
అప్పుడప్పడు కొందరు సెలబ్రిటీలకు దశ తిరిగేస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి ఫేజ్ లో రష్మిక ఉంది. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటోంది. తాజాగా ఈమె ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక బయటపెట్టింది.
కర్ణాటకకు చెందిన రష్మిక ప్రస్తుత వయసు 28. కానీ ఆస్తి మాత్రం రూ.66 కోట్ల వరకు సంపాదించిందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుందని పేర్కొంది. రీసెంట్ గా 'ఛావా'తో సూపర్ సక్సెస్ అందుకుంది. త్వరలో ఈమె ఆస్తి రూ.100 కోట్లకు చేరొచ్చని అంచనా.
(ఇదీ చదవండి: ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్)
యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరసగా రూ.500 కోట్ల వసూళ్ల సినిమాలు చేసిన రష్మిక మరోవైపు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ లో ఈమెకు సొంత ఫ్లాట్స్ ఉన్నాయి.
ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న రష్మిక.. అప్పుడప్పడు వెకేషన్స్ కి వెళ్తుంటుంది. మరోవైపు ఈమె దగ్గర బెంజ్, ఆడీ, రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్స్ ఉన్నాయి. ఇలా అన్నింటా రష్మిక తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతోంది.
(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment