సక్సెస్‌ అవుతుందని తెలుసు, ఈ రేంజ్‌లో ఊహించలేదు! | Ram Karthik Veekshanam Movie Thanks Meet | Sakshi

Veekshanam Movie: వీక్షణం థ్యాంక్స్‌ మీట్‌.. సంతోషంలో చిత్రయూనిట్‌

Oct 20 2024 7:27 PM | Updated on Oct 20 2024 7:26 PM

Ram Karthik Veekshanam Movie Thanks Meet

రామ్ కార్తీక్, కశ్వి..  హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వీక్షణం'. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 18న విడుదలవగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో చిత్రయూనిట్‌ థ్యాంక్స్ మీట్  సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నాడు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. నేను కూడా కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉందని తెలిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అన్నాడు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మూవీ‌లో కామెడీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కామెడీ అంతలా బాగా రావడానికి కారణం నాతో కలిసి వర్క్ చేసిన ఫణి. ఇద్దరం పోటీపడి మరీ నటించాం. థ్యాంక్స్, ఫణి. అలాగే హీరో కార్తీక్ గారికి కూడా థ్యాంక్స్, ఆయ‌న నాకు చాలా స్పేస్ ఇచ్చారు, నాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement