![As Srivalli and Pushpa 2 Will Remain Special: Rashmika Mandanna](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Rashmika-Mandanna222.jpg.webp?itok=n_021_Dw)
‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ (‘Pushpa 2: The Rule) సినిమాల్లో శ్రీవల్లి పాత్రతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రష్మికా మందన్నా(Rashmika Mandanna). అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’(2021), ‘పుష్ప 2: ది రూల్’(2024) సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించి, వసూళ్లతో పాటు రికార్డులు సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.
అయితే జిమ్‌లో కాలికి తగిలిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక ఈ థ్యాంక్స్ మీట్‌కు హాజరుకాలేకపోయారు. దీంతో చిత్రయూనిట్‌కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రష్మిక. ‘‘శనివారం జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్‌లో నేను పాల్గొనలేకపోయాను. కానీ, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా.
సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కృతజ్ఞతలు. మీరు ఎంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్‌పీస్‌ను ఇచ్చినందుకు ఒక ప్రేక్షకురాలిగా థ్యాంక్స్. అదేవిధంగా శ్రీవల్లిగా చె΄్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రం కోసం అన్ని విభాగాలు బాగా పని చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రష్మిక.
Comments
Please login to add a commentAdd a comment