Manoj
-
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
మనోజ్, కోడలు మౌనికతో ప్రాణహాని ఉందన్న మోహన్ బాబు
-
‘వీక్షణం’ ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు: హీరో రామ్ కార్తీక్
థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్ హీరో రామ్ కార్తిక్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్ కార్తిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. -
వెంకటేష్‌గారి మాటే ‘వీక్షణం’కి మూలం
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ– ‘‘ఎమ్బీఏ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్టీ కోర్సు పూర్తి చేశా. ‘జార్జి రెడ్డి, జోహార్’ వంటి చిత్రాలకు పనిచేశాను. ఓ సందర్భంలో వెంకటేష్‌గారితో మాట్లాడే అవకాశం లభించింది. ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే.. మన పని మనం చూసుకోకపోవడమే’ అని అన్నారాయన. ఈ లైన్ నాకు ఎగ్ట్జైటింగ్గా అనిపించింది. ‘వీక్షణం’ కథకు ఈ లైన్ మూలం. సంతోషంగా జీవిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం వల్ల అతని జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ–‘‘కోటిగారి దగ్గర వర్క్ చేశాను. ఎమ్ఎస్ రాజుగారి ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రానికి సంగీతం అందించాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘వీక్షణం’ రెండో చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి’’ అని పేర్కొన్నారు. -
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో విషాదంశామీర్‌పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్‌న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
'అలాంటి వారు ముందుగా సినిమా చూడండి'.. ఎమర్జన్సీపై ఆదిపురుష్ రచయిత!
ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమర్జన్సీ చిత్రానికి ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీకి సిక్కు కమ్యూనిటీ ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ మూవీ రిలీజ్‌ను అడ్డుకోవద్దని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాపై కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చంపింది నిజం కాదా? అని వారిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదా? అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బ్లూ స్టార్ ఆపరేషన్ సమయంలో మరణించిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే గురించి రచయిత ప్రస్తావించారు. ఈ చిత్రంలో జర్నైల్ సింగ్‌ను ఉగ్రవాదిలా చూపిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన అతను ఉగ్రవాది కాదా? అని ముంతశిర్ ప్రశ్నించారు. దయచేసిన భింద్రావాలేను హీరోగా గుర్తించవద్దని సిక్కు సమాజాన్ని కోరాడు.ఎమర్జన్సీ కంటెంట్‌పై అభ్యంతరం చెప్పే ముందు సినిమాను చూడమని వారిని కోరారు. ధైర్యమైన సిక్కు సమాజం సినిమా విడుదలకు భయపడుతుందని తాను నమ్మడం లేదన్నారు. వారు భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. అలాంటి ధైర్యం కలిగిన వారు కేవలం సినిమాకే భయపడుతారంటే ఎవరు నమ్ముతారని మనోజ్ అన్నారు. కాగా.. ఎమర్జన్సీ మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని హితవు పలికారు. ఇది పూర్తిగా భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమేనని తెలిపారు. సినిమాపై నిరసనలు తెలిపే వారు.. ముందుగా థియేటర్లలో విడుదలై చూసిన తర్వాత.. అందులో తప్పులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా రనౌత్‌కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
దంచికొట్టిన కరుణ్ నాయర్.. మహరాజా ట్రోఫీ మైసూర్దే!
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ చాంపియన్‌గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్ ఫామ్ కొనసాగించాడు.పోటీలో ఆరు జట్లుకాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్‌లో గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, హుబ్లి టైగర్స్ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్, హుబ్లి సెమీ ఫైనల్ చేరుకున్నాయి.ఫైనల్‌కు చేరుకున్న మైసూర్, బెంగళూరు జట్లుఅయితే, మొదటి సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ జరిగింది.మనోజ్ భండాగే పరుగుల విధ్వంసంబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ కార్తిక్ 71, కెప్టెన్ కరుణ్ నాయర్ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 338.46 కావడం గమనార్హం.ఫలితంగా మైసూర్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్ వారియర్స్ ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. Mysuru hold out Bengaluru; clinch the TITLE!A Karun Nair-led #MysuruWarriors do it in style against #BengaluruBlasters in the Maharaja Trophy final 🏆🙌#MaharajaTrophy | #KarunNair | #MWvBB | #Final2024 pic.twitter.com/GbuDDJyHeV— Star Sports (@StarSportsIndia) September 1, 2024 -
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్‌లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.మనోజ్ తివారీప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.పవన్ సింగ్భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్‌లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.కంగనా రనౌత్హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిర్హువాఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి భోజ్‌పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.హేమామాలినిబాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.రవి కిషన్ఉత్తరప్రదేశ్లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్‌పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం. -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి సదరు మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా? (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) బాలీవుడ్‌లోని టాప్ రైటర్స్‌లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. 'తేరే మిట్టి', 'గల్లియన్', 'కౌన్ తుజే' లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే 'బాహుబలి' హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మార్చిపోయారు. అలాంటిది రైటర్ మనోజ్ ముంతాషిర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘14డేస్ లవ్’
మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ‘కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో ఈ సినిమా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు నాగరాజు బోడెం ఈ చిత్రాన్ని తీర్చి దిద్డాడు’ అని నిర్మాతలు పేర్కొన్నారు. అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ నటించిన ఈ చిత్రానికి కిరణ్ వెన్న పాటలు.. యష్‌కే బాజి బీజీఎం అందించారు. -
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్‌ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్‌పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్‌ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
వివాదాలు లేని వ్యక్తులకే చైర్మన్ పదవి
-
యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ!
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)’ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం సహకరించాలని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు. తగిన సహకారం అందించండి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో రేవంత్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు. వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు. ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. సీఎం దృష్టి సారించడం అభినందనీయం టీఎస్పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్షణశాఖ భూములను రాష్ట్రానికి ఇవ్వండి యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రాష్ట్ర బృందం భేటీ అయి చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణం, విస్తరణ కోసం.. రక్షణశాఖ పరిధిలో ఉన్న పలు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్ కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని.. అక్కడ రక్షణశాఖ పరిధిలో ఉన్న కాస్త భూమిలో మినహా మిగతా భాగం పూర్తయిందని వివరించారు. ఆ భూమిని వెంటనే బదిలీ చేస్తే.. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కరీంనగర్–రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వరకు 11.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44)పై కూడా కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించామని.. ఇందులో 12.68 కిలోమీటర్ల మేర నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాల కోసం మరో 56 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2019–20 నుంచి 2023–24 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
పద్నాలుగు రోజుల ప్రేమ
మనోజ్ పుట్టూర్, చాందినీ భాగవని జంటగా నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన చిత్రం ‘14 డేస్ లవ్’. అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమా జనవరి 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ లవ్ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ‘14 డేస్ లవ్’ రూపొందింది. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే కోణంలో ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది’’ అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
మనోజ్, చాందిని హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "14 డేస్ లవ్". ఈ చిత్రాన్ని నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కించారు. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాసరి హరిబాబు నిర్మించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అన్న కోణంలో దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంప్రదాయ విలువలతో రూపొందించినఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్, అంజలి, ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు. -
ఆదిపురుష్ కి రికార్డు స్థాయిలో TRP
-
యాదాద్రి కలెక్టరేట్లో దంపతుల ఘర్షణ
భువనగిరి క్రైం: కొద్దికాలంగా తనతో సఖ్యతగా ఉండటంలేదన్న కోపంతో భర్తపై కత్తితో దాడి చేసింది ఓ భార్య. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్లో ఆత్మకూర్(ఎం) మండల వ్యవసాయశాఖ అధికారిణిగా పనిచేస్తున్న నర్ర శిల్ప, అదే కార్యాలయంలో తన కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న మాటూరి మనోజ్‌గౌడ్‌ను గతేడాది జూన్ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా 3నెలల క్రితం మనోజ్‌గౌడ్ యాదగిరిగుట్టకు డిప్యూటేషన్‌పై వెళ్లి అనంతరం సెలవుపై వెళ్లాడు. శుక్రవారంతో సెలవులు పూర్తికావడంతో విధులకు హాజరుకావడానికి రిపోర్ట్ చేసేందుకు కలెక్టర్‌ట్‌కు వచ్చాడు. అదేసమయంలో భర్తతో మాట్లాడేందుకు శిల్ప దగ్గరకు వెళ్లింది. గొడవల నేపథ్యంలో వారిద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శిల్ప కత్తి తీసుకుని మనోజ్‌పై దాడి చేయగా..అతడి వీపు, మెడపై తీవ్రగాయాలయ్యాయి. సహోద్యోగులు వెంటనే వారిని అడ్డుకుని మనోజ్‌ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శిల్పను వివరణ కోరగా..మనోజ్ కొంతకాలంగా తనతో సఖ్యతగా ఉండటం లేదని ఇదే విషయం మాట్లాడేందుకు రాగా తనపై కత్తితో దాడి దిగాడని చెప్పారు. దీంతో ఆత్మరక్షణార్థం అతడి వద్ద ఉన్న కత్తిని లాక్కుని దాడి చేసినట్లు చెప్పారు. శిల్ప, మనోజ్ తండ్రి ఉపేందర్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జడంగే చెప్పారు. -
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్‌పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్‌పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
స్మిత, మనోజ్ ఎపిసోడ్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. మనోజ్‌కు స్మిత ఫేస్బుక్ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్ కౌన్సిలింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మరోవైపు.. తమను మనోజ్ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్‌ను చూడగానే మనోజ్‌ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్ గిప్ట్గా ఇచ్చిన ఏయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్‌ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
శామీర్‌పేట్ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్ నటుడు
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దార్థ్‌పై నటుడు మనోజ్ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు నటుడు మనోజ్. గన్ ఫైర్ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పులు జరిపిన మనోజ్ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు. అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్ అనే ఓ వ్యక్తి గన్ ఫైర్ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్ క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్‌పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల మనోజ్.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్‌కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar) చదవండి: శామీర్‌పేట్ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్ ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్ను అందరిముందే అవమానించిన స్టార్ హీరో -
శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది