Veekshanam Movie
-
సక్సెస్ అవుతుందని తెలుసు, ఈ రేంజ్లో ఊహించలేదు!
రామ్ కార్తీక్, కశ్వి.. హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వీక్షణం'. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 18న విడుదలవగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నాడు.హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. నేను కూడా కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉందని తెలిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అన్నాడు.నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మూవీలో కామెడీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కామెడీ అంతలా బాగా రావడానికి కారణం నాతో కలిసి వర్క్ చేసిన ఫణి. ఇద్దరం పోటీపడి మరీ నటించాం. థ్యాంక్స్, ఫణి. అలాగే హీరో కార్తీక్ గారికి కూడా థ్యాంక్స్, ఆయన నాకు చాలా స్పేస్ ఇచ్చారు, నాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అని తెలిపాడు. -
'వీక్షణం' సినిమా రివ్యూ
సినిమాల్లో ఎవర్ గ్రీన్ జానర్ ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేమాట థ్రిల్లర్. ఈ జానర్ మూవీస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైన మూవీ 'వీక్షణం', రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే)కథేంటి?ఆర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు ఏం చేస్తుంటారా అని బైనాక్యులర్‌తో చూస్తుంటాడు. అలా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండే నేహా(కశ్వి)ని చూసి ఇష్టపడతాడు. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెతో ప్రేమలో పడతారు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 'వీక్షణం' కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.ఎవరెలా చేశారు?ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.టెక్నికల్ విషయానికొస్తే థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సమర్థ గొల్లపూడి సరిగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
లవ్ నుంచి థ్రిల్
‘‘నేను గతంలో థ్రిల్లర్ సినిమాలు చేశాను. కానీ ‘వీక్షణం’ లాంటి మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. సరదాగా ఉండే కుర్రాడికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడంతో అతని కథ ఎలాంటి మలుపులు తిరగుతుంది?’’ అన్నది ‘వీక్షణం’లో ఆసక్తిగా ఉంటుంది’’ అని హీరో రామ్ కార్తీక్ అన్నారు.మనోజ్ పల్లేటి దర్శకత్వంలో రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన సినిమా ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లవ్ స్టోరీతోప్రారంభమై మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. ఫస్ట్ కాపీ చూసినవారు నా గత సినిమాలతో పోలిస్తే ఇందులో మెచ్యూర్డ్‌గా, సెటిల్డ్‌గా నటించానని అనడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన వాటిలో ‘తెలిసినవాళ్లు, గ్రేట్ ఇండియన్ సూసైడ్’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ‘వీక్షణం’ చిత్రం హీరోగా నన్ను మరో మెట్టుపైకి తీసుకెళుతుందని ఆశిస్తున్నాను. వాసూగారి దర్శకత్వంలో నేను చేసిన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది’’ అన్నారు. -
‘వీక్షణం’ ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు: హీరో రామ్ కార్తీక్
థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్ హీరో రామ్ కార్తిక్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్ కార్తిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. -
వెంకటేష్‌గారి మాటే ‘వీక్షణం’కి మూలం
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ– ‘‘ఎమ్బీఏ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్టీ కోర్సు పూర్తి చేశా. ‘జార్జి రెడ్డి, జోహార్’ వంటి చిత్రాలకు పనిచేశాను. ఓ సందర్భంలో వెంకటేష్‌గారితో మాట్లాడే అవకాశం లభించింది. ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే.. మన పని మనం చూసుకోకపోవడమే’ అని అన్నారాయన. ఈ లైన్ నాకు ఎగ్ట్జైటింగ్గా అనిపించింది. ‘వీక్షణం’ కథకు ఈ లైన్ మూలం. సంతోషంగా జీవిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం వల్ల అతని జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ–‘‘కోటిగారి దగ్గర వర్క్ చేశాను. ఎమ్ఎస్ రాజుగారి ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రానికి సంగీతం అందించాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘వీక్షణం’ రెండో చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి’’ అని పేర్కొన్నారు.