థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్ హీరో రామ్ కార్తిక్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్ కార్తిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.
⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.
⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.
⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.
⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment