సమర్థవంతంగా అమలు చేయడంలో సుదర్శన్‌కు మంచి పట్టున్నట్లు చెబుతుంటారు. నాలుగు దశాబ్దాల పైబడి అజ్ఞాతవాసం గడుపుతున్న సుదర్శన్ ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం విశేషం. (గణపతి లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?) తల్లిదండ్రులు చనిపోయినా.. 64 ఏళ్లున్న సుదర్శన్ ఎన్నోసార్లు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అతడి తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందినప్పటికీ ఇంటిముఖం చూడలేదు. పోలీసుల సూచనతో జనజీవన స్రవంతిలో కలవాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ సుదర్శన్ మాత్రం ముందుకు రాలేదు. సహచరులు కొంతమంది లొంగిపోయినా.. ఎంతోమంది ఎన్కౌంటర్లో మృతిచెందినా.. ఆయన అజ్ఞాతం వదిలి రాలేదు. సుదర్శన్ లొంగిపోతున్నట్లు సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. లొంగిపోతారనే ప్రచారంలో వాస్తవమెంత? నిజంగానే సుదర్శన్ పోరుబాట వదులుతాడా..? అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి..? ప్రచారంలో వాస్తవం ఎంత..? అనే కోణాల్లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం క్షీణించి జనజీవన స్రవంతిలో కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోనే సుదర్శన్ కూడా లొంగిపోతున్నాడనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించడం.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి
సిద్దిపేట: దుబ్బాకలో మంత్రాల నెపంతో దాడి.. ఘటనలో గాయపడిన భార్యాభర్తలు శుక్రవారం మృతి చెందారు. బంధువులు, స్థానికులు స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని గాంధీ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో గురువారం సుదర్శన్ సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సుదర్శన్‌కు సోదరులు మల్లేష్, శ్రీనివాస్‌లతో గత కొంత కాలంగా ఆస్తితగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వారు స్థానికులను రెచ్చగొట్టి సుదర్శన్‌పై దాడి చేశారని సమాచారం. నిందితులు మల్లేష్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: దంపతుల సజీవ దహనం