అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్‌ ఠాకూర్‌ | Mrunal Thakur Upcoming Movies Details | Sakshi
Sakshi News home page

Mrunal Thakur : అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక

Oct 18 2023 7:48 AM | Updated on Oct 18 2023 9:27 AM

Mrunal Thakur Upcoming Movies Details - Sakshi

తమిళసినిమా: తెలుగులో నటించిన సీతారామం చిత్రానికి ముందు మృణాల్‌ ఠాగూర్‌ ఒక ఉత్తరాది నటి అంతే. చాలామందికి ఈమె తెలియదు కూడా. అలాంటిది సీతారామం చిత్రంతో దక్షిణాది చిత్రపరిశ్రమను ఒక్కసారిగా కమ్మేసింది. అయితే ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్న మృణాల్‌ ఠాగూర్‌ ఆ తర్వాత ఆమె సామాజిక మాధ్యమాల్లో  విడుదల చేసిన గ్లామరస్‌ ఫొటోలు చూసి ఇది ఒరిజినల్‌ మృణాల్‌ ఠాగూర్‌ అని చెప్పకనే చెప్పింది.

అలా హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ బాగా పాపులర్‌ అయింది. వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాని సరసన నటించిన హాయ్‌ నాన్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్‌ దేవరకొండకు జంటగాను ఒక చిత్రం చేస్తోంది. కాగా తమిళంలో శివ కార్తికేయన్‌తో జోడీ కట్టడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా ఈ అమ్మడు  ఒక భేటీలో పేర్కొంటూ ఓకే భాషలో నటిస్తూ ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. తనకు అన్ని రకాల పాత్రలో నటించాలనే కోరిక ఉందన్నారు. మూస పాత్రలో నటించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అందుకే వివిధ భాషల్లో విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు తన నుంచి ఇదే కోరుకుంటున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement