OTTలో దుమ్ము లేపుతున్న మూవీ.. ఏకంగా మూడు స్థానాల్లో ట్రెండింగ్‌! | Nani's Hi Nanna Movie Trending No 1 In Netflix - Sakshi
Sakshi News home page

నానియా మజాకా.. ఓటీటీలో టాప్‌ ట్రెండింగ్‌! మూడు భాషల్లో..

Published Sun, Jan 7 2024 6:16 PM | Last Updated on Mon, Jan 8 2024 11:34 AM

Nani Starrer Hi Nanna Movie Trending on Top Place In Netflix - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని సినిమా అంటే మినిమమ్‌ ఉంటది మరి! ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఏడిపించే టాలెంట్‌ నాని సొంతం. ఆయన ఎంచుకునే కథ, కాన్సెప్ట్‌ అన్నీ కొత్తగా ఉండాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్‌ నాన్న. సీతారామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. తండ్రీకూతుళ్ల ప్రేమ కథను అందంగా, హృద్యంగా ఆవిష్కరించాడు డైరెక్టర్‌ శౌర్యువ్‌.

ఓటీటీలోనూ ట్రెండింగ్‌
డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందుగా అగ్రిమెంట్‌ చేసుకున్నందుకో ఏమో కానీ.. థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్‌ చేశారు. అలా హాయ్‌ నాన్న ఈ నెల 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ము దులిపేస్తోంది. ఆదివారం నాడు(జనవరి 7న) ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతోంది.

టాప్‌ 10లో మూడు స్థానాలు హాయ్‌ నాన్నదే!
హాయ్‌ నాన్న తెలుగు వర్షన్‌ మొదటి స్థానంలో, హిందీ వర్షన్‌ ఐదో స్థానంలో, తమిళ వర్షన్‌ 10వ స్థానంలో ట్రెండ్‌ అవుతోంది. అంటే టాప్‌ 10లో మూడు స్థానాల్లో హాయ్‌ నాన్నే ఉండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.  హాయ్‌ నాన్న నెట్‌ఫ్లిక్స్‌లో తనదైన మార్క్‌ చూపిస్తోంది అని రాసుకొచ్చింది. మరి మీరు ఇంతవరకు హాయ్‌ నాన్న చూడకపోయుంటే ఓసారి వీలు చూసుకుని లుక్కేయండి..

చదవండి: రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్‌.. మొదటి భార్య ఎవరో తెలుసా?
కోట్లు సంపాదించిన కమెడియన్‌..ఆ ఒక్క పొరపాటుతో జీవితమే అస్తవ్యస్తం.. చివరకు డిక్కీలో శవం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement