మోహన్ చెరుకూరి, నాని, కియారా ఖన్నా, శౌర్యువ్, హేషమ్ అబ్దుల్, ప్రియదర్శి, షాను
‘‘చిత్ర పరిశ్రమలో బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయి అని మాట్లడుతుంటారు. నాకు సంబంధించి శుక్రవారం నా సినిమా విడుదలైతే.. ‘నాని సినిమాకి వెళ్దాం రా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి.. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని హీరో నాని అన్నారు.
శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాని మాట్లాడుతూ–‘‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా ఉంది.
‘హాయ్ నాన్న’ కి ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు. ‘‘నానిగారు ‘హాయ్ నాన్న’ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను’’ అన్నారు శౌర్యువ్. ‘‘హాయ్ నాన్న’ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’’ అన్నారు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల. కెమెరామేన్ షాను మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment