Thanks Meet
-
నా హృదయంలో ప్రత్యేక స్థానం: రష్మికా మందన్నా
‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ (‘Pushpa 2: The Rule) సినిమాల్లో శ్రీవల్లి పాత్రతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రష్మికా మందన్నా(Rashmika Mandanna). అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’(2021), ‘పుష్ప 2: ది రూల్’(2024) సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించి, వసూళ్లతో పాటు రికార్డులు సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే జిమ్‌లో కాలికి తగిలిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక ఈ థ్యాంక్స్ మీట్‌కు హాజరుకాలేకపోయారు. దీంతో చిత్రయూనిట్‌కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రష్మిక. ‘‘శనివారం జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ థ్యాంక్స్ మీట్లో నేను పాల్గొనలేకపోయాను. కానీ, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా.సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కృతజ్ఞతలు. మీరు ఎంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్‌పీస్‌ను ఇచ్చినందుకు ఒక ప్రేక్షకురాలిగా థ్యాంక్స్. అదేవిధంగా శ్రీవల్లిగా చె΄్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రం కోసం అన్ని విభాగాలు బాగా పని చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రష్మిక. -
పుష్ప ఐదేళ్ల జర్నీలో ప్రతి క్షణం నాకు ముఖ్యమే: హీరో అల్లు అర్జున్
‘‘చాలాసార్లు ‘పుష్ప’ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో ఎంతో కష్టపడ్డాం. జాతర ఎపిసోడ్ టైమ్‌లో... ఈ ఎపిసోడ్ ఎండ్‌ని చూడగలనా అనిపించింది. ‘పుష్ప 2’(Pushpa 2)ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. అయితే చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. ‘పుష్ప’ సినిమాకు చెందిన ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ అదొక అద్భుతంలా అయితే ఉంది (నవ్వుతూ)’’ అన్నారు అల్లు అర్జున్(Allu Arjun) .హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ‘థ్యాంక్స్ మీట్’(Thank You Meet)ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.ఇండియన్ సినిమాలోని అన్ని ఇండస్ట్రీలకు, ఆడియన్స్ కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘పుష్ప’ ఫ్యాన్స్ కు థ్యాంక్స్. ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే... థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఒక యాక్టర్ ఎంత బాగా అయినా చేయవచ్చు. నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు... కానీ అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టర్ మాత్రమే. ఒకరు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే... సరైన మార్గ దర్శకులు లేకపోతే ఏ యాక్టర్ అయినా బ్యాడ్ యాక్టరే.నన్ను, మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు థ్యాంక్స్ (సుకుమార్‌ను ఉద్దేశించి). తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా చేసినందుకు థ్యాంక్స్. డార్లింగ్... నిన్ను అందరూ నమ్ముతారు. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు నమ్మవు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ , వై. రవిశంకర్గార్ల వల్లే ‘పుష్ప’ సాధ్యమైంది. అలాగే ప్రతి రోజూ కష్టపడే చెర్రీగారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ, నా వ్యక్తిగత ఏఏ టీమ్ అందరికీ ధన్యవాదాలు. సాంగ్స్ మిలియన్స్ ఎలా అవుతాయి అనుకున్న నాకు బిలియన్స్ లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్. శ్రీవల్లి (రష్మిక), కెమేరామేన్ క్యూబా, డ్యాన్స్మాస్టర్స్ గణేశ్, విజయ్, ప్రేమ్ రక్షిత్, శేఖర్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నర్ పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా అని ప్రతి సీన్ ముందు అల్లు అర్జున్‌కి చెప్పేవాడిని. ఈ మాటను మరోలా తీసుకోవద్దు... ట్రోల్స్ చేయవద్దు. మా కాలనీలో ఓ పెద్దాయన నాతో ‘ఎస్వీ రంగారావుగారిలా నటించాడు’ అన్నారు. ఆ పక్కనే ఉన్న మరో పెద్దాయన ‘ఎస్వీఆర్ డ్యాన్సులు, ఫైట్లు చేయడు కదా’ అన్నారు. అల్లు అర్జున్ పరిపూర్ణమైన హీరో. డ్యాన్స్ చేయగలడు... ఫైట్స్ చేయగలడు... ఏడవగలడు... నవ్వగలడు... ‘రంగస్థలం’ నుంచి నాకు సూపర్‌డూపర్ హిట్స్ వచ్చాయంటే కారణం మైత్రీ మూవీ మేకర్సే. మంచి సీన్స్ కోసం రీ షూట్స్ చేసేంత ఫ్రీడమ్ ఇచ్చారు.‘పుష్ప’ సక్సెస్ మైత్రీ మూవీ మేకర్స్‌కే చెందుతుంది. దేవీశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమా తీయలేనేమో! మొదట్లో ‘పుష్ప’ రెండు పార్ట్స్ కాదు. తొలి భాగానికే మూడు గంటల ఫుటేజ్ వచ్చిందని ‘పుష్ప 1’గా రిలీజ్ చేశాం. ఇది ‘పుష్ప’కు జరిగిన అద్భుతం. ఇది చెర్రీగారి వల్ల జరిగింది. ‘పుష్ప 2’నూ ఇలానే రిలీజ్ చేశాం. ఇలా మా లైఫ్‌లో ఆయన ‘పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3’ పెట్టారు. ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ‘పుష్ప 2’తో అసోసియేట్ అయిన అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు.‘‘పుష్ప 1, పుష్ప 2’ అనే మ్యాజిక్‌ను క్రియేట్ చేసిన అందరికీ... ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ‘‘పుష్ప 3’ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు ‘పుష్ప 2’ను హిందీలో పంపిణీ చేసిన హిందీ నిర్మాత అనిల్ తడానీ. ‘‘సుకుమార్‌గారి విజన్‌ని అల్లు అర్జున్‌గారు సరిగ్గా తీసుకెళ్లగలిగారు. ‘పుష్ప’ కోసం చాలా కాల్షీట్స్ ఇచ్చారు రష్మిక. మా సినిమాకు దేవీగారు బ్యాక్‌బోన్. ‘పుష్ప’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘పుష్ప 2’ అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘స్పెయిన్‌లో షూటింగ్ చేస్తూ, అర్ధరాత్రి వేళ అక్కడ ఓ రెస్టారెంట్‌కి వెళితే, ఆ రెస్టారెంట్ నడిపే పాకిస్తాన్ వ్యక్తి నన్ను ‘పుష్ప’ సినిమాలోని మంగళం శీనుగా గుర్తుపట్టి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీలయ్యాను. తమిళ, కన్నడ, మలయాళం... ఇలా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవంతో పాటు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది ‘పుష్ప’తోనే సాధ్యమైంది’’ అన్నారు సునీల్. ‘‘పుష్ప’ సినిమా అయ్యేలోపే రెండు ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్‌ను తట్టుకుని, అందరికీ కరెక్ట్‌గా పేమెంట్ చేసిన మా అకౌంట్స్ టీమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు మైత్రీ సీఈవో చెర్రీ. ‘నైజాంలో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘పుష్ప 2’ కూడా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున మాట్లాడారు. అజయ్, ఆదిత్యా మీనన్, జగదీశ్, గణేశ్ ఆచార్య మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి, ఎడిటర్ నవీన్ నూలి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అల్లు అర్జున్, సుకుమార్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కలిసి ‘పుష్ప’ టీమ్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. -
సక్సెస్ అవుతుందని తెలుసు, ఈ రేంజ్లో ఊహించలేదు!
రామ్ కార్తీక్, కశ్వి.. హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వీక్షణం'. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 18న విడుదలవగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నాడు.హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. నేను కూడా కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉందని తెలిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అన్నాడు.నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మూవీలో కామెడీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కామెడీ అంతలా బాగా రావడానికి కారణం నాతో కలిసి వర్క్ చేసిన ఫణి. ఇద్దరం పోటీపడి మరీ నటించాం. థ్యాంక్స్, ఫణి. అలాగే హీరో కార్తీక్ గారికి కూడా థ్యాంక్స్, ఆయన నాకు చాలా స్పేస్ ఇచ్చారు, నాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అని తెలిపాడు. -
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Chiyaan Vikram: తంగలాన్ మూవీ థాంక్స్ మీట్ (ఫొటోలు)
-
Bhimaa Thanks Meet: భీమా మూవీ థ్యాంక్స్ మీట్ (ఫోటోలు)
-
‘మా ఊరి పొలిమేర 2’ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్‌బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
Vaishnavi Chaitanya : ‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
‘వ్యవస్థ’థాంక్స్ మీట్ (ఫొటోలు)
-
ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్
‘‘రోటీన్‌గా కాకుండా కొత్తగా చేయాలని ‘కస్టడీ’ చేశాను’’ అన్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కస్టడీ’కి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ లభిస్తోంది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్ యాక్షన్ సీన్, పోలీస్ స్టేషన్లో సింగిల్ షాట్ ఫైట్, ట్రైన్ ఫైట్, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు. ఈ చిత్రంలో నేను చేసిన రేవతి పాత్రకు మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కృతీ శెట్టి.‘‘వందశాతం మా కష్టం ఫలించిందని అనుకుంటున్నాను’’ అన్నారు వెంకట్ ప్రభు. ‘‘కస్టడీ’ బ్లాక్‌బస్టర్ అయి నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. -
‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున
‘‘గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలను గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్‌గారు థియేటర్‌కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు’’ అన్నారు హీరో నాగార్జున. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. చదవండి: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే! హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ మూవీ థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్‌కి వెళ్లింది (నవ్వుతూ). చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘గీతాంజలి, సంతోషం, మన్మథుడు’ రోజులు గుర్తొచ్చాయి’’ అన్నారు. ‘‘నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు దుల్కర్. ‘‘నేను నాలుగు సినిమాలు తీశాను.. కానీ ‘సీతారామం’ వంటి ఆదరణ లేదు. ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది’’ అన్నారు హను. ‘‘నాగార్జునగారు మా బేనర్లో ఐదు సినిమాలు చేశారు.. ‘మహానటి, సీతారామం’తో మా బ్యానర్‌కి రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయాడు’’ అన్నారు అశ్వనీదత్. -
CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని సన్మానించారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు. చదవండి: (CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
Salman Khan: చిరంజీవిగారు అడగ్గానే ఓకే చెప్పా!
‘‘చిరంజీవిగారు, రామ్‌చరణ్‌లు నాకు మంచి స్నేహితులు. వెంకటేశ్‌గారు కూడా బాగా తెలుసు. నేను నేరుగా తెలుగులో నటిస్తున్నాను. ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో చేయమని చిరంజీవిగారు అడిగారు. పాత్ర ఏంటి? ఎన్ని రోజులు షూటింగ్ అని అడగకుండా సరే అన్నాను. వెంకటేశ్‌గారితో కూడా నటించబోతున్నాను’’ అని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. మహేశ్ వి. మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ హీరోలుగా నటించిన హిందీ చిత్రం ‘అంతిమ్’. సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 26న విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం థ్యాంక్స్ మీట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘నా సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటాను. ‘టైగర్ 3’ షూటింగ్ వల్ల ఈసారి టైమ్ కుదరలేదు. ‘అంతిమ్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌లో బాగా ఆదరిస్తున్న నా ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకే వచ్చాను. నా ‘దబాంగ్’ సినిమాను తెలుగులో డబ్ చేసి, విడుదల చేశాం. కోవిడ్ వల్ల ‘అంతిమ్’కు టైమ్ లేక తెలుగులో డబ్ చేయలేదు. నా తదుపరి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుదల చేస్తాను. మాస్, క్లాస్, మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్.. ఇలా ప్రత్యేకించి ఏ తరహా చిత్రాల్లో నటించాలని ఆలోచించను.. కథ నచ్చితే సినిమాలు చేస్తానంతే. సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే లాభాలకు గ్యారెంటీ ఉంటుంది. థియేటర్లో సినిమా సరిగ్గా ఆడకుంటే డబ్బులు రావు.. ఇది ఓ రకంగా రిస్క్. అయినా థియేటర్ అనుభూతే వేరు. చాన్స్ వస్తే ఓటీటీకి చేస్తాను’’ అన్నారు. మహేశ్ వి.మంజ్రేకర్, ఆయుష్ శర్మ కూడా పాల్గొన్నారు. -
థాంక్యూ.. కేటీఆర్ సార్..
లక్డీకాపూల్: ఉద్యోగులకు మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సీపీయస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం వారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సీపీయస్ కోశాధికారి నరేష్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమూర్తి, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, కూరకుల శ్రీనివాస్, దర్శన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్, సాహిత్య కార్యదర్శి రోషన్, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ రావులు పాల్గొన్నారు. యథావిధిగా ఓయూ పీజీ, డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలు య«థావిధిగా కొనసాగుతాయని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం తెలిపారు. రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ఓయూ పీజీ,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను యథావిధంగా కొనసాగిస్తామన్నారు. -
‘నాంది’ థ్యాంక్స్ మీట్
-
దయచేసి టికెట్ ధర పెంచొద్దు
‘‘థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్‌ను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు థియేటర్స్ ఓపెన్ చేయడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో ఎవరూ టికెట్ ధర పెంచవద్దని నా మనవి. రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు? టికెట్ ధర పెంచడానికి కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అన్నారు నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి. సాయితేజ్, నభా నటేశ్ జంటగా సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘సాయితేజ్‌గారు ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆర్. నారాయణమూర్తిగారు ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకున్నాను. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు సుబ్బు. ‘‘ఈ సినిమా రిలీజ్ అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం చేసిన సపోర్ట్‌కి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ ప్రభావంతో అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో వారు అడిగితే, ప్రొడ్యూసర్‌గారికి లాభాలు రావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే అప్పుడు థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన రెండు తెలుగు ప్రభుత్వాలకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్ పడ్డాం. కానీ వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
విశాఖలో ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్
-
క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను
‘‘సరిలేరు నీకెవ్వరు, ‘అల.. వైకుంఠపురములో, జాను’ చిత్రాలతో ఈ ఏడాది అప్పుడే ‘దిల్’ రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ అందమైన ప్రేమకథ. క్లైమ్యాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజలి’, నేను డైరెక్ట్ చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాల క్లైమ్యాక్స్ తర్వాత ‘జాను’ చిత్రం అంతలా కదిలించింది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తొలి రోజు నుంచి ఇటు ఇండస్ట్రీ నుండి అటు మీడియా, సోషల్ మీడియా, ప్రేక్షకుల నుండి మా ‘జాను’కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమ్, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. శర్వానంద్, సమంత కళ్లతోనే నటించారు. మా బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెబుతున్నారు. జనరల్‌గా సినిమాలు తీసేటప్పుడు లెక్కలు వేసుకుంటాను.. కానీ ‘జాను’కి లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి సినిమాలు చేయగలం’’ అన్నారు. ‘‘సినిమాని చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు’’ అన్నారు సమంత. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. హిట్స్ కొడుతున్నా కానీ... నటుడిగా ఏదో మిస్ అయ్యాననే భావన మనసులో ఉండిపోయింది.. అది ‘జాను’తో తీరింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అన్నారు. దర్శకులు బి.వి.ఎస్. రవి, నందినీ రెడ్డి, పాటల రచయిత శ్రీమణి, రచయిత ‘మిర్చి’ కిరణ్ మాట్లాడారు. -
‘చూసీ చూడంగానే’ కనెక్ట్ అవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చూసీ చూడంగానే’ సినిమాకు సానుకూల స్పందన రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేష సింధు ది బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ బాగా పండింది. హీరోయిన్గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు. దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాలా సహజంగా సినిమాను తీయాలనుకున్నాం. అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యువతతో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్ అవుతుంది. నాకిది తొలి చిత్రం అయినా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమాకి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ ఆశించలేదు’ అన్నారు. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. చదవండి: ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ -
‘అల..’ రికార్డును త్వరగా బద్దలు కొట్టాలి
సాక్షి, హైదరాబాద్: ‘రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. 'అల.. వైకుంఠపురములో' మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్లిద్దరు. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. 'సిత్తరాల సిరపడు' సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’ అని చెప్పారు. నటులు సుశాంత్, హర్షవర్ధన్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. (అది మొదట చెప్పింది మెగాస్టారే: బన్నీ) -
మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది
కల్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహరీన్ కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాస్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ–‘‘ఇతరుల బాధలు తనవి అనుకుని వారితో అనుబంధాన్ని పంచుకునే పాత్రలో నటించాను. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేశాననే అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. నేను మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చారు సతీష్. ఈ చిత్రంలో నా నటన, డైలాగ్ డెలివరీ, స్టైల్ బాగున్నాయని మా కుటుంబ సభ్యులు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు నా కెరీర్లో ఇదే ఉత్తమ చిత్రమని ప్రశంసించారు’’ అని అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో ఓ మంచి సినిమా తీస్తానని నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్. కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా ఫలితం కోసం నిద్రపోకుండా ఎదురు చూశాం.మొదట్లో ఫెయిల్ అన్నారు. ఆ తర్వాత పాస్ అయ్యామని చెప్పారు. ఫస్ట్ షో తర్వాత సెకండ్ క్లాస్‌లో పాసయ్యామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది’’ అని అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా తీశాం. మా నమ్మకం నిజమైంది. మౌత్‌టాక్‌తో వసూళ్లు పెరుగుతున్నాయి. చక్కటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, తనికెళ్లభరణి తదితరులు పాల్గొన్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ థాంక్స్ మీట్
-
ఆర్టీసీ ఉద్యోగుల కృతఙ్ఞత సభ
-
నీళ్లేవో.. పాలేవో తేల్చారు
సాక్షి, సూర్యాపేట: ‘హుజూర్నగర్ ముద్దుబిడ్డలకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు అందిం చిన విజయం తప్పకుండా మాలో ఉత్సాహాన్ని, సేవా భావాన్ని పెంచడంతోపాటు మరింత అంకితభావంతో పనిచేసే స్ఫూర్తి కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాపనిందలు అన్నింటినీ విశ్లేషణ చేసి మీరు నీళ్లేవో.. పాలేవో తేల్చిచెప్పారు. బల్లగుద్ది మరీ హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’అని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహిం చిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్డు మార్గం ద్వారా హుజూర్నగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంట వెయ్యికిపైగా వాహనాలు వచ్చాయి. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మీరిచ్చిన ఫలితానికి సరిసమానంగా అభివృద్ధి.. హుజూర్‌నగర్‌లో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు మండల కేంద్రాలను తీసేస్తే 134 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎలా అయితే ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితం ఇచ్చారో దానికి సరిసమానంగా సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్ అద్భుతమైన నియోజకవర్గం అనే పరిస్థితి రావాలి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. రేపో, ఎల్లుండో జీఓ విడుదల చేస్తాం. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్నగర్ మున్సి పాలిటీకి సీఎంగా నా నిధుల నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నా. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొంత పోడుభూముల సమస్య ఉంది. దీనిపై అన్ని జిల్లాలకు నేనే వెళ్తున్నా. మొత్తం మంత్రివర్గం వచ్చి ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. 3 ఫీట్లు జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు.. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి బాటలో పెట్టడానికి వచ్చా. మాటలు మాట్లేడేవారు దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి మూడు ఫీట్లు లేడని మాట్లాడారు. ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉన్నడు. కానీ ఇక్కడ ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చాలా మంది చేసింది చెబితే మీరు (ప్రజలు) నవ్వుతారు. కానీ ఇవ్వాళ మూడు ఫీట్లు ఉన్న మంత్రి 300 కి.మీ. దూరాన ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్ మండలంలోని చివరి గ్రామాలు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు జిల్లా భూములను పునీతం చేస్తుండు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్ల మండలానికి తెచ్చాడు. ఇది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుంది. సాగర్ ఆయకట్టును కాపాడుకుంటాం.. నాగార్జునసాగర్ ఆయకట్టును నల్లగొండ జిల్లాలో కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును తీసుకున్నాం. దీని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు తొలగుతాయి. నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలి. దీనికోసం గోదావరి నీళ్లు సాగర్ ఎడమ కాలువలో పడాలి. ఈ నీళ్లతో రెండు పంటలు ఏటా పండాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నాలుగేళ్లు అహోరాత్రాలు పనిచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ సాగర్ ఆయకట్టుపై పడుతుంది. కచ్చితంగా తిరుగుతా. ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వచ్చే 15–20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటన చేస్తా. ప్రజలను, రైతులను కలుస్తా. ఈ బడ్జెట్లో, వచ్చే బడ్జెట్లో కొన్ని నిధులు మంజూరు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. ఏ ఎత్తిపోతలు కావాలో అన్నీ మంజూరు చేస్తాం. కాలువల లైనింగ్‌లు చేస్తాం. ఈ పనుల్నీ త్వరలో జరుగుతాయి. నవంబర్ మొదటి వారంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ నిపుణులు, నాగార్జునసాగర్ సీఈ నర్సింహతో తిరిగి పరిశీలించాలి. ఎత్తిపోతల రైతాంగానికి శుభవార్త.. ఐడీసీ, నీటిపారుదలశాఖ కింద ఎత్తిపోతల బాధ్యతలు సొసైటీలు, ఎన్జీఓల పరిధిలో ఉన్నాయి. రైతులపై పైసా భారం లేకుండా వాటన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుంది. అందులోని సిబ్బందినీ ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 600 ఎత్తిపోతలకు ఈ ఉపశమనం ఉంటుంది. రైతాంగమంతా సంతోషిస్తుంది. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి ఈ శుభవార్త చెబుతున్నా. కర్రు కాల్చి వాత పెట్టారు.. సైదిరెడ్డికి మీరు (ప్రజలు0 40 వేలకుపైగా మెజారిటీ ఇచ్చారు. కొందరు దుర్మార్గులు ఆయనది గుంటూరు జిల్లా అన్నారు. ఆయనది గుంటూరు జిల్లా కాదు కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టారు. మీ అందరి దీవెనలు ఇలానే ఉంటే ఎవరు ఏమన్నా భయపడకుండా, వెరవకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తాం. మళ్లీ వచ్చినప్పుడు జానపహాడ్ దర్గా, మట్టపల్లి ఆలయం దర్శనం చేసుకుంటా. ఈ రెండు పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తాం. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి సైదిరెడ్డికి విజయం చేకూర్చి కేసీఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్ అని చెప్పిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తాం. -
చాలు.. ఇక చాలు అనిపించింది
‘‘సైరా’ సినిమా విడుదలకు నెలన్నర ముందు నుంచి తెల్లవారుజాము 3.30 ప్రాంతంలో ఉలిక్కిపడి నిద్రలేచేవాణ్ణి. అది ఎందుకో తెలియదు. బహుశా మన తెలుగు సినిమా నిర్మాతలందరూ అలాగే లేస్తారేమో తెలియదు’’ అన్నారు ‘సైరా’ చిత్రనిర్మాత రామ్‌చరణ్. చిరంజీవి టైటిల్ రోల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మించిన చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘థ్యాంక్స్ టూ ఇండియా’ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ పైనుండి మమ్మల్ని ఆశీర్వదించి నాన్నగారితో ఇంత గొప్ప సినిమా తీసే అవకాశం ఇచ్చారేమో. ఇది భారతీయులు గర్వపడే సినిమా’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ కథ పరుచూరి బ్రదర్స్ బిడ్డ. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సురేందర్ రెడ్డితో చెప్పాం. కథ ఏ విధంగా చెప్పారో అదే కథను ఓ ఎపిక్‌లా తెరమీద చూపించినందుకు హ్యాట్సాఫ్ టు సురేందర్. నేను ఎప్పుడూ ఏ కథ విన్నా నాతోపాటు ఓ స్క్రిప్ట్ డాక్టర్ ఉంటారు. ఆయనే సత్యానంద్‌గారు. ఆయనకు థ్యాంక్స్. సాయిమాధవ్‌గారు చక్కని మాటలను అందించారు. అమితాబ్‌గారు స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చి మాకు ఎలా కావాలో అలా అద్భుతంగా నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో చేశారు కాబట్టే ఈ రోజున ‘సైరా’ అందరితో ‘వావ్’ అనిపించుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి స్వాతంత్య్ర సమర యోధుడు అనే సంగతి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ఫిల్మ్‌గా విడుదల చేశాం. ఈ సినిమా ప్రీమియర్‌ను ఒకటో తారీఖున ముంబైలో మీడియాకి వేశాం. అక్కడ సినిమా చూసినవారందరూ సౌత్‌లో ఇంతమంచి నాయకుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయి, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట. ఇది సౌత్, నార్త్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా అంటున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటుంటే చాలు.. ఇక చాలు! ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనిపించింది’’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప హిస్టారికల్ ఫిల్మ్‌ను తీసే చాన్స్ ఇచ్చినందుకు చిరంజీవిగారికి, రామ్‌చరణ్‌కి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్ సినిమా కలెక్షన్లను గ్రాస్‌లో చెబుతారు. తెలుగులో షేర్‌ను మాత్రమే చెప్పేవాళ్లం. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా 85 కోట్లు వసూలు చేసిందని గ్రాస్‌లో కలెక్షన్లను చెబుతున్నాం. ఇది అమేజింగ్ ఫిగర్. చిరంజీవిగారిని కలిసినప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుందని కాదు రాజూ.. ఇది రెస్పెక్టెడ్ మూవీ, ఆ గౌరవాన్ని కాపాడాలి అన్నారు’’ అని చెప్పారు. ‘‘చిరంజీవిగారు తన తర్వాతి సినిమాల్లో కూడా నన్ను తీసుకోవాలి’’ అన్నారు తమన్నా. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, రత్నవేలు, బుర్రా సాయిమాధవ్, కమల్‌కణ్ణన్, జగపతిబాబు, సుస్మిత, విద్య తదితరులు పాల్గొ న్నారు. -
నాకు నేను నచ్చాను
‘‘రణరంగం’ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వినిపిస్తోందన్నారు. మ్యాట్నీ షోకి యావరేజ్ అన్నారు. సెకండ్ షో పడేసరికి ఎబౌ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా∙చేరువ అవుతుందని నమ్ముతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత గురువారం విడుదలైంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న చిత్రబృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ అండ్ ప్రాపర్ యాక్షన్ సినిమా ఇవ్వాలని ‘రణరంగం’ సినిమా చేశాను. ఈ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన మంచి క్వాలిటీ æఫిల్మ్‌గా ‘రణరంగం’ పేరును చెబుతుంటే హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి మాస్ పాత్ర చేయలేదు. నాకు నేను నచ్చాను. స్క్రీన్‌ప్లే బేస్డ్ పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది. క్లైమాక్స్ అలా ఉండకపోతే రెగ్యులర్ సినిమాలా ఉండేది. సినిమాలో కల్యాణీకి, నాకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మా ఇద్దరి లవ్‌ట్రాక్ నా కెరీర్లోనే బెస్ట్. చిన్న పాత్ర అయినా చేసినందుకు కాజల్‌కి థ్యాంక్స్. కలెక్షన్స్ గురించి మాట్లాడను. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. రణరంగం నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘విడుదలకు ముందే ఇది శర్వానంద్ సినిమా అని చెప్పా. మంచి ఓపెనింగ్స్ రావడానికి శర్వానే కారణం. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకాడలేదు. ఓపెనింగ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘రాంగ్ ఫిగర్లు (వసూళ్లు) చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్ల షేర్ వచ్చింది. ఇలానే ప్రేక్షకాదరణ కొనసాగితే భవిష్యత్ కలెక్షన్స్ బాగుంటాయనుకుంటున్నాం. ఫ్యామిలీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు’’ అని పీడీవీ ప్రసాద్ అన్నారు. ‘‘విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు దివాకర్ మణి. ‘‘జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రాజా. -
అదే నిజమైన విజయం
‘‘రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా చాలా బాగుంది. ఫలానా సీన్ బాగుంది. చివర్లో మదర్ సెంటిమెంట్ బాగుంది’ అని చెప్పారు. అదే నిజమైన విజయమని భావిస్తున్నాను. బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్ అనను. దాదాపు రెండేళ్ల తర్వాత మంచి హిట్ సాధించానని చెప్పగలను’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యాసింగ్ కథానాయికగా నటించారు. విజి. సుబ్రహ్మణ్యన్, దయా పన్నెం, సందీప్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం అనిల్ సుంకర సమర్పణలో ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. మా అబ్బాయి లవ్ ఫెయిల్యూర్‌తో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా 3 నెలల కింద వచ్చి, మా అబ్బాయి చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునే ముందు మా గురించి ఆలోచించేవాడేమో అని బాధపడ్డారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మమ్మల్ని నమ్మి ఈ సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యారని చెప్పగలను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకరగారు హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యం చేసిన సందీప్‌ను మెచ్చుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాను నిర్మించడానికైనా సందీప్‌లాంటి హార్డ్‌వర్కర్ గెలవాలి’’ అన్నారు తమన్. ‘‘నిర్మాతగా మా తొలి సినిమా ఇది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దయా పన్నెం. ‘‘ఈ సినిమా విజయంలో భాగస్వామ్యం కల్పించిన సందీప్ కిషన్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు’’ అన్నారు అన్యా సింగ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది సమష్టి విజయం
‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్‌గారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నానిగారు, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్‌బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
ఆజన్మాంతం రుణపడి ఉంటా
‘‘ఒక సంఘటన వల్ల విషాదఛాయలు కమ్మిన మా ఇంట్లోకి వెలుతురు రేఖను, ఓ నవ్వు రేఖను తీసుకొచ్చిన నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, చిత్ర బృందానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి ముఖంలో నవ్వు చూశా. ఈ ‘అరవిందసమేత...’ విజయాన్ని మా నాన్నగారికి (హరికృష్ణ) ఎందుకో గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉంది సామీ (త్రివిక్రమ్‌ని ఉద్దేశిస్తూ) అని అడిగాను. మా నాన్నగారికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేలా దోహదం చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని త్రివిక్రమ్‌గారితో చేయాలనుకున్నా. ఆ తరుణం మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో రానే వచ్చింది. ఈ చిత్రం విజయం నా ఖాతాలో వేశారు త్రివిక్రమ్‌గారు. కానీ, ఇది ఆయన కలంలోని సిరా నుంచి వచ్చిన విజయం. దర్శకునిగానే కాదు.. ఓ గురువుగా కూడా త్రివిక్రమ్ ఈ సినిమాను ముందుండి నడిపించారు. నిర్మాత పాత్రను వంద శాతం నిర్వహించారు చినబాబుగారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా.. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా ‘అర వింద సమేత వీరరాఘవ’. వీటన్నింటినీ దాటుకుని ఒక వెల్లువలాంటి విజయాన్ని ఇచ్చి, పండగను మా ఇళ్లలోకి తీసుకొచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటించడానికి సారధి ఎన్టీఆరే. వాళ్ల తాతగారి పేరు నిలబెట్టడం కాదు.. దాన్ని మ్యాచ్ చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆయన లైఫ్‌లో అంత విషాదం జరిగినా... మేము ఎక్కడ నలిగిపోతామేమోనని ఆయన నలిగిపోయాడు. ఈ సినిమా విజయం కచ్చితంగా ఎన్టీఆర్ ఖాతాలోకే వెళుతుంది. చినబాబుగారు ఖర్చుకు వెనకాడరు. నా మొదటి విమర్శకుడు ఆయనే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రచయితలు రామజోగయ్యశాస్త్రి, పెంచలదాస్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విమర్శకులు అభినందించడం ఆనందంగా ఉంది
‘‘ఫ్యామిలీ అంతా కలసి చూసే మూవీ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. మౌత్ టాక్‌తో పెద్ద సక్సెస్‌వైపుకు వెళ్తుందీ సినిమా. విమర్శకులు కూడా అభినందించడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్ నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేశ్ కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. శనివారం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘సెన్సార్ వాళ్లు బావుంది అని చెప్పడంతోనే నమ్మకం వచ్చింది. హరీష్ శంకర్, రానా, మోహన్ కష్ణ ఇంద్రగంటి, సందీప్ కిషన్, గోపీమోహన్ అందరూ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఆర్.ఎస్ నాయుడు బాగా తీశాడు. ‘అష్టా చమ్మా’లో స్వాతి, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా ఈ సినిమాలో నభా అంటున్నారు నభాను. కామెడీ వర్కౌట్ అవుతుందా అనుకునేవాణ్ణి. షార్ట్ ఫిల్మ్ సీన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సుధీర్ మంచి కో–స్టార్. ప్రొడ్యూసర్‌గా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మంచి రోల్ రాసినందుకు డైరెక్టర్‌గారికి థ్యాంక్స్. అమేజింగ్ సక్సెస్‌లో నన్ను భాగం చేసినందుకు థ్యాంక్స్. బాగా యాక్ట్ చేశాను అని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్. ‘‘కామెడీ, ఎమోషనల్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. తండ్రీ, కొడుకుల ఎమోషనల్ సీన్స్‌కు రెస్పాన్స్ బావుంది. సుధీర్‌గారు నన్ను నమ్మి చేసిన కథ ఇది. నభా చాలా బాగా చేసింది’’ అన్నారు ఆర్ఎస్ నాయుడు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ చోటా ప్రసాద్ పాల్గొన్నారు. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్‌కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్‌కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’
సాక్షి, హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ జంటగా డైరక్టర్ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్ బ్లాక్‌బస్టర్ పేరిట పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ శనివారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట సినిమా కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. ఈ సినిమాకు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయని.. అందుకు మారుతికి థ్యాంక్యూ చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ల సొంతింటి అల్లుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్లు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని.. అక్కినేని ఫ్యాన్స్ తనకు సూపర్ ఎనర్జీ ఇచ్చారని వెల్లడించారు. నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ లకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఈ సినిమా బాగుందని ఫ్యామిలీల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అను మాట్లాడుతూ.. ముందు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. మారుతికి, నాగచైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూడని వాళ్లు థియేటర్ వెళ్లి తప్పక సినిమా చూడండి అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ, నాగవంశీ పాల్గొన్నారు. -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
‘నీవెవరో’ థాంక్స్ మీట్
-
చిన్న సినిమాలకు పెద్ద వరం
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తీసుకున్న నిర్ణయం చిన్న సినిమాలకు పెద్ద వరం. 116 జీవో చిన్న సినిమాలతో పాటు నిర్మాతలందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంది’’ అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు వి.వీరినాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘4 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మించే ప్రదేశాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతి ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఏడాది ఎఫ్డీసీ పర్యవేక్షణలో 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి రూ.10 లక్షలు సబ్సిడీ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఆమోదించడానికి కారకులైన ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం కీలకమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమపట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటోంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ సెక్రటరీ ముత్యాల రాందాసు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌సీసీ సెక్టార్ చైర్మన్ వల్లూరిపల్లి రమేశ్, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ఈసీ మెంబర్ ప్రసన్న కుమార్, స్టూడియో సెక్టార్ తరఫున బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా లైఫ్‌లో అదే పెద్ద అభినందన
‘‘రెండేళ్లుగా నాకు చాలా ఎమోషనల్‌గా, ఒత్తిడిగా ఉండేది. ఇప్పుడు రిలీఫ్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ని హిట్ చేసిన ప్రేక్షకులు, నాన్నగారి, నా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్’’ అని మహేశ్‌బాబు అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘బ్రహ్మాజీ నాతో యాక్ట్ చేసినప్పుడల్లా 99 పర్సెంట్ బ్లాక్‌బస్టర్సే. తెలుగు చిత్ర పరిశ్రమకి కియారా లాంటి ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. శివగారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ‘శ్రీమంతుడు’ సినిమాకి ముందు కూడా ఇదే ఫేజ్ ఉండేది నాకు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. తర్వాత అదే రిపీట్ చేశారు. నేను పడుతున్న టెన్షన్ ఆయనకు తెలుసు. మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ‘ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు సర్’. నేనెప్పుడూ ఏ సినిమాకీ ఇంత కష్టపడి పనిచేయలేదు. మా సినిమా రిలీజ్ ముందు ఏప్రిల్ 27న అనుకున్నాం. 20కి వచ్చాం. అది మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతకి, యూనిట్‌కి థ్యాంక్స్. ఆ రోజు సినిమా విడుదల అవడం వల్లే ఇన్ని బ్లెసింగ్స్ వచ్చాయేమో మాకు. 20న సినిమా రిలీజ్ అంటే పదో తారీఖు నా డబ్బింగ్ పూర్తయింది. ఈ టెన్షన్ తట్టుకోలేక ఫ్యామిలీతో కలిసి ఐదు రోజులు వెకేషన్ వెళ్లా. దేవి ఈజ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. నేపథ్య సంగీతంతో స్టోరీ చెప్పేశారు. ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని దానయ్యగారికి ఉండేది. ‘భరత్ అనే నేను’ చేశాం. పెద్ద హిట్ అయింది. రిలీజ్ రోజు సాయంత్రం ఆయన్ని కలిసి.. ‘కొట్టేశాం దానయ్యగారు పెద్ద హిట్’ అంటే.. ‘అవ్వుద్దండీ.. ఎందుకు అవ్వదు.. అవ్వాలి కదా!’ అన్నారు. ‘మీతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తాను సార్’. థ్యాంక్యూ. సినిమాలో ఇంకా చాలా ఎగై్జటింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టలేకపోయా మనే బాధ ఉంది. నాన్నగారికి (కృష్ణ) సినిమా విపరీతంగా నచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ ఓత్ విడుదలైనప్పుడు ‘అరే.. ఇది నా వాయిస్‌లా ఉందే’ అన్నారు. రమేశ్ అన్నయ్య చెన్నైలోనే ఎక్కువగా పెరిగారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లంటే ఆయనకి ఇష్టం. వారికి బిగ్ ఫ్యాన్. ‘భరత్ అనే నేను’ సినిమా చూడగానే నాకు వాళ్లు గుర్తొచ్చారు అని చెప్పారు. అది నా లైఫ్‌లో బిగ్ కాంప్లిమెంట్’’ అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కృషగారు, మహేశ్ అభిమానులకు ఓ హామీ ఇచ్చా. అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ మూవీ చూసి, చిరంజీవి గారు ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అభినందించారు. నా బంధువులు, ఫ్రెండ్స్ గొప్ప సినిమా తీశావని ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. గొప్ప సినిమా ఇచ్చిన శివగారికి, మహేశ్‌గారికి థ్యాంక్స్. హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 27న శుక్రవారం తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహిస్తాం’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నేను నా స్క్రిప్ట్‌ని ఎంత ప్రేమిస్తానో నా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అంతే ప్రేమిస్తారు. మహేశ్‌లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో రాయాలనే ఉంటుంది. ఆయన మంచి సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంటుంది. గొప్ప సినిమా తీయాలని చెప్పిన దానయ్యగారి నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా. మా కష్టం అంతా మరచిపోయేలా చేసినందుకు జీవితాంతం ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలను మించిన లైన్ దొరికినప్పుడు మహేశ్‌గారి ఇంటికెళ్లి కాలింగ్ బెల్ నొక్కుతా’’ అన్నారు. ‘‘సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీలో అందరికీ వస్తుంటాయి. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే.. సమాజంలో ఏదైతే జరగాలో.. ఇలాంటోడు ఒకడు రావాలనుకుంటామో అలాంటి వాడు రావడంతో అందరూ కనెక్ట్ అయ్యారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘ఈ మూవీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మహేశ్ సార్‌లాంటి కో–స్టార్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నా. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కియారా. నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. -
‘బాహుబలి తర్వాత రంగస్థలం టాప్...’
‘మీరు ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?’ అని అడుగుతుంటారు. నేనెప్పుడూ అలా సినిమాలు ఒప్పుకోలేదు. కథ ముందు నాకు నచ్చాలి. ఆ తర్వాత అందరికీ నచ్చుతుంది. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం’’ అని రామ్‌చరణ్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌కి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్‌ను మా భుజాలపై పెట్టాడు. తన మిషన్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, సినిమా సక్సెస్‌లో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వేసవిలో రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకెంతో ఇష్టం. సినిమా రంగంలో వచ్చే ప్రతి రూపాయిని వారు మళ్లీ తర్వాతి సినిమాపైనే పెడతారు. వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు, చరణ్‌కి కామన్ ఫ్రెండ్ రంగ. అతని ద్వారా ‘నాన్నకు ప్రేమతో’ సమయంలో చరణ్‌ని కలిశా. తను నా మైండ్‌లో ఉండిపోయాడేమో.. కాబట్టి ‘రంగస్థలం’ టైటిల్ పెట్టా. జగపతిబాబుగారు ఏ ప్రాత చేసినా బంగారమే. ఆయనతోనే ప్రేమలో పడిపోయా. ఆయనతో నా ప్రతి సినిమా చేయాలనుకుంటున్నాను. రత్నవేలుగారు ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్‌కు పెళ్లయితే ఆమెను ప్రేక్షకులు ఆదరించరని అంటుంటారు. కానీ, సమంత విషయంలో అలా జరగలేదు. రూల్స్‌ను బ్రేక్ చేసిన సినిమా ఇది. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేదు’’ అన్నారు. ‘‘సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు ‘లెజెండ్’ చిత్రం ఓ లైఫ్ అయితే.. ‘రంగస్థలం’తో మరో లైఫ్ వచ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్’’ అన్నారు జగపతిబాబు. ‘‘రంగస్థలం తొలి మూడురోజులకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో, నాలుగోరోజు సోమవారం కూడా అంతే కలెక్షన్స్ రావడం సినిమా బ్లాక్‌బస్టర్ అనడానికి పెద్ద నిదర్శనం. ‘ఆర్య’ తర్వాత సుక్కు చిత్రాల్లో పూర్తిగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుక్కు కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్ హీరో కొత్తగా ట్రై చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలకు వర్కవుట్ అయ్యింది. ‘మగధీర’ను కూడా ఈ సినిమా క్రాస్ చేయబోతోంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘రంగస్థలం’ స్టార్టింగ్ షాట్ నుంచి ఎండింగ్ వరకు చరణ్‌గారి నటన సూపర్బ్ అని అందరూ చెబుతున్నారు. ‘రంగస్థలం’ ఫస్ట్ షెడ్యూల్ కాగానే మరో సినిమా చేయమని సుకుమార్‌గారితో కమిట్ అయ్యామంటే మా జర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. మా మూడు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘బాహుబలి, బాహుబలి 2’ తర్వాత ‘రంగస్థలం’ టాప్ గ్రాసర్ అవుతుంది. ‘ఖైదీనంబర్ 150’ చిత్రాన్ని కూడా చరణ్‌గారు దాటేస్తారు’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత సీవీఎం, రవిశంకర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటి అనసూయ, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థలం థాంక్స్ మీట్ హైలెట్స్
-
నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది..
‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్ మీడియా వర్క్స్ బేనర్లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్‌గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్. ‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ రాజ్ తోట, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
హిట్ అనుకున్నాం.. సూపర్ హిట్ అయ్యింది – నాగశౌర్య
‘‘ఛలో’ ఓ ఎమోషనల్ జర్నీ. మంచి సినిమా తీశాం. హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ పెద్ద హిట్.. సూపర్‌హిట్ అయ్యింది. టికెట్లు దొరకడం లేదని కొందరు నన్ను టికెట్లు అడుగుతుంటే ‘వీళ్లు కావాలనే అడుగుతున్నారా.. లేకుంటే నిజంగానే పెద్ద హిట్ అయ్యిందా అన్నది అర్థం కావడం లేదు’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛలో’. శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఛలో’ సినిమాకి నేనొక్కడినే బలం కాదు. నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ. నాకు మా అమ్మానాన్న బలమైతే.. ఐరా క్రియేషన్స్‌కి బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డి అంకుల్ ఇద్దరే బలం. మరో నాలుగు సినిమాలు తీయొచ్చనే ధైర్యం ఇచ్చింది వారిద్దరే. ‘ఛలో’ని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ రోజుల్లో డైరెక్టర్‌గా అవకాశం దొరకడం ఎంత కష్టమో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాకు తెలుసు. అటువంటిది నన్ను నమ్మి, సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఉషా ఆంటీ, శంకర్‌ప్రసాద్ అంకుల్. మిమ్మల్ని జీవితంలో మరచిపోలేను. శౌర్య, రష్మిక చాలా బాగా చేశారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘ఛలో’ సినిమాని ఆదరించడంతో పాటు నన్ను బాగా సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు రష్మిక మండన్న. శంకర్‌ప్రసాద్, ఉషా, కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!
-
దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!
- థ్యాంక్స్ మీట్లో ఎన్టీఆర్ ‘‘ఓ వెలుగు కనిపిస్తుందని ఎప్పుడో చెప్పా. ఈరోజు నిజంగా.. నేను నమ్మిన వెలుగుని నాకు అందించిన ప్రేక్షక దేవుళ్లకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అన్ని విజయాల కంటే ఈ విజయాన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను. ఎప్పటికీ మరువను. ఇంకా బాధ్యతతో సినిమాలు చేస్తా’’ అన్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘జనతా గ్యారేజ్’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘కొన్నిసార్లు కళ్లలో ఆనందంతో వచ్చే నీళ్లు తప్ప.. మాటలు రావు. అంత గొప్ప అనుభూతిని దర్శకుడు కొరటాల శివ నాకు అందించాడు. ఈ నెల 2న మా అమ్మానాన్నల పుట్టినరోజు. ఇద్దరికీ 60 ఏళ్లు నిండాయి. పన్నెండేళ్ల నా తపన, సంకల్పాన్ని ‘జనతా గ్యారేజ్’ రూపంలో వాళ్లకు గిఫ్ట్‌గా అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా. ఆయన పక్కన నటించే అర్హత, వయసు లేకపోయినా నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా, ఓ శిష్యుడిలా భావించి జీవితంలో ఎన్నో కొత్త కోణాలు తెలుసు కునేలా చేసిన ద కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ నిర్మాతలు ఇంకా ఎన్నో విజయాలు చూడాలని కోరుకుంటున్నాను. నా సక్సెస్, మేకోవర్ వెనక నా స్టైలిష్ అశ్విన్ కృషి ఎంతో ఉంది. దేవిశ్రీ తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు. ‘బృందావనం’ తర్వాత నేను, సమంత చేసిన రెండు చిత్రాలూ మేము అనుకున్న విజయం సాధించలేదు. నేను సెంటిమెంట్స్ నమ్మను కానీ, చాలామంది ‘ఎన్టీఆర్, సమంత కలసి నటిస్తే సినిమా హిట్ కాదు’ అని మాట్లాడారు. ఫైనల్లీ.. ‘జనతా గ్యారేజ్’తో హిట్ అందుకున్నాం. సినిమాలోనే కాదు, షూటింగ్‌లోనూ మా వెన్నంటి పాజిటివిటీ అందించిన మెకానిక్స్, మా చంటి మామ (ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరరావు), పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డెరైక్టర్ ప్రకాశ్, అందరికీ థ్యాంక్స్. నా స్నేహితుడు రాజీవ్ కనకాల చేశాడు కాబట్టే వికాస్ క్యారెక్టర్, జి.హెచ్.ఎం.సి. ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారు. మాకంటే గట్టిగా డిస్ట్రిబ్యూటర్లు సినిమాని నమ్మారు. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మొదటి వారంలోనే డబ్బులొచ్చేశాయని డిస్ట్రిబ్యూ టర్లు చెప్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ - ‘‘తారక్ కాంబి నేషన్‌లో నాకు బ్లాక్‌బస్టర్ ఇస్తానని శివగారు మాటిచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్తుంటే నాకే డబ్బులొచ్చినంత హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రానికి 8 రోజుల్లోనే నేను పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ ‘జనతా గ్యారేజ్’కి వచ్చాయి’’ అన్నారు. రాజీవ్ కనకాల, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ, ఎడిటర్ కోటగిరి, ఆర్ట్ డెరైక్టర్ ఏఎస్ ప్రకాశ్ పాల్గొన్నారు. ఆయన నమ్మకమే కారణం - దర్శకుడు కొరటాల శివ ‘‘యంగ్ టైగర్ కాదు, ఎన్టీఆర్ యంగ్ బ్రదర్ నాకు. రెండేళ్ల క్రితం కథ విన్నప్పుడే ‘చాలా మంచి కథ. పెద్ద స్థాయికి వెళ్తుంది’ అన్నారు. అందరి కన్నా ఈ కథను ఎక్కువ నమ్మింది ఎన్టీఆరే. ఈ భారీ విజయానికి కారణం మొదట ఆయన నమ్మకమే. తర్వాత ఈ స్థాయి విజయానికి మరో కారణం మోహన్‌లాల్‌గారు.’’ -
అభిమానులతో పవన్ కల్యాణ్ సమావేశం రద్దు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ సినిమా విజయోత్సవ వేడుకలు, సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పవన్ తన శైలికి భిన్నంగా అభిమానులను కలవాలని భావించారు. సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకోసం ఆదివారం వారితో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం రద్దయింది. దీనికి గల కారణాలేంటన్నది తెలియరాలేదు. కాగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణం కాదని చిత్ర నిర్మాత ప్రసాద్ చెప్పారు. 'ఆదివారం అభిమానులతో కృతజ్ఞత సమావేశం నిర్వహించాలని భావించాం. అనివార్య కారణాల వల్ల దీన్ని రద్దు చేశాం. కొత్త తేదీని త్వరలో తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో అత్తారింటికి దారేది చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొంటారు' అని ప్రసాద్ చెప్పారు. గత నెల 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు.