Nani Dasara Movie Streaming On Netflix From Today - Sakshi
Sakshi News home page

Dasara Movie: అర్ధరాత్రి నుంచే ఓటీటీలో సందడి చేస్తున్న దసరా మూవీ, ఎక్కడ చూడాలంటే?

Published Thu, Apr 27 2023 7:15 AM | Last Updated on Thu, Apr 27 2023 8:55 AM

Nani Dasara Movie Streaming On Netflix - Sakshi

ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తెలంగాణ యాసలో కొనసాగే ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము దులిపింది. నాని కెరీర్‌లోనే అత్యధికంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

థియేటర్స్‌లో దుమ్మురేపిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే దసరా స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! ఏప్రిల్‌ 27 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. అన్నట్లుగానే బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే హిందీలోకి కూడా వస్తే బాగుండని కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.

చదవండి: కమల్‌ హాసన్‌ నాస్తికుడు, కూతురు శ్రుతిహాసన్‌కు దైవభక్తి ఎక్కువ, అందుకే పచ్చబొట్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement