
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో క్రికెట్ బుకీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలివీ.. కడప బాలాజీ నగర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు.
ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.14.11 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment