ఫుల్ ఎనర్జీ కథతో... | Manoj, Nageswara Reddy to team up again | Sakshi
Sakshi News home page

ఫుల్ ఎనర్జీ కథతో...

Published Thu, Feb 12 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

ఫుల్ ఎనర్జీ కథతో...

ఫుల్ ఎనర్జీ కథతో...

మంచు విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. నాగేశ్వరరెడ్డి, ఆ తర్వాత మనోజ్ హీరోగా ‘కరెంట్ తీగ’ వంటి విజయాన్ని అందించారు. వరుసగా అన్నదమ్ములిద్దరితో రెండు విజయవంతమైన చిత్రాలు చేసిన నాగేశ్వరరెడ్డి మళ్లీ మనోజ్‌తో ఓ సినిమా చేయనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుస విజయాలు అందిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్, కామెడీ కలగలసిన కథాంశంతో సాగే ఈ చిత్రంలో మనోజ్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వినూత్న తరహా కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనీ, మనోజ్ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ కథ అనీ నిర్మాత తెలిపారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement