bookies arrested
-
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
అమీర్‌పేట: గుజరాత్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా పట్టుబడ్డ వారి నుంచి రూ.1.15 కోట్ల నగదు, సెల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రాంప్రసాద్‌లు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన విశాల్ పటేల్, కమలేష్‌రావత్, పటేల్ హితేష్ అంబాల, ధర్మేంద్ర భాయ్‌లు నగరంలోని గౌలిగూడ గురుద్వార, గౌలిపుర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వేసి ప్రచారం చేస్తారు. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌ల ద్వారా అతి తక్కువ కాలంలో లక్షలు సంపాదించి ఆపై కోటీశ్వరులుగా ఎదుగుతారని నమ్మిస్తారు. సదరు వెబ్సైట్లో పొందుపర్చిన అందర్ బహార్, ఫుట్‌బాల్, క్రికెట్, సూపర్ ఓవర్, తీన్‌పత్తి వంటి గేమ్‌లను డౌన్లోడ్ చేసుకునే వారికి బెట్టింగ్‌లలో పాల్గొనే వీలు కల్పిస్తారు. కాగా నగరంలో వీరి వలలో పడిన వారినుంచి డబ్బులు తీసుకునేందుకు రాగా..పక్కా సమాచారం మేరకు బీకేగూడ పార్కు వద్ద మాటువేసి పోలీసులు విశాల్ పటేల్, కమలేష్ రావత్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద రూ.2 లక్షలు లభించాయి. వీరిచ్చిన సమాచారంతో గౌలిగూడలో ఒక ఇంటికి వెళ్లి సోదాలు చేయగా లోపల పటేల్ హితేష్ అంబాల కనిపించాడు. ఇతని వద్ద రూ.1.13 కోట్లు లభించాయి. ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితుడు ధర్మేష్ భాయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. (చదవండి: అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై) -
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
-
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
సాక్షి, గుంటూరు: ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు బూకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన అభీర్ చంద్, శ్యాంఘోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసుల ఆకస్మిక దాడి.. క్రికెట్ బుకీల అరెస్ట్
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో క్రికెట్ బుకీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలివీ.. కడప బాలాజీ నగర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.14.11 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు. -
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహించిన రవికుమార్, నరేష్లతో సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 11 మొబైల్స్, ఒక ల్యాప్‌టాప్, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లో క్రికెట్ బూకి అరెస్ట్ వరల్డ్‌కప్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న బూకిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని బుధవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఒక క్యాష్ మెషీన్, ఒక సెట్‌టాప్ బాక్స్, 8 సెల్ఫోన్లు, 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.