Nageswara Reddy
-
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
గట్ బ్యాక్టీరియా VS వ్యాయామం
-
హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా
జహీరాబాద్: ‘హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నాను..’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఓ ఆలుగడ్డ రైతుకు ఫోన్ చేసి పంట గురించి ఆరా తీశారు. సం గారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్‌రెడ్డికి శనివారం సీఎం ఫోన్ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు సంభాషించారు. సంభాషణ సాగిందిలా.. సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు. సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు? రైతు: జహీరాబాద్ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు. సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి? రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి. సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా? రైతు: అవును సార్ సీఎం: ఎంత బరువు తూగుతుంది? రైతు: కిలో మేర తూగుతుంది. సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు? రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది. సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది. రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది. సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది? రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది. సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు? రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం. సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా. రైతు: సరే సార్.. నాలుగైదు మందిమి వస్తాం. సీఎం: థ్యాంక్యూ ఇదిలా ఉంటే, నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్‌రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించిన విషయం తెలిసిందే. -
పోలీసుల ఆకస్మిక దాడి.. క్రికెట్ బుకీల అరెస్ట్
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో క్రికెట్ బుకీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలివీ.. కడప బాలాజీ నగర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.14.11 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు. -
ఫుల్ ఎనర్జీ కథతో...
మంచు విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. నాగేశ్వరరెడ్డి, ఆ తర్వాత మనోజ్ హీరోగా ‘కరెంట్ తీగ’ వంటి విజయాన్ని అందించారు. వరుసగా అన్నదమ్ములిద్దరితో రెండు విజయవంతమైన చిత్రాలు చేసిన నాగేశ్వరరెడ్డి మళ్లీ మనోజ్‌తో ఓ సినిమా చేయనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుస విజయాలు అందిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్, కామెడీ కలగలసిన కథాంశంతో సాగే ఈ చిత్రంలో మనోజ్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వినూత్న తరహా కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనీ, మనోజ్ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ కథ అనీ నిర్మాత తెలిపారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.