Hi Nanna Movie
-
'హాయ్ నాన్న' కాపీ సినిమా.. నాని ఇంత చీపా?: కన్నడ నిర్మాత
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు. తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్ నాన్న పేరిట తెలుగులో రీమేక్ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్ చేశాడు. దీంతో హాయ్ నాన్న సినిమా టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్ సరగుర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక, ఆద్య, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్‌లో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్ ఎమ్ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా -
హాయ్ నాన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా..
నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ "హాయ్ నాన్న". అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన "హాయ్ నాన్న" కథనం, నటీనటుల పర్ఫామెన్స్ న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. శౌర్యువ్ మాట్లాడుతూ.. 'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యిందీ మూవీ. 'హాయ్ నాన్న'కి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, 'హాయ్ నాన్నా'కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను"అన్నారు. Hi Nanna celebrations continue across all corners! 💥💥#HiNanna released as #HiDad and received the prestigious award for Best Feature Film at the esteemed Athens International Art Film Festival in their March 2024 edition ❤️🔥 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN… pic.twitter.com/Yu2AtVdPTW — Vyra Entertainments (@VyraEnts) April 6, 2024 చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు.. డబ్బులు కూడా ఇవ్వలేదు.. కళ్లు తెరిపించారు! -
OTTలో దుమ్ము లేపుతున్న మూవీ.. ఏకంగా మూడు స్థానాల్లో ట్రెండింగ్!
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది మరి! ఎమోషనల్ యాక్టింగ్‌తో ఏడిపించే టాలెంట్ నాని సొంతం. ఆయన ఎంచుకునే కథ, కాన్సెప్ట్ అన్నీ కొత్తగా ఉండాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. తండ్రీకూతుళ్ల ప్రేమ కథను అందంగా, హృద్యంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ శౌర్యువ్. ఓటీటీలోనూ ట్రెండింగ్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నందుకో ఏమో కానీ.. థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. అలా హాయ్ నాన్న ఈ నెల 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ము దులిపేస్తోంది. ఆదివారం నాడు(జనవరి 7న) ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. టాప్ 10లో మూడు స్థానాలు హాయ్ నాన్నదే! హాయ్ నాన్న తెలుగు వర్షన్ మొదటి స్థానంలో, హిందీ వర్షన్ ఐదో స్థానంలో, తమిళ వర్షన్ 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అంటే టాప్ 10లో మూడు స్థానాల్లో హాయ్ నాన్నే ఉండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. హాయ్ నాన్న నెట్‌ఫ్లిక్స్‌లో తనదైన మార్క్ చూపిస్తోంది అని రాసుకొచ్చింది. మరి మీరు ఇంతవరకు హాయ్ నాన్న చూడకపోయుంటే ఓసారి వీలు చూసుకుని లుక్కేయండి.. The heartwarming tale transcends languages and bringing love to every corner 😍🔥#HiNanna is making its mark on the @NetflixIndia Trending charts! 🤘 Enjoy this blockbuster with your family at home today! 🤩 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/pJx4Lgfjiu — Vyra Entertainments (@VyraEnts) January 7, 2024 చదవండి: రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్.. మొదటి భార్య ఎవరో తెలుసా? కోట్లు సంపాదించిన కమెడియన్..ఆ ఒక్క పొరపాటుతో జీవితమే అస్తవ్యస్తం.. చివరకు డిక్కీలో శవం! -
హాయ్ నాన్న మూవీ సమయమా సాంగ్
-
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ.. ఎక్కడంటే?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు హాయిగా ఉంటుందని, జనాలకు తప్పకుండా నచ్చుతుందన్నాడు. అతడి నమ్మకం నిజమైంది. సినీప్రియులు హాయ్ నాన్నకు జై కొట్టారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు. భారీ బడ్జెట్ సినిమాలైన యానిమల్, సలార్ పోటీని తట్టుకుని హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది. అక్కడే ఈ సినిమా ఘన విజయం సాధించేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం నేటి (జనవరి 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు, మరోసారి హాయ్ నాన్న చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో వీక్షించేయండి.. కథ విషయానికి వస్తే.. ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు. అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి పోస్ట్ చూశారా? -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
హాయ్ నాన్న బ్లాక్‌బస్టర్ హిట్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ లెక్కల కన్నా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే ముఖ్యమని ఫీలవుతుంటాడు. అయితే తను ఎంచుకునే వైవిధ్యమైన కంటెంట్‌కు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లే వస్తుంటాయి. అది దసరా సినిమాతో నిరూపితమైంది. తాజాగా హాయ్ నాన్నతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడీ హీరో. డిసెంబర్ 7న రిలీజైన హాయ్ నాన్న నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ నెల 7న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించింది. ఫలితంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే డిసెంబర్ 22న విడుదలైన సలార్ హాయ్ నాన్న మూవీకి గట్టి పోటీనిచ్చింది. ఇప్పటివరకు వచ్చిందెంతంటే? సోషల్ మీడియాలో అంత హడావుడి లేకపోయినా సైలెంట్‌గా బాగానే రాబట్టింది. తాజాగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లను ప్రకటించింది చిత్రయూనిట్. హాయ్ నాన్న ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టిందని తెలిపింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 4 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మరి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఆనందించండి. Ending the year on a BLOCKBUSTER NOTE 💥🧨 Thank you all for embracing good cinema and giving us a warm hug 🤗#HiNanna magic has made a 75Crore+ Worldwide Gross ❤️🔥 and this is our victory 🤗#BlockbusterNanna Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/Ywl7pFPAEz — Vyra Entertainments (@VyraEnts) December 31, 2023 చదవండి: తెలుగులో అదే చివరి సినిమా.. హీరోయిన్ నుంచి ప్రాధాన్యత లేని పాత్రల్లో.. -
న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ సోమవారంతో కొత్త సంవత్సరం మొదలైంది. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు ఈ వారమంతా కూడా ఇదే మూడ్‌లో ఉంటారు. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారమైతే థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇందుకు తగ్గట్లే ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు.. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ (జనవరి 01 నుంచి 07 వరకు) నెట్‌ఫ్లిక్స్ బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01 ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01 యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01 డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01 మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01 ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01 ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 (ఇదీ చదవండి: ) -
Hi Nanna In OTT: ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
డిసెంబరులో వచ్చిన హిట్ సినిమాలు అంటే చాలామంది 'సలార్', 'యానిమల్' పేర్లు చెప్తారు. అయితే ఇదే నెలలో నేచురల్ స్టార్ నాని కూడా ఓ క్లాస్ మూవీతో వచ్చాడు. హిట్ కొట్టేశాడు. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తున్న నాని.. ఈ ఏడాది మార్చిలో 'దసరా' అనే మాస్ సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ మధ్య 'హాయ్ నాన్న' అనే తండ్రి-కూతురు సెంటిమెంట్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తొలుత ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎక్కువరోజులు నిలబడటం కష్టమని అన్నారు. కానీ 20 రోజులు దాటిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఇకపోతే థియేటర్లలో 'హాయ్ నాన్న' ఇంకా ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత అంటే జనవరి 19 లేదా 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మరీ ఆలస్యం అవుతుందనో ఏమో ఇప్పుడు డేట్ ముందుకు మార్చినట్లు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) Love is in the air, and so is our excitement ❤️🌟 Join @NameisNani and #MrunalThakur in their journey of finding love in Hi Nanna. Hi Nanna, streaming from 4th January in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi on Netflix. 👨👩👧#HiNannaOnNetflix pic.twitter.com/zTy8cY7jnX — Netflix India (@NetflixIndia) December 30, 2023 -
Nani-Mrunal Thakur Latest Photos: హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోటకు చేరిన నాని, మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
అంతకుమించిన స్థాయి లేదు
‘‘చిత్ర పరిశ్రమలో బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయి అని మాట్లడుతుంటారు. నాకు సంబంధించి శుక్రవారం నా సినిమా విడుదలైతే.. ‘నాని సినిమాకి వెళ్దాం రా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి.. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాని మాట్లాడుతూ–‘‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా ఉంది. ‘హాయ్ నాన్న’ కి ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు. ‘‘నానిగారు ‘హాయ్ నాన్న’ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను’’ అన్నారు శౌర్యువ్. ‘‘హాయ్ నాన్న’ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’’ అన్నారు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల. కెమెరామేన్ షాను మాట్లాడారు. -
బ్లాక్ డ్రెస్‌లో రితికా నాయక్ నయగారాలు (ఫొటోలు)
-
‘హాయ్ నాన్న’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రెండు వారాల గ్యాప్‌లో రెండు హిట్లు
‘‘నేను మాటలు అందించిన ‘కోట బొమ్మాళి’ (నవంబర్ 24), ‘హాయ్ నాన్న’ (డిసెంబరు 7) చిత్రాలు రెండు వారాల గ్యాప్‌లో విడుదలై సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. ‘కోట బొమ్మాళి’ ΄పోలిటికల్ థ్రిల్లర్. ‘హాయ్ నాన్న’ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు విభిన్నమైన కథలకు మాటలు అందించిన నాకు మంచి పేరొచ్చింది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ సుకుమార్గార్లు ప్రత్యేకంగా అభినందించడం మరచిపోలేను’’ అన్నారు. మాటల రచయిత నాగేంద్ర కాశీ. ఇంకా తన కెరీర్ గురించి నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నాది కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న నాగేశ్వరరావు, అమ్మ సత్యవతి. రచన, సాహిత్యంపై ఇష్టంతో ఇంటర్ చదివే రోజుల నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను. నేను రాసిన కథలతో ‘నల్ల వంతెన’ అనే తొలి పుస్తకం పబ్లిష్ చేశాను. దీనికి నాలుగు అవార్డులు వచ్చాయి. తొలిసారి ‘పలాస 1978’ సినిమాకి కో రైటర్‌గా పని చేశా. ఆ తర్వాత ‘తోలు బొమ్మలాట’ మూవీకి రచనా సహకారం చేశాను. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి కథ ఇచ్చాను. నా ‘నల్ల వంతెన’లో ఓ కథ నచ్చడంతో నాకు ‘సుకుమార్ రైటింగ్స్‌లో’ చాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్‌గారు. ‘విరూపాక్ష’కి రైటింగ్ విభాగంలో చేశా. ఆ తర్వాత రామ్‌చరణ్– బుచ్చిబాబుగార్ల మూవీకి బుచ్చిబాబుగారితో కలిసి మాటలు రాస్తున్నాను. ‘పుష్ప 2’ సినిమాకి రచయితల విభాగంలో చేస్తున్నాను. అలాగే రష్మిక నటిస్తున్న ‘రెయిన్బో’కి మాటలు అందిస్తున్నాను. సుకుమార్‌గారి వద్ద పని చేసే చాన్స్ రావడం నా లక్. భవిష్యత్తులో డైరెక్టర్ కావాలని ఉంది. ఐదు కథలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. -
ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు
ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఈ ఏడాదలో ఎక్కువగా చిన్న చిత్రాలే మెప్పించాయి. ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి. దసరా- శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని- కీర్తి సురేష్ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోని హిట్ సినిమాల లిస్ట్‌లో చేరింది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్ సుకుమార్ టీమ్‌లో శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్. దసరా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హాయ్ నాన్న- శౌర్యువ్ నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్ శౌర్యువ్కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించగా శ్రుతి హాసన్ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శౌర్యువ్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. హాయ్ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్ వద్ద ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు. రోమాంచమ్- జీతూ మాధవన్ (మలయాళం,తెలుగు) కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. కామెడీ, హారర్.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో మంచి వినోదాన్ని పండించాడు డైరెక్టర్ జీతూ.. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదా- గణేష్ కె. బాబు (తమిళ్) కోలీవుడ్‌లో కెవిన్ హీరోగా నటించిన తమిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్‌గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం. తండ్రి గొప్పతనంతో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్ గణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి తమిళంలో ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ దాస్ హీరోయిన్గా నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌కు పా..పా అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. త్వరలో విడుదల కానుంది. బాయ్స్ హాస్టల్- నితిన్ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు) కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్‌భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్‌గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి. -
భారీ ధరకు హాయ్ నాన్న డిజిటల్ రైట్స్.. ఓటీటీ పార్ట్నర్ ఇదే!
ఈ మధ్య లవ్‌స్టోరీ, యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో సినీప్రియులకు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది హాయ్ నాన్న మూవీ. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో బేబి కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.37 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలోకి తీసుకుచ్చే ఆలోచనలు చేయడం లేదట! వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తారట! హాయ్ నాన్న కథేంటంటే.. ముంబైకి చెందిన విరాజ్(నాని) ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. అతడికి తన కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. విరాజ్ ప్రతిరోజు హీరో కథలు చెప్పడం.. ఆ హీరో పాత్రను నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటుంది. కానీ విరాజ్ చెప్పడు. కూతురు ఇలాగే మారాం చేయడంతో ఒకరోజు విరాజ్ అమ్మ కథ చెప్తాడు. అసలు మహి తల్లి ఎవరు? ఎందుకు ఆమె వీరితో కలిసి ఉండట్లేదు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది థియేటర్స్‌లో చూసి తెలుసుకోవాల్సిందే! చదవండి: -
ముద్దొచ్చే ఫోజులతో మృణాల్ ఠాకూర్ ...(ఫొటోలు)
-
‘హాయ్ నాన్న’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘హాయ్ నాన్న’ మూవీ రివ్యూ
టైటిల్: హాయ్ నాన్న నటీనటులు: నాని, మృనాల్ ఠాకూర్, బీబీ కియారా ఖన్నా, అంగద్ బేడీ, జయరామ్, ప్రియదర్శి, విరాజ్ అశ్విన్ తదితరులు నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల రచన-దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ ఎడిటర్: ప్రవీణ్ ఆంథోనీ విడుదల తేది: డిసెంబర్ 7, 2023 కథేంటంటే.. ముంబైకి చెందిన విరాజ్(నాని) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. తనకు కూతురు మహి(బేబీ కియారా ఖన్నా)అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. సింగిల్ పేరెంట్‌గా ఉన్నప్పటికీ కూతురుకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానని ప్రామిస్ చేస్తాడు నాన్న విరాజ్. అమ్మ కథ కోసం నెలంతా కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. తర్వాత కథ చెప్పమని నాన్నని అడిగితే.. చిరాకు పడతాడు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. రోడ్డుపై ప్రమాదం నుంచి కాపాడిన యష్ణతో మహికి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ ఓ కాఫీ షాప్‌లోకి వెళ్లి విరాజ్‌కి కాల్ చేస్తాడు. విరాజ్ కూడా అక్కడికి రాగానే అమ్మ కథ చెప్పమని అడుగుతారు. కూతురు మారం చేయడంతో అమ్మ కథను చెబుతాడు. ఈ కథలో అమ్మ వర్షని యష్ణగా ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు? విరాజ్-వర్షల లవ్‌స్టోరీ ఏంటి? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? వర్షకి యష్ణకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ అరవింద్ (అంగద్ బేడీ)తో ఎంగేజ్మెంట్ చేసుకున్న యష్ణ..విరాజ్‌తో ప్రేమలో ఎలా పడింది? ఆ ప్రేమ నిలబడిందా? అరుదైన వ్యాధిని మహి జయించిందా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘హాయ్ నాన్న’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అమ్మ గురించి నాన్న తన కూతురుకి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం..గొడవపడి విడిపోవడం..చివరకు కలిసిపోవడం.. ఇలాంటి కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘ఖుషి’ నేపథ్యం కూడా ఇదే. కానీ హాయ్ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే.. లవ్స్టోరీలోని ట్విస్టులు కొత్తగా ఉంటాయి. అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు సినిమాను నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ హృదయాలను హత్తుకుంటాయి. తండ్రి కూతుళ్ల బాండింగ్‌ని తొలి సీన్లోనే చూపిస్తూ చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. మహి తన తల్లిగా యష్ణని ఊహించుకున్నప్పటి నుంచి ప్రేమకథ మొదలవుతుంది. విరాజ్, వర్షల పరిచయం.. ప్రేమ.. పెళ్లి...ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక.. గుండె బరువెక్కుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్‌లో భావోద్వేగాలు మరింత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. సన్నీవేశాలతో కాకుండా సంభాషణలతో కూడా ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. ‘నువ్వు నిజమైన అమ్మకి కాదు’ అని చిన్నారి చెప్పడం.. ‘ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవడం లేదా’ అని హీరో కూతురితో అనడం.. ‘నేను దాచుకున్న నిజం నా కూతురుకి చెప్పావు.. నువ్వు దాచిన నిజం నీ కూతురుతో చెప్పనా?’అని హీరోయిన్ తల్లితో నాని అనడం.. ప్రతిదీ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్‌లో జయరామ్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథనం నిదానంగా సాగినప్పటికీ.. కొన్ని ట్విస్టులు.. ప్రధాన పాత్రలు పండించిన భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన సహజ నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఈ చిత్రంలోని విరాజ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బాధ్యతగల తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా..ఇలా పలు వేరియేషన్స్ ఉన్న పాత్ర తనది. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకు హైలెట్. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. యష్ణగా, కథలో వర్షగా రెండూ పాత్రల్లోనూ చక్కగా నటించింది. ఎమోషనల్ సన్నీవేశాల్లో జీవించేసింది. ఇక ఈ చిత్రంలో మహి పాత్రను పోషించిన చిన్నారి కియార ఖన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెరపై ముద్దు ముద్దుగా కనిపిస్తూనే తనదైన నటనతో ఏడిపించేసింది. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి తన పాత్ర పరిధిమేర నటించాడు. జయరామ్ రొటీన్ తండ్రి పాత్రలో కనిపించినా..క్లైమాక్స్‌లో అతనిచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అంగద్ బేడీ ఒకటి రెండు సన్నీవేశాల్లో కనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. నాజర్, విరాజ్ అశ్విన్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. వర్గీస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ ఏడాది ముగింపులో మా సినిమా ఓ స్వీట్
‘‘హాయ్ నాన్న’ చిత్రంలో వినోదం, అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రకథపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘హాయ్ నాన్న’ కథని శౌర్యువ్ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్ సినిమాల్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ‘యానిమల్’తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైస్‌ని పంచాయి. అయితే స్పైసీ తర్వాత ఉండే ఆ స్వీట్‌ని మా సినిమా ఇస్తుంది. ఈ ఏడాది అన్ని ఐటమ్స్ పెట్టారు కానీ, ముగించే ఐటమ్ నేను పెడతాను (నవ్వుతూ). ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. కానీ, ‘హాయ్ నాన్న’ చూసి, ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ►నాకు కంఫర్ట్ జోన్ అనేది ఏదీ లేదు. కామెడీ సినిమాలు చేసినప్పుడు అది నా కంఫర్ట్ జోన్ అన్నారు. తర్వాత ‘జెర్సీ’ చేసినప్పుడు ఎమోషన్ నా కంఫర్ట్ జోన్ అన్నారు. ఆ తర్వాత ‘దసరా’ లాంటి రా మూవీ చేశాను. నాకు కంఫర్ట్ జోన్ అనేది లేకుండా సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను ఇమేజ్ కోణంలో చూడను. కథ నచ్చిందనే ‘దసరా’ చేశాను.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ చేశాను. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది. ►ఇలాంటి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ప్రమోషన్స్ ఎక్కువగా చేశాం. అందులో భాగంగానే వెంకటేశ్‌గారిని ఇంటర్వ్యూ చేశా. ప్రమోషన్స్‌లో భాగంగానే హీరో శివరాజ్ కుమార్‌గారిని కలిశా. వెంకటేశ్‌గారు ‘నా తర్వాత ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు నిన్ను చూస్తారు’ అన్నారు. మనల్ని ఎవరైనా ఫ్యామిలీ హీరో అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ►వైర ఎంటర్టైన్మెంట్కి ‘హాయ్ నాన్న’ తొలి చిత్రం. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డిగార్లు ΄్యాషనేట్ ్ర΄÷డ్యూసర్లు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ పాటలో మాత్రమే కనిపిస్తారు. ►నా ‘దసరా’ సినిమా దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసింది. నా తర్వాతి చిత్రాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కువ సినిమాలు చేయలేను. ►‘యానిమల్’ లాంటి కథ వస్తే చేస్తాను. ‘దసరా’ చిత్రంలో నేను చేసిన పాత్రని ఎవరైనా ముందుగా ఊహించారా? చేశాకే బాగుందన్నారు. సవాల్‌తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినప్పుడు చేయడానికే ఇష్టపడతాను. నాతో పని చేయాలని ‘బలగం’ వేణు అనుకుంటున్నారని ‘దిల్’ రాజుగారు చె΄్పారు. వేణు వచ్చి నాకు కథ చెబితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సరి΄ోదా శనివారం’ సినిమా చేస్తున్నాను. ‘హిట్ 3’ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టేస్తాం. -
హాయ్ నాన్నతో నాని నిలబడతాడా?
తమిళసినిమా: టాలీవుడ్ నటుడు నాని తమిళ ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తి కాదు. ఇంకా చెప్పాలంటే తొలి రోజుల్లో ఆయన ఇక్కడ వెప్పమ్ వంటి ఒకటి రెండు చిత్రాల్లో నటించారు కూడా. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రం ఈగ తమిళంలో నాన్ ‘ఈ’ పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ చిత్ర క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళి, నటి సమంత ఖాతాలోకి వెళ్లి పోయింది. కాగా ఆ తరువాత నాని తెలుగులో నటించిన చిత్రాలను తమిళంలోనూ విడుదల చేసి ఇక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అలా అంటే సుందరినికి , దసరా చిత్రాలను తమిళంలో విడుదల చేయాలని తల పెట్టారు. అయితే అంటే సుందరినికి చిత్రాన్ని విడుదల చేయలేక పోయారు. ఇక దసరా చిత్రాన్ని ఇక్కడ విడుదల చేసినా, ఆశించిన విజయం అందుకోలేక పోయింది. ఈసారి హాయ్ నాన్న చిత్రంతో వస్తున్నారు. మృణాల్ ఠాగూర్ నాయకిగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 7న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తాను ఇంతకు ముందు తమిళం కొన్ని చిత్రాల్లో నటించానని, అయితే ఇక్కడి వారు తనను తెలుగు నటుడిగా భావించారన్నారు. తెలుగు వారు తమిళ చిత్రాలుగా భావించరాదన్నారు. అయితే బాహుబలి, కాంతార వంటి చిత్రాల ఎవరు ఏ భాషలోనైనా నటించి విజయం సాధించవచ్చని రుజువైందన్నారు. కాగా హాయ్ నాన్న అందమైన ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని నాని వ్యక్తం చేశారు. మరి తమిళంలో నిలదొక్కుకోవాలన్న ఆయన కోరికను ఈ చిత్రం నెరవేరుస్తుందో..? అన్నది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. -
ప్రతి సినిమా నాకో పరీక్ష: మ్యూజిక్ డైరెక్టర్
‘‘ఈ ఏడాది నేను సంగీతం అందించిన ‘ఖుషి’, ‘స్పార్క్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ రాబోతోంది. ప్రతి సినిమా నాకో పరీక్ష.. ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.. ఇక సంగీత దర్శకుడిగా ‘హాయ్ నాన్న’ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తోడ్పడింది’’ అన్నారు హేషమ్ అబ్దుల్ వహాబ్. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా శ్రుతీహాసన్, బాల నటి కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో హేషమ్ అబ్దుల్ వాహబ్ చెప్పిన విశేషాలు. ఇటీవల నేను సంగీతం అందించిన సినిమాల్లో ప్రేమకథలే ఎక్కువ. అబ్బాయి, అమ్మాయిల మధ్య ఉండే ప్రేమకథలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఆ కథను దర్శకుడు ఎంత కొత్తగా చూపించారు? అన్నది ముఖ్యం. అలాగే ప్రేమ పాటలు కూడా. ఆ పాటలను ఎవరు పాడారు? ఏ సందర్భంలో పాడారు? ఎలాంటి సాహిత్యం ఉంది? అన్న అంశాలతో కొత్త క్రియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్ చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు. నా మలయాళ సినిమా ‘హృదయం’లోని ‘దర్శన..’, ‘హాయ్ నాన్న’లోని ‘సమయమా..’ పాటలకు శ్రోతలు పోలిక పెడుతున్నారు. అయితే ‘దర్శన..’ కంటే ‘సమయమా..’లో క్లాసిక్ కంపోజిషన్ ఎక్కువగా ఉంటుంది. అయినా.. ఈ రెండు పాటలు నావే. రెండూ వైరల్ అయ్యాయి (నవ్వుతూ). ∙‘హాయ్ నాన్న’ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం. ‘సమయమా’.., ‘గాజుబొమ్మ’, ‘అమ్మాడి..’ ఇలా సినిమాలోని ప్రతి పాటకూ ప్రాముఖ్యత ఉంది. కథలో ఓ పెద్ద పార్టీలో భాగంగా ‘ఓడియమ్మ..’ పాట వస్తుంది. ఈ పాటలను శౌర్యువ్ ఆవిష్కరించిన తీరు నన్ను సర్ప్రైజ్ చేసింది. దాదాపు 40 రోజుల పాటు 15 మంది మ్యుజిషియన్స్తో హైదరాబాద్‌లోనే ‘హాయ్ నాన్న’ కోసం పని చేశాం. మరో 20 మందికి పైగా మ్యూజిక్ ప్లేయర్స్ పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. అలాగే ఆర్ఆర్ కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వాడాం. ఈ తరహాలో ఆర్ఆర్ చేసిన తొలి ఇండియన్ సినిమా ‘హాయ్ నాన్న’ కావొచ్చేమో. ప్రస్తుతం తెలుగులో రష్మికా మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’, శర్వానంద్‌గారి సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. -
ఈ సినిమాలో కొత్త విరాజ్ ని చూస్తారు
-
కాంగ్రెస్ విజయంపై నాని ఫన్నీ కామెంట్.. ఆపై తారక్ ఫోటో పోస్ట్
నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన చిత్రం 'హాయ్ నాన్న'. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. బేబీ కియారా, శ్రుతిహాసన్, ప్రియదర్శి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో పోషించారు. డిసెంబరు 7న సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన నెటిజన్లతో ముచ్చటించాడు. వారందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ నేపధ్యలోనే ఒక నెటిజెన్ తెలంగాణ ఎన్నికల గురించి ప్రశ్న అడిగాడు. 'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కదా. మరి వచ్చిన ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. 'పదేళ్లు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశాము. ఇప్పుడు థియేటర్లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాము.' అని తనదైన స్టైల్లో నాని చెప్పడం విశేషం. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఇలా అన్నాడు. 'తారక్ అన్నతో మీరు కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోని షేర్ చేయండి.' అంటూ కోరాడు. దీంతో నాని కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని ఆ అభిమాని కోసం షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను తారక్ అభిమానులతో పాటు నాని ఫ్యాన్స్ కూడా నెట్టింట షేర్ చేస్తున్నారు. 10 yellu blockbuster cinema chusam. Theatre lo cinema maarindhi. Idhi kuda blockbuster avvali ani korukundham:)#AskNani #HiNanna https://t.co/wZHycPk5gN — Hi Nani (@NameisNani) December 4, 2023 Idhi ok aa ? :)#AskNani #HiNanna https://t.co/3yyBPAXCMx pic.twitter.com/f4G2fxijvt — Hi Nani (@NameisNani) December 4, 2023 -
నాన్నే నా జీవితానికి మూలస్తంభం: మృణాల్ ఠాకూర్
‘‘హాయ్ నాన్న’ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. భావోద్వేగాలూ ఉంటాయి. దర్శకుడు శౌర్యువ్‌కి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా కొత్త దర్శకుడితో పని చేస్తున్నామనే ఫీలింగ్ రాలేదు. తన విజన్, అప్రోచ్ చాలా క్లారిటీగా ఉన్నాయి. శౌర్యువ్ సృష్టించిన మ్యాజిక్‌ని ఈ గురువారం ప్రేక్షకులు చూస్తారు’’ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ పంచుకున్న విశేషాలు. ► ‘సీతారామం’ సినిమా తర్వాత నన్ను మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వారిని అలరించేందుకు నా మనసుకు దగ్గరైన పాత్రలు, సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాను. ‘సీతారామం’ హిట్ తర్వాత నేను చేసిన ‘హాయ్ నాన్న’పై అంచనాలుంటాయి. వాటికి తగ్గట్టు చాలా అద్భుతమైన కథ ఇది. ఇందులో నేను యష్ణ, నానీగారు విరాజ్ పాత్రల్లో నటించాం. తెరపై విరాజ్, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు తప్పకుండా వారితో ప్రేమలో పడిపోతారు. ► కథని, పాత్రలని బలంగా నమ్మి యూనిట్ అంతా నిజాయితీతో చేసిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర న్యూ ఏజ్ అమ్మాయిగా ఉంటుంది. ఈ మూవీలోని మానవీయ బంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ సినిమాలో పాట పాడటం సవాల్‌గా అనిపించింది. ఇందులో ‘అమ్మాడి..’ పాటలో ప్రతి పదాన్ని ట్యూన్‌కి తగ్గట్టు లిప్ సింక్ చేయాలి. అది నాకు చాలా సవాల్‌గా అనిపించింది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌గారు మంచి సాహిత్యం అందించారు. ► నానీగారు చాలా సపోర్టివ్. షూటింగ్లో నాకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మోహన్, విజయేందర్ రెడ్డి గార్లు ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఈ మూవీలో రాక్ స్టార్ ఎవరంటే బేబీ కియారానే. తన పాత్ర ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు సంగీతాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ► మా నాన్న నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ జీవితాన్ని గడపాలని నేర్పించారు. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుందని, జీవితంలో ఓర్పుతో ఉండాలని చెబుతుంటారు. నాన్నే నా జీవితానికి మూలస్తంభం. ఇండస్ట్రీలో నేను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఇంకా మంచి మంచి సినిమాలు, పాత్రలు చేయాలి. ► ప్రేక్షకులకు నా పేరు గుర్తు ఉండకపోయినా పర్లేదు కానీ, సీత.. యష్ణ.. ఇలా చేసిన పాత్రలతో నేను గుర్తుండిపోవాలి. దాని కోసం నిజాయితీగా కష్టపడి పని చేస్తాను. ప్రస్తుతం తెలుగులో ‘ఫ్యామిలీ స్టార్’, హిందీలో పలు సినిమాల్లో నటిస్తున్నాను. -
విజయ్ దేవరకొండ,రష్మికలకు సారీ చెప్పిన నాని
నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన చిత్రం 'హాయ్ నాన్న'. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. బేబీ కియారా, శ్రుతిహాసన్, ప్రియదర్శి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో పోషించారు. డిసెంబరు 7న సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హాయ్ నాన్న నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. విశాఖలో జరిగిన ఆ ఈవెంట్లో స్క్రీన్‌పై కొందరి సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ.. మూవీ టీమ్‌ను ప్రశ్నలు అడుగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న సమయంలో తెరపై ఒక్కసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పూల్‌లో సేదతీరుతున్న ఫోటోలు చూపించారు. ఏ సంబంధం లేకుండా ప్రత్యేకంగా వారిద్దిరి ఫోటోలు ఎందుకు చూపారు..? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. చీప్ ప్రమోషన్స్ అవసరమా అని దుయ్యబట్టారు. ఇదే విషయంపై హీరో నాని తాజాగా ఇలా స్పందించారు. ' విశాఖలో జరిగిన ఆ సంఘటన దురదృష్టకరం.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగా దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఆ ఫొటో చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం. విజయ్ దేవరకొండ, రష్మికతో సహా మేమంతా మంచి స్నేహితులం. ఒక్కోసారి సినిమా ప్రమోషన్స్‌లో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వాళ్లకు తెలుసు. ఈ ఫోటో వివాదం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతో పాటు హాయ్ నాన్న సినిమా యూనిట్ మొత్తం నుంచి సారీ చెబుతున్నాం.' అని నాని తెలిపారు. -
వారి ఉత్సాహంతో కడుపు నిండిపోయింది
‘‘హాయ్ నాన్న’ మ్యూజికల్ నైట్‌లో ఇంత హాయిగా గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. అభిమానులు ఇచ్చిన ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోయింది. నా ప్రతి సినిమాకి ఇలాంటి వేడుక ఒకటి ఉండేలా చూస్తాను. ‘హాయ్ నాన్న’ కోసంప్రాంణం పెట్టి సొంత సినిమాలా పని చేసిన యూనిట్‌కి ధన్యవాదాలు’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హాయ్ నాన్న మ్యూజికల్ నైట్’ వేడుకలో నాని మాట్లాడుతూ–‘‘ఈ చిత్రానికి హేషమ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శౌర్యువ్‌కి చాలా ప్రత్యేకమైన సినిమాగా ఇది నిలిచిపోతుంది. ‘హాయ్ నాన్న’ లాంటి అందమైన కథలు పెద్ద బ్లాక్ బస్టర్స్ కావాలి’’ అన్నారు.‘‘సీతారామం’ తర్వాత నేను చేసిన చిత్రాల్లో నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం ‘హాయ్ నాన్న’’ అన్నారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శౌర్యువ్. ఈ వేడుకలో హేషమ్ అబ్దుల్ వాహబ్, నటులు ప్రియదర్శి, విరాజ్ అశ్విన్ పాల్గొన్నారు. -
దర్శకుడిగా నా బలం అదే
‘‘ఓ దర్శకుడిగా యాక్షన్ చిత్రాల కథలు కూడా రాయగలను. కానీ ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలైతే కొత్త దర్శకులకు అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ‘హాయ్ నాన్న’ కథ రాశాను. నాకు నానీగారు చాన్స్ ఇచ్చారు. నాలానే మిగతా దర్శకులకూ ప్రేమకథలు, కుటుంబ కథలతోనే అవకాశాలు వస్తాయని చెప్పలేను. నా విషయంలో జరిగిందని చెబుతున్నాను. అయితే ఏ జానర్ ఫిల్మ్ అయినా ఆ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది అందులోని భావోద్వేగాలతోనే. భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడం నా బలం అని నా నమ్మకం’’ అన్నారు శౌర్యువ్. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా బాల నటి కియారా ఖన్నా, హీరోయిన్ శ్రుతీహాసన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో శౌర్యువ్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. మెడిసిన్ పూర్తి చేశాను. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. తండ్రీకూతురి అనుబంధం, వీరికి మృణాల్ పాత్రతో ఉన్న సంబంధం.. ఈ అంశాల తాలూకు ఎమోషన్స్‌తో ‘హాయ్ నాన్న’ కథనం ఉంటుంది. నానీగారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. కథ రీత్యా ఏడ్చినా అందంగా ఉండాలని మృణాల్‌ను తీసుకున్నాం. శ్రుతీహాసన్గారి పాత్ర బాగుంటుంది. బేబీ కియారాకి యాక్టింగ్ ప్రతిభ ఉంది. హేషమ్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం ఇంకా బాగుంటుంది. సాను మంచి విజువల్స్ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు. -
నా బలం ఎమోషన్.. ‘హాయ్ నాన్న’లో అదే చూస్తారు: డైరెక్టర్ శౌర్యువ్
ప్రస్తుతం వయోలెన్స్, గన్స్, యాక్షన్ ఇలాంటి నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. క్లీన్ ఎంటర్టైనర్ చిత్రాలు రావడం అరుదుగా మారింది. మనమంతా ఎమోషనల్‌గా మొద్దుబారిపోయాం. ఇలాంటి సమయంలో ‘హాయ్ నాన్న’ లాంటి సినిమా చాలా అవసరం. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, హింసలేదు. చాలా క్లీన్ ఎమోషన్ ఫ్యామిలీ చిత్రమిది’ అన్నారు దర్శకుడు శౌర్యువ్. ఆయన దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైర్టెర్ శౌర్యువ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది వైజాగ్.నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి రావడం జరిగింది. కన్నడ, తెలుగు సినిమా జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యవర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. ►నాలుగేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నాను. వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు వారికి నచ్చింది. నాని గారికి పరిచయం చేశారు. నాని గారికి చెప్పినపుడు ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పారు. ఆరునెలల పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగింది. తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం. ►నా ప్రధాన బలం ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం, అలానే మృణాల్ పాత్రలో వున్న బాండింగ్, అలాగే ఈ కథ అంతా దేనిపై ఆధారపడి వెళుతుందనేది కోర్ స్ట్రెంత్. ఆ ఎమోషన్ కారణంగా నాని గారు ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నాను. ►హీరో విక్రమ్ గారి అబ్బాయి ద్రువ్ నా ఫ్రెండ్. తన సంగీతం తెలుసు. పాటలు చక్కగా పాడుతాడు, మంచి గిటార్ ప్లేయర్. అందుకే ఓడియమ్మ పాటను ద్రువ్ తో పాడిస్తే బావుంటుందనిపించింది. ఈ ఆలోచన ద్రువ్ కి కూడా చాలా నచ్చి స్వయంగా పాడారు. ►ఈ కథ రాస్తున్నప్పుడే హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ని తీసుకోవాలనుకున్నాను. మృణాల్ నటించిన తుపాన్ సినిమా చూశాను. అందులో ఆమె నటన చాలా నచ్చింది. హాయ్ నాన్న లో హీరోయిన్ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. ఇందులో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని అలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్ ఠాకూర్ కనిపించింది. ►బేబీ కియారా సూపర్ ట్యాలెంటెడ్. చిన్నపిల్లలతో నటింపజేయడం కొంచెం కష్టమైనపనే. ఐతే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సీన్ గురించి చెప్పి డైలాగు పేపర్ ఇవ్వగానే ఎలాంటి తడబాటు లేకుండా ఎమోషన్ ని అర్ధం చేసుకొని నటించేది. ఇప్పటికీ నిద్రలో లేపి అడిగిన తన డైలాగులన్నీ అనర్గళంగా చెప్పేస్తుంది. తనతోయాక్ట్ చేయించడానికి నేను పెద్దగా కష్టపడలేదు. ►ఇందులో శ్రుతి హాసన్ గారికి పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత వుంది. ఇప్పటివరకైతే ఆ పాత్ర గురించి ఇంత మాత్రమే చెప్పాలి. ఒకటిరెండు సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయి. ►‘హాయ్ నాన్న’లాంటి కథ చేయడం ఒక సవాల్. చాలా సున్నితమైన కథ. దానిని మాటలతో, సన్నివేశాలతో ఎమోషన్స్ తో నిలబెట్టాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇలాంటి కథను రాయడం ఒక సవాల్ ► ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం తీసుకొని కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను. ఇప్పటికే కొన్ని కథలను రాసుకున్నా. నా బలం ఎమోషన్. కమర్షియల్ సినిమాల్లో కూడా ఎమోషనే కీలకం -
హాయ్ నాన్నలో విజయ్ ,రష్మిక పర్సనల్ ఫోటో.. ఫ్యాన్స్ ఫైర్
టాలీవుడ్ హీరో నాని- మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం హాయ్ నాన్న... డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదులకు రెడీగా ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో బేబీ కియారా, శ్రుతిహాసన్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రజలతో తనకు ప్రత్యేక బంధం ఉందని వేదక మీద నాని తెలిపాడు. తన యాక్షన్ చిత్రాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్ అయ్యాయని చెప్పాడు. సినిమాల నేపథ్యం ఏదైనా అన్ని చిత్రాలు వైజాగ్‌లో బ్రహ్మాండంగా ఆడాయని తెలిపాడు. జనవరిలానే డిసెంబరు కూడా సినిమాల పండగ నెలగా మారిందని నాని పేర్కొన్నాడు. హాయ్ నాన్న ఈవెంట్ అంతా బాగానే ఉంది కానీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. స్క్రీన్‌పై కొందరి సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ.. మూవీ టీమ్‌ను ప్రశ్నలు అడుగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న సమయంలో తెరపై ఒక్కసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పూల్‌లో సేదతీరుతున్న ఫోటోలు చూపించారు. దీంతో ఆ ఈవెంట్‌లోని వారందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొంత సమయం సైలెంట్ అయ్యారు. విజయ్, రష్మికలు వేర్వేరుగా ఒకే లొకేషన్లో ఉన్న ఫోటోలను ఒకేచోటకు చేర్చి దానికి ఒక కొటేషన్ చెప్పాలంటూ యాంకర్ సుమ అడుగుతుంది. ఎవరూ ఊహించన విధంగా ఈ సంఘటన జరగడంతో హీరో నాని కూడా చిరు నవ్వుతో సరిపెట్టేశాడు. మృణాల్ ఠాకూర్ ఇదేమిటి..? అంటూ ఆశ్చర్యపోయింది. కానీ యాంకర్ సుమ మాత్రం కొంతమేరకు నాలుగు మాటలు చెప్పి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం హాయ్ నాన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ పై ఫైర్ అవుతున్నారు. మీకు ఏ అధికారం ఉందని వారిద్దరి ఫోటోలు అలా పక్కపక్కనే ఉంచుతారు.. వారిద్దిరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మాత్రమే వచ్చాయి... అధికారికంగా వారు చెప్పలేదు కదా అంటూ సీరియస్ అవుతున్నారు. లక్షల మంది చూసే ఒక కార్యక్రంలో భాద్యత లేకుండా ఇంతలా దిగజారిపోతారా..? అని ప్రశ్నిస్తున్నారు. Cheap promotional stunts from HiNanna Team Fans emo hero ni Personal ga Tag chesi Abuse cheyadam Hero emo Ma #VijayDeverakonda and #RashmikaMandanna personal life ni Events lo use cheyadam Endhuku ra babu e cheap stunts collections ravali ante ma hero personal life lagadam pic.twitter.com/GIDfGRtENy — THE CHANTI (@chanticomrade_) November 29, 2023 -
ఈ సినిమా మీకు నచ్చకపోతే నా పేరు మార్చుకుంటా: మృణాల్ ఠాకూర్
-
చిరంజీవి గారి డాడీ సినిమా లాంటి.. ఎమోషనల్ మూవీ ఇది
-
సలార్ మూవీ వస్తుంది.. దానికంటే ముందు ఈ సినిమా చూడండి!
-
‘హాయ్ నాన్న’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
టికెట్స్ ఇవ్వకపోతే గొడవ చెయ్యండి: హీరో నాని
-
హీరో నాని ‘హాయ్ నాన్న’ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
క్రికెట్ జోష్ ముగిసింది.. బరిలో 8 సినిమాలు.. పోటీ పడుతున్న సలార్
కొద్దిరోజుల్లో 2023కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. దసర పండుగ వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిత్ర పరిశ్రమ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకంటే..? క్రికెట్, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయి. క్రికెట్ కారణంగా కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటే మరికొన్ని అనుకోని కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. నిన్నటితో క్రికెట్ ప్రపంచం నుంచి ప్రేక్షకులు మెళ్లిగా సినిమా ప్రపంచం వైపు మళ్లుతున్నారు. త్వరలో క్రిస్టమస్ పండగ రానుంది... అంతేకాకుండా 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో రానున్న 40 రోజుల్లో విడుదలయ్యే సినిమాలు ఏవి..? ఏడాది చివర్లో భారీ సిక్సర్ కొట్టే సినిమా ఏది..? ఇదే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యే మూవీ ఏది..? అనే అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినీ అభిమానులు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 22 వరకు వరసగా విడుదలయ్యే చిత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆదికేశవతో వస్తున్న వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైష్ణవ్, శ్రీలీల రొమాంటిక్ లుక్‌తో చూడముచ్చటగా కనిపించారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై వైష్ణవ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో రుద్ర అనే పాత్రలో వైష్ణవ్ కనిపిస్తే... వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనుంది. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 'కోట బొమ్మాళి పీఎస్'లో శివాని రాజశేఖర్ లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా గురించి విడుదలకి ముందే హైప్ క్రియేట్ అయింది. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనుంది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. క్రూరమైన యానిమల్గా రణ్‌బీర్ రణ్‌బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్ వస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. హ్యట్రిక్‌పై కన్నేసిన షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేర్లలో 'డంకీ' చిత్రం టాప్‌లో ఉంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్‌జోష్‌లో ఉన్న షారుక్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్, జవాన్ రెండు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. డంకీ చిత్రం ద్వారా సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టాలని షారుక్ ఉన్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం సలార్‌తో పోటీకి దిగనుంది. చివర్లో దిగుతున్న డైనోసార్ (సలార్) భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న చిత్రం సలార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడి క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో భారీ బడ్జెట్ చిత్రంగా సలార్ ఉంది. లైన్లో ఉన్న నాని, నితిన్, విష్వక్సేన్ ఈ చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తకరమైన చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాని చిత్రం 'హాయ్ నాన్న' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 8న ఏకంగా మూడు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వరుణ్‌తేజ్- 'ఆపరేషన్ వాలంటైన్', విష్వక్సేన్- 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', నితిన్- 'ఎక్స్ట్రా ఆర్డినరీమేన్' ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. -
వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!
టాలీవుడ్ హీరో నాని పేరు చెప్పగానే మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు గుర్తొస్తాయి. ఇతడి లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. పాన్ ఇండియా వైడ్ డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌లోనూ సందడి చేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ని కలవడంతో పాటు తనలోని ఓ పాత టాలెంట్‌ని మళ్లీ అందరికీ చూపించాడు. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) హీరో కాకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని.. 'అష్టాచెమ్మా' మూవీతో హీరో అయ్యాడు. ఒక్కో సినిమాతో తన నటన మెరుగుపరుచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి వెళ్లాడు. తాజాగా ప్రపంచకప్ ఫైనల్లో తనదైన కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇతర కామెంటేటర్స్ కూడా చాలా బాగా చేస్తున్నావ్ నాని అనగా.. సినిమాల్లోకి రాకముందే తను ఆర్జే(రేడియా జాకీ)గా కొన్నేళ్ల పనిచేశానని, అందుకే ఇలా అని నాని చెప్పుకొచ్చాడు. అలానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో నాని ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరేమో సూపర్ స్టార్, నాని ఏమో నేచురల్ స్టార్.. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) Natural Star @NameisNani LIVE now on @StarSportsTel for the epic clash of #INDvsAUSfinal. 🏏💪 Watch on @DisneyPlusHS 🔥 #CWC2023 #INDvAUS #TeamIndia #HiNanna #HiNannaOnDec7th @VyraEnts pic.twitter.com/mSQX6v3YTg — Telugu Film Producers Council (@tfpcin) November 19, 2023 -
అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్
తమిళసినిమా: తెలుగులో నటించిన సీతారామం చిత్రానికి ముందు మృణాల్ ఠాగూర్ ఒక ఉత్తరాది నటి అంతే. చాలామందికి ఈమె తెలియదు కూడా. అలాంటిది సీతారామం చిత్రంతో దక్షిణాది చిత్రపరిశ్రమను ఒక్కసారిగా కమ్మేసింది. అయితే ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్న మృణాల్ ఠాగూర్ ఆ తర్వాత ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన గ్లామరస్ ఫొటోలు చూసి ఇది ఒరిజినల్ మృణాల్ ఠాగూర్ అని చెప్పకనే చెప్పింది. అలా హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ బాగా పాపులర్ అయింది. వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాని సరసన నటించిన హాయ్ నాన్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండకు జంటగాను ఒక చిత్రం చేస్తోంది. కాగా తమిళంలో శివ కార్తికేయన్‌తో జోడీ కట్టడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఓకే భాషలో నటిస్తూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. తనకు అన్ని రకాల పాత్రలో నటించాలనే కోరిక ఉందన్నారు. మూస పాత్రలో నటించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అందుకే వివిధ భాషల్లో విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు తన నుంచి ఇదే కోరుకుంటున్నారని వెల్లడించారు. -
ప్రభాస్ అన్నయ్య కోసమే ఈ నిర్ణయం.. సలార్‌పై నాని కామెంట్స్
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టీజర్ ఈవెంట్ లో నాని.. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి హయ్ నాన్న సినిమా డిసెంబర్ చివరి వారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ.. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో నాని సినిమా టీమ్ కూడా అలెర్ట్ అయింది. దీంతో వెంటనే హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సలార్ సినిమా రావడంతో హాయ్ నాన్న సినిమా ముందుగా విడుదల చేయడం ఎలా అనిపిస్తుందని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చాలా చాకచక్యంగా సినిమా విడుదల తేదీలో మార్పు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 'ఒక ఇంట్లో పెద్ద అన్నయ్యకు సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. అప్పుడు చిన్నోడి వేడుకని వాయిదా వేసుకుంటాడు.. తేదీని కూడా మార్చుకుంటాడు. ఇది సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి.' అని ప్రభాస్ సలార్ సినిమా గురించి నాని చెప్పాడు.ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాలతో నిర్మాతలకు నష్టం నాని సినిమా కలెక్షన్లపై ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ లాంటి సినిమాలు చాలా బాగున్నాయని టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం రాలేదని, నిర్మాతలు నష్టపోయారని టాక్ ఉందని, దీనిపై మీ స్పందేనంటని ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి నాని ఘాటుగానే స్పందించారు. ఈ మాట ఏ నిర్మాత చెప్పారో చెప్పండి. నా గత సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్, నాన్ థియేరిటికల్, రీమేక్.. ఇలా అన్ని విధాలుగా నా సినిమాలు మంచిగానే వసూళ్లను అందుకుంది. ‘జెర్సీ’కి రూ.10 రూపాయలు పెడితే.. రూ. 50 రూపాయలు వచ్చాయి. థియేట్రికల్ బిజినెస్ 30 రూపాయలకు జరిగితే 70 రూపాయలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని వివరించారు. సోషల్ మీడియాలో తెలిసి తెలియని వాళ్లు ఇలాంటి మాటలు అనొచ్చు కానీ..అన్నీ తెలిసిన మీడియా సరైన రీజనింగ్‌తో సరిగ్గా అడ్రస్ చేయాలి. మీకు దగ్గరకు వచ్చిన మాటలు నిజం కాదని తెలిసినప్పుడు.. ఆ విషయం అందరికి తెలియజేసే బాధ్యత కూడా మీదే(మీడియా) అని నాని కోరాడు. Love you @NameisNani Anna 🤩. December mottham manade 💥💥#HiNanna #SalaarCeaseFireOnDec22nd#Prabhas #Nani 🥳🥳pic.twitter.com/mOIqCkngaX — Vicky (@imVicky____) October 15, 2023 #Nani thrashes comments made by a reporter stating that #Jersey and #ShyamSinghaRoy are cost Failures#HiNanna pic.twitter.com/pxjovqVaZI — Daily Culture (@DailyCultureYT) October 15, 2023 -
అన్నయ్య కోసం తమ్ముడు మార్చుకున్నాడు!
‘‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ, నాకు నచ్చింది వారికీ నచ్చుతుందనే భరోసా కల్పించారు. ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోసారి అది నిరూపితమవుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో నాని అన్నారు. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్, బాల నటి కియారా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ ఉంటుంది. అన్ని ఏజ్ గ్రూప్‌లకు నచ్చే సినిమాను కమర్షియల్ మూవీ అనుకుంటే..‘హాయ్ నాన్న’ మోస్ట్ కమర్షియల్ మూవీ. మా సినిమాను ముందు డిసెంబరు 21న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ఓ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు, తమ్ముడు అనుకున్న తేదీకే అన్నయ్య వేడుక (ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలను పరోక్షంగా ఉద్దేశించి..) కూడా ఖరారైతే.. తమ్ముడు తేదీ మార్చుకుంటాడు’’ అన్నారు. ‘‘ఒక మంచి కథతో ‘హాయ్ నాన్న’ తీశాం. నా దర్శకత్వంలోని తొలి సినిమాయే పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం హ్యాపీ’’ అన్నారు శౌర్యువ్. ‘‘ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు మోహన్, విజయేందర్ రెడ్డి. ‘‘కథకు తగ్గట్లే మ్యూజిక్ ఇచ్చాను’’ అన్నారు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
ఆ బాధ్యత కూడా మీడియాదే : నాని
మృనాల్ ఠాకూర్, నాని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. అవేంటో చదివేయండి. ఫాదర్-డాటర్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి కదా? హాయ్ నాన్న ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది? నాని: హాయ్ నాన్న చాలా యూనిక్ సబ్జెక్ట్. ఒకొక్క ప్రమోషన్ కంటెంట్ వచ్చే కొద్ది కథ, కాన్సెప్ట్ ప్రత్యేకత గురించి తెలుస్తూనే ఉంటుంది. ఇది టీజర్ ఈవెంట్ కాబట్టి అన్నీ టీజ్ చేయడానికే (నవ్వుతూ). ఇందులో కమర్షియల్ కంటెంట్ ఉందా ? నాని: కమర్షియల్ అంటే అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులందరినీ అలరించేది. అలా చూసుకుంటే .. హాయ్ నాన్న మోస్ట్ కమర్షియల్ మూవీ. మీరు ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తుంటారు. కష్టంగా అనిపించదా? నాని: నచ్చనిది చేయడం బరువుగా ఉంటుంది. నచ్చినది చేయడం తేలికగా ఉంటుంది. నాకు నచ్చిన సినిమా చేస్తున్నాను. దసరా సినిమాకి దీనికి చాలా వైవిధ్యం ఉంది. ఇందులో తల్లి ప్రేమ కూడా తండ్రి ఇస్తున్నాడనినిపించింది టీజర్ చూస్తే.. మీరు ఏం చెప్తారు ? నాని: నిజానికి నేను ఏదీ పెద్దగా కాలిక్యులేట్ చేసి చేయను, మనసుకు నచ్చింది చేసేస్తాను. ఈ రోజువరకూ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నాకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చుతుందనే భరోసా ఇచ్చారు. డిసెంబర్ 7న అది మరోసారి ప్రూవ్ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పటివరకూ ఫాదర్ క్యారెక్టర్ ని చేసే హీరోలు ఒక వయసు దాటిన తర్వాత చేశారు. మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. ఈ వయసులో చేయడం ఎలా అనిపిస్తుంది ? నాని: రోజులు మారాయి. పద్దతులు కూడా మారాలని భావిస్తాను. ప్రేక్షకులు చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళని అందుకోలేకపోతే చాలా కష్టం. మీ అబ్బాయి మిమ్మల్ని హాయ్ నాన్న అని పిలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ? నాని: చాలా గ్రేట్ ఫీలింగ్ అండీ. ‘ఈ పేరు నేనే పెట్టాను కదా’ అని అంటుంటాడు. నువ్వే పెట్టావ్ నీ సినిమానే అని చెబుతుంటాను. జెర్సీ, హాయ్ నాన్న లాంటి సినిమాలు అర్ధం చేసుకొనే వయసు వాడికి ఉందో లేదో తెలీదు. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమాలు చూసి గర్వపడతాడని నా నమ్మకం. టీజర్ లో మీరు తప్పితే అందరూ వేరే భాష నటులు కనిపిస్తున్నారు. పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా ? నాని: ఇందులో తెలుగు హిందీ తమిళ్ అన్ని భాషల నటులు ఉన్నారు. పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందే కానీ పాన్ ఇండియా ని దృష్టి లో పెట్టుకొని చేసింది కాదు. ఇందులో మృణాల్ ఫ్యామిలీ ముంబై నుంచి వచ్చిన కుటుంబం. ఆ పాత్రలు ఎవరు సరిపోతారో వాళ్ళనే తీసుకున్నాం. అలాగే కియారా ఒక ఆడిషన్ వీడియో పంపింది. చాలా అద్భుతంగా చేసింది. ఈ పాత్రకు తను న్యాయం చేస్తుందని తనని తీసుకున్నాం. కచ్చితంగా ఈ సినిమాతో తను మీ మనసుని టచ్ చేస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి. ప్రేక్షకులకు ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం తీసిన సినిమా అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన సరిహద్దులు దాటి ప్రేక్షకులని అలరించే సినిమా ఇది. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా తగ్గట్టు కథలో కూడా మార్పులు చేస్తున్నారు కదా ? నాని: నా సినిమాల వరకూ మాట్లాడుకుంటే.. ఇప్పటివరకూ ఒక్క ఎలిమెంట్ కూడా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని చేసినట్లుగా ఉండదు. నాకు కథ నచ్చితే సినిమా చేస్తాను. ఇందులో హీరోయిన్ మిమ్మల్ని హాయ్ నాన్న అని పిలుస్తుంది. దాని వెనుక ఉన్న కారణం ఏంటి? నాని: ఇందులో కియారాకి నేను నాన్నను కాబట్టి తను తరచూ పిలిచే పిలుపు ప్రకారం అలా పిస్తుంది. అయితే హాయ్ నాన్న వెనుక ఉన్న డీపర్ లాజిక్ ఏమిటనేది సినిమా చూసిన తర్వాత అర్ధమౌతుంది. సలార్ సినిమా రావడంతో మీ సినిమా విడుదల తేదిలో మార్పులు వచ్చాయి. ఎందుకలా? నాని: ఒక ఇంట్లో పెద్ద అబ్బాయి కి సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. చిన్నోడి వేడుకని ముందుకు వెనక్కి జరపడం సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి. (నవ్వుతూ) ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి మంచి సినిమాలు చేసినప్పటికీ.. నిర్మాతలకు నష్టమే వచ్చిందని టాక్? నాని: ఈ మాట ఏ నిర్మాత చెప్పారో చెప్పండి. నా గత సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్, నాన్ థియేరిటికల్, రీమేక్.. ఇలా అన్ని విధాలుగా నా సినిమాలు మంచిగానే వసూళ్లను అందుకుంది. ‘జెర్సీ’కి రూ.10 రూపాయలు పెడితే.. రూ. 50 రూపాయలు వచ్చాయి. ఆ సినిమాను ఉదాహారణగా చెప్పడం తప్ప. అంటే సుందరానికి ఉదాహారణగా చెప్పొచు. సోషల్ మీడియాలో తెలిసి తెలియని వాళ్లు ఇలాంటి మాటలు అనొచ్చు కానీ..అన్నీ తెలిసిన మీడియా సరైన రీజనింగ్‌తో సరిగ్గా అడ్రస్ చేయాలి. మీకు దగ్గరకు వచ్చిన మాటలు నిజం కాదని తెలిసినప్పుడు.. ఆ విషయం అందరికి తెలియజేసే బాధ్యత కూడా మీదే(మీడియా). మీరు నటించిన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉంటున్నాయి. ఎందుకలా? నాని: నేను నటించిన అన్ని సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ లేవు. అంటే సుందరానికి.. దసరా సినిమాల్లో అలాంటి సీన్స్ లేవు. కథకు అవసరమైన, దర్శకుడు చేయమని చెబితేనే ఆ సీన్స్ చేస్తాను. ఇలాంటి సీన్స్ తర్వాత మా ఇంట్లో గొడవలు జరుగుతాయి(నవ్వుతూ..) చాలా మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు ? ఆ నమ్మకం ఎలా కుదురుతుంది ? నాని: నిజానికి నేను అంతగా ఆలోచించను. నేను సహాయ దర్శకుడిగా పని చేశాను. కథ చెప్పినప్పుడు ఆ కనెక్ట్ వస్తే మరో ఆలోచన లేకుండా చేస్తాను. ఇప్పటివరకూ అది కరెక్ట్ అవుతూ వచ్చింది. హాయ్ నాన్న లాంటి స్పెషల్ ఫిల్మ్ తో శౌర్యువ్ కూడా లిస్టు లో చేరుతారు. -
హీరోయిన్‌తో లిప్‌లాక్.. నాని ఇంట్లో గొడవలు!
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్స్ పెడితే.. మరికొన్ని సినిమాల్లో మాత్రం మసాలా యాడ్ చేయడం కోసమే అన్నట్లుగా ముద్దు సన్నివేశాలు పెడుతున్నారు. హీరో నాని సైతం కొన్ని సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించాడు. తాజా చిత్రం ‘హాయ్ నాన్న’లో కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇదే విషయంపై టీజర్ లాంచ్ ఈవెంట్లో ఓ విలేకరి నుంచి నానికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. ‘మీ ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్ సీన్స్ కనిపిస్తున్నాయి. దర్శకుడు ఆ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారా? లేదా మీరు అలాంటి సీన్ పెట్టాలని కండీషన్ పెడుతున్నారా’? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. (చదవండి: విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా) దానికి నాని ఇలా సమాధానం ఇచ్చాడు. ‘నా ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్ సీన్స్ లేవు. అంటే సుందరానికీ.. మూవీతో పాటు దసరా సినిమాలో కూడా ముద్దు సన్నివేశాలు లేవు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆ తరహా సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్‌లో నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి. అయితే నేను ఒక నటుడిని. కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్స్‌లో నటిస్తాను. (చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్) నా గత చిత్రాలను చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సినిమాకు ఆ సీన్ అవసరం అనుకుంటేనే.. నటిస్తాను తప్ప.. ప్రమోషన్స్ కోసమే, లేదా మసాలా యాడ్ చేయడం కోసమో నటించను’ అని నాని సమాధానం ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’టీజర్ చూశాక.. మళ్లీ మీ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ‘ఏమో ఇప్పుడే రిలీజ్ చేశాం. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు నాని. ఇక ‘హాయ్ నాన్న’విషయాకొస్తే.. నాని తండ్రి పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మృణాలు ఠాకూర్ హీరోయిన్. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!
సినిమా ఎంత బాగా తీసినా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలు వరకు పండగల్ని టార్గెట్ పెట్టుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ సంగతి అలా పక్కనబెడితే సంక్రాంతి కోసం విపరీతంగా పోటీపడుతుంటారు. గతంలో మహా అయితే రెండో మూడో సినిమాలొచ్చేవి. ఈసారి మాత్రం అరడజనుకు పైగా లైన్లో ఉన్నాయి. కట్ చేస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పండక్కి రాబోయే సినిమాలేంటి? వాటి లెక్కేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) సంక్రాంతికి అనగానే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కావడం గ్యారంటీ. వచ్చే ఏడాది కూడా మహేశ్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోస్ తమ చిత్రాల్ని బరిలోకి దింపుతున్నారు. మొన్నటివరకు డేట్ చెప్పకుండా ఊరించారు గానీ ఇప్పుడు ఆయా తేదీల్ని కూడా ఫిక్స్ చేసేశారు. అలా అని వీళ్ల ముగ్గురే వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. విజయ్ దేవరకొండ, తేజ సజ్జాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ - జనవరి 11 (రూమర్ డేట్) గుంటూరు కారం - జనవరి 12 హనుమాన్ - జనవరి 12 నా సామిరంగ - జనవరి 12 (రూమర్ డేట్) ఈగల్ - జనవరి 13 అయాలన్ - జనవరి 14 (రూమర్ డేట్) (ఇదీ చదవండి: సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!) ప్రస్తుతానికి పైన చెప్పిన సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అలానే 'సలార్' డిసెంబరు చివరి వారంలో రానుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేశ్ 'సైంధవ్', నాని 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పైన చెప్పిన వాటిలో ఏయే సినిమాలు సైడ్ అవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. మహేశ్ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. నిర్మాతలు సంక్రాంతి అంటున్నారు కానీ చూడాలి. ఒకవేళ పైన చెప్పినవన్నీ సంక్రాంతికే వచ్చినా థియేటర్ల సమస్య పక్కా. కలెక్షన్స్పైనా ఘోరమైన ఎఫెక్ట్ పడుతుంది. బహుశా టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో చూసుకుంటే.. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్! మరి ఫైనల్‌గా రేసులో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!) This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023 -
ప్రభాస్ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్ హీరోలు
సలార్ టీజర్‌లోని కొన్ని పదాలలో ‘సింపుల్ ఇంగ్లిష్ - నో కన్ఫ్యూజన్’ మొదటిది. అయితే, ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీ నుంచి అన్నీ కన్ఫ్యూజన్ అని ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో సినిమా విడుదల అని చెప్పి చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో చాలా సినిమాలు తేదీని ఎంచుకోవడానికి దారితీసింది. దీంతో సలార్ విడుదల కావాల్సిన రోజుకు స్కంద,చంద్రముఖి-2 వచ్చేశాయి. అయితే తాజాగా సలార్ చిత్రం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతుందని వార్తలు బలంగా వస్తున్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సలార్ వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఒకవేళ 'సలార్' డిసెంబర్ 22న విడుదలైతే.. ముందే ఆరోజును టార్గెట్ చేసుకున్న సినిమాల విడుదల తేదీలు మార్చాల్సి వస్తుంది. ఈ సినిమా నిర్మాతలు వేరే తేదీ కోసం మళ్లీ వెతుక్కోవాలి. ఎప్పటి నుంచో క్రిస్మస్ సెలవుల్లో తమ సినిమాలను విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. (ఇదీ చదవండి: దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్) డిసెంబర్ 21, 22, 23 తేదీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందస్తు ప్రణాళికలు పెట్టుకున్నారు. తాజాగా డైనాసర్ సడన్ గా విడుదల తేదీని డిసెంబర్ 22 అని ప్రకటిస్తే వాటి పరిస్థితి ఏంటి అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై సలార్ మేకర్స్‌పై భారీ విమర్శలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడుతుంది అని చెప్పడానికి సు డిసెంబర్21న నాని- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' విడదల అవుతుందని ఆ చిత్ర నిర్మాణ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. డిసెంబర్ 22న, వెంకటేష్ 'సైంథవ్' కూడా లైన్లో ఉంది. డిసెంబర్ 23న నితిన్- వక్కంతం వంశీ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' విడుదల కానుంది. ఇలా ఈ మూడు సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ముందే ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు సలార్‌పై వస్తున్న వార్తల వల్ల ఈ చిత్రాల నిర్మాతల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. సలార్ సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ చాలా అలసత్వం వహిస్తున్నారనే చెడ్డపేరు ఉంది. (ఇదీ చదవండి: ప్రియమణిపై మరో రూమర్స్.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్) ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా కనీసం ఇప్పటికీ సలార్ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకని సంక్రాంతికి 'సైంథవ్' చిత్రాన్ని విడుదల చేయాలని వెంకటేశ్ ప్లాన్ చేస్తున్నారట. సలార్ మేకర్స్ నిర్ణయాల వల్ల ప్రభాస్‌తో పాటు ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైన సలార్ మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏం లేదు. -
మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
మీడియాతో అయినా, అభిమానులతో అయినా సరదాగా మాట్లాడే అది కొద్ది మంది హీరోలలో నాని ఒకరు. ఏ విషయాన్ని అయినా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. మీడియాతో కూడా అంతే. పర్సనల్ విషయాలను అడిగినా.. చెప్పను..కుదరదు అని అనడు. చాలా జన్యూన్‌గా జవాబిస్తాడు. తాజాగా ఆయన తొలి ప్రేమ అనుభవాన్ని రేడియో జాకీలతో షేర్ చేసుకున్నాడు. మృనాల్ ఠాకూర్, నాని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఇటీవల రేడియో జాకీలతో కలిసి చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ప్రేమలో ఎప్పుడు పడ్డాడో.. ప్రస్తుతం తన క్రష్ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ‘నేను మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డాను. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకొని వచ్చింది. నేను ఏమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. ఆమెను చూడగానే నాకు వెళ్లి పకలరించాలని అనిపించింది. కానీ ఆకులు చుట్టుకున్నాననే సిగ్గుతో ఆమె దగ్గరకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. వెళ్లి పలకరిస్తాను’అని సరదగా చెప్పాడు. ప్రస్తుతం తన క్రష్ కియారా ఖన్నా(హాయ్ నాన్న చైల్డ్ ఆర్టిస్ట్) అని చెపన్పాడు. ‘ఒక్కరోజు కియారా ఖన్న చక్కగా రెడీ అయి సెట్‌కి వచ్చింది. చూడగానే ముచ్చటగా అనిపించింది. ప్రస్తుతం తనే నా క్రష్’అని నాని చెప్పుకొచ్చాడు.