
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. భారీ అంచనాల నడుమ నేడు(గురువారం)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుందీ చిత్రం. నాని మాస్ సీన్స్‌కు కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియెన్స్ మనసు దోచుకుంటుంది.
మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌లో సందడి చేశారు. ఆ తర్వాత మరో థియేటర్‌లో నాని, కీర్తిసురేష్‌లు అభిమానుల మధ్య సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఇక నాని, కీర్తిసురేష్‌లను చూసేందుకు, వాళ్లతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
Oora Mass Performance @NameisNani ❤️
— Rowdy Nani (@Rowdyfan_Nani) March 30, 2023
Normal story with Best Cinematography , Top Notch BGM 🔥 @Music_Santhosh @KeerthyOfficial Mahanati 🙏@odela_srikanth nachindi anna ni Taking ✨#Dasarareview #dasara #DasaraOnMarch30th #Nani #Sudarshan35MM pic.twitter.com/XyN4AOEZHJ